
హైటెక్ గ్రూప్ బిశ్వజిత్ పాణిగ్రాహికి సత్కారం
పర్లాకిమిడి: ఉన్నత విద్య, ఆరోగ్యశాఖలో అనేక విప్లమాత్మక మార్పులు తెచ్చిన ఒడిశాలోని హైటెక్ గ్రూప్ మెడికల్ కళాశాలల డైరక్టర్ బిశ్వజిత్ పాణిగ్రాహిని రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ సంఘం మంత్రి డాక్టర్ ముఖేష్ మహలింగ సోమవారం భువనేశ్వర్‌లో మెమొంటోతో సత్కరించారు. భువనేశ్వర్‌లో జరిగిన కాన్‌క్లేవ్ ఒడిశా కార్యక్రమంలో బిశ్వజిత్‌ను సత్కరించారు. బిశ్వజిత్ పాణిగ్రాహి హైటెక్ మెడికల్ కళాశాలల మేనేజింగ్ ట్రస్టీ సురేష్ కుమార్ పాణిగ్రాహి కుమారుడు. రూర్కెలా, భు భనేశ్వర్, తిరుపతిలో వైద్య కళాశాలలు నెలకొల్పిన చైర్మన్ డాక్టర్ తిరుపతి పాణిగ్రాహి సంతానం సురేష్‌కుమార్ పాణిగ్రాహి.