Odisha News
-
నవజాత శిశువుల పొట్టలపై వాతలు పెట్టొద్దు
కొరాపుట్: నవజాత శిశువుల పొట్టలపై వాతలు పెట్టవద్దని బీజేడీ ఎంపీ, ఒడియా సినీ హీరో ముజిబుల్లా ఖాన్ (మున్నా) ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ సమితి సెమిఖొడ్ర పంచాయతీ ఖండ గ్రామంలో జన జాగృతి మిషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో గిరిజన మహిళలనుద్దేశించి ప్రసంగించారు. అప్పుడే పుట్టిన శిశువుల పొట్టలపై కొడవలిని కాల్చి వాతలు పెట్టడంతో అనాగరికమన్నారు. నబరంగ్‌పూర్ జిల్లాలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ఇంకా ఇటువంటి మూఢనమ్మకాలు కొనసాగుతుండటం బాధాకరమన్నారు. ఇటువంటి వాతలు పెట్టే మంత్రగత్తెలను పొలీసులు అరెస్ట్ చేయాలన్నారు. కార్యక్రమంలో సయాద్ కాజం మదాని తదితరులు పాల్గొన్నారు. -
ఫుట్‌బాల్ చాంపియన్‌గా జీబా టైగర్స్
పర్లాకిమిడి: స్థానిక గజపతి స్టేడియంలో ఏప్రిల్ 7వ తేదీ నుంచి జరుగుతున్న జిల్లా స్థాయి సీఎం ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారంతో ముగిశాయి. ఫైనల్స్‌లో నువాగడ, జీబా టైగర్స్ మధ్య పోటీ జరిగింది. నువాగడ ఫైటర్స్‌పై నాలుగు పాయింట్ల తేడాతో జీబా టైగర్స్ విజేతగా నిలిచింది. జీబా టైగర్స్‌కు భువనేశ్వర్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్టోర్స్ అకాడమీలో చేర్చి ఫుట్‌బాల్‌లో కోచింగ్ ఇస్తూ ఉన్నత చదువులు చదివిస్తుంది. జీబా టైగర్స్‌లో అందరూ 15 ఏళ్ల వయస్సు గలవారే. జిల్లాలో 8 క్లబ్‌లకు చెందిన క్రీడాకారులు అండర్ 15 గ్రూప్‌లో 176 మంది ఏప్రిల్ 7 నుంచి 13వ తేదీ వరకు ఆడారు. ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, జిల్లా ఎస్పీ జితేంద్ర నాథ్ పండా, గౌరవ అతిథి డీఈఓ మాయాధర్ సాహు, విద్యాలయాల పీఈటీ సురేంద్ర పాత్రో హాజరయ్యారు. ట్రోఫీని జీబా టైగర్స్ జట్టుకు ఎమ్మెల్యే అందజేయగా, నువాగడ ఫైటర్స్ జట్టుకు రన్నర్స్ ట్రోఫీని జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ విద్యాలయాల ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలలో విద్యాలయాల క్రీడా శిక్షకులు ధర్మేంద్ర సామల్, సంతోష్ పట్నాయక్, ప్రియదర్శి మిశ్రా, రేఖారాణి దేవ్, శివరాం భుయ్యాన్, కె.వి.రెడ్డి, కిశోర్ సామల్ పర్యవేక్షించారు. -
గనుల తవ్వకాలపై ఎంపీ ఆగ్రహం
కొరాపుట్: కొరాపుట్ జిల్లాలో కొడింగా మాలిలో గనుల తవ్వకాలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ సమితి కేంద్రంలోని ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. గ్రామ సభ, పల్లె సభ తీర్మానాలను ఉల్లంఘించి అక్రమాలు జరుగుతున్నాయన్నారు. గత తీర్మానాలను పక్కన పెట్టి తవ్వకాల పరిధిని పెంచారన్నారు. అందుకు కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో మోహన్ మజ్జి ప్రభుత్వాలు గనుల తవ్వాకాలకు రాజ మార్గాలు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. గిరిజనులకు మిగిలేది కేవలం కాలుష్యమేనన్నారు. తాము అంబెడ్కర్ ఆశయాల సాధన కోసం రాహుల్ గాంధీ నేతృత్వంలో బలహీన వర్గాలకు అండగా నిలబడతామన్నారు. కొడింగా మాలిలో బాకై ్సట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఎంపీ సప్తగిరి ఉల్క హెచ్చరించారు. ఈ సమావేశంలో లక్ష్మీపూర్ ఎమ్మెల్యే పవిత్ర శాంత, ఎంపీ ప్రతినిధి మనోజ్ ఆచార్యలు పాల్గొన్నారు. అంతకు ముందు నియోజకవర్గ పర్యటనలో భాగంగా అంబెడ్కర్ సంఘాలతో సమావేశమయ్యారు. -
9 మందికి రిమాండ్
సోంపేట: సోంపేట ఎకై ్సజ్ స్టేషన్ పరిధిలో నవోదయం 2.0 లో భాగంగా ఏప్రిల్ 1 నుంచి 12వ తేదీ వరకు 5 నాటు సారా కేసులు నమోదు చేసి 9 మందిని రిమాండ్‌కు తరలించినట్లు ఎకై ్సజ్ సీఐ బేబి తెలిపారు. పై కేసుల్లో 68 లీటర్ల నాటు సారా సీజ్ చేసి, 1800 లీటర్ల బెల్లం ఊటలను ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు. దాడుల్లో పలువురు సిబ్బంది పాల్గొన్నట్లు తెలియజేశారు. ఏరియా ఆస్పత్రికి కొత్త ఎక్స్‌రే మిషన్ నరసన్నపేట: స్థానిక ఏరియా ఆస్పత్రికి కొత్త ఎక్స్‌రే యూనిట్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకూ పాత ఎక్స్‌రే యూనిట్ నే వినియోగిస్తూ వచ్చారు. రూ. 7 లక్షల విలువ కలిగిన ఎక్స్‌రే యూనిట్ ఆస్పత్రికి మంజూరు కావడం యూనిట్ రావడంతో దాన్ని వెంటనే వినియోగం లోనికి తీసుకువచ్చారు. ప్రస్తుతం అన్ని రకాల ఎక్స్‌రేలు ఈ కొత్త మిషన్‌లో తీయవచ్చని యూనిట్ ఇన్చార్జి కృష్ణమూర్తి తెలిపారు. రోగులు వినియోగించుకోవాలని కోరారు. ప్రజల కష్టాలపై కవులు స్పందించాలి శ్రీకాకుళం కల్చరల్: దేశంలో అరాచక ఫాసిస్టు మూకలు రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తూ ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్నాయని, ఈ దశలో అంబేడ్కర్ ఆశయాలను తలకెత్తుకుని ప్రజానీకం అంతా ఐక్యంగా ముందుకు సాగాలని కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు అన్నారు. ఆదివారం ఇలిసిపురంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిరంలో సాహితీ స్రవంతి శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో సమతాభారత్ కవితా గోష్టిలో ఆయన మాట్లాడారు. ప్రజల కష్టాలపై కవులు స్పందించాలని పిలుపునిచ్చారు. అంబేడ్కర్ విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యులు డాక్టర్ కె.ఉదయ్‌కిరణ్ త్రిభాషా సూత్రం మాతృభాష అనే అంశంపై ప్రసంగించారు. 2020 నూతన విద్యావిధానం ద్వారా హిందీబాషను రుద్దాలని చూస్తున్నారని, మాతృభాషలో విద్యాబోధన విద్యార్థి ప్రాథమిక హక్కు అని అన్నారు. ఇతర భాషలు నేర్చుకొవడం ఐచ్ఛికమన్నారు. సభకు అధ్యక్షత వహించిన సాహితీ స్రవంతి కన్వీనర్ కేతవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఆశయాలు, స్వాతంత్రోద్యమ లక్ష్యాలు నీరు గారకుండా గళం ఎత్తి కలాలకు పదును పెట్టాలని పిలుపు నిచ్చారు. ‘సిలబస్ భారం తగ్గాల్సిందే’ శ్రీకాకుళం న్యూకాలనీ: పాఠశాల విద్య, ఉన్నత తరగతుల్లో సాంఘిక శాస్త్ర సిలబస్ భారం తగ్గించాలని లేకుంటే విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా ప్రతి పాఠశాలకు రెండేసి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుల పోస్టులు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ ఫోరమ్ జిల్లా శాఖ ప్రతినిధులు మక్కా శ్రీనివాసరావు, బాడాన రాజు, ఎల్.గుణశేఖర్, సీ.హెచ్.సుబ్బలక్ష్మి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆదివారం విద్యాశాఖాధికారి డాక్టర్ ఎస్.తిరుమల చైతన్యను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫోరం జిల్లా ప్రతినిధులు మాట్లాడుతూ 8, 9, 10 తరగతుల్లో సాంఘిక శాస్త్రంలో సిలబస్ భారం, విషయ భారం అధికంగా ఉండడం విద్యార్థులకు పెను భారంగా ఉందని అన్నారు. ఒక సగటు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు పదిహేను పాఠ్యపుస్తకాలు బోధించాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల మానసిక స్థాయిని దృష్టిలో పెట్టుకొని సాంఘిక శాస్త్ర పాఠ్య పుస్తకాలను పునఃపరిశీలించి అసంబద్ధ విషయాంశాలు తొలగించి సిలబస్ భారం లేకుండా కుదించాలని విన్నవించారు. ఆ అవకాశం లేనిపక్షంలో భూగోళ, అర్ధశాస్త్రాల బోధనకు ఒక ఉపాధ్యాయుడు, చరిత్ర, పౌరశాస్త్రాల బోధనకు మరొక ఉపాధ్యాయుడు చొప్పున ప్రతి పాఠశాలకు రెండేసి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయ పోస్టులు కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు నరసన్నపేట: జాతీయ రహదారిపై తామరాపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పోలాకి మండలం పాత జడూరుకు చెందిన డి.హేమలరావుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ద్విచక్ర వాహనంపై నరసన్నపేట వైపు నుంచి స్వగ్రామం పాత జడూరుకు వెళ్తుండగా ఎదురుగా మరో వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ముందుగా వెళ్తున్న లారీ కట్లు ఊడి పోతుండటంతో ప్రమాదం జరుగుతుందని గమనించి లారీ డ్రైవర్‌కు చెప్పడానికి ఓవర్ టేక్ చేస్తున్నప్పుడు ఎదురుగా వచ్చిన వాహనం ఢీ కొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. గాయపడిన వ్యక్తిని 108 లో ఆస్పత్రికి తరలించారు. -
కొరాపుట్ జిల్లా మహిళా క్రికెట్ టీమ్ ఎంపిక
