రాయగడ: ఒక గంజాయి కేసులో ఆరోగ్య కార్యకర్తను జిల్లాలోని పద్మపూర్ పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు. అరైస్టెన మహిళ కేంద్రపడ జిల్లాకు చెందిన జ్యోత్స్నరాణి శెఠిగా పోలీసులు గుర్తించారు. ఆమె నుంచి 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. పద్మపూర్ సమితి పరిధిలోని గులుగుడ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రం నిర్వహిస్తున్నారు. దీనిలో ఆరోగ్య కార్యకర్తగా పనిచేస్తున్న జ్యోత్స్న కొద్దికాలంగా అక్రమంగా గంజాయి క్రయవిక్రయాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు బుధవారం సాయంత్రం ఆమె ఉంటున్న ప్రభుత్వ క్వార్టర్స్‌లో దాడులు నిర్వహించారు. దీంతో గంజాయి బయటపడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గంజాయితో ఆరోగ్య కార్యకర్త అరెస్టు


