రైతుసేవా కేంద్రం పరిశీలన
విజయనగరం ఫోర్ట్: అపరాల (పెసర, మినుము) పంటలను రైతులు విక్రయించేసిన తరువాత ప్రభుత్వం అపరాల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందన్న అంశంపై సాక్షిలో బుధవారం ‘ఎవరి లాభం కోసం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ ఎన్. వెంకటేశ్వరరావు స్పందించారు. ఈ మేరకు జామి మండలంలోని విజినిగిరిలో ఏర్పాటు చేసిన అపరాల కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతులు మాత్రమే అపరాలను విక్రయించుకోవాలని దళారులు ఎవరైనా అపరాలు విక్రయించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
జెడ్పీ చైర్మన్‌కు వైఎస్సార్‌సీపీ నాయకుల పరామర్శ
విజయనగరం: జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావును వైఎస్సార్‌సీపీ నాయకులు బుధవారం పరామర్శించారు. ఇటీవల జెడ్పీ చైర్మన్ చిన్న కుమారుడు మృతి చెందిన నేపథ్యంలో పార్టీ నాయకురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి జెడ్పీ చైర్మన్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తొలుత ఆమె మృతిచెందిన ప్రణీత్ బాబు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పలువురు వైఎసా్‌స్‌ర్‌సీపీ నాయకులు పాల్గొన్నారు.
కోటదుర్గమ్మ హుండీల ఆదాయం లెక్కింపు
పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ హుండీల ఆదాయాన్ని బుధవారం లెక్కించారు. ఉదయం 10 గంటల నుంచి దేవదాయ ధర్మాదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో హుండీలను తెరిచి ఆదాయాన్ని సిబ్బంది లెక్కించారు. ఈ నెల 3వ తేదీ నుంచి 26వ తేదీ వరకు 23 రోజులకు గాను రూ.3,08,943 ఆదాయం సమకూరినట్లు ఈవో సూర్యనారాయణ తెలిపారు. అలాగే 36 గ్రాముల బంగారం, 1900 గ్రాముల వెండి హుండీల్లో లభించిందని వివరించారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
సాలూరు: రామభద్రపురం మండలం చింతలవలస గ్రామానికి చెందిన టి.గౌరమ్మ(47) సాలూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో బుధవారం మృతిచెందింది. ఈ ఘటనపై సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాలిలా ఉన్నా యి. మక్కువ మండలంలోని ఎర్రసామంతవలస వద్ద చర్చికి ప్రార్థనలకు వెళ్లి వస్తున్న క్రమంలో ద్విచక్రవాహనంపై ముగ్గురు ప్ర యాణిస్తుండగా సాలూరులోని కోటవీధి జంక్షన్ వద్ద బైక్ మధ్యలో కూర్చున్న గౌరమ్మ అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో రైల్వే స్తంభాల లోడుతో వెళ్తున్న లారీ ఆమైపె నుంచి వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జ యి వెంటనే మరణించింది. దీనిపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
రైతుసేవా కేంద్రం పరిశీలన
రైతుసేవా కేంద్రం పరిశీలన
రైతుసేవా కేంద్రం పరిశీలన
రైతుసేవా కేంద్రం పరిశీలన