జయపురం: కొరాపుట్ జిల్లా మహిళా క్రికెట్ టీమ్‌ను ఆదివారం ఎంపిక చేశారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన మహిళా క్రికెట్ క్రీడాకారులకు నిర్వహించిన పోటీలో 17 మందిని ఎంపిక చేశారు. ప్రియాంక వర్మ (కెప్టెన్), సొమరి హోంజరియ, నమ్రత్ ఎడ్డింగ్, సాలు బరోల్, సునీత ఖిలో, జానకి చలాన్, సుంబాల పర్విన్, డోళీ అంపొడియ, అమ్రిత డ్యుయెల్పొడియ, గంగా హంజారియ, సుదురుతి రౌత్, దిబ్యశ్రీ జెన, భవాన బర్మ, ప్రియాంక పాత్రో, జశ్వినీ మహంతిని ఎంపిక చేశామని జయపురం సబ్‌డివిజనల్ అథ్లెటిక్ అసోసియేషన్ కార్యదర్శి రబి నాయక్ వెల్లడించారు. గౌరీ ప్రధాని, గీతాంజలి రిషిలను స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపిక చేసినట్లు వెల్లడించారు. మహిళా క్రీడాకారుల మద్య నిర్వహించిన పోటీలను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు అనూప్ కుమార్ పాత్రో, జి.ప్రసాద్, జి.సత్యనారాయణ నిర్వహించి, ఉత్తమ మహిళా క్రీడాకారులను ఎంపిక చేశారని వెల్లడించారు.ఆదిత్యుని సన్నిధిలో భక్తజనం అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి కనిపించింది. ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కళకళలాడాయి. ఎండ తీవ్రత అధికంగా ఉన్న తరుణంలో ఆలయం తరఫున మంచినీటిని పంపిణీ చేసినప్పటికీ..భక్తుల దాహం తీర్చలేకపోయారనే విమర్శలు వినిపించా యి. పలువురు వీఐపీలు ఆదిత్యుని దర్శనానికి రావడంతో గౌరవ స్వాగతాలు, ప్రత్యేక దర్శనాల ఏర్పా ట్లు చేశారు. దేవదాయశాఖ మాజీ కార్యదర్శి సుందరకుమార్ కుటుంబసమేతంగా ఆదిత్యుడిని దర్శించుకున్నారు. అలాగే విశాఖపట్నం జిల్లా వాస్తవ్యులు రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ చాగంటి సన్యాసిరాజు నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళంగా అందజేశారు. ఈ మేరకు ఆలయ సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రాచార్యులుకు విరాళ నగదును అందజేయగా అందు కు తగిన రశీదును ఆయన దాతలకు అందజేశారు. వివిధ దర్శనాల టిక్కెట్ల ద్వారా రూ.2,67,800, విరాళాల ద్వారా రూ. 78,417, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 1.80 లక్షల వరకు ఆదాయం లభించినట్లుగా ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలియజేశారు. -
వైభవంగా భక్తిసంగీత విభావరి
పర్లాకిమిడి: స్థానిక రాజవీధి అర్బన్ బ్యాంకు గ్రౌండ్స్‌లో శనివారం రాత్రి భక్తి సంగీత సంసద్ ఆధ్వర్యంలో 45వ భజన సమారోహన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, ఎస్పీ జితేంద్రనాథ్ పండా, పురపాలక అధ్యక్షురాలు నిర్మలా శెఠి, మహాంత రామానంద దాస్జీ, ఉపాధ్యక్షులు ప్రదీప్ నాయక్, భరత్ భూషణ్ మహంతిలు అతిథులుగా విచ్చేశారు. ఒడియా సినీ సంగీత దర్శకులు ప్రశాంత్ పాఢి, గాయకులు శుభజ్యోతి, ప్రభుప్రశాంత్ మహంతి, స్వస్థిక్ పాఢి తదితరులు జగన్నాథ భక్తి సంగీత గేయాలను శ్రావ్యంగా ఆలపించి శ్రోతలను అలరించారు. హార్మోనిస్టు కై లాస్ చంద్ర పట్నాయిక్, ఉపాధ్యాయులు మనోజ్ పట్నాయిక్, ప్రసన్న కుమార్ రథ్, తిరుపతి పండా, అర్చనా రోథో తదితరులకు ఎమ్మెల్యే చేతులమీదుగా అవార్డులు అందజేశారు. గౌరీ ప్రసాద్ రథ్, ఎస్.ఎన్.రథ్ తదితరులు పర్యవేక్షించారు. -
వెళ్లకండి మాస్టారూ..
కొరాపుట్: బదిలీపై వెళ్లిపోతున్న హెచ్ఎంను వెళ్లనివ్వకుండా విద్యార్థుల కన్నీళ్లతో అడ్డుకున్నారు. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా కొసాగుమడ సమితి బడఅమడ పంచాయతీకేంద్రంలో అక్కడి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రంజన్ కుమార్ బెహరాకు బదిలీ సందర్భంగా వీడ్కోలు కార్యక్రమం జరిగింది. రంజన్‌కుమార్ ఇక్కడి వారికి బాగా దగ్గరైపోయారు. చక్కగా చదువు చెబుతుండడంతో గ్రామస్తులు కూడా టీచర్‌ను ఇష్టపడేవారు. పాఠశాల ప్రాంగణం అంతా కూరగాయల మెక్కలు పెంచి వాటిని విద్యార్థులకు వితరణగా ఇచ్చేవారు. వ్యవసాయంపై అవగాహన కల్పించేవారు. సొంత ఖర్చుతో పిల్లలకు భోజనాలు కూడా పెట్టేవారు. పాఠశాలకు రాని పిల్లల ఇళ్ల వద్దకు వెళ్లి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేవారు. గత ఏడాది ఈ బడికి ఉత్తమ పాఠశాల అవార్డు కూడా వచ్చింది. అలాంటి టీచర్‌కు బదిలీ కావడంతో విద్యార్థులతో పాటు స్థానికులు కూడా కంటతడి పెట్టారు. -
సంప్రదాయ వంటల ప్రదర్శన
రాయగడ: రాష్ట్రావతరణ పక్షోత్సవాల్లో భాగంగా జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో స్థానిక సంసృతి భవన ప్రాంగణంలో ఆదివారం ఒడిశా సంప్రదాయ వంటల ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ ప్రదర్శనలో జిల్లాలొని 12 స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళలు పాల్గొన్నారు. రాయగడ మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ శుభ్రాపండ, కౌన్సిలర్ మంజులా మినియాకలు అతిథులుగా వచ్చి వంటల ప్రదర్శనను తిలకించారు. అదిరిన రుచులు పర్లాకిమిడి: ఒడియా పక్షోత్సవాల్లో భాగంగా పర్లాకిమిడి డీఆర్డీఏ పంచాయతీ రిసోర్సు భవనంలో ఆదివారం ఉదయం ఒడియా పిండివంటల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో 13 మందికి పైగా స్వయం సహాయక మహిళా గ్రూపులు పాల్గొని రాగి సున్నండలు, కేకులు, పాయసం, కక్కరాలు, గారెలు తదితర వంటకాలు ప్రదర్శించారు. పోటీల్లో ప్రథమ బహుమతి రిమా సహా గెలుపోందగా, ద్వితీయ, తృతీయ బహుమతులు సునితా ప్రధాన్, రీనా మహారాణాలు గెలుపొందారు. -
ఘనంగా స్వర్ణక్షేత్ర ఉత్సవం
కొరాపుట్: ఉత్కళ సాహిత్య పరిషత్ ఆధ్వర్యంలో స్వర్ణక్షేత్ర ఉత్సవం ఘనంగా జరిగింది. ఆదివారం నబరంగ్‌పూర్ జిల్లా కొసాగుమ్డ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఒడియా సాహిత్యంపై పద్య పోటీలు నిర్వహించారు. ఉత్కళ కవితా రంగంపై అద్భుత ప్రభావం చూపుతున్న తులసి మ్యాగజైన్‌ను ఆవిష్కరించారు. అనంతరం మా భాష మాది అనే అంశంపై చర్చగోష్టి జరిగింది. ఈ సందర్భంగా జరిగిన భాషా పోటీల్లో విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో ప్రముఖ భాషా కవులు కై లాష్ చంద్ర నాయక్, ప్రపుల్ల కుమార్ రౌత్, పవిత్ర కుమార్ హల్ధార్, రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు తిరుపతి బాలాజీ బెహరా తదితరులు పాల్గొన్నారు. -
జూన్ 2 నుంచి బురదల పోలమ్మ ఉత్సవాలు
రాయగడ: గ్రామదేవతగా పూజలందుకుంటున్న స్థానిక భైరవ వీధిలో బురదల పోలమ్మ ఉత్సవాలు జూన్ 2 నుంచి ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు శనివారం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా బార్జి జగన్మోహన్ రావు, ఉపాధ్యక్షులుగా ఎద్దు శ్రీహరి, కోశాధికారిగా బొచ్చ శ్రీనివాసరావు, పలువురు సభ్యులు నియమితులయ్యారు. జగన్నాథ్ ఎక్స్‌ప్రెస్ బస్సుసర్వీసు ప్రారంభం కొరాపుట్: రాష్ట్రంలో చివరి సమితి నబరంగ్‌పూర్ జిల్లా చందాహండి నుంచి బ్రహ్మపురకు ఓఎస్ఆర్టీసీ ఆదివారం జగన్నాథ ఎక్స్‌ప్రెస్ ఓల్వో బస్సు సర్వీసును ప్రారంభించింది. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు చందాహండిలో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 6 గంటకు బ్రహ్మపుర చేరుకుంటుంది. అదే విధంగా బ్రహ్మపురలో సాయంత్రం 6 గంటలకు బయలుదేరి ఉదయం 6 గంటలకు చందాహండి చేరుకుంటుంది. చందాహండి, నబరంగ్‌పూర్, జయపూర్, రాయగడ, దిగపొండిల మీదుగా బ్రహ్మపురకు రాకపోకలు సాగిస్తుంటుంది. బ్రహ్మపురలోని ఎంకేసీజీ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రికి వెళ్లే రోగులకు ఈ బస్సు సర్వీసు ఉపయుక్తంగా ఉంటుంది. ఇందులో మహిళలకు సగం ధరకె టికెట్లు ఇవ్వనున్నారు. పింగిపుట్లో వైద్య శిబిరం రాయగడ: సదరు సమితి పరిధిలోని తడమ పంచాయతీ సింగిపుట్ గ్రామంలో సత్యసాయి మొబైల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ ఉత్కల్ కుమార్ రథ్, డాక్టర్ జి.వి.రమణ, డాక్టర్ సుకుమార్ త్రిపాఠి, ఫార్మసిస్ట్ ప్రమోద్‌కుమార్ సాహు తదితరులు హాజరై 101 మందికి వైద్యపరీక్షలు నిర్వహించి 12 మందికి కంటి శస్త్రచికిత్సలకు ఎంపిక చేశారు. వీరిని పితామహాల్‌లోని ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్కు రిఫర్ చేసినట్లు డాక్టర్ ఎల్ఎన్ సాహు తెలిపారు. వైద్యపరీక్షల్లో భాగంగా ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. యువకుడి ఆత్మహత్య మల్కన్‌గిరి: మ ల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ బోఢపోదర్ పంచాయతీ బారడబందో గ్రామంలోని అడవిలో ఓ యువకుడి మృతదేహం చెట్టుకు వేలాడుతూ కనిపించింది. గ్రామస్తులు కొందరు కట్టెల కోసం అడవికి వెళ్లగా అడవి సమీపంలో చిన్న వంతెన వద్ద ఓ బ్యాగు, చెప్పులు కనిపించాయి. అటుగా వెళ్లగా ఓ యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో వారు సర్పంచ్ స్వప్నఖిలోకు విషయం తెలియజేశారు. ఆమె చిత్రకొండ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఐఐసీ ముకుందో మేల్క తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని దింపి బ్యాగ్ తనిఖీ చేయగా అందులో ఆధార్ కార్డులో వివరాలు కనిపించాయి. యువకుడు మేరు రమేశ్ చంద్ర ఆలాంగ్ అని ఉంది. అతడిని బలిమెల సమీపంలోని సోమనాథ్పురం పంచాయతీ అలాంగుడ గ్రామానికి చెందిన వాడిగా గుర్తించారు. దీంతో అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. తన కుమారుడు ఆత్మహత్య చేసుకోలేదని, స్నేహితులతో కలిసే ఈ ప్రాంతానికి వచ్చాడని మృతుడి తండ్రి శుకదేవ్ ఆరోపించారు. -
ముగిసిన మజ్జిగౌరమ్మ చైత్రోత్సవాలు
