మల్కన్‌గిరిలో శుభాశర్మ పర్యటన
మల్కన్‌గిరి:
జిల్లాలో మహిళా, శిశు అభివృద్ధి శాఖ ప్రధాన కార్యదర్శి శుభాశర్మ మంగళవారం పర్యటించారు. ఆమెకు కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అధికారులు, తల్లిదండ్రులు తదితరులతో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. గిరిజన పాఠశాలల్లో మౌలిక వసతులు అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పాఠశాలలో బాలికల భద్రతాపై అవగాహన కల్పించాలన్నారు. అలాగే చిత్రకొండ సమితిలో పర్యటించి అక్కడి మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
మల్కన్‌గిరిలో శుభాశర్మ పర్యటన