
శిష్టకరణ సంఘం నూతన కార్యవర్గం
కొరాపుట్: నబరంగ్‌పూర్ శిష్ట కరణ సంఘం నూతన కార్యవర్గం ఎన్నికై ంది. జిల్లా కేంద్రంలోని అఖండల మణి దేవాలయ ప్రాంగణంలో ఆదివారం సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా సతీష్ పట్నాయక్, ఉపాధ్యక్షునిగా కిశోర్ పట్నాయక్, వివిధ విభాగాల కార్యదర్శులుగా మహేశ్వర్ పట్నాయక్, అవని ప్రసాద్ పట్నాయక్, కోసాధికారిగా చంద్ర ఖర్ పట్నాయక్, న్యాయ సలహాదారుడుగా అరవింద పట్నాయక్, సలహాదారులుగా రబి పట్నాయక్, పి.రామ్మూర్తి పట్నాయక్, ప్రసన్న పట్నాయక్ ఎంపికయ్యారు. సంఘ సేవలను జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని నిర్ణయించారు.