
25న టేకు కలప బహిరంగ వేలం
టెక్కలి: ఈ నెల 25న టెక్కలి కోర్టు సముదా యంలో టేకు కలప బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు కోర్టు వర్గాలు సోమవారం ఓ ప్రకటనలో తెలిపాయి. వివిధ కేసుల్లో పట్టుబడిన సుమారు రూ.47,872 (ప్రభుత్వ విలువ) విలువ కలిగిన 21 రకాల వివిధ సైజులు కలిగి న టేకును బహిరంగ వేలం వేస్తున్నట్లు వెల్లడించారు. జూనియర్ సివిల్ జడ్జి ఎస్‌హెచ్‌ఆర్ తేజ చక్రవర్తి మల్ల సమక్షంలో ఉదయం 10:30 గంటల నుంచి నిర్వహిస్తున్న ఈ వేలంలో ఆసక్తి కలిగిన వారు పాల్గొనవచ్చునని పేర్కొన్నారు.
12 మందికి శ్రీశ్రీ వేదిక పురస్కారాలు
శ్రీకాకుళం కల్చరల్: సాహిత్య, కళా రంగాల్లో పలు రికార్డులు సాధించిన 12 మందికి శ్రీశ్రీ కళావేదిక సంస్థ ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహించబోయే ప్రపంచ తెలుగు సంబరాల్లో శ్రీశ్రీ వేదిక పురస్కారాలను అందిస్తున్నారు. మే నెల 10,11 తేదీల్లో నిర్వహించే ఈ సంబరాలకు జిల్లా నుంచి 12మందిని ఎంపిక చేసినట్లు నిర్వాహక సంస్థ సమన్వయకర్త ఈవేమన ఓ ప్రకటనలో తెలిపారు. జంధ్యాల శరత్ బాబు (తెలుగు భాష), కుమారనాయక్, ఎం. శ్రీరాములు (తెలుగు కీర్తి), రఘుపాత్రుని శివ, పి. ముకుందరావు (యువకీర్తి), గౌరీపతిశాస్త్రి (అక్షర తేజం), జె.వి.తిరుమలాచార్యులు (కళా కిరీటి), మహ్మద్ రఫీ (కళారత్న), మూల తాత య్య (శ్రీశ్రీ ప్రతిభా పురస్కారం), మాతృదేవో భవ పురస్కారాలను బోడవరపు వెంకటలక్ష్మీ, గంపా శ్రీదేవి, డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవిలకు ప్రకటించారని తెలిపారు.
26న ముఖ్యమంత్రి పర్యటన
ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండలంలోని బుడగుట్లపాలెం మత్స్యకార గ్రామంలో ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు ఈ నెల 26న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బహిరంగ సభ నిర్వహించి మత్స్యకార భరోసా (వేట నిషేధ భృతి) అందజేయనున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ స్వప్నిక్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఆర్డీఓ సాయిప్రత్యూష, డీఎస్పీ వివేకానంద, తహసీల్దార్ బి.గోపాలరావుతో కూడిన అధికారులు సోమవారం ఏర్పాట్లపై సమీక్షించారు. స్థలం పరిశీలించి సభ ఏర్పాటుపై చర్చించారు.
రెండు గంటల నిరీక్షణ
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కాశీబుగ్గ ఎల్‌సీ గేటు వద్ద ప్రయాణికులు సోమవారం నరకయాతన పడ్డారు. రైలు పట్టాల కింద కొత్త స్లీపర్‌లు వేశారు. దీని కోసం ప్రత్యేకమైన రైలు రావడంతో సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఏడున్నర గంట ల వరకు పనులు చేపట్టారు. ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో వాహనదారులు అంత సేపూ వేచి ఉండాల్సి వచ్చింది. ఆఖరుకు నర్సిపురం, కిష్టుపురం ప్రాంతాల మీదుగా ప్రయాణించారు.
బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలు
కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కేటీ రోడ్డు మోర్ స్టోర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. యు టర్న్ తీసుకునే సమయంలో రెండు బైక్‌లు ఎదురెదుగా ఢీకొట్టడంతో చిత్రాడ దేవరాజు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. తక్షణమే స్థానికులు 108 ప్రభుత్వ వాహనానికి సమాచారం ఇవ్వడంతో క్షతగా త్రుడిని పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు.
డీఎస్పీ మూర్తికి సత్కారం
శ్రీకాకుళం క్రైమ్: విధి నిర్వహణలో అందించిన సేవలే గుర్తింపునిస్తాయని, అలాంటి క్రమశిక్షణ నిబద్ధత గల అధికారి డీఎస్పి డిఎస్‌ఆర్‌వీ ఎస్‌ఎన్ మూర్తి అని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. టెక్కలిలో ఇటీవల ఉద్యోగ విరమణ పొందిన మూర్తిని నగరంలోని ఓ హోటల్‌లో సోమవారం ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ లు కేవీ రమణ, పి.శ్రీనివాసరావు, డీఎస్పీలు సీహెచ్ వివేకానంద, వీవీ అప్పారావు, శేషాద్రి పాల్గొన్నారు.

25న టేకు కలప బహిరంగ వేలం

25న టేకు కలప బహిరంగ వేలం

25న టేకు కలప బహిరంగ వేలం