గుడ్లు రవాణా చేస్తున్న వాహనం బోల్తా
జయపురం: సబ్ డివిజన్ పరిధి బొయిపరిగుడ సమితి కొట్ట గ్రామ సమీపంలో కోడి గుడ్లు రవాణా చేస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గుడ్లు నేలమట్టం కాగా, ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళ్తే.. మల్కన్‌గిరి జిల్లా మతిల్తిలో కోడిగుడ్లను దుకాణాలకు అమ్మేందుకు జయపురం నుంచి ఒక ఆటో వెళ్లింది. మత్తిలిలో దుకాణాలకు గుడ్లు సరఫరా చేసి మిగిలిన గుడ్లతో తిరిగి వస్తుండగా బొయిపరిగుడ సమితి కొట్ట గ్రామ సమీపంలో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. గుడ్లు రోడ్డపై పడగా ఆటో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడనవారిలో జయపురం సమితి కుంతరకాల్ గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ రామ మండల్, డిమ్ల గ్రామానికి చెందిన శివ పొరజలు ఉన్నారు. గాయపడిన ఇద్దరినీ స్థానికులు బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు.
బాల్య వివాహం అడ్డగింత
పర్లాకిమిడి: స్థానిక కాశీనగర్ బ్లాక్ పోలూరు గ్రామంలో ఏప్రిల్‌లో జరగనున్న బాల్య వివాహాన్ని కాశీనగర్ జిల్లా శిశు సురక్షా అధికారులు ముందస్తుగా అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. కాశీనగర్ బ్లాక్ రాణిపేట గ్రామానికి చెందిన ఒక అమ్మాయికి 18 ఏళ్లు నిండకుండానే పోలూరు గ్రామానికి చెందిన వరుడితో ఏప్రిల్‌లో వివాహం చేయించేందుకు పెద్దలు నిశ్చయించారు. అయితే చైల్డ్‌లైన్ సిబ్బంది ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు రాణిపేట గ్రామానికి వెళ్లి వధువు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇప్పించారు. ఆడపిల్లకు 18 ఏళ్లు నిండకుండా వివాహం జరిపించడం నేరమని నచ్చజెప్పారు. అనంతరం వరుడు నివసిస్తున్న పోలూరు గ్రామానికి వెళ్లి అతడి కౌన్సిలింగ్ ఇచ్చి వివాహంను నిలుపుదల చేశారు.
సామూహిక
అక్షరాభ్యాసాలకు ఆహ్వానం
మల్కన్‌గిరి: స్థానిక బుట్టిగూడ వీధిలో కలెక్టర్ ఆశిష్ ఈశ్వర్ పటేల్ సామూహిక అక్షరాభ్యాసాలకు సంబంధించిన ఆహ్వాన పత్రాలు శనివారం పంపిణీ చేశారు. ఏప్రిల్ 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అక్షరాభ్యాసాలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా ఈనెల 28వ తేదీలోగ పాఠశాలల్లో చేరు విద్యార్థుల తల్లిదండ్రులకు ఆహ్వానపత్రాలు అందించారు. ఆయనతో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి ఉమా ప్రసాద్ దాస్, జిల్లా అదనపు విద్య అధికారి రాఘురాం సాజన్ తదితరులు పాల్గొన్నారు.
గుడ్లు రవాణా చేస్తున్న వాహనం బోల్తా
గుడ్లు రవాణా చేస్తున్న వాహనం బోల్తా