
హజ్ యాత్రికులకు శిక్షణ శిబిరం
కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో తొలిసారిగా హజ్ యాత్రికుల శిక్షణ శిబిరం జరగనుంది. శుక్రవారం జయపూర్ ముస్లిం అంజుమన్ కమిటీ ప్రెసిడెంట్ మీర్జా ముస్తాఫా బేగ్ ఈ వివరాలు ప్రకటించారు. ఈ నెల 22వ తేదీన జయపూర్ పట్టణం లోని సంధ్యా ఫంక్షన్ హాల్‌లో ఈ శిబిరం ప్రారంభిస్తామన్నారు. అవిభక్త కొరాపుట్ జిల్లాల నుంచి మెత్తం 41 మంది ఈ ఏడాది హజ్ యాత్రకి వెళ్తున్నారని తెలిపారు. అందులో నబరంగ్‌పూర్ జిల్లా నుంచి 11 మంది, కొరాపుట్ జిల్లా నుంచి 21 మంది, రాయగడ జిల్లా నుంచి ఆరుగురు, మల్కన్ గిరి జిల్లా నుండి ముగ్గురు ఉన్నారని తెలిపారు. వీరు మే 13న హజ్ బయల్దేరి 42 రోజులు యాత్ర చేస్తారని తెలిపారు. ఒడిశా బోర్డు ఆఫ్ వక్ఫ్ కటక్ నుంచి నలుగురు నిపుణులు వచ్చి యాత్రికులకు శిక్షణ ఇస్తారన్నారు. యాత్రలో గుర్తింపు కార్డుల రక్షించుకోవడం, ప్రార్థన స్థలాలు కేటాయించిన భవనాల వద్దకు చేరుకోవడం, సౌదీలో నియమాలు గురించి యాత్రికులకు శిక్షణ ఇస్తారని ముస్తఫా పేర్కొన్నారు.

హజ్ యాత్రికులకు శిక్షణ శిబిరం