అద్దె తగ్గింపునకు అంగీకారం
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ స్టాల్స్ అద్దెలు తగ్గించడానికి కౌన్సిల్ అంగీకరించింది. శుక్రవారం చాంబర్ ఆఫ్ కామర్స్ నేతృత్వంలో వ్యాపారుల బృందం కౌన్సిల్‌కి తరలివెళ్లి విజ్ఞప్తులు చేయగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో స్టాల్‌కు రు.840 వరకు అద్దె ఉండేది. పొడవు, వెడల్పులకు సంబంధం లేకుండా ఈ అద్దె వసూలు చేసేవారు. ఇది అసమంజసంగా భావించి చదరపు అడుగుకు రూ.9 చొప్పున అద్దె వసూలు చేయాలని కౌన్సిల్ నిర్ణయం చేసింది. దాంతో వ్యాపారులు ఈ అద్దె భారం అవుతుందని పేర్కొన్నారు. మున్సిపల్ చైర్మన్ కునునాయక్‌తో చర్చలు జరపగా ఇకపై చదరపు అడుగుకు రు.7గా నిర్ణయించారు. సమావేశంలో చాంబర్ అధ్యక్షుడు కనుదాస్, టి.ఎల్.మూర్తి, ఈఓ సమ్రేష్ మహంతి, కౌన్సిలర్ ఏ.సతీష్ తదితరులు పాల్గొన్నారు.


