తెర్లాం: జిల్లాలోని తెర్లాం మండలం, తెర్లాం పంచాయతీ పరిధిలోని చిన్నయ్యపేట గ్రామానికి చెందిన చింత జ్యోతిస్వరూప్, తెర్లాం మండల కేంద్రానికి చెందిన చిప్పాడ హరీష్‌లు ఇటీవల జరిగిన ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్షలో మంచి ప్రతిభ కనబరిచి సెంట్రల్ జీఎస్టీ ఇన్‌స్పెక్టర్లుగా ఎంపికయ్యారు. ఆ యువకుల నేపథ్యం ఇలా ఉంది.
చింత జ్యోతిస్వరూప్:.
చిన్నయ్యపేట గ్రామానికి చెందిన చింత శంకరరావు, అరుణల కుమారుడు. విశాఖపట్నంలోని గాయత్రి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తి చేశాడు. ఇటీవల జరిగిన ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్షలో 390 మార్కులకుగాను 350 మార్కులు సాధించి ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 836వ ర్యాంక్ సాధించి సెంట్రల్ జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యాడు. జ్యోతిస్వరూప్ తండ్రి శంకరరావు విశాఖపట్నంలోని ఓ కోచింగ్ సెంటర్‌లో రీజనింగ్ ఫ్యాకల్టీగా పనిచేస్తుండగా తల్లి అరుణ గృహిణి. కుమారుడు జ్యోతిస్వరూప్ జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపిక కావడంపట్ల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చిప్పాడ హరీష్..
తెర్లాం గ్రామానికి చెందిన చిప్పాడ రమణ, మంగరత్నంల కుమారుడు. హరీష్ ప్రస్తుతం చైన్నెలో ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌లో టాక్స్ అసిస్టెంట్‌గా ఏడాదిన్నగా పనిచేస్తున్నాడు. ఇటీవల జరిగిన ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ ప్రవేశ పరీక్షకు హాజరై 390మార్కులకుగాను 346మార్కులు సాధించి ఆలిండియా ఓబీసీ కేటగిరీలో 1602 ర్యాంక్ కై వసం చేసుకుని సెంట్రల్ జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపికయ్యాడు. హరీష్ తండ్రి రమణ మండలంలోని పణుకువలస ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తుండగా, తల్లి మంగరత్నం తెర్లాంలోని శ్రీవేంకటేశ్వర విద్యాసంస్థల కరస్పాండెంట్. కుమారుడు హరీష్ సెంట్రల్ జీఎస్టీ ఇన్‌స్పెక్టర్‌గా ఎంపిక కావడంపట్ల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందం వ్యక్తంచేశారు.
చిన్నయ్యపేటకు చెందిన జ్యోతిస్వరూప్
తెర్లాంకు చెందిన హరీష్ ఎంపిక
సెంట్రల్ జీఎస్టీ ఇన్‌స్పెక్టర్లుగా తెర్లాం యువకులు