క్రికెట్ టోర్నమెంట్ విజేతగా విరాట్ రైడర్స్
మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితిలో శుక్రవారం నుంచి ప్రీమియర్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. మొత్తం 6 జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. ఫైనల్‌లో విరాట్ రైడర్స్, లిఖల్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన విరాట్ వారియర్స్ 15 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన లిఖిల్ వారియర్స్ జట్టు 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా గజేంద్ర మాఝి నిలిచారు. విజేతలకు మత్తిలి ఐఐసీ దేవదత్త మల్లిక్, సమితి సభ్యుపు బాలారాజ్ కోపే, మత్తిలి విద్యుత్ విభాగం ఇంజినీర్ చిత్తరంజన్ మహరణ, మత్తిలి కాలేజీ ప్రిన్సిపాల్ సుభ్రత్ కుమార్ భత్ర తదితరులు ట్రోఫీ అందజేశారు.