విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలి
జయపురం: విద్యార్థుల్లో దాగిఉన్న ప్రతిభను వెలికి తీయాలని జయపురం బ్లాక్ ఎడ్యు కేషన్ అధికారి చందన కుమార్ నాయిక్ అన్నారు. విద్యార్థుల్లో నిఘూడమై ఉన్న ప్రతిభ ప్రతిభింబించేది ఉత్సవాల్లోనేనని.. అందుకే ప్రతి పాఠశాలలో వార్షికోత్సవాలు జరుపుతారన్నారు. స్థానిక గౌఢవీధి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన వార్షికోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయిని సబితా బెహర అధ్యక్షతన జరిగిన వార్షికోత్సవంలో ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ.. విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దటంలో ఉపాధ్యాయులు ప్రధాన భూమిక పోషించాలన్నారు. విద్యార్థులు మనసు పెట్టి చదువుకోవాలని, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు చెప్పినట్లు నడుచుకోవాలని ఉద్బోంధించారు. గౌరవ అతిథిగా అదనపు బీఈవో కై ళాస చంద్రశతపతి, సీఆర్‌సీసీ జ్యోతీ శంకర త్రిపాఠీ, జయపురం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు త్రినాథ్ సింగ్‌లాల్, సీనియర్ న్యాయవాది శశి పట్నాయక్, లక్ష్మీ కుమారి పట్నాయక్ పాల్గొన్నారు. పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలకు అతిథులు చేతులమీదుగా బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి.