
అంబులెన్స్‌లో ప్రసవం
మందస: మందస మండలం కుడుమాసాయ్ గిరిజన గ్రామంలో ఓ మహిళ అంబులెన్స్‌లో ప్రసవించారు. ఆమెకు బుధవారం పురిటి నొప్పులు రావడంతో 108కు కాల్ చేశారు. అంబులెన్స్‌లో ఆమెను తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో నొప్పులు అధికం కావడంతో వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇద్దరినీ హరిపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. 108 సిబ్బంది ఈఎంటీ ఉప్పాడ గోపాలకృష్ణ, పైలెట్ రామచంద్రారెడ్డి ఉన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు
ఎచ్చెర్ల క్యాంపస్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎచ్చెర్ల మండలం బుడగుట్లపాలెంలో ఈ నెల 26వ తేదీన పర్యటించనున్నారు. ఈ పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుడ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు బుధవారం పర్యవేక్షించారు. గ్రామంలో ఏర్పాటు చేయనున్న సభ, హెలీప్యాడ్ ఏర్పాటు, వాహ నాలు పార్కింగ్, మత్స్యకారులతో ముఖా ముఖి కార్యక్రమం నిర్వహణపై చర్చించారు.
పుస్తక ప్రదర్శన
శ్రీకాకుళం అర్బన్: ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుధవారం శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా గ్రంథాలయ కా ర్యదర్శి బి.కుమార్‌రాజు మాట్లాడుతూ పుస్తకం మంచి నేస్తం వంటిదని అన్నారు. ప్రతి విద్యార్థి గ్రంథాలయానికి వచ్చి కొత్త విషయాలు నేర్చుకోవాలన్నారు. పోటీ పరీక్షలకు పుస్తకాలు తెప్పించడం జరిగిందని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాని సూచించారు. ఈ ప్రదర్శనలో రామాయణం, మహాభారతం, ఇతిహాసాలు, నాటికలు, ఇయర్ బుక్స్, నిఘంటువులు, పోటీ పరీక్షలకు సంబంధించిన 200 రకాల పుస్తకాలు ఉంచినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప గ్రంథాలయాధికారి వీవీజీఎస్ శంకరరావు, పై.మురళీ కృష్ణ, యు.కల్యాణి, టి. రాంబాబు, పి.రామ్మోహన్ విద్యార్థులు, పాఠకులు పాల్గొన్నారు.
కందుకూరి పురస్కార గ్రహీతలకు సత్కారాలు
శ్రీకాకుళం కల్చరల్: నగరంలోని వాసవీ కల్యాణ మండపంలో సుమిత్రా కళాసమితి ఆధ్వర్యంలో ఇటీవల కందుకూరి పురస్కారాలు అందుకున్న కళాకారులను బుధవారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. పురస్కారాలు అందుకున్న మెట్ట పోలినాయుడు, గుత్తు చిన్నారావులకు జ్ఞాపికలు, సన్మాన పత్రాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో రంగస్థల కళాకారుల సమాఖ్య సభ్యులు, సుమిత్రా కళాసమితి సభ్యులు పాల్గొన్నారు.
ఇంటి బాట..
టెక్కలి: ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు వేసవి సెలవులు ఇవ్వడంతో వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులంతా ఇంటి బాట పట్టారు. బుధవారం తరగతుల నిర్వహణ చివరి రోజు కావడంతో, సుదూర ప్రాంతాల్లో ఉన్న తల్లిదండ్రులంతా వసతి గృహాల వద్దకు చేరుకుని వారి పిల్లలకు సంబంధించి సామ గ్రితో ఇంటి బాట పట్టారు. మళ్లీ జూన్ 12 న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.

అంబులెన్స్‌లో ప్రసవం

అంబులెన్స్‌లో ప్రసవం

అంబులెన్స్‌లో ప్రసవం

అంబులెన్స్‌లో ప్రసవం