రాయగడ: ఐదు రోజులుగా కొనసాగుతున్న మజ్జిగౌరి అమ్మవారి వార్షిక చైత్రోత్సవాలు ఆదివారంతో వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన పూజారి నిప్పులపై నడక, ముళ్ల కంపలపై కూర్చుని ఊయలూగడం వంటి కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా శనివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా ఆలయ ప్రధాన పూజారి చంద్ర శేఖర్ బెరుకొ మందిర ప్రాంగణంలో ఖాళీ స్థలంలొ అగ్నిగుండాన్ని వెలిగించారు. అనంతరం అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలను మోసుకొచ్చారు. నిత్యం అమ్మవారి సన్నిధిలో పూజలందుకునే కత్తి (ఖడ్గం)ని పూజారి చేతపట్టుకుని మండుతున్న నిప్పులపై నడిచారు. అనంతరం చండీహోమంతో పూర్ణాహుతి కార్యక్రమాలు ముగిశాయి. ఆదివారం ఉదయం అమ్మవారి సన్నిధిలో ఉంచిన పాదాలను యథాస్థానానికి (పాదాల గుడి) తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. -
భారీగా గంజాయి పట్టివేత
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల, చిత్రకొండ పోలీసులు వేర్వేరు ప్రాంతాల్లో 860 కిలోల గంజాయిను పట్టుకున్నారు. కలిమెల సమితి నుంచి అక్రమంగా చిత్రకొండ వైపునకు ట్రక్‌లో తరలిస్తున్న 500 కిలోల గంజాయిని కలిమెల పోలీసులు శనివారం రాత్రి పట్టుకున్నారు. కలిమెల చెక్‌పోస్టు వద్ద పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఓ ట్రక్ అతివేగంగా రావడంతో దాన్ని ఆపి తనిఖీ చేశారు. గంజాయి కనిపించడంతో బండిలో ఉన్న హరియాణాకు చెందిన రాజ్‌కుమార్(26), సోను సింగ్ (23)లను అరెస్టు చేశారు. కలిమెల ఐఐసీ చంద్రకాంత్ తండ కేసు నమోదు చేశారు. నిందితులను మంగళవారం కోర్టులో ప్రవేశపెడతామని తెలిపారు. దొరికిన గంజాయి విలువ రూ.50 లక్షలు ఉంటుందని తెలిపారు. అలాగే చిత్రకొండ సమితి మంత్రీ పూట్ గ్రామం రహదారిలో ఆదివారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అడవిలో కొన్ని బస్తాలు కనిపించాయి. తీసి చూస్తే గంజాయి ఉంది. 360 కిలోల బరువు ఉన్న ఈ గంజాయి విలువ రూ.36 లక్షల వరకు ఉంటుందని చిత్రకొండ ఐఐసి ముకుందో మేళ్క తెలిపారు. -
జీవో నంబర్ 35ను సవరణ చేయాలి
అరసవల్లి: రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో ఇటీవల తీసుకొచ్చిన జీవో నంబర్ 35ని తక్షణమే సవరించాలని పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు కిలారి నారాయణరావు కోరారు. జిల్లాకేంద్రంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంచాయతీరాజ్ శాఖలో ప్రభుత్వం తీసుకున్న పాలనా సంస్కరణలను తామంతా స్వాగతిస్తున్నామన్నారు. అయితే జీవో నంబర్ 35తో జిల్లా పరిషత్, మండల పరిషత్‌లలో పరిపాలనాధికారులుగా పనిచేస్తున్నవారికి ఎంపీడీవోలుగా పదోన్నతుల కోటాలో తీరని అన్యాయం జరుగుతుందన్నారు. గతంలో ఎంపీడీవోలుగా పదోన్నతుల్లో జెడ్పీ, మండల పరిషత్ ఉద్యోగులకు 34 శాతం, పంచాయతీ విస్తరణాధికారి (ఇవోపీఆర్డీ)లకు 33 శాతం, అలాగే డైరక్ట్ నియామకాలకు 30 శాతం, ఇతరులకు 3 శాతం చొప్పున కేటాయింపు ఉండేదని గుర్తు చేశారు. 34 శాతం కేటాయింపు దారుణం ప్రస్తుతం ఎంపీడీవోల పోస్టులకు డైరక్ట్ నియామకాలను ప్రభుత్వం రద్దుచేసి, పదోన్నతులతో భర్తీ చేస్తామని ప్రకటించింది. దీంతో ఈ లెక్కన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఉద్యోగుల క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం పదోన్నతుల కోటా 50 శాతం వరకు తమకే కేటాయింపులు ఇవ్వాల్సి ఉందని కిలారి నారాయణరావు అన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం 34 శాతం మాత్రమే కేటాయిస్తున్నట్లుగా ప్రస్తావిస్తూ జీవో విడుదల చేయడం దారుణమన్నారు. ఇప్పటికై నా జిల్లా పరిషత్, మండల పరిషత్ క్యాడర్ స్ట్రెంత్‌ను దృష్టిలో పెట్టుకుని తమకు పదోన్నతుల్లో 50 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తక్షణమే జీవో సవరించాలని విజ్ఞప్తి చేస్తున్నామని, లేదంటే రాష్ట్ర కమిటీ మార్గదర్శకాల ప్రకారం భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతామని ప్రకటించారు. సమావేశంలో జిల్లా సంఘ ప్రధాన కార్యదర్శి కింజరాపు నర్సింహమూర్తి, జిల్లా మహిళ ఉద్యోగుల సంఘ అధ్యక్షురాలు పి.జయమ్మ, జెడ్పీ యూనిట్ ప్రతినిధి మాసపు సంతోష్‌కుమార్, రాష్ట్ర సంఘ ప్రతినిధులు కె.మురళీకృష్ణ పట్నాయక్, సీపాన రామ్మోహనరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షుడు కిలారి -
మహనీయుల జీవితం ఆదర్శం
పర్లాకిమిడి: ఒడిశా భాషా పక్షోత్సవాలు సందర్భంగా ఒడిశా సాహిత్య అకాడమీ, జిల్లా అధికారుల ఆధ్వర్యంలో స్థానిక మహారాజా బాలుర ఉన్నత పాఠశాలలో ప్రముఖుల జీవిత చరిత్రపై పలువురు వక్తలు చర్చించారు. పట్టణంలోని 50 మందికి పైగా వయోవృద్ధులు, ఒడిశా భాష, సాహిత్యం, సంస్కృతిని వివరించారు. పండిత గోపబంధుదాస్, గోదావరి దాస్, పండిత మధుసూదన్ దాస్, సత్యనారాయణ రాజగురు, అప్పన్న పోరిచ్చా, అప్పన్న పాణిగ్రాహి, భక్తకవి జయదేవ్ వంటి మహామహుల జీవిత చరిత్రపై ఉత్కళ హితేషినీ కార్యదర్శి పూర్ణచంద్ర మహాపాత్రో, బినోద్ జెన్నా, ఒడిషా సాహిత్య అకాడమీ, మాజీ సభ్యులు బిచిత్రానంద బెబర్తా తదితరులు వేదికపై మాట్లాడారు. డీఆర్డీఏ ముఖ్యకార్య నిర్వాహణ అధికారి శంకర కెరకెటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా, డీఆర్డీఏ అధికారి ఫృథ్వీరాజ్ మండల్, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారి అర్చనా మంగరాజ్ డాక్టర్ భారతీ పాణిగ్రాహి, తదితరులు పాల్గొన్నారు. -
ఆఫ్‌షోర్ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
పలాస: మండలంలోని రేగులపాడు వద్ద ఆఫ్‌షోర్ నిర్మాణానికి భూములిచ్చినవారి త్యాగాలు వెలకట్టలేనివని, నిర్వాసితులకు అన్నివిధాలుగా తగిన న్యాయం చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఆఫ్‌షోర్ పనులను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. పనులు పూర్తయితే సాగునీటితో పాటు పలాస పట్టణ ప్రజలకు తాగునీటి కొరత తీరుతుందన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్ వద్ద మొదటిగా 7 లక్షల క్యూబిక్‌ల మట్టి పని చేయాల్సి ఉందని, పనులకు అందరూ సహకరించాలని కోరారు. డైవర్సన్ రోడ్డు పనులు కూడా చేపడతామన్నారు. ఇంకా నిర్వాసితుల సమస్యలు ఉన్నాయని, ప్యాకేజీలు అందరికీ వచ్చేలా తగిన చర్యలు తీసుకుంటామన్నారు. నిర్వాసితుల కాలనీలో మౌలిక వసతులు కల్పిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జేసీ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, ఇరిగేషన్ సీఈ రుద్రమనాయుడు, ఎస్ఈ పి.వి.తిరుపతిరావు, ఈఈ శేఖర్‌బాబు, డీఈవీ సుధాకర్, ఆర్డీవో జి.వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
కన్నుల పండువగా తెప్పోత్సవం
పొందూరు: మండల పరిధిలోని లైదాం శ్రీరామధామంలో సీతారాముల మహాయజ్ఞంలో భాగంగా తెప్పోత్సవం కార్యక్రమం శనివారం రాత్రి 7 గంటలకు కన్నుల పండువగా నిర్వహించారు. తొలుత సీతారామ చంద్రప్రభువుల వారికి రథోత్సవం చేపట్టారు. వారిని పల్లకిలో గ్రామంలో ఊరేగించారు. మహిళలు హారతులు పట్టి పూజలు చేశారు. అనంతరం కొలనులో తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు. చిక్కోలుకు వన్నెతెచ్చిన ‘గాయకుడు ఆనంద్’ శ్రీకాకుళం కల్చరల్: శ్రీకాకుళం జిల్లాకు వన్నెతెచ్చిన వ్యక్తి సినీ గాయకుడు జి.ఆనంద్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక బాపూజీ కళామందిర్ ప్రాంగణంలో ఘంటసాల, బాలు, జి.ఆనంద్ (జీబీఏ) స్వరమాధురి వెల్ఫేర్ అండ్ సర్వీస్ సొసైటీ, ఆనంద్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆనంద్ విగ్రహాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విగ్రహాన్ని రూపొందించిన శిల్పి దివిలి హేమచందర్ను సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, గొండు స్వాతి, రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, డాక్టర్ నిక్కు అప్పన్న, గేదెల వీర్రాజు, వావిలపల్లి జగన్నాథం నాయుడు, డోల జగన్, ఎం.వి.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి
● భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింహరావు శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వి.నర్సింహరావు కోరారు. శ్రీకాకుళం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో విలేకరుల సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించి పెండింగ్ క్లైయిమ్స్ పరిష్కరిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు అమలు చేయడానికి పూనుకోకపోవడం దారుణమన్నారు. కార్మిక వర్గాన్ని నమ్మించి మోసగించడం పాలకులకు పరిపాటిగా మారిందన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని, భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తోందని విమర్శించారు. లేబర్ కోడ్లు రద్దు చేయాలి కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమ పథకాల అమలు కోసం ఉద్దేశించి వసూలు చేసిన సెస్ నిధులను, కార్మికుల సంక్షేమానికే ఖర్చు చేయాలని సూచించారు. ప్రభుత్వాలు వివిధ సందర్భాల్లో అక్రమంగా తీసుకున్న వెల్ఫేర్ బోర్డు నిధులను తక్షణమే తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. అర్హులైన భవన నిర్మాణ కార్మికులకు గృహ నిర్మాణాల వెల్ఫేర్ బోర్డు ద్వారా సబ్సిడీతో కూడిన రుణం ఇప్పించాలన్నారు. కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ అందించాలని, పనిచేసే ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. నిర్మాణాల్లో ఉపయోగించే వస్తువులపై (ముడి సరుకులు) జీఎస్టీ తగ్గించాలని విన్నవించారు. నిర్ల్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వం తీరుకు నిరసనగా, భవన నిర్మాణ కార్మిక సంఘం, సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈనెల 24వ తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టనున్నట్లు తెలియజేశారు. అన్ని మండలాల్లోని నిర్మాణ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సింహరావు, ఏపీ బిల్డింగ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.హరనాథరావు, గౌరవాధ్యక్షుడు ఎం.ఆదినారాయణమూర్తి, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అదుపుతప్పి గుడ్లలారీ బోల్తా
నరసన్నపేట: మండలంలోని జాతీయ రహదారిపై మడపాం వద్ద గుడ్ల లారీ అదుపుతప్పి సర్వీసు రోడ్డులో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ సిబ్బంది స్వల్ప గాయాలతో బయటపడగా, లారీ చాలా వరకు నుజ్జు అయింది. దీంతో గుడ్లకు నష్టం వాటిళ్లింది. విజయవాడ నుంచి కోల్‌కతాకు గుడ్లుతో వెళ్లున్న లారీ శనివారం వేకువజామున మెయిన్ రోడ్డు నుంచి అదుపు తప్పి సర్వీసు రోడ్డులో బోల్తా పడింది. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. అయితే రాత్రి సమయం కావడంతో స్థానికులకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. గంజాయితో వ్యక్తి అరెస్టు ఇచ్ఛాపురం: పట్టణ పరిధిలో 16.330 కేజీల గంజాయితో ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ మీసాల చిన్నంనాయుడు తెలియజేశారు. స్థానిక పోలీసు సీఐ కార్యాలయంలో శనివారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలో తనిఖీలు నిర్వహించామన్నారు. ఆ సమయంలో ఒడిశాలోని గజపతి జిల్లా మోహన బ్లాక్ అలిగెండా గ్రామానికి చెందిన బినసెంత బాన్‌సింగ్ అనే వ్యక్తి బ్యాగులో 16.330 కేజీల గంజాయిని తరలిస్తుండగా పట్టుబడ్డాడు. నిందితుడిని విచారించగా అలిగెండా గ్రామానికి చెందిన టోప్పో అనే వ్యక్తి సూచనల మేరకు హైదరాబాద్ తీసుకెళ్లి ఒక వ్యక్తికి అందజేయడానికి తరలిస్తున్నట్లు పేర్కొన్నాడు. నిందితుడి వద్ద నుంచి గంజాయితో పాటు ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి అక్రమ రవాణా జరగకుండా చాకచక్యంగా వ్యవహరించిన ఇచ్ఛాపురం పోలీసులను ఎస్పీ అభినందించారన్నారు. కార్యక్రమంలో పట్టణ ఎస్ఐ ముకుందరావు, క్రైం సిబ్బంది పాల్గొన్నారు. వ్యక్తికి గాయాలు ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్లకు చెందిన పొన్నాడ గంగారావు శుక్రవారం ఎచ్చెర్ల పాత జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం వైపు బైక్‌పై వెళ్తున్న వ్యక్తి ఢీకొన్నాడు. దీంతో 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రి వైద్య నివేదిక, క్షతగాత్రుని భార్య అన్నపూర్ణ ఫిర్యాదు మేరకు ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేశారు. కింగ్ కోబ్రా హల్చల్ సోంపేట: మండలంలోని కొర్లాం అయ్యప్ప దాబా వద్ద భారీ కింగ్ కోబ్రా శనివారం హల్చల్ చేసింది. దీంతో స్థానికులు, దాబా సిబ్బంది భయబ్రాంతులకు గురయ్యారు. అయ్యప్ప దాబా యాజమాన్య సిబ్బంది పాములు పట్టే నర్సింగ్ మహాపాత్రోకు సమాచారం అందజేశారు. మహాపాత్రో పాము ఉన్న స్థలానికి చేరుకుని చాకచక్యంగా పట్టుకున్నాడు. అనంతరం అటవీశాఖ అధికారి జోగారావు సమక్షంలో జలంత్రకోట రిజర్వ్ ఫారెస్టులో విడిచిపెట్టారు. రైలు నుంచి జారిపడిన మహిళ కాశీబుగ్గ: పలాస రైల్వేస్టేషన్ కూతవేటు దూరంలో శుక్రవారం రాత్రి 11.30 గంటలకు రైలు నుంచి ఒక మహిళ జారిపడిన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తా నుంచి తమిళనాడు రాష్ట్రం చైన్నె వెళ్తుండగా సూపర్‌ఫాస్ట్ రైలు నుంచి జారిపడింది. విశ్వాస్ పాయల్ అనే మహిళగా గుర్తించిన పలాస 108 సిబ్బంది ప్రథమ చికిత్స అందించారు. అనంతరం పలాస ప్రభుత్వ సామాజిక ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో పలాస వైద్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. -
కరిగిపోతున్న అడవులు!
జయపురం: జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి గుప్తేశ్వర్ అటవీ రేంజ్లో అడవులు మాఫియా పిడికిలో చిక్కుకొని మరుభూమిగా మారుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. దట్టమైన అడవులు గల గుప్తేశ్వర్ ప్రాంతంలో కొంతమంది బరితెగించి విలువైన చెట్లను నరికేసి తరలించుకుపోతున్నారు. దీంతో దట్టమైన అటవీ ప్రాంతం ఉనికని కోల్పోతుంది. అడవులకు రక్షణ లేకుండా పోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుప్తేశ్వర్ ప్రాంతంలో గతంలో అనేక రకాల వృక్షాలు ఉండేవని వాటిని పరిరక్షించేందుకు అటవీ విభాగ సిబ్బంది పర్యవేక్షిస్తుండేవారన్నారు. అయితే ప్రస్తుతం అడవుల పర్యవేక్షణకు తగినంత మంది సిబ్బంది లేరు. దీన్ని అదునుగా చేసుకొని మాఫీయా పెట్రేగిపోతోంది. రేయింబవళ్లు తేడాలేకుండా విలువైన చెట్లను నరికేసి కలపను తరలించుకుపోతున్నారు. ప్రధానంగా విలువైన ఔషధ గుణాలు ఉన్న చెట్లు ఇప్పుడు అడవిలో లేకుండా పోయాయి. పోడు వ్యవసాయం కోసం కొంతమంది అడవులకు నిప్పు అంటిస్తూ కాల్చి వేస్తున్నా అటవీ సిబ్బంది నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో గుప్తేశ్వర్ ప్రాంతం మరుభూమిగా మారుతుందా అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అటవీ విభాగ అధికారులు చర్యలు చేపట్టి అడవులను పరిరక్షించాలని ప్రజలు కోరుతున్నారు. మరుభూములుగా మారుతున్న.. గుప్తేశ్వర అటవీ ప్రాంతం! పట్టించుకోని అటవీ అధికారులు -
సన్మార్గంలో నడవాలి
పర్లాకిమిడి: ప్రతిఒక్కరూ సన్మార్గంలో నడవాలని ఆధ్యాత్మిక ప్రవచనకారుడు సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. నగరంలోని రాజవీధి రామలింగేశ్వర ఆలయంలో శనివారం పొడుగుకోవెల ఆలయ కమిటీ ప్రతినిధి దుర్గాప్రపాద్ దాస్, కన్యకాపరమేశ్వరి ఆలయం అర్చకులు వనమాలి మణిశర్మ, లలితా దేవి ఆలయం భక్తబృందం ఆధ్వర్యంలో సామవేదం షణ్ముఖ శర్మకు సత్కారం చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ శంకరుడు, పార్వతీదేవి, లలితాదేవి అందరూ ఒక్కటేనని చెప్పారు. కార్యక్రమంలో లలితాదేవి భక్త బృందం కమిటీ అధ్యక్షురాలు విశాలాక్ష్మీ అయ్యంగర్, బరాటం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పిడుగు పడి ఇల్లు దగ్ధం జయపురం: కాలవైశాఖి ప్రభావంతో జయపురంలో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాలు, పిడుగులతో జనం భయాందోళనకు గురయ్యారు. శుక్రవారం సాయంత్రం స్థానిక గొడియ మాలి వీధిలో ప్రశాంత్ అనే వ్యక్తి ఇంటిపై పిడుగు పడింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితుడు సర్వస్వం కోల్పోయి నిరాశ్రయుడయ్యాడు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని స్థానికులు కోరారు. 18 క్వింటాళ్ల ఇప్పపూలు పట్టివేత మల్కన్‌గిరి: కోరుకొండ సమితి ఎం.వి.53 గ్రామంలో శనివారం ఎకై ్సజ్ పోలీసులు దాడులు నిర్వహించి 18 క్వింటాళ్ల ఇప్పపూలు స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన వికాష్ బాణిక్, హరధన్ బాణిక్లను అరెస్టు చేశారు. నాటుసారా తయారీ కోసం ఇప్పపూలు వినియోగిస్తారని పోలీసులు తెలిపారు. -
20న ఘంటసాల ఆరాధనోత్సవాలు
పర్లాకిమిడి : చైతన్య ఆంధ్ర సాహితీ సంస్కృతి సమితి ఆధ్వర్యంలో స్థానిక బిజూ కల్యాణ మండపంలో ఈ నెల 20న ఘంటసాల ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నట్లు సంస్థ కన్వీనర్ డాక్టర్ సయ్యద్ రహీంతుల్లా తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఘంటసాల అష్టావధానం, మెలోడీ, పాటలు, స్కిట్స్ విశాఖపట్నం, పర్లాకిమిడి కళాకారులు పాల్గొంటారని చెప్పారు. ఉదయం 8 గంటలకు మెగా వైద్య శిబిరం నిర్వహిస్తామని, హృద్రోగులు, షుగర్ వ్యాధిగ్రస్తులకు బీపీ రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు చేపడతారని తెలిపారు. సాయంత్రం జరిగే ఘంటసాల ఆరాధనోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, ఫిషరీస్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు, సెంచూరియన్ వర్శిటీ ఉపాధ్యక్షులు డి.ఎన్.రావు తదితరులు విచ్చేస్తారని వివరించారు. సమావేశంలో మహిళా చైతన్య అధ్యక్షురాలు కోట్ని శోభారాణి, చైతన్య కార్యదర్శి బి.జనార్దనరావు, సెంచూరియన్ వర్శిటీ జి.నెం. ఫల్గుణరావు, నానాజీ తదితరులు పాల్గొన్నారు. -
వరకట్నం కోసం వేధిస్తున్నారు..
