
మావో డంప్ స్వాధీనం
మల్కన్‌గిరి: జిల్లాలో చిత్రకొండ సమితి స్వాభిమాన్ ఏరియాలోని కేందుగూడ గ్రామ సమీప అడవిలో 177 బెటాలియాన్‌కు చెందిన బీఎస్‌ఎఫ్ జవాన్లు కూంబింగ్ నిర్వహించారు.
అయితే వారు తిరిగి వస్తున్న సమయంలో శుక్రవారం తెల్లవారుజామున ఓ మావో డంప్ గుర్తించారు. దీంతో వెంటనే దానిని వెలికితీశారు. అందులో నాలుగు టిఫిన్ బాంబులు, ఒక 12 వోల్ట్స్ బ్యాటరీ, ఎలక్ట్రికల్ వైర్లు, పెద్ద ప్లాస్టిక్ డ్రమ్, ఆక్సిజన్ సిలిండర్లు, ఇతర పేలుడు పదార్థాలు ఉన్నాయి. ఈ సామగ్రిని స్వాధీనం చేసుకొని బీఎస్‌ఎఫ్ క్యాంపుకు తరలించారు.