
కొండలెక్కి.. వాగులు దాటి
కొరాపుట్: దండకారణ్యంలోని దుర్గమ అటవీ ప్రాంతాలలో ఉండే గిరిజన గూడేంలను లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత సందర్శించారు. ఆదివారం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి గౌడుగుడ గ్రామ పంచాయతీ లచ్చమణి, తులమట్టంగి, ఉప్పర్ మట్టంగి గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాలకు రోడ్డు మార్గం లేదు. కనీసం బైక్ వెళ్లడానికి కూడా అవకాశం లేదు. దీంతో ఎమ్మెల్యే కాలి నడకన కొండలు ఎక్కి, వాగులు దాటి గ్రామాలకు చేరుకున్నారు. పలు చోట్ల గిరిజనులతో మీటింగ్‌లు ఏర్పాటు చేసి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇళ్ల ముందు ఉన్న అరుగులే వేదికలయ్యాయి. స్వాతంత్య్ర అనంతరం ఇంత వరకు ఆ గ్రామాలకు ఎవరూ వెళ్లలేదు. పవిత్ర శాంత తొలి ఎమ్మెల్యే. తులమట్టంగి వద్ద ఉన్న పెద్ద జలపాతాన్ని కూడా సందర్శించి రోడ్డు వేయాలని పర్యాటక శాఖకు లేఖ రాశారు.

కొండలెక్కి.. వాగులు దాటి

కొండలెక్కి.. వాగులు దాటి