రాయగడ: వరకట్నం తీసుకురావాలంటూ తన అత్తమామలు వేధిస్తున్నారని, నిండు గర్భిణిగా ఉన్న తనపై దాడి చేస్తున్నారని ఓ మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఘటన జిల్లాలోని రామనగుడలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గుడారి సమితిలోని శిరిగుడ గ్రామానికి చెందిన లక్ష్మీకాంత్ పతికా కుమార్తె కల్పనకు రామనగుడ సమితి పరిధిలోని గోగుపాడు పంచాయతీలోని జర్లింగి గ్రామానికి చెందిన పంచానన్ లిమ్మ కొడుకు సొమనాథ్ లిమ్మతో తొమ్మిదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఆరేళ్ల కొడుకు, మూడేళ్ల కూతురు ఉన్నారు. ఈ క్రమంలో కల్పన మరోసారి గర్భం దాల్చింది. మూడో సంతానం వద్దని.. వెంటనే గర్భస్రావం చేయించుకోవాలని అత్తమామలు కోడలను తరచూ వేధిస్తుండేవారు. భర్త లేని సమయంలో కల్పనను అనేక విధాలుగా హింసిస్తుండేవారు. ఈ విషయాన్ని తన భర్త సొమనాథ్కు చెప్పినా వారి మాటలు పట్టించుకోవద్దని భార్యకు నచ్చజెబుతుండేవాడు. ఇదే అదనుగా తీసుకున్న అత్తమామలు కల్పనను కట్నం తీసుకురావాలని వేధిస్తుండేవారు. ఈ క్రమంలో శుక్రవారం కల్పన భర్త లేని సమయంలో అదనుగా భావించిన కల్పన అత్త సుభాషిణి, మామ లక్ష్మీకాంత్లు కల్పనపై దాడి చేశారు. వీరి వేధింపులు భరించలేని కల్పన తన కటుంబీకులకు విషయాన్ని తెలియజేసింది. అనంతరం వారి సహాయంతో శుక్రవారం సాయంత్రం రామనగుడ పోలీస్‌స్టేషన్‌లో తనను వరకట్నం తీసుకురమ్మంటున్నారని, అదేవిధంగా తన గర్భానికి నష్టం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకు వివాహిత ఫిర్యాదు -
విజిలెన్స్‌కు చిక్కిన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్
మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పవిత్రా మోహన్ పాణిగ్రాహి శుక్రవారం రాత్రి విజిలెన్స్ అధికారులకు పట్టుబడ్డారు. తన కారులో చిత్రకొండ నుంచి విధులు ముగించుకొని భువనేశ్వర్ వెళ్తుండగా గోవిందపల్లి వద్ద విజిలెన్స్ పోలీసులు కారు ఆపారు. లోపల తనిఖీలు చేయగా రూ.5లక్షల 7వేలు అక్రమంగా ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కొరాపుట్‌కు తరలించారు. ఇంట్లో సోదాలు చేయగా విలువైన ఆస్తులు, బంగారు గుర్తించారు. అనంతరం కొరాపూట్ విజిలెన్స్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. -
చెరువు కాటేసింది..
జయపురం: చెరువులో మునిగి ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి బలిగాం పంచాయతీ బానుగుడ గ్రామంలో శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. బానుగుడ గ్రామానికి చెందిన పదలాం దొరాపుటియ కుమార్తె ప్రమీళ దొరాపుటియ (10), అదే గ్రామం పరుశురాం పలిగుడియ కుమార్తె అమ్రిత పలిగుడియ(8)లు స్కూల్‌కు వెళ్లి మధ్యాహ్నం ఇళ్లకు తిరిగి వచ్చారు. పుస్తకాలను ఇంటి దగ్గర పెట్టేసి తండ్రులతో కలసి బానుగుడ గ్రామంలోని చెరువులో స్నానం కోసం వెళ్లారు. వారి తండ్రులు స్నానం చేసి ఏదో పనిపై వెళ్లిపోయారు. వారు వెళ్లిన తరువాత కూడా మరికొంతమంది బాలికలతో కలిసి దొరాపుటియ, పలిగుడియలు స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి పోయారు. ఎంత సేపటికీ వారు బయటకు రాకపోవడంతో మిగతా పిల్లలు ఆందోళనతో వచ్చి గ్రామస్తులకు విషయాన్ని తెలియజేశారు. వెంటనే గ్రామస్తులు వచ్చి చెరువులో గాలించి ఇద్దను బాలికలను బయటకు తీసి.. బలిగాం ప్రాథమిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పిల్లలిద్దరూ అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదం నెలకుంది. రామగిరి పోలీసులు కేసులు నమోదు చేశారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించిన తరువాత కుటుంబ సభ్యలకు అప్పగించారు. నీట మునిగి ఇద్దరు బాలికలు మృతి -
జింకకు తప్పిన ముప్పు
పర్లాకిమిడి : దాహార్తిని తీర్చుకునేందుకు అటవీ ప్రాంతం నుంచి గ్రామాల వైపు వస్తున్న జంతువులు కొన్నిసార్లు వీధి కుక్కల దాడుల్లో గాయపడుతున్నాయి. గుసాని సమితి ఏడో మైలు వద్ద కోర్సండ గ్రామంలో శనివారం ఉదయం 9 గంటల సమయంలో ఓ జింక ప్రవేశించడంతో వీధి కుక్కలు వెంటాడాయి. వెంటనే స్థానికులు గుర్తించి జింకను రక్షించి అటవీ అధికారులకు ఫోన్ చేసి అప్పగించారు. అటవీ శాఖ రేంజ్ అధికారి గణేష్ గ్రామానికి చేరుకుని జింకను ప్రాథమిక చికిత్స చేయడానికి పర్లాకిమిడి తీసుకెళ్లారు. ఘనంగా హనుమాన్ జయంతి పూజలు పర్లాకిమిడి: హనుమాన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక కోమటివీధిలోని వేంకటేశ్వర స్వామి మందిరంలో ప్రత్యేక పూజలు జరిగాయి. భద్రం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు జరిపారు. పర్లాకిమిడిలో సోమవారం ఒడియా ప్రజలు హనుమాన్ జయంతిని జరుపుకుంటుండగా, మంగళవారం కూడా జరుపుకోవచ్చని శ్రీనివాసాచార్యులు తెలియజేశారు. ఇసుక అక్రమ రవాణాపై చర్యలు రాయగడ: ఇసుక అక్రమ రవాణాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. గుణుపూర్‌లో గత బుధవారం వంశధార నది నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం జిల్లా మైనింగ్ అధికారులకు సమాచారం అందించడంతో శుక్రవారం మైనింగ్ విభాగాధికారులు గుణుపూర్ వెళ్లారు. అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి టిప్పర్ల యజమానులకు రూ.1.35 లక్షల జరిమానా విధించారు. శాకంబరిగా ముత్యాలమ్మ రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో మూడు రోజులుగా నిర్వహిస్తున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతరలో భాగంగా శనివారం ఉదయం అమ్మవారు శాకంబరి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సాయంత్రం నిజ రూప దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. -
14న హిందూ ఏక్తా వాహినీ ర్యాలీ
కొరాపుట్: నబరంగ్‌పూర్ హిందూ ఏక్తా వాహీనీ ఆధ్వర్యంలో సుమారు 30 వేల మందితో ఈనెల 14న భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు జిల్లా కన్వీనర్ గౌరీ శంకర్ సాహు శుక్రవారం తెలిపారు. ఈ మేరకు స్థానిక రాజువీధిలోని గణేష్ దేవాలయంలో జరిగిన మీడియా సమావేశం ఈ విషయాన్ని వెల్లడించారు. పొణ సంక్రాంతి, హనుమన్ జయంతి, మహా బిషు సంక్రాంతి, ఒడియా నూతన సంవత్సరం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు వివరించారు. ఆ రోజున మెయిన్ రోడ్డులో చమిరియా గుడ వద్ద సాయంత్రం మూడు గంటలకు ర్యాలీ ప్రారంభమై పోలీస్ గ్రౌండ్స్ వరకు కొనసాగుతోందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో పూసర్ల సంతోష్, అనంత పండా, నీలి బాబు త్రిపాఠి, బాబు యాదవ్, సిసిర్ గంతాయిత్ ఉన్రరు. -
విక్రమ వర్సిటీని సందర్శించిన విద్యాశాఖ కార్యదర్శి
జయపురం: స్థానిక విక్రమదేవ్ విశ్వ విద్యాలయాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా విభాగ కార్యదర్శి అరవింద అగర్వాల్ గురువారం సాయంత్రం సందర్శించారు. వైస్ చాన్స్‌లర్, రిజిస్టార్, అధ్యాపకులు జిల్లా కలక్టర్ మొదలగు వారితో రెండేళ్ల కిందట ప్రారంభించబడిన విక్రమదేవ్ విశ్వవిద్యాలయంలో సౌకర్యాలు, సమస్యలపై చర్చించారు. కొరాపుట్ జిల్లాలో ఉన్నత విద్య వికాశ లక్ష్యంతో విక్రమదేవ్ కళాశాలను విశ్వవిద్యాలయంగా గుర్తింపు ఇచ్చి ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయితే నేటికీ కళాశాల భవనాల్లోనే కళాశాల అధ్యాపకుల చేతనే వర్సిటీని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్, కులపతి ప్రొఫెసర్ దేవీ ప్రసాద్ మిశ్ర, రిజిస్టార్ మహేశ్వర చంద్ర నాయిక్, ఉన్నత విద్యాపరిషత్ డిప్యూటీ డైరెక్టర్ గోపాల్ హల్దార్, విక్రమదేవ్, ఉన్నత విద్యాలయ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ పాత్రో, మహేశ్వర దురియ, డాక్టర్ అరుణ కుమార్ రాజ్, డాక్టర్ విజయ కుమార్ సెట్టి, లంభోదర మఝి, కమల లోచన మహలిక, ప్రాన్సిస్ బర్ల, డాక్టర్ సాగరికమిశ్ర, డాక్టర్ దేవదత్త ఇందోరియ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
