మాజీ ఎమ్మెల్యే దేబేంద్ర శర్మ కన్నుమూత
భువనేశ్వర్: కేంద్రపడా జిల్లా ఔల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే దేబేంద్ర శర్మ (66) శుక్రవారం కన్నుమూశారు. స్థానికంగా ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దేబేంద్ర శర్మ అంకితభావంతో ఎదిగిన నాయకుడిగా ప్రసిద్ధి చెందారు. ఆయన కాంగ్రెస్ టికెట్‌పై 15వ రాష్ట్ర శాసనసభకు 2014లో ఎన్నికయ్యారు. ఆయన మరణంతో ఈ ప్రాంతంలో సర్వత్రా విచారం నెలకొంది. రాష్ట్ర శాసనసభ ఆవరణలో శనివారం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. స్పీకర్ సురమా పాఢి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి తదితర ప్రముఖులు దివంగత మాజీ శాసన సభ్యుడి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.