
ఏడుగురు సైబర్ మోసగాళ్లు అరెస్టు
భువనేశ్వర్:
పూరీ నీలాద్రీ భక్త నివాస్ మోసపూరిత వెబ్‌సైట్‌ను సృష్టించి వసతి కల్పించడంలో యాత్రికులను మోసం చేసే ప్రయత్నంలో పాల్గొన్న ప్రధాన నింది తుడితో సహా ఏడుగురిని రాష్ట్ర క్రైమ్ (సీఐడీ సైబర్ క్రైమ్) యూనిట్ విజయవంతంగా అరెస్టు చేసింద ని ఆ శాఖ డైరెక్టర్ జనరల్ వినయ్‌తోష్ మిశ్రా విలేకర్లకు తెలిపారు. అరెస్టు చేసిన వ్యక్తుల్లో ప్రధాన నిందితుడు అన్షుమాన్ శర్మ (24)గా గుర్తించారు. మిగిలిన నిందితుల్లో ఉత్తరప్రదేశ్‌కు చెందిన అరవింద్ కుమార్ (35), ఆకాష్ కేశర్వాణి (33), గుజరాత్ కు చెందిన హితేష్‌భాయ్ పాత్రో (39), పార్థ్ పర్మా ర్ (25), ఠక్కర్ కర్సాంజి శోభాజీ (48), కురేషి మహ్మద్ అస్లాం (31) ఉన్నారు. పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయ ప్రధాన నిర్వాహకుడి (సీఏఓ) లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. నకిలీ వెబ్‌సైట్ సృష్టించి పుణ్య క్షేత్రం పూరీలో వసతి సదుపాయం కల్పిస్తా మని మోసగిస్తున్నట్లు ప్రజలు, భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు దాఖలు కావడంతో చర్యలు తీసుకోవా లని శ్రీ మందిరం సీఏఓ ఫిర్యాదు రాష్ట్ర క్రైం శాఖకు ఫిర్యాదు చేశారు. అమాయకపు యాత్రికులను వాట్సాప్ ద్వారా మొబైలు నంబరుకు పూరీ పుణ్య క్షేత్రంలో నీలాద్రి భక్త నివాస్‌లో వసతి సదుపా యం ఖరారు చేసినట్లు మోసగించి ఆన్‌లైన్‌లో చెల్లింపులు ప్రేరేపించి మోసాలకు పాల్పడుతున్న ట్లు ఫిర్యాదులో వివరించారు.
మోసగాళ్లు కెనరా బ్యాంకులోని సేవింగ్స్ బ్యాంక్ ఖాతా (ఖాతా నంబర్: 110217193478) లోకి చెల్లింపులు స్వీకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నా రు. అన్షుమాన్ శర్మ వెబ్‌సైట్‌ను మే 22, 2024న సృష్టించాడని తేలింది. ఫిర్యాదు నమోదైన వెంటనే ఆ మోసపూరిత సైట్‌ను తొలగించారు. అక్రమ లావాదేవీలకు బ్యాంకు ఖాతాను ఉపయోగించిన మరో సహచరుడు అరవింద్ కుమార్‌ను కూడా దర్యాప్తులో గుర్తించారు. అరెస్టు చేసిన అనుమానితుల నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు, నీలాద్రి భక్త నివాస్ వెబ్‌సైట్‌కు సంబంధించిన వివరాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, గోడాడీ హోస్టింగ్ సమాచారం, వెబ్‌సైట్‌ను రూపొందించడానికి ఉపయోగించిన రిజిస్టర్డ్ సిమ్ కార్డ్‌తో సహా అనేక వస్తువులను దర్యాప్తు బృందం స్వాధీనం చేసుకుంది.
ఈ మోసపూరిత వ్యవహారంలో 4 వేర్వేరు కేసులు దాఖలు చేశారు. వీటి దర్యాప్తు కొనసాగించడానికి 2 దర్యాప్తు బృందాలను గుజరాత్ (అహ్మదాబాద్, ఆనంద్ జిల్లా, సూరత్) ఉత్తరప్రదేశ్‌కు పంపారు.
రూ.1.28 కోట్లు మోసం
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన హితేష్‌భాయ్ పాత్రో (39) ఖాతాలో నేరుగా రూ. 27 లక్షలు జమ అయిన ఆధారంతో ఆయనను అరెస్టు చేశారు. 6 చెక్ పుస్తకాలు, 31 డెబిట్/క్రెడిట్ కార్డులు, నకిలీ కంపెనీల 13 రబ్బరు స్టాంపులు, 12 మొబైల్ హ్యాండ్‌సెట్‌లు, సిమ్ కార్డులు, 4 పెన్ డ్రైవ్‌లు ఎనిమిది ప్రభుత్వ, ప్రభుత్వేతర ఐడిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో సమగ్రంగా రూ.1.28 కోట్లు భారీ మోసం బట్టబయలైందని డీజీ పేర్కొన్నారు.
రూ. 7.5 కోట్లు భారీ మోసం
ఈ మోసం వ్యవహారంలో అహ్మదాబాద్‌కు చెందిన పార్థ్ పర్మార్ (25) ప్రాథమిక ఖాతాదారుడిగా వ్యవహరించినట్లు ధృవీకరించి అరెస్టు చేశారు. అతని ఖాతాలో ప్రత్యక్షంగా రూ. 25 లక్షలు జమ అయినట్లు పేర్కొన్నారు. పోలీసులు అతని మొబైల్ ఫోన్, ఆధార్ కార్డు మరియు పాన్ కార్డును స్వాధీనం చేసుకుని కొనసాగించిన దర్యాప్తులో మోసం పరిమాణం రూ.7.5 కోట్లుగా తేలింది.
రూ. 87.8 లక్షల మోసం
ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. గుజరాత్‌లోని బనస్కాంతకు చెందిన ఠక్కర్ కర్సాంజీ శోభాజీ (48) తన ఖాతాలో రూ. 9.3 లక్షలు జమ చేసినట్లు గుర్తించడంతో ఈ డొంక కదిలింది. గుజరాత్‌లోని ఖేడా జిల్లాకు చెందిన కురేషి మొహమ్మద్ అస్లాం (31) ఖాతాలో రూ. 6 లక్షలు జమ అయినట్లు తేలింది. వీరి దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రూ. 1.4 కోట్లు మోసం
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన ఆకాష్ కేషర్వానీ (33) ఖాతాకు రూ. 3.7 లక్షలు బదిలీ ఆధారంగా అతడిని అరెస్టు చేశారు. అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్లో మొబైల్ ఫోన్లు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులు ఉన్నాయి. తదుపరి దర్యాప్తులో ఇలాంటి మోసపూరిత కార్యకలాపాలలో అదనపు కరెంట్ ఖాతాల ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేరంలో ఇతర భాగస్వాములను, దాని ట్రాన్స్ ఇండియా పరిణామాలను, డబ్బు జాడను దర్యాప్తు బృందం కనుగొంటుందని తెలిపారు.