పార్వతీపురం టౌన్: టీటీసీ వేసవి ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్. తిరుపతినాయడు తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కడప, అనంతపురంలలో మే 1నుంచి జూన్ 11 వరకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 3 నుంచి 25వరకు ప్రభుత్వ వెబ్‌సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌సీ.ఏపీ.జీఓవీ.ఇన్‌లో ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. మే 1 2025 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు 45ఏళ్లలోపు వయస్సు గల వారు అర్హులని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, అప్లికేషన్‌తో పాటు జిల్లా విద్యాశాఖాధి కారి కార్యాలయంలో మే 1వ తేదీన హాజరు కావాలని సూచించారు.
పోలమాంబ హుండీల ఆదాయం లెక్కింపు
మక్కువ: E™èl¢-Æ>…{«§ýl$ÌS CÌS-ÐólË$µ Ôèæ…ºÆý‡ ´ùÌS-Ð]l*…º AÐ]l$Ã-ÐéÇ çßæ$…yîlÌS B§éĶæ*-°² VýS$Æý‡$-ÐéÆý‡… §ólÐ]l-§éĶæ$-Ô>Q íܺ¾…¨ ÌñæMìSP…^éÆý‡$. Ôèæ…ºÆý‡ ´ùÌS-Ð]l*…º AÐ]l$Ã-ÐéÇ 8,9 gê™èl-Æý‡-ÌS-ÌZ ¿ýæMýS$¢-Ë$ çßæ$…yîl-ÌZÏ çÜÐ]l$-ǵ…^èl$-MýS$¯]l² M>¯]l$-MýS-ÌS¯]l$ ÌñæMìSP…^èl-V> ₹4,11,188 B§éĶæ$… Ð]l_a…§ýl° DK çÜ*Æý‡Å-¯éÆ>Ķæ$-׿ ™ðlÍ´ëÆý‡$. çßæ$…yîlÌS ÌñæMìSP…ç³# M>Æý‡Å-{MýS-Ð]l$…-ÌZ ´ëÆý‡Ó-¡ç³#Æý‡… Ð]l$¯]lÅ… hÌêÏ §ólÐ]l-§éĶæ$ Ô>Q A«¨M>Ç G‹Ü.Æ>gêÆ>Ð]l#, {V>Ð]l$ çÜÆý‡µ…^Œl Ððl§ýl$âýæÏ íÜ…à^èl-ÌS-Ð]l$Ð]l$Ã, Eç³-çÜ-Æý‡µ…^Œl AË$Ï Ððl…MýS-rÆý‡-Ð]l$-׿, Ð]l*i O^ðlÆý‡Ã¯ŒS ç³Nyìl §éÍ ¯éĶæ¬yýl$, E™èlÞÐ]l MýSÑ$sîæ Ð]l*i O^ðlÆý‡Ã¯ŒS O¯ðl§é¯]l çÜ*Æý‡Å-¯éÆ>Ķæ$-׿, ™èl¨™èl-Æý‡$-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.
గడ్డి మందుతాగి వ్యక్తి ఆత్మహత్య
గుర్ల: మండలంలోని నాగళ్లవలసకు చెందిన సంబర రమేష్ (51) గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రమేష్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉండడంతో తట్టుకోలేక బుధవారం గడ్డి మందు తాగేశాడు. గమనించిన కుటుంబసభ్యులు జిల్లా కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. మృతుని భార్య ఉమ అంగన్‌వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. కుమారుడు సూర్య ఉన్నాడు, ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.నారాయణ రావు తెలిపారు.
పక్కా డాక్యుమెంట్ రీ సర్వే జరగాలి
● జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్ శోభిక
కొమరాడ: జిల్లాలో జరుగుతున్న రెండవ విడత రీ సర్వేలో డాక్యుమెంట్లు పక్కాగా ఉండాలని, సమగ్ర విచారణ చేపట్టి తుది నిర్ణయం తీసుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఎస్.శోబిక సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ఆమె కొమరాడ మండలంలోని విక్రంపురం గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా రెండవ విడత రీ సర్వే పనులపై తనిఖీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ రీ సర్వే చేపడతున్న గ్రామల్లో ముందుగా రైతులకు సమాచారం అందించి తగు రశీదులను పొందాలని స్పష్టం చేశారు. భూముల రీసర్వేలో తలెత్తిన లోపాలను భూయజమానికి ముందుగా నోటీస్ ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. వివాదాస్పద భూములకు సంబంధించిన వివరాలు ఆయా రిజిస్టర్లలో నమోదు చేయాలని చెప్పారు. రీ సర్వేలో ఎక్కడా లోపాలు ఉండరాదని అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ తహసీల్డార్ శివయ్య మండల సర్వేయిర్ వంశీ తదితరులు పాల్గున్నారు.
టీటీసీ వేసవి ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
టీటీసీ వేసవి ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం
టీటీసీ వేసవి ట్రైనింగ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం