ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
రాయగడ: వివాహేతర సంబంధంతో ఒక అవివాహిత, వివాహితుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సదరు పోలీస్‌స్టేషన్ పరిధి రైతుల కాలనీ ఏడోలైన్‌లో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. రైతుల కాలనీ 7వ లైన్‌లో నివసిస్తున్న కోడూరు రమేష్ అనే వివాహితుడు, తన ఇంటి పక్కనే నివసిస్తున్న ఒక అవివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలో మంగళవారం వీరిద్దరూ ఒకే గదిలో ఉండడం గమనించిన ఇరుగుపొరుగు వారు విషయాన్ని బయటపెట్టారు. దీంతో గది లోపలే ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం తెలుసుకున్న ఇరువురి కుటుంబ సభ్యులు వారిద్దరినీ చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా అక్కడ చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.