జయపురం: స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణంలో కొరాపుట్ జిల్లా న్యాయ సేవా ప్రదీకరణ జయపురం వారు శుక్రవారం న్యాయ అవగాహన శిబిరం నిర్వహించారు. శిబిరంలో జిల్లా న్యాయ సేవా ప్రధీకరణ కార్యదర్శి, లోక్ అదాలత్ శాశ్వత విచారపతి సుమన్ జెన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఉద్యోగాలలో, ఇతర పనులలో ఉండే మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అత్యాచారాలు పైన,వాటి నివారణ చట్టాలపైన వివరించారు. బాధిత మహిళలకు చట్టపరిధిలో లభించే సహాయాలు వివరించారు. విధి నిర్వహణలో ఉన్న సమయంలో లైంగిక దాడుల నివారణ, వాటి పరిష్కారం తదితర విషయాలపై మాట్లాడారు. కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ అండ్ డిఫెన్స్ కౌన్సిలర్ కె.దివాకర రావు, హరిశ్చంధ్ర ముదులి, అసిస్టెంట్ డిప్యూటీ టీగల్ ఆండ్ డిఫెన్స్ కౌన్సిలర్ గీతాంజళీ ధల్, ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ వివేకానం సున, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డొంబురు దొర దాస్, డాక్టర్ దిగాల్ తదితరులు పాల్గొన్నారు.