–8లోu
రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం
గురువారం శ్రీ 27 శ్రీ మార్చి శ్రీ 2025
భువనేశ్వర్: బడ్జెట్ సమావేశాలు పురస్కరించుకొని రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సమావేశాల్లో అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం నిరవధికంగా కొనసాగుతోంది. ఇరుపక్షాలు ఎవరి పట్టుపై వారు నిశ్చలంగా ఉండడంతో సభా కార్యకలాపాలు సక్రమంగా కొనసాగలేదు. ప్రధానంగా రాష్ట్రంలో మహిళలకు కనీస భద్రత లేకుండా పోయిందని కాంగ్రెస్ ఆరోపించింది. మైనర్ బాలికలకు విద్యా సంస్థల్లో మౌలిక రక్షణ కొరవడిందని దుమ్మెత్తిపోసింది. ఈ పరిస్థితిపై రాష్ట్ర హోమ్ శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సభలో వివరణ ప్రవేశపెట్టాలని డిమాండ్ చేసింది. మహిళలకు లోపించిన భద్రత పరిస్థితిపై విచారణకు సభా కమిటీ ఏర్పాటు చేయాలని పట్టుబట్టారు. అయితే దీనికి అధికార పక్షం ససేమిరా అనడంతో సభలో పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది.
సభా కార్యకలాపాలకు విఘాతం
రాష్ట్రంలో మహిళల భద్రత కోసం సభలో ఉద్యమించిన కాంగ్రెసు సభ్యుల తీరును అధికార పక్షం తప్పు బట్టింది. ఈ వ్యవహారంలో సభలో సభ్యుల తీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని బాహాటంగా విమర్శించింది. తదుపరి దశలో కాంగ్రెస్ ఎమ్మెల్యే తారా ప్రసాద్ బాహిణీపతిని సభ నుంచి 7 రోజుల పాటు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ సురమా పాఢి ప్రకటించారు. దీంతో అకస్మాతుగా వ్యతిరేకత తారా స్థాయికి తాకింది. ఈ చర్యపై ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ కూడా విచారం వ్యక్తం చేసింది. ఇలా రోజులు గడుస్తున్నా వివాదం కొలిక్కి రాకపోవడంతో సభా కార్యకలాపాలకు తీవ్రంగా గండి పడింది.
12 మంది సస్పెన్షన్
మంగళవారం నాటికి ఈ పరిస్థితి మరింతగా రాజుకుంది. సభలో కాంగ్రెసు సభ్యుల బలం 14 మంది కాగా, అత్యధికంగా 12 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేసినట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో మిగిలిన ఇరువురు సభ్యులు సభలో తోటి సభ్యుల సస్పెన్షన్ వ్యతిరేకిస్తూ, సభా కమిటీ ఏర్పాటు నినాదంతో సభలో నిరసన ప్రదర్శన కొనసాగించారు. తమ న్యాయ సమ్మతమైన ప్రతిపాదనలపై సభ సానుకూలంగా స్పందించకుంటే రాత్రంతా సభలో నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. వీరి హెచ్చరికపై సభ పెడచెవి వైఖరి ప్రదర్శించడంతో మంగళవారం రాత్రంతా కాంగ్రెసు సభ్యులందరూ కలిసి సభలో నిరాహార దీక్ష చేపట్టారు.
సభ బయట ఉద్రిక్తత
సభ లోపల తోటి సభ్యుల నిరాహార దీక్ష స్థితిగతులను తెలుసుకునేందుకు ఒడిశా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ ఆధ్వర్యంలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు శాసనసభ ప్రాంగణానికి చేరారు. దీంతో లోపలికి వెళ్లకుండా వీరిని పోలీసు ఉన్నతాధికారులు అడ్డుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వేడెక్కింది. ఫలితంగా శాసనసభ బయట ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అమానుష చర్యలు
సభలో నిరాహార దీక్షకు దిగిన కాంగ్రెసు సభ్యులకు తాగునీరు, మరుగుదొడ్డి వంటి మౌలిక సౌకర్యాలు లేకుండా అధికారులు అమానుష చర్యలకు పాల్పడ్డారు. దీంతో క్రమంగా ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి ఆరోగ్యం దిగజారింది. పోలీసులు ప్రత్యక్షంగా రంగంలోకి దిగి నిరాహార దీక్ష కొనసాగిస్తున్న కాంగ్రెసు ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు నెట్టేశారు. పదవిలో ఉన్న శాసనసభ్యులపై పోలీసుల జులుం సర్వత్రా చర్చనీయాంశం అయింది.
మరో ఇద్దరు సైతం సస్పెండ్
పరిస్థితి ఇలా కొనసాగుతుండగా మిగిలిన ఇద్దరు కాంగ్రెసు ఎమ్మెల్యేలను సైతం సభ నుంచి మరోసారి వారం రోజుల వరకు సస్పెండ్ చేసినట్లు స్పీకర్ బుధవారం దేశాలు జారీ చేశారు. మరోవైపు తారా ప్రసాద్ బాహిణీపతికి రెడ్ కార్డు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భావ వ్యక్తీకరణకు కనీస అవకాశం కల్పించకుండా సస్పెండ్ చేశారని తారా ప్రసాద్ బాహిణీపతి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నిలువునా హతమార్చిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న తమపై పోలీసులు జులుం ప్రదర్శించారు. తెల్లవారుజామున 2.15 గంటల ప్రాంతంలో సభలో నిరసన ప్రాంగణంలోకి పోలీసులు ప్రవేశించారు. నిరసన కొనసాగిస్తున్న తమపై చేయి చేసుకుని బలవంతంగా బయటకు నెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు తన గొలుసు లాక్కున్నారని ఆరోపించారు.
న్యూస్‌రీల్
రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు
రాత్రంతా శాసనసభలో కాంగ్రెస్ సభ్యుల నిరసన
శాసనసభ నుంచి కాంగ్రెస్ సభ్యులంతా సస్పెండ్
గందరగోళం..!
గందరగోళం..!
గందరగోళం..!
గందరగోళం..!
గందరగోళం..!
గందరగోళం..!


