చిరుత, ఎలుగు దాడులు
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా రాయగర్ సమితి కేంద్రానికి సరిహద్దులోని సరోనా ప్రాంతం అచిడోంగ్రి గ్రామంలోకి ఆదివారం చిరుత పులి ప్రవేశించింది. వీధిలో ఆడుకుంటున్న చిన్నారి బాలుడిపై దాడికి తెగబడింది. పిల్లవాడు భయంతో కేకలు వేయగా గిరిజనులు ఆయుధాలతో పులి పై దాడి చేశారు. వెంటనే ఆ బాలుడిని వదిలి అడవిలోకి పారిపోయింది. బాధితుడిని కాంకేర్ లోని కోమ్లాదేవి ఆస్పత్రికి తరలించారు.
వేర్వేరు చోట ఎలుగు బంట్లు దాడులు
ఆదివారం నబరంగ్‌ఫూర్ జిల్లా రాయగర్ సమితి కుసుంపూర్ గిరిజన గ్రామానికి చెందిన రాములు గొండో మెంతి ఆకులు సేకరణకు అడవి లోనికి వెళ్లింది. ఒక ఎలుగు బంటి వెనక నుంచి దాడి చేసి కాలు,భుజం మీద గాయ పరిచింది. భయంతో రాములు కేకలు వేయడంతో సమీపంలో ఉన్న గిరిజనుల రక్షించారు. హత్తిగావ్ పంచాయతీ లెండి గ్రామానికి చెందిన శంకర్ గొండో అడవిలో మెంతి ఆకుల సేకరణకి వెళ్లాడు. అతనిపై కూడా వేరే ఎలుగు బంటి దాడి చేసింది. సహచరులు రక్షించి ఆస్పత్రికి తరలించారు. వీరిద్దరినీ రాయగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. హత్తిగాం అటవీ ప్రాంతంలో ఎలుగు బంట్లు అధికంగా వచ్చాయని అటవీ శాఖ అధికారులు సమీప గ్రామాల్లో హెచ్చరికలు చేశారు. కానీ గిరిజనులు జీవనోపాధి కోసం తేనె, కలప, గుగ్గిలం, మెంతి ఆకుల సేకరణ కి వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారు.
చిరుత, ఎలుగు దాడులు
చిరుత, ఎలుగు దాడులు