టెక్కలి రూరల్: మండలంలోని కె.కొత్తూరు సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఒడిశా నుంచి శ్రీకాకుళం వైపు వెళ్తున్న బొలెరో వాహనం టెక్కలి మండలం కె.కొత్తూరు సమీపంలో రహదారిపై ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరోలో ఉన్న ఒడిశా క్లీనర్ జితేంద్ర సాహు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్‌లో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. విప్లవ పోరాట యోధుడు పైలా వజ్రపుకొత్తూరు రూరల్: వర్తమాన భవిష్యత్ విప్లవ పోరాటాలకు నిత్య చలనశీలతను రగిలించే పోరాట యోధుడిగా కామ్రేడ్ పైలా వాసదేవరావు నిలిచారని న్యూడెమొక్రసీ పార్టీ జిల్లా కమిటీ కార్యదర్శి తాండ్ర ప్రకాశరావు అన్నారు. వజ్రపుకొత్తూరు మండలం రిట్టపాడులో శుక్రవారం పైల వాసదేవరావు వర్ధంతి నిర్వహించారు. పైలా స్మారక స్థూపం వద్ద పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, అభిమానులు విప్లవ జోహార్లతో ఘన నివాళులు ఆర్పించారు. వాసుదేవరావు ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఈ నెల 13న పలాసలో న్యూడెమొక్రసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో పైలా స్మారక సభ జరుగుతుందని ప్రకటించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, ప్రజా సంఘ నాయకులు, కుటుంబ సభ్యులు ఎం.వినోద్, గొరకల బాలకృష్ణ, పోతనపల్లి కుసు మ, ఆర్.మాధవరావు, పైల అప్పారావు, కృష్ణప్రసాద్, ఎస్.రామారావు, అప్పయ్య, ప్రసాద్, జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. 36 రోజుల తర్వాత స్వగ్రామానికి మృతదేహం కవిటి: మండలంలోని ఆర్.బెలగాం గ్రామానికి చెందిన తిప్పన భుజంగరావు(43) ఇరాక్‌లో ఉద్యోగానికి వెళ్లి మార్చి 6న ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఎట్టకేలకు మృతదేహం శుక్రవారం గ్రామానికి చేరుకోవడంతో అంత్యకఇయలు నిర్వహించారు. ఇరాక్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో నాలుగేళ్లుగా పనిచేస్తున్న భుజంగరావు అమ్మోనియా ట్యాంకర్ సమీపంలో పేలుడు కారణంగా మృతిచెందిన విషయం తెలిసిందే. కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు, ప్రభుత్వ విప్ అశోక్ చొరవతో మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. భుజంగరావు మృతదేహాన్ని చూసిన తల్లి దమయంతి, భార్య జయలక్ష్మి, కుమార్తెలు రిషీ, దీక్ష కన్నీరుమున్నీరుగా విలపించారు. ఉద్యోగిని దూషించిన కేసులో రెండేళ్ల జైలుశిక్ష రణస్థలం : విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిని దూషించిన కేసులో బలగ చిరంజీవి అనే వ్యక్తికి ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద రెండేళ్ల జైలు శిక్ష, రూ.11వేలు ఆపరాధ రుసుం విధిస్తూ తీర్పు వెలువడిందని జె.ఆర్.పురం ఎస్సై ఎస్.చిరంజీవి తెలిపారు. 2020 డిసెంబర్ 4న రణస్థలం మండలం తెప్పలవలసలో వీఆర్ఓ పేదలందరికి ఇళ్ల స్థలాల పంపిణీ చేస్తుండగా అదే గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు హద్దురాళ్లు తీసేశారు. సమాచారం అందిన వెంటనే సచివాలయ సిబ్బంది, ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. ఆ సమయంలో బలగ బుచ్చిబాబు, బలగ శ్రీను, మహేష్, రమణ, చిరంజీవి, యాగాటి లక్ష్మణరావు, భోగాపురపు సింహాచలం, ముక్కు అసిరయ్య, బంగారపు సూరప్పడులు హద్దురాళ్లు తొలగించినట్లు గుర్తించారు. ఈ విషయమై తహశీల్దార్‌కు సమాచారం ఇచ్చే సమయంలో వీఆర్ఓను బలగ చిరంజీవి అనే వ్యక్తి కులం పేరుతో దూషించాడు. దీంతో బాధిత వీఆర్ఓ జె.ఆర్.పురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అప్పటి ఎస్సై ఈ.శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ ఎం.మహేంద్ర కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నేరం నిరూపితం కావడంతో చిరంజీవికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పునిచ్చింది. -
ఆదిత్యుని సన్నిధిలో దత్త విజయానందతీర్థ స్వామి
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయంగా ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రాచార్యులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఈ సందర్భంగా అనివెట్టి మండపంలో స్వామీజీ మాట్లాడుతూ విశ్వలోకాల రక్షకుడు, ప్రత్యక్షదైవం సూర్యనారాయణ స్వామి ఇక్కడ కొలువుతీరడం నిజంగా అదృష్టమని..ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడని వివరించారు. ఆదిత్యుని వార్షిక కల్యాణ మహోత్సవాలు (బ్రహ్మోత్సవాలు) జరుగుతున్నా యని ప్రధానార్చకులు శంకరశర్మ తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పి లి సాందీప్ శర్మ, ఫణీంద్రశర్మ పాల్గొన్నారు. -
తగ్గిన దిగుబడి
జీడిమామిడి..వజ్రపుకొత్తూరు ప్రాంతంలో నల్లగా మాడి పిందె దశలోనే ఉన్న జీడి పంట దెబ్బకొట్టిన వర్షాభావం.. జిల్లాలో దాదాపు రెండున్నర నెలలుగా వర్షం కురవకపోవడం, అకాల వర్షం ప్రభావం జీడి మామిడి పంటపై పడిందని రైతులు చెబుతున్నారు. జీడిమామిడి తోటలకు నీరు పెడితే మంచి కాపు ఇస్తుందని ఉద్యానవన శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ప్రస్తుతం జీడిమామిడి తోటలు అధికంగా ఉద్దానం, కొండపోడు భూములు, రాళ్ల ప్రదేశాల్లో సాగు చేస్తున్నారు. ఈ తరహా తోటలకు నీరు అందే అవకాశం ఏమాత్రం లేకపోవడం కూడా జీడిమామిడి పంటల దిగుబడి తగ్గిపోవడానికి కారణమని రైతులు చెబుతున్నారు. వరుసగా మూడేళ్లుగా పంట నష్టం వాటిల్లడంతో, ఇక జీడిమామిడి తోట సాగు వృథా అనే నిర్ణయానికి వచ్చిన రైతులు చాలా తోటలను నరికి కలపగా విక్రయిస్తున్నారు. జిల్లాలో దాదాపు 38,930 ఎకరాల్లో జీడి మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ఇటీవల చెట్లు జీర్ణావస్థకు వచ్చి మరికొన్ని చోట్ల తోటలను నరికివేయడం వల్ల జీడిమామాడి తోటల విస్తీర్ణం జిల్లాలో 10 వేల ఎకరాలకు పడిపోయిందని పలువురు చెబుతున్నారు. ఆశలు ఆవిరి.. జీడి పంటపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి. ఎకరాకు ఆరు బస్తాలు దిగుడి వస్తుందని భావించాం. వాతావరణంలో మార్పులతో పిందె మాడిపోయి పిక్కలకు బూజు పట్టి దిగుబడిపై ప్రభావం చూపింది. ఎకరాకు ఒక బస్తా కూడా రాని పరిస్థితి వచ్చింది. – దున్న నాగేశ్వరరావు, యూఆర్‌కేపురం, వజ్రపుకొత్తూరు మండలం శాస్త్రవేత్తలను తెచ్చాం వజ్రపుకొత్తూరు పూండి ఉద్దా నం ప్రాంతంలో సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు పెద్దపేట, జీడిపరిశోధన కేంద్రం(బాపట్ల) నుంచి శాస్త్రవేత్తలను తెప్పించి రైతులకు అవగాహన కల్పించాం. ఐదు మండలాలకు ఉద్యా నవన శాఖ అధికారిగా ఉన్నాను. వాతావరణంలో మార్పులకు ఎవరూ ఏమీ చేయలేరు.పిండి నల్లి ఉద్ధృతంగా ఉండటం వల్ల రైతులకు నష్టం వాటిల్లింది. మందులు ఏం వాడాలో రైతులకు వివరించాం. – కె.సునీత, ఉద్యానవన శాఖ అధికారి ధరల పతనం.. జిల్లాలో వజ్రపుకొత్తూరు మండలంలో 11706, మందసలో 8069, పలాసలో 4575, రణస్థలంలో 1720, సోంపేటలో 1950, కంచిలిలో 1173, సీతంపేటలో 6539, కవిటిలో 1270, ఎచ్చెర్లలో 1935 ఎకరాల్లో రైతులు జీడిమామిడి పంట సాగు చేస్తున్నారు. గత రెండు వారాల్లో జీడి మామిడి ధర రోజు రోజుకూ తగ్గుతూ వస్తోంది. సీజన్ తొలి రోజుల్లో ( బస్తా 80 కిలోలు) రూ.14000 పలకగా.. ప్రస్తుతం రూ.12వేలు (కిలోరూ.150)కు పడిపోయింది. అసలే పంట దిగుబడి లేక దిగాలు పడ్డ రైతులు ధర కూడా తగ్గిపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జీడి మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కొత్తపేట, అమలపాడు, యూఆర్కేపురంతో పాటు పలాస, సీతంపేట, కవిటి, కంచిలి, మందస, రణస్థలం ప్రాంతాల్లో ఎక్కువగా నష్టం ఉంది. ఏ మందు ఎంత మోతాదులో వాడితే మంచి ఫలితం ఉంటుందో ఉద్యానవన శాఖ అధికారులు తమకు అవగాహన కల్పించడం లేదని కొందరు రైతులు చెబుతున్నారు. వాస్తవానికి ఈ ప్రక్రియ ప్రాథమిక దశలోనే జరగాలి. కానీ ఉద్దానం ప్రాంతంలో ఉద్యానవన శాఖ ద్వారా జీడిమామిడి రైతులకు సలహాలు సూచనలు మొక్కుబడిగా ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఐదు మండలాలకు ఒకే ఒక్క ఉద్యానవన శాఖ అధికారి ఉండటం వల్ల కూడా రైతులకు సలహాలు, సూచనలు సకాలంలో అందని పరిస్థితి నెలకొంది. ప్రస్తుత సీజన్లో రైతులకు చేరువగా, పంటను కాపాడేందుకు ఉండాల్సిన విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్లు చాలా మంది సచివాలయాలకే పరిమితమవుతున్నారని జీడిమామిడి రైతులు వాపోతున్నారు. దీంతో చాలామంది రసాయన మందులపై అవగాహన లేక ఇష్టానుసారంగా పురుగు మందు పిచికారీ చేస్తున్నారు. దీని వల్ల తోటల్లో పూత మాడిపోయి పిందె రాకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. -
భక్తిశ్రద్ధలతో సీతాదేవికి కుంకుమ పూజలు
జయపురం: జయపురం జమాల్ లైన్‌లోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో చతుర్దశి సందర్భంగా సీతాదేవికి శుక్రవారం ఘనంగా పూజలు జరిపారు. ఉదయం 9.30 గంటలకు వందలాది మంది మహిళలు, యువతులు సీతా దేవికి సామూహిక లలితా సహస్ర నామములతో ’కుంకుమ పూజలు, అష్టోత్తర శతనామములతో పుష్ప అర్చన జరిపారు. ఆలయ పూజారి ఉలిమిరి నాగేశ్వరరావు పంతులు శాస్త్రోత్తంగా మహిళలచే పూజలు చేయించారు. కార్యక్రమంలో శ్రీరామమందిర ఆలయ కమిటీ అధ్యక్షులు గోరపల్లి నాగరాజు, కార్యదర్శి సాన జగదీష్, సహాయ కార్యదర్శి ఎన్.చంద్ర శేఖర్, కోశాధికారి వారణాశి రమేష్ గుప్త, సహాయ కోశాధికారి బి.వెంకట రమణ, ఉపాధ్యక్షులు సి.హెచ్.చంద్రశేఖర్, అందవరపు తిరుమల, ఎన్.మల్లికార్జున, వారణాశి సత్యనారాయణ, వారణాశి శివప్రసాద్, ఎన్.ఈశ్వర రావు పాల్గొన్నారు. -
తనిఖీలకు రమ్మన్నారు.. వస్తే పొమ్మన్నారు..
