● ఘనంగా నాటక దినోత్సవాలు
జయపురం: స్థానిక గీతాంజలి కల్యాణ మండప ప్రాంగణంలో కొరాపుటియ కళలు, కళాకార సంస్థ ఆధ్వర్యంలో గురువారం రాత్రి ఘనంగా నాటక దినోత్సవాలు నిర్వహించారు. ప్రముఖ నాటక కళాకారుడు గోవింద చంద్ర సాహు ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో ముందుగా ఇటీవల అకాల మరణం చెందిన బాల కళాకారిణి సంతోషిణీ తరాశియకు నివాళులర్పించారు. జయపురం నాటక గత చరిత్ర, నేటి పరిస్థితి, భవిష్యత్‌లో నాటక కళను విస్తరింపజేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కళాకారులు సత్య మిశ్ర, గోపాల కృష్ణ సామంతరాయ్, సుధాకర పట్నాయిక్, రవీంద్ర పాత్రోలు మాట్లాడుతూ.. నాటక ప్రదర్శనలు సమాజ చైతన్యానికి దోహదపడతాయని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో సంగీత కళాకారుడు ధిరెన్ మోహన్ పట్నాయక్, కళాకారులు మనోజ్ కుమార్ పాత్రో, జయపురం ఆకాశవాణి విశ్రాంత అధికారి నరేంద్రనాథ్ పట్నాయక్, జయంత శాంత, గుప్తేశ్వర పాణిగ్రహి, రఘునాథ్ బిశ్వాల్, సత్యనారాయణ మిశ్ర తదితరులు పాల్గొన్నారు.
● ఘనంగా నాటక దినోత్సవాలు