పర్లాకిమిడి: ఒడిశా గోహాత్య నిషేధం బిల్లు 2024ను అమలు చేయాలని, గోవుల అక్రమరవాణా అరికట్టాలని, గోశాలలు నిర్మించాలని విశ్వహిందూ పరిషద్, భజరంగ్ దళ్ శ్రేణులు కలెక్టరేట్ ఆవరణలో నినాదాలు చేశారు. అనంతరం గవర్నర్‌కు ఉద్దేశించి రాసిన వినతిని కలెక్టర్ బిజయకుమార్ దాస్‌కు జిల్లా గోరక్షణ పర్యవేక్షకులు లోకనాథ్ మిశ్రా, పరలా ధర్మ ప్రచారక ప్రేమీ సత్యనారాయణ సాహు, వీహెచ్‌పీ పట్టణ అధ్యక్షులు కై లాష్ చంద్ర గౌడో అందజేశారు. ఈ ఆందోళనలో వి.హెచ్.పి. కోశాధికారి హారిమోహాన్ పట్నాయిక్, సౌమ్యరంజన్ ఆచార్య తదితరులు పాల్గొన్నారు.
గోహత్య నిషేధం బిల్లు అమలు చేయాలని డిమాండ్


