భువనేశ్వర్: నగరంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. శాంతి భద్రతల పరిరక్షణ జంట నగరాల పోలీసు కమిషనరేట్‌కు పెను సవాల్‌గా మారింది. శాసనసభలో కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్‌పై నిరసన కట్టలు తెంచుకుంటోంది. బుధవారం నడి రోడ్డు మీద నిరసనకు దిగిన కాంగ్రెస్ సభ్యులకు మద్దతుగా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. శాసనసభ వైపు దూసుకుపోయి ముట్టడించేందుకు పాల్పడ్డారు. సభా ప్రాంగణం భద్రత కోసం ఏర్పాటు చేసిన బారికేడ్లు అధిగమించి సభా ప్రాంగణం ప్రవేశ ద్వారాల తాళాలు బద్దలు కొట్టేందుకు విఫలయత్నం చేసి పోలీసు యంత్రాంగానికి ముప్పు తిప్పలు పెట్టారు. ఇదిలాఉండగా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ గురువారం శాసనసభ ముట్టడిస్తామని ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ లోగడ ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆందోళనలు భారీ ఎత్తున విజయవంతం చేయాలనే లక్ష్యంతో స్థానిక కాంగ్రెస్ భవన్‌లో పార్టీ ప్రముఖుల వ్యూహ రచన చేశారు. కాంగ్రెసు భవన్ నుంచి శాసనసభ మార్గం ఉద్రిక్తంగా మారే ప్రమాదంపై జంట నగరాల పోలీసు కమిషనరేట్ ముందస్తుగా అప్రమత్తమైంది.
రాకపోకల కట్టడి
శాసనసభ సమీపంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న ప్రదర్శన తీవ్రత దృష్ట్యా పోలీసు కమిషనరేట్ నగరంలో విస్తృత భద్రతా ఏర్పాట్లు చేసింది. ఈ నిరసన కారణంగా మాస్టరు క్యాంటిన్ కూడలి నుంచి దిగువ పీఎంజీ మార్గం గుండా శాసనసభ వైపు ఉధృత పరిస్థితి తాండవిస్తుందని అంచనా. ఈ మార్గంలో వాహనాలు, సాధారణ ప్రజానీకం రాకపోకలకు అంతరాయం కలిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అవాంఛనీయ సంఘటనల నివారణ కోసం గురువారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు ఈ మార్గంలో రాకపోకలపై ఆంక్షలు అమలులో ఉంటాయని కమిషనరేట్ పోలీసులు తెలిపారు. ప్రధానంగా రాజ్ మహల్ స్క్వేర్ మరియు రూపాలి స్క్వేర్ మధ్య ప్రాంతాలు ముఖ్యంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. నిరసన ప్రదర్శన సమయంలో ప్రత్యామ్నాయ మార్గాల గుండా రాకపోకలకు సర్దుబాటు చేసుకోవాలని అభ్యర్థించారు. ఈ మార్గంలో మాస్టరు క్యాంటిన్ కూడలి నడి రోడ్డు మీద కాంగ్రెసు సభ్యుల నిరసన నిరవధికంగా కొనసాగుతోంది. రాత్రంతా ఈ ప్రదర్శన కొనసాగుతుందని ఆందోళనకారుల వర్గం పేర్కొంది.
నేడు శాసనసభ ముట్టడి