జాతీయ సెమినార్ ప్రారంభం
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వద్యాలయంలో సైన్స్ ఫర్ సోషియేటెడ్ అప్లికేషన్స్ అనే అంశంపై శుక్రవారం రెండు రోజుల జాతీయ సెమినార్ ప్రారంభమయ్యింది. వర్సిటీ ఫిజిక్స్, కెమిస్టీ విభాగం ఐఓపీ, ఐఎఎన్‌సీఎఎస్,–ఈఆర్‌సీ భువనేశ్వర్ సహకారంతో జరిగిన ఈ సదస్సులో కార్యదర్శి డాక్టర్ బి.మల్లిక్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఈఆర్‌సీ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె.కె.నంద, ముంబై బీఆర్‌సీ డాక్టర్ ఆర్.ఆచార్య విశ్వవిద్యాలయ పి.జి కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ ప్రశాంత్‌కుమార్ పాత్ర, యూనివర్శిటీ రిజిస్ట్రార్ మహేశ్వర చంద్రనాయిక్, యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ దేవీప్రసాద్ మిశ్రా, సెమినార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జ్ఞాన రంజన్ మహంతి, హెచ్‌ఓడీ డాక్టర్ సుజిత్ కుమార్ దెహురి, సెమినార్ కన్వీనర్ డాక్టర్ బీబీ నంద, విద్యార్థులు పాల్గొన్నారు.


