నిలిచిపోయిన రైళ్లు
కొరాపుట్: కొత్తవలస – కిరండోల్ రైల్వేమార్గంలో కొరాపుట్–జయపూర్ రైల్వేస్టేషన్ల మధ్య జరతి రైల్వేస్టేషన్‌లో ప్రమాదం జరగడంతో రైళ్లు నిలిచిపోయాయి. వివరాల్లోకి వెళ్తే.. గంగవరం పోర్టు నుంచి గూడ్స్ రైలు ఛత్తీష్‌గడ్‌లోని బచేలి నుంచి ముడి ఇనుప రజను తీసుకొని రావడానికి వెళ్తోంది. అయితే ఆ సమయంలో గుర్తు తెలియని వస్తువు ఢీకొనడంతో ఒక విద్యుత్ స్తంభం ముందుకు కదిలింది. దీంతో 350 మీటర్ల విద్యుత్ వైరు తెగిపడింది. ఫలితంగా విద్యుత్ సరఫరా లేకపోవడంతో రైళ్లు నిలిచిపోయాయి. వెంటనే కొరాపుట్, జయపూర్ స్టేషన్ల నుంచి రైల్వే నిపుణులు ఘటనా స్థలానికి చేరుకొని విద్యుత్ పునరుద్ధరించారు. దీంతో జగదల్‌పూర్–రౌర్కెలా, జగదల్‌పూర్–భువనేశ్వర్ రైళ్లని జయపూర్ రైల్వేస్టేషన్లో నిలిపివేశారు.
నిలిచిపోయిన రైళ్లు


