మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితి క్యాంగ్ పంచాయతీ పెద్ద సేరపల్లి గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి ఆశిష్ జలారి అనే పదకొండేళ్ల బాలుడు కనిపించలేదు. దీంతో తల్లిదండ్రులు గ్రామమంతా వెదికారు. అయినా ఎక్కడా కనిపించకపోవడంతో బుధవారం ఉదయం మత్తిలి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐఐసీ దేవదత్తు మల్లిక్ వెంటనే స్పందించి సబ్ ఇన్‌స్పెక్టర్ మాడ మడ్కమి, సబ్ ఇన్‌స్పెక్టర్ విష్ణుకిశోర్‌ల ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పాటు చేశారు. అనంతరం వారు గాలించగా మత్తిలి సమీపంలోని ఒక చెట్టుకింద బాలుడు కూర్చొని ఉండడం గమినించి పట్టుకున్నాడు. అయితే బాలుడి మతిస్థిమితం సరిగా లేనట్లు గుర్తించారు. అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. తమ బిడ్డను సురక్షితంగా అప్పగించిన పోలీసులుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
బాలుడిని కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్న పోలీసులు