‘ఆ పవర్ ప్లాంట్ కొరాపుట్‌లో లేదు’
కొరాపుట్: ప్రైవేట్ పవర్ ప్లాంట్ కొరాపుట్ జిల్లాలో లేదని గిరిజనులకు జిల్లా అధికారులు వివరించారు. గురువారం కొరాపుట్ జిల్లా బొయిపరిగుడ సమితి దండాబడి గ్రామంలో అధికారులు గ్రామ సభ నిర్వహించారు. కొద్ది రోజుల క్రితం దండాబడి గ్రామస్తులు జిల్లా అధికారులకు ప్రైవేటు పవర్ ప్లాంట్‌పై ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దర్యాప్తులో ఆ రెండో ప్లాంట్ కొరాపుట్ జిల్లా పరిధిలో రావడం లేదని స్పష్టం చేశారు. మల్కన్‌గిరి జిల్లాకి చెందుతుందని ప్రకటించారు. ఇది తమ దర్యాప్తులో తేలిందని వివరించారు. అందువల్ల ప్లాంట్ యాజమాన్యంపై తమకు అధికారాలు లేవని పేర్కొన్నారు. ఇదే సభలో పాల్గొన్న ప్లాంట్ ప్రతినిధులు ఈ సమస్య యజమాన్యం దృష్టికి తెచ్చి అందులో దండాబడి గ్రామస్తులకు ఉపాధి కల్పించాలని ప్రతిపాదిస్తామని హామీ ఇచ్చారు. సమావేశంలో బొయిపరిగుడ అభిమన్యు కబి సత్పతి,జయపూర్ పారెస్ట్ రిజర్వ్ అఽధికారి ప్రతాప్ కుమార్ బెహరా పాల్గొన్నారు.
‘ఆ పవర్ ప్లాంట్ కొరాపుట్‌లో లేదు’


