
పునరావృతం కాకుండా చూడాలి
గార: శ్రీకూర్మం క్షేత్రంలో తాబేళ్లు దహనం వంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని బీజేపీ నాయకులు అధికారులను కోరారు. బుధవారం కూర్మనాథాలయానికి జనసేన నాయకుల తో కలసి వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాబేళ్ల మరణానికి గల కారణాలు విశ్లేషించాలని, దహనం చేయడంలో ఎవరు చేశారన్నది త్వరగా విచారించాలని కోరారు. కార్యక్రమంలో పైడి వేణుగోపాలరావు, శివ్వాన ఉమామహేశ్వరి, బిర్లంగి ఉమామహేశ్వరరావు, పండి యోగీశ్వరరావు, పైడి సిందూర, జనసేన నాయకులు కోరాడ సర్వేశ్వరరావు, రాజు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.