రాయగడ: జిల్లాలోని కొలనార సమితి ముకుందపూర్ ఘాటీ మలుపులో గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో బరంపురం నుంచి టికిరి వైపు వెళ్తున్న ప్రైవేటు బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 45 మందిలో 27 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. క్షతగాత్రులను అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. బరంపురం నుంచి బుధవారం రాత్రి 9 గంటలకు బయల్దేరిన బస్సు ముకుందపూర్ ఘాటికి చేరుకునేసరికి తెల్లవారుజామున 4 గంటలయ్యింది. ఘాటీ మలుపులో బస్సు అదుపు తప్పడంతో బోల్తా పడింది. దీంతో బస్సులోని ప్రయాణికులు పెద్ద కేకలు పెట్టారు. కాగా క్షతగాత్రుల వివరాలు తెలియడం లేదు. స్వల్పగాయాలు తగిలిన కొంతమంది చికిత్స అనంతరం వారి వారి ఇళ్లకు వెళ్లిపోయినట్లు సమాచారంప్రమాదపు మలుపు
ముకుందపూర్ ఘాటీ మలుపులో తరచూ ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటుండడం పరిపాటిగా మారింది. మలుపు వద్ద అత్యంత వేగంతో వచ్చే వాహనాలు ఇటువంటి తరహా ప్రమాదాలకు గురవుతున్నాయి. డ్రైవర్లు ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం ప్రమాదాలను హెచ్చరించే విధంగా మలుపుల వద్ద బోర్డులను కూడా రవాణా శాఖ ఏర్పాటు చేసింది. అయినా అవేవీ పట్టించుకోని చోదకులు అతివేగంతో వాహనాలు నడపడం ఈ ప్రమాదాలకు కారణమవుతోంది. ఇదిలా ఉండగా గురువారం బస్సు బోల్తా ఘటనకు సంబంధించి త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. పక్కనే ఉన్న లోయలో బస్సు పడి ఉంటే ప్రమాద తీవ్రత అంచనాలకు అందేది కాదని పలువురు పేర్కొంటున్నారు.
ప్రైవేటు బస్సు బోల్తా
27 మందికి గాయాలు
ఇద్దరి పరిస్థితి ఆందోళనకరం
త్రుటిలో తప్పిన ప్రమాదం
త్రుటిలో తప్పిన ప్రమాదం
త్రుటిలో తప్పిన ప్రమాదం