స్కూల్‌లో చాలని మధ్యాహ్న భోజనాలు
మెళియాపుట్టి: మండలంలోని చాపర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం మధ్యా హ్న భోజనాలు చాలలేదు. దీంతో హోటల్ నుంచి పార్సిళ్లు తీసుకువచ్చి విద్యార్థులకు భోజనం పెట్టారు. శనివారం పాఠశాలకు వచ్చిన విద్యార్థుల సంఖ్య తెలియకుండానే వంట చేయడంతో సుమారుగా 15 మంది విద్యార్థులకు అన్నం సరిపోలేదు. దీంతో మధ్యాహ్న భోజన వంట నిర్వాహకులు హోటల్ నుంచి తీసుకొచ్చి పెట్టారు. టెన్త్ పరీక్షలు ప్రారంభమైన నాటి నుంచి 170 మందికి మాత్రమే వంట చేయడానికి బియ్యం ఇస్తున్నారని వంట నిర్వాహకులు చెబుతున్నారు. దీనిపై హెచ్‌ఎం ఎం. సలాన చిట్టిబాబును వివరణ కోరగా తాను శ్రీకాకు ళం వెళ్లానని, వంట నిర్వాహకులు సరుకులు పక్క దారి పట్టిస్తున్నారని, చెప్పినా వినడం లేదని తెలిపా రు. స్కూల్ అసిస్టెంట్ ప్రసాద్‌కు బాధ్యతలు అప్పగించానని పేర్కొన్నారు. ఆయనను వివరణ కోరగా 170 మందికి బియ్యం ఇచ్చానని, తిన్నవారికే గుడ్లు, చెక్కీలు ఇవ్వాలని, తినని విద్యార్థులకు ఇవ్వవద్దని ప్రభుత్వం చెబుతోందని ‘సాక్షి’కి తెలిపారు.