
‘ఆపరేషన్ కగార్ ఆపాల్సిందే’
పలాస: దండకారణ్యంలో జరుగుతున్న ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఆపాలని ప్రగతిశీల కార్మిక సమాఖ్య డిమాండ్ చేసింది. పలాస మండలం బొడ్డపాడు అమరవీరుల స్మారక మందిరంలో బుధవారం మేడే కరపత్రాల ను ఆవిష్కరించారు. అన్ని ఊరూవాడల్లో కార్మిక పతాకాలను ఆవిష్కరించి ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని విజయవంతం చేయా లని కోరారు. అలాగే కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలన్నారు. కనీసం వేతనం రూ.26వేలు చెల్లించాలని, అసంఘటిత కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పురుషులతో పాటు మహిళలకు సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ప్రగతి శీల కార్మిక సమాఖ్య జిల్లా కార్యదర్శి పుచ్చ దుర్యోధనరావు, అధ్యక్షుడు మద్దిల ధర్మారావు, దాసరి నారాయణమూర్తి, మామిడి గణపతి, గూడ మన్మధ, డొక్కర లక్ష్మణ, తామాడ గంగయ్య, మురిపింటి గంగయ్య, దాసర దానేశు తదితరులు పాల్గొన్నారు.