ఆమదాలవలస: వికలాంగత్వం పునఃపరిశీలన కోసం ఆమదావలసలోని జొన్నవలస సీహెచ్‌సీకి ఈ నెల 11న హాజరుకావాలంటూ నందిగాం మండలం హరిదాసుపురం సచివాలయం పరిధిలోని పలువురు దివ్యాంగ పింఛనుదారులకు ఈ నెల 1న ఉత్తర్వులు అందించారు. దీంతో హరిదాసుపురం గ్రామానికి చెందిన బమ్మిడి సావిత్రి, గుంట హేమాచలం, నర్సిపురం నారాయణ, చెరుకుపల్లికి చెందిన మామిడి సంతు, రాజాం చంద్రయ్య, ప్రతాప విశ్వనాథపురం గ్రామానికి చెందిన పనిల రామస్వామిలు తీవ్ర వ్యయ ప్రయాసలకు ఓర్చి, మండుటెండలో ప్రయాణించి శుక్రవారం ఆమదాలవలసలోని ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే సిబ్బంది మాత్రం ఇక్కడ ఎటువంటి వికలాంగత్వ పరీక్షలు చేపట్టలేదని, మీ వద్ద ఉన్న ఉత్తర్వులతో తమకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. దీంతో దివ్యాంగులు ఉసూరుమన్నారు. తమకు ఉసురు అధికారులకు, ప్రభుత్వానికి తప్పక తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. తమకు ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చిన వారిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతసేపయ్యాక, వీరి ఆవేదనను చూసిన ఆస్పత్రి సిబ్బంది పాతపట్నం సీహెచ్‌సీకి వెళ్లమని చెప్పి అక్కడి సిబ్బందితో ఫోన్లో పునః పరిశీలన చేయించారు. -
ట్యాక్సీ కార్మికుల ఆందోళన
టెక్కలి: టెక్కలి వైఎస్సార్ జంక్షన్లో ట్యాక్సీ స్టాండ్ తొలగింపును వ్యతిరేకిస్తూ కార్మికులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. పట్టుమహాదేవి కోనేరు గట్టు అభివృద్ధిలో భాగంగా మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతో ట్యాక్సీ స్టాండ్ తొలగింపు కోసం అధికార యంత్రాంగం సిద్ధమయ్యారు. ఈ క్రమంలో పంచాయతీ అధికారులు యంత్రాలతో సహా ట్యాక్సీ స్టాండ్ వద్దకు చేరుకున్నారు. దీంతో ట్యాక్సీ కార్మికులు అడ్డుకుని వ్యతిరేకించారు. తమకు ప్రత్యామ్నాయం కల్పిస్తామని మంత్రి హామీ ఇచ్చారని, ఇప్పుడు హఠాత్తుగా వచ్చి స్టాండ్ తొలగిస్తామనడం సమంజసం కాదని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ రాము, సిబ్బంది ట్యాక్సీ స్టాండ్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. తామంతా మంత్రిని కలిసి సమస్య వివరిస్తామని, ఆ తరువాత స్టాండ్ తొలగింపు నిర్ణయం తీసుకోవాలని కార్మికులు పట్టుబట్టడంతో అధికారులు వెనుదిరిగారు. కాగా, దశాబ్దాలుగా ఇదే స్థలంలో ట్యాక్సీ స్టాండ్ ద్వారా కార్మిక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, ఇప్పుడు స్టాండ్ తొలగిస్తే కుటుంబాలతో సహా ఇబ్బందులు పడతామని పలువురు కార్మికులు వాపోయారు. -
ఘనంగా చెన్నపొడ దినోత్సవం
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో శుక్రవారం చెన్నాపొడ దినోత్సవం ఘనంగా జరిగింది. ఉత్కళ ప్రజలకు ఎంతో ప్రీతిపాత్రమైన మిఠాయి చెన్నా పొడ. నిత్యావసర సరుకులు పంపిణీ రాయగడ: స్థానిక రైతుల కాలనీలోని నవ జీవన్ ట్రస్టు ఆధ్వర్యంలో నిరుపేదలైన 40 మంది ఆదివాసీ వృద్ధ మహిళలకు నిత్యావసర సరుకులను శుక్రవారం పంపణీ చేశారు. బియ్యం, నూనె, బంగాళ దుంపలు, ఉప్పు, కందిపప్పు వంటి పది రకాల వస్తువులను ట్రస్టు ద్వారా పంపిణీ చేసినట్లు ట్రస్టు నిర్వాహకురాలు ఎం.నళిని తెలియజేశారు. ప్రతీ నెల ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు.చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి మల్కన్‌గిరి: ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉన్నందున అన్ని వార్డుల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని మున్సిపల్ చైర్మన్ ప్రదీప్ కుమార్ నాయక్ సూచించారు. బలిమెల మున్సిపల్ కార్యాలయంలో వార్డు సభ్యులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వార్డుల్లో సమస్యలపై చర్చించారు. పిడుగు పడి మహిళ మృతి మల్కన్‌గిరి: జిల్లాలోని మత్తిలి సమితి కంసారిపుట్ గ్రామంలో గురువారం రాత్రి ఒక ఇంటిపై పిడుగుపడి మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామంలో గురువారం సాయంత్రం నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఈ సమయంలో అజయ్ కుమార్ నాయక్ ఇంటిపై పిడుగు పడింది. దీంతో ఇంట్లో ఉన్నటువంటి అజయ్ భార్య ఛబి నాయక్(39), వారి కుమారుడు చందన్ నాయక్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వీరిని మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించగా ఛబి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు. 21 కేజీల గంజాయి పట్టివేత మల్కన్‌గిరి: జిల్లాలోని బలిమెల పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున గంజాయితో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసులు బలిమెల – చిత్రకొండ రహదారిపై ఇద్దరు వ్యక్తులు బ్యాగులతో ఉండడం గమనించారు. వారిని ప్రశ్నించడంతో పాటు బ్యాగులను తనిఖీ చేయగా అందులో గంజాయి ప్యాకెట్లు ఉన్నాయి. దీంతో వీరిని పోలీసుస్టేషన్‌కు తరలించి విచారించగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి చిత్రకొండలో గంజాయి కొన్నట్లు పేర్కొన్నారు. అరైస్టెనవారిలో అరవింద్, తుఫాన్గిరి అనే వ్యక్తులు ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఐఐసీ ధీరజ్ పట్నాయక్ వెల్లడించారు. పట్టుబడిన గంజాయిని తూకం వేయగా 21 కేజీలు ఉంది. దీని విలువ రూ.2 లక్షలు వరకు ఉంటుందని తెలిపారు. -
కొనసాగుతున్న చైత్రోత్సవాలు
రాయగడ: పట్టణంలో మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు శుక్రవారం బారులుతీరారు. మందిరం ప్రాంగణంలోని ప్రత్యేక గదిలో భక్తుల దర్శనార్థం ఏర్పాటు చేసిన ఘటాలను దర్శించుకుంటున్నారు. పసుపు, కుంకుమలతో పాటు సీజన్లో లభించే మామిడి, పనస తదితర పండ్లను ఘటాల్లో వేసి మొక్కుబడులు చెల్లించుకుంటున్నారు. ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన చండీహోమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు రాయసింగి బిడిక, సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, పెద్దీన వాసుదేవరావు, వడ్డాది శ్రీనివాస్‌రావు దంపతులు కూర్చుని పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ చండాహోమం శనివారం రాత్రి పూర్ణాహుతి కార్యక్రమంతో ముగుస్తుంది. అదేవిధంగా అమ్మవారి ఉత్సవాలు కూడా ముగుస్తాయి. రాయగడ ఎమ్మెల్యే అప్పల స్వామి కడ్రక అమ్మవారిని దర్శించుకున్నారు. నిప్పులపై పూజారి నడక ఉత్సవాలు ముగింపులో భాగంగా నిప్పులపై పూజారి నడిచే కార్యక్రమం శనివారం రాత్రి 8 గంటల నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. వారి సౌకర్యార్థం కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా ముళ్ల కంపలతో అమర్చే ఊయలలో పూజారి ఊగే కార్యక్రమం కూడా శనివారం రాత్రి నిర్వహిస్తారు. -
రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్ పర్యటన
రాయగడ: రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కమిషనర్, ప్రభుత్వ కార్యదర్శి అరవింద్ అగర్వాల్ జిల్లాలో పర్యటించారు. శుక్రవారం ఆయన జిల్లాలోని కై లాస్‌పూర్, కొలనారలో గల ఉన్నత పాఠశాలల్లో పర్యటించి అక్కడ గల విద్యార్థులు, ఉపాధ్యాయులతో సమీక్షించారు. అనంతరం రామనగుడలో పర్యటించిన ఆయన అక్కడ రైతులు పండిస్తున్న గులాబీ పూల తోటలను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. అదే సమితిలో పసుపు, చింతపండు యూనిట్లను నిర్వహిస్తున్న రైతులతో ముచ్చటించారు. వారికి సరైన ప్రోత్సాహం ఇవ్వాలని సూచించారు. అనంతరం రాయగడ అటానమస్ కళాశాలలో పర్యటించిన అగర్వాల్ కు ప్రిన్సిపాల్ సరస్వతి రే, సిబ్బంది ఘన స్వాగతం పలికారు. మజ్జిగ వితరణ రాయగడ: మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాల్లో స్థానిక మహిళా క్లబ్ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు శుక్రవారం మజ్జిగ పంపిణీ చేశారు. మందిరం ప్రాంగణంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తమ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది అమ్మవారి ఉత్సవాల్లో మజ్జిగ వితరణ కార్యక్రమం చేపట్టినట్లు, క్లబ్ కార్యదర్శి కస్తూరి సాహు, కోశాధికారి సీహెచ్ ఇతిశ్రీ, అల్కాదాస్, బి.లక్ష్మీలు తెలియజేశారు. -
వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ శ్రేణుల శోభాయాత్ర
పర్లాకిమిడి: పట్టణంలో శ్రీరామనవమి వేడుకల ముగింపు సందర్భంగా విశ్వ హిందూ పరిషత్, భజరంగఽ దళ్ శ్రేణులు శుక్రవారం సాయంత్రం సరస్వతీ శిశు విద్యామందిర్ నుంచి నగరంలో శోభాయాత్ర నిర్వహించాయి. తొలుత వీహెచ్‌పీ కేంద్రియ సంఘటన్ మంత్రి బినాయక్ రావ్ దేశ్ పాండే, గంజాం, గజపతి ప్రాంతీయ సామాజిక సమరసత్తా నాయకులు తరిణీ దాస్, దేవీ మఠం మహాంత రామానంద మహారాజ్ అధ్యక్షతన సాధారణ సమావేశం అనంతరం నగర పరిక్రమ చేశారు. ఈ ర్యాలీలో వేలాది మంది వి.హెచ్.పి., భజరంగ్ దళ్ సభ్యులు కాషాయం జెండాలు, శ్రీరామసీతాసమేత వేషధారణలో పాల్గొన్నారు. -
