జయపురం: తన నటనా కౌశల్యంతో ప్రజలను అలరించిన బాల కళాకారిణి సంతోషిణి తరాశియ(13) చికిత్స పొందుతూ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. జయపురం మున్సిపాలిటీలోని జయనగర్ పాయిక సాహికి చెందిన దుర్గా ప్రసాద్ తరాశియ ఏకై క కుమార్తె సంతోషిణి. ఈమె పాఠశాల ఉత్సవాలు, పట్టణంలో జరిగే వివిధ ఉత్సవ వేదికలపైన ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇస్తూ ఆకట్టుకుంది. జయపురంలో వివిధ సంస్థలు నిర్మించిన 15 చిన్న సినిమాల్లో నటించి ప్రశంసలు పొందింది. అయితే ఇటీవల ఆమె అస్వస్థతకు గురయ్యింది. దీంతో ఆమెకు జయపురం, కొరాపుట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బరంపురం ఎంకేసీజే ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మంగళవారం మృతి చెందింది. దీంతో జయపురంలో విషాదచాయలు అలముకున్నాయి.
క్రమశిక్షణతో ఉన్నత శిఖరాలు
జయపురం: క్రమశిక్షణతో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి అన్నారు. సమితిలోని ఫష్త్రల్‌బెడ గ్రామంలో ఉన్న విజ్ఞాన ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవాన్ని పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు ప్రకాశ్ కుమార్ నాయిక్ అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు గుణాత్మక విద్యనభ్యసించాలన్నారు. విద్యార్థులు చదువుతో పాటు సంస్కారం అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో ఔషధ మొక్కల వనాన్ని ప్రారంభించారు. పాఠశాల వార్షిక ముఖపత్రం ‘సమాధాన్’ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జయపురం న్యాయ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ నిరంజన్ మిశ్ర, పాఠశాల ప్రిన్సిపాల్ సర్వేశ్వర ప్రధాన్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల
అమలుపై సమీక్ష
జయపురం: కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షించేందుకు ఇద్దరు సభ్యుల కేంద్ర బృందం జయపురంలో మంగళవారం పర్యటించింది. వీరు టంకువ పంచాయతీ, జయపురం పట్టణంలో కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. అనంతరం జయపురం మున్సిపల్ సభాగృహంలో కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్ష చేపట్టారు. పట్టణ ప్రధాన మార్గం, రాజానగర్, ప్రధాన ట్రాఫిక్ కూడలి ప్రాంతాల్లో పీఎం ఎస్‌బీఎన్ నిధి నుంచి రుణాలు తీసుకున్న లబ్ధిదారులను కలిసి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనంతరం అవాస్ యోజన లబ్ధిదారులతో ముచ్చటించారు. పథకాలను ప్రజలంతా సక్రమంగా ఉపయోగించుకోవాలని సూచించారు. వారితో పాటు కలెక్టర్ వి.కీర్తి వాసన్, జయపురం సబ్ కలెక్టర్ ఎ.శొశ్యారెడ్డి, జయపురం బీడీవో శక్తి మహాపాత్రో, జిల్లా సివిల్ సప్లయ్ విభాగ అధికారి సూర్యకాంత బెహర తదితరులు పాల్గొన్నారు.
విద్యాభ్యాసాలకు ఆహ్వానాలు
పర్లాకిమిడి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించేందుకు సీఎం మోహన్ చరణ్ మాఝి పేరిట ఆహ్వాన పత్రికలను కలెక్టర్ బిజయ కుమార్‌దాస్ పర్లాకిమిడిలో మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో డీఈవో డా.మాయాధర్ సాహు, బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారులు పాల్గొన్నారు.
చికిత్స పొందుతూ కళాకారిణి సంతోషిణి మృతి
చికిత్స పొందుతూ కళాకారిణి సంతోషిణి మృతి
చికిత్స పొందుతూ కళాకారిణి సంతోషిణి మృతి