
మంచం కింద భార్య శవం
కొరాపుట్: మంచం కింద పెట్టెలో భార్య శవం పెట్టి భర్త పరారైన సంఘటన సోమవారం నబరంగ్‌పూర్ జిల్లా చందాహండి సమితి హల్ది గ్రామంలో వెలుగు చూసింది. రెండు రోజుల నుంచి తమ కూతురు అనితా స్వయ్ (25) నుంచి సమాచారం లేదని ఆమె బంధువులు చందాహండి పోలీస్ స్టేషన్‌కి ఫిర్యాదు చేశారు. అనుమానంతో పోలీసులు గ్రామస్తుల సమక్షంలో రెండు రోజులుగా తాళం వేసి ఉన్న ఆమె ఇంటిని బలవంతంగా తీసి లోపలకి వెళ్లారు. అక్కడ మంచం కింద అనిత మృతదేహం కనిపించింది. ఆమె భర్త దుష్మంత్ నాయక్ రెండు రోజులుగా పరారీలో ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.