● జనావాసాల్లోకి హైనా
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ పట్టణ సమీపంలోకి హైనా ప్రవేశించింది. బీఎస్ పూర్ సమీపంలో భారత మాల రోడ్డు నిర్మాణం జరిగే ప్రాంతంలో ఒక కల్వర్టు కింద గిరిజనులు హైనాను గుర్తించారు. ముందు రోజు ఏదో వాహనం ఢీకొని ఉండడంతో ఈ క్రూర జంతువు నడవలేకపోతోంది. దీంతో స్థానికులు ఉమ్మర్‌కోట్ అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు దాన్ని అదుపు తీసుకోవడానికి ప్రయాస పడ్డారు. అదను చూసి ఎదురు దాడి చేయడం హైనా జంతువు జాతి లక్షణం. దాంతో వల పన్ని ఎంతో కష్టం మీద బోనులో బంధించారు. అనంతరం చికిత్స కోసం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. పపడాహండిలోని అటవీ సంరక్షణ కార్యాలయంలో ఉంచి కోలుకున్న తర్వాత అడవిలోకి విడిచిపెడతామని చెప్పారు. భారత మాల రోడ్డు నిర్మాణంలో భాగంగా దండకారణ్యం లో వేలాది అటవీ వృక్షాలను తొలగించారు. దీంతో జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. -
ఆహార కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు
రాయగడ: ఆహార కేంద్రాల పనితీరుపై మున్సిపాలిటీ అధికారులు చర్యలు చేపట్టారు. గురువారం స్థానిక గోవింద చంద్ర దేవ్ ఉన్నత పాఠశాల ఎదురుగా గల ఆహార కేంద్రంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మున్సిపాలిటీ చైర్మన్ మహేష్ పట్నాయక్, మున్సిపాలిటీ కార్యనిర్వాహక అధికారి కులదీప్ కుమార్, 17 వార్డు కౌన్సిలర్ మజ్జి శ్రీనివాసరావు ,మున్సిపాలిటీ ఇంజినీర్లు, సిబ్బంది ఆహార కేంద్రానికి వెళ్లి నాణ్యత పరిశీలించారు. అందరితో కలిసి భోజనం చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రూ.18కు భోజనం అందించడం కష్టంగా ఉందని, కాస్త పెంచగలిగితే బాగుంటుందని స్వయం సహాయక బృందానికి చెందిన మహిళలు అన్నారు. ఉపాధ్యాయుడు రక్తదానం జయపురం: ఉపాధ్యాయులు విద్యాదానమే కాదు రక్తదానం కూడా చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జయపురం సబ్‌డివిజన్ బొయిపరిగుడ సమితి ఆర్.భాలుగుడ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న ఉపాద్యాయుడు కాలూచరణ బెహరను ఉదహరించవచ్చు. ఆ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న పాయల్ ముండగుడియ రక్తహీనత కారణంగా అనారోగ్యానికి గురైంది. విషమ పరిస్థితిలో బాలికను బుధవారం జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చేర్చారు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు హిమోగ్లోబిన్ తక్కువ ఉందని వెంటనే రక్తం అవసరమని కుటుంబ సభ్యులకు సూచించారు. ఈ విషయం తెలిసిన ఉపాధ్యాయుడు వెంటనే ఆస్పత్రికి వచ్చి బాలికకు అవసరమైన రక్తదానం చేసి ప్రాణాలు కాపాడి మానవత్వాన్ని చాటారు. 2019లో కూడా విద్యార్థిని పాయల్ రక్తహీనతతో మృత్యువుతో పోరాడిన సమయంలో కూడా ఉపాధ్యాయుడు బెహర వచ్చి రక్త దానం చేశారని బాలిక బంధువులు వెల్లడించారు. బెహర సమాజానికి చేస్తున్న సేవను ప్రజలు అభినందిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఒంటిపూట పనివేళలు పర్లాకిమిడి: గజపతి జిల్లాలో పర్లాకిమిడి, కాశీనగర్, గుసాని, గుమ్మా, ఆర్.ఉదయగిరి, నువాగడ, రాయఘడ, మోహన బ్లాక్‌లలో గురువారం నుంచి ఒంటిపూట పనివేళలు అమలు చేయనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటన్నర వరకూ పనివేళలను మార్చారు. అధిక ఎండల కారణంగా ప్రభుత్వ కార్యాలయాలు జూన్ 15 వరకూ ఉదయం పూట కార్యాలయాల్లో సిబ్బంది పనిచేస్తారు. రాష్ట్రంలో టిట్లాఘడ్, రాయఘడ, నవరంగ్ పూర్, భఽధ్రక్, సోన్ పూర్ జిల్లాలో ఈ ఉదయం పనివేళలు పనిచేస్తాయి. మరికొన్ని జిల్లాలకు ఈ జీఓ వర్తించదు. ఎలుగుబంటి దాడిలో వృద్ధుడికి గాయాలు మల్కన్‌గిరి: ఎలుగుబంటి దాడిలో వృద్ధుడు గాయపడ్డాడు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా మాత్తిలి సమితి క్యాంగ్ పంచాయతీ సారంగపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకోగా.. ధము నాయక్ (60) తీవ్రంగా గాయపడ్డారు. సారంగపల్లి గ్రామ సమీపంలోని అడవికి కట్టెలు తేవడానికి ధము నాయక్ గురువారం ఉదయం వెళ్లాడు. కట్టెలు కొడతున్న సమయంలో అతనిపై ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో అతను భయంతో కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు అక్కడకు చేరుకొని ఎలుగుబంటిని తరిమేశారు. గాయపడిన అతన్ని అంబులెన్స్‌లో మత్తిలి ఆరోగ్య కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న మత్తిలి పోలీసులు ఫారెస్టర్ వాసుదేవ్ నాయక్ సమాచారం ఇచ్చారు. దీంతో ఆరోగ్య కేంద్రానికి వచ్చి బాధితుడ్ని పరామర్శించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వన్యప్రాణుల దాడిలో గాయపడిన వారికి అందజేసే నష్టపరిహారాన్ని ధము నాయక్‌కు అందజేస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. -
స్వగ్రామంలో సామవేదం షణ్ముఖశర్మకు ఆత్మీయ సత్కారం
పర్లాకిమిడి: ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సామవేదం షణ్ముఖ శర్మను దక్షిణ భారత బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో సత్కరించారు. స్థానిక జంగం వీధి జంక్షన్ సింహాద్రి ఫంక్షన్ హాలులో సామవేదం షణ్ముఖ శర్మను దక్షిణ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు డాక్టర్ ఆర్.ఆర్.రవి, ఉపాధ్యక్షులు మరువాడ శివరామకృష్ణలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సామవేదం మాట్లాడుతూ తాను పుట్టింది గంజాం జిల్లా అస్కాలో అయినా నా విద్యాభ్యాసం పర్లాకిమిడి శ్రీకృష్ణచంద్ర గజపతి కళాశాలలో జరిగిందన్నారు. ఈ చారిత్రాత్మక ప్రాంతాన్ని ఒక నిర్ధిష్టమైన వాస్తుశాస్త్రాన్ని అనుసరించి అప్పటి మహారాజులు నిర్మించారని అన్నారు. పర్లాకిమిడిలో దక్షిణ భారత బ్రాహ్మణ సంఘం, ఆత్మీయులు చాలా ఏళ్ల తర్వాత ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఆత్మీయ సభలో వెల్లంకి కూర్మనాథం, కార్యదర్శి గుడిమెట్ల శ్రీనివాస రావు, చెట్టి వెంకటేశ్వర్లు తదితరులు సహకరించారు. -
50 ఇళ్లలో అంధకారం
జయపురం: పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కమల పూజారి ఇంటితో పాటు మరో 50 ఇళ్లు అంధకారమయ్యాయి. ఆయా ఇళ్ల వారు బిల్లులు కట్టలేదని విద్యుత్ సరఫరా నిలుపు చేశారు. దీంతో ఈ నిరుపేద ఆదివాసీలు అంధకారంలో ఉంటున్నారు. కమల పూజారి గ్రామం జయపురం సమితి పాత్రోపుట్. మూడేళ్ల కిందట ఆ గ్రామంలోను పక్కన ఉన్న కొంజాయి మాలిగుడ గ్రామాల్లో రాజీవ్ గాంధీ విద్యుద్దీకరణ పథకం అమలు చేశారు. ఆ మేరకు పాత్రొపుట్లో 50 ఇళ్లకు విద్యుత్ సౌకర్యం కల్పించారు. ఆ నాడు ఒక బల్బుకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు వేలకు వేలు బిల్లులు రావడంతో గిరిజనులు కంగారు పడుతున్నారు. తాము అంత డబ్బు కట్టలేమని చెప్పినా వినకుండా విద్యుత్‌శాఖాధికారులు కరెంటు సరఫరా నిలిపివేశారు. ఈ ఇల్లలో పద్మశ్రీ డాక్టర్ కమలా పూజారి కుటుంబానికి చెందిన ఇల్లు కూడా ఉంది. అలాగే కొజాయిమాలిగుడలో 12 ఇళ్లకు విద్యుత్ సరఫరా కట్ చేశారు. ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని ఆనాడు చెప్పిన అధికారు నేడు బిల్లు కట్టలేదంటూ విద్యుత్ సరఫరా నిలిపి వేయటం అన్యాయమని అన్నారు. ఈ అంశంపౌ బీజేడీ తీవ్రంగా స్పందించింది. వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించక పోతే బీజేడీ ఆందోళనన చేపడుతుందని మాజీ మంత్రి రబినారాయణ నందో హెచ్చరించారు. -
జబాపోదర్‌కు బస్సు ప్రారంభం
బస్సును ప్రారంభిస్తున్న అధికారులు జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంధ్రా సమితి కెరిమిట పంచాయతీ నుండి ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర సరిహద్దులోని జబాపోదర్ పంచాయతీకి మో బస్సు సేవా పథకంలో భాగంగా గురువారం బస్సును ప్రారంభించారు. కెరిమిటి పంచాయతీ నుంచి మొ బస్సు పథకంలో జబాపోదర్‌కు బస్సు వేయాలని ఆ ప్రాంత ప్రజలు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. అయితే నేటి వరకు ప్రజల కోరిక తీరలేదు. మారుమూలనున్న జబాపోదర్ గ్రామానికి వెళ్లేందుకు ఎటువంటి రవాణా సౌకర్యం లేదు. ఇటీవల జబాపోదర్ గ్రామంలో జరిగిన ప్రసిద్ధ ఠకురాణి జాత్రకు వెళ్లిన కోట్పాడ్ ఎమ్మెల్యే రూపు భొత్రను తమ పంచాయతీకి బస్సు సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరారు. బస్సు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన కుంధ్ర సమితి బీడీవో కపిలేశ్వర్ తండితో చర్చించి వెంటనే మొ