కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లాలో ఉమ్మర్‌కోట్ సబ్ డివిజన్ జొరిగాం సమితి డోడ్రా, రాయిఘర్ సమితి జొడింగాలో 33/11 కేవీ విద్యుత్ స్టేషన్లు రాష్ట్ర సాంఘీక సంక్షేమ, విద్యాశాఖ మంత్రి సోమవారం ప్రారంభించారు. నబరంగ్‌పూర్ ఎంపీ బలభద్ర మజ్జి, కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో, జొరిగాం ఎమ్మెల్యే నర్సింగ్ బోత్రా పాల్గొన్నారు.
కాలుష్యంతో అవస్థలు
జయపురం: జయపురం పట్టణ సమీప మొకాపుట్ ప్రాంతలో పురపాలక పరిషత్ వారు పట్టణంలో చెత్తను పారవేసేందుకు డంపింగ్ యార్డు ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డులో సోమవారం మంటలు ఎగిసి పడ్డాయి. ఈ ప్రాంత వాసులు పొగతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఈ యార్డుకు సమీపంలోనే ఆశ్రమ పాఠశాల ఉంది. డంప్ యార్డు నుంచి వెలువడే దుర్ఘంధం వలన విద్యార్థులు అనారోగ్యానికి లోనవుతున్నారు. యార్డులో మంటలు రేగడం వల్ల వేడి గాలలు వీస్తున్నాయని స్థానికులు అంటున్నారు. కాలుష్య నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
వినతుల స్వీకరణ
మల్కన్‌గిరి: జిల్లా కోరుకొండ సమితి కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ నిర్వహించారు. సమితిలోని పలు పంచాయతీలకు చెందినవారు వినతిపత్రాలను అందజేశారు. పాత చిత్తపరికి రహదారి నిర్మించాలని ఆ గ్రామస్తులు కోరారు. మొత్తం 27 వినుతులు అందినట్లు అధికారులు తెలిపారు. ఎస్పీ వినోద్ పటేల్, సబ్ కలెక్టర్ దుర్యోధన్ బోయి, జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్ర సబర్, కోరుకొండ సమితిలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
గ్రానైట్ టిప్పర్ స్వాధీనం
పర్లాకిమిడి: గుసాని సమితి యం.యస్.పూర్ గ్రామం నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్న గ్రానైట్ లోడ్‌ను జిల్లా మైన్స్ అధికారి దిపెన్ పరిడా సోమవారం ఉదయం పట్టుకుని స్థానిక ఆదర్శ పోలీసు స్టేషన్‌కు తరలించారు. గ్రానైట్ తరలిస్తున్న టిప్పర్‌కు ఎటువంటి మైన్స్‌కు సంబంధించి లీజు కాగితాలు లభించకపోవడంతో గ్రానైట్ కంపెనీ యాజమానికి ఒక లక్షా ఆరువేల రూపాయల జరిమానాను జిల్లా మైన్స్ అధికారి దీపెన్ పరిడా విధించారు.
నిధుల గోల్‌మాల్‌పై ఫిర్యాదు
హిరమండలం: మండలంలోని తంప పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. గ్రామానికి చెందిన మామిడి చిన్నబాబు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పందించారు. విచారణ చేపట్టాలని డీపీవోకు ఆదేశించారు. పంచాయతీకి చెందిన 15వ ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులను సర్పంచ్ పక్కదారి పట్టించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీస్ శాఖలో పనిచేసిన విశ్రాంత ఉద్యోగి అయినటువంటి తన పేరును ఉప సర్పంచ్‌గా రికార్డుల్లో చూపి దుర్వినియోగం చేసినట్లు వాపోయాడు.
విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభం
విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభం
విద్యుత్ సబ్ స్టేషన్ల ప్రారంభం