జాతీయ కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాకు చెందిన క్రీడాకారులు అవకాశం దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఎన్.అనురాధ, ఇ.సుమంత్‌లు ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు బీహార్ రాష్ట్రంలో జరగనున్న అంతర్ రాష్ట్ర కబడ్డీ పోటీల్లో పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించి జాతీయ పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులను జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.రంగారావుదొర, కార్యదర్శి కేవీ.ప్రభావతి, ఆర్గనైజింగ్ కార్యదర్శి నడిపేన.లక్ష్మణరావు, పీడీ వి.సౌదామిని అభినందించారు. రాష్ట్ర జట్టు తరఫున ఆడనున్న ఇద్దరు క్రీడాకారులు క్రీడాస్ఫూర్తితో ఆడి జిల్లా ఖ్యాతిని జాతీయస్థాయిలో చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.
జాతీయ కబడ్డీ పోటీలకు జిల్లా క్రీడాకారులు