
వక్ఫ్ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు
కొరాపుట్: ఈ నెల రెండో వారంలో కేంద్రం తెచ్చిన వక్ఫ్ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని బీజేపీకి చెందిన నబరంగ్‌పూర్ ఎంపీ బలబద్ర మజ్జి పేర్కొన్నారు. సోమవారం కలహండి జిల్లా భవానిపట్న లో ఇండియన్ ఫుడ్ పార్క్‌లో జరిగిన బీజేపీ వర్క్ షాప్‌లో కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఈ బిల్లు లోక్ సభ, రాజ్యసభలలో అనుమతి పొందిందన్నారు. వక్ఫ్ రూల్స్ వలన ముస్లిం సోదరులు, సోదరీ మణులు గతంలో చాలా ఇబ్బందులు పడ్డా రన్నారు. ఇకపై ఆ కష్టాలు ఉండవని చెప్పారు. పేద ముస్లిం లకు ఈ బిల్లు ప్రస్తుతం సహాయం చేస్తుందని బలబద్ర మజ్జి పేర్కోన్నారు.ఈ సమావేవంలో కలహండి ఎంపీ రాజమాత మాళవిక దేవి, ఎంఎల్ ఎ సుదీర్ రంజన్ పఠజోషిలు పాల్గోన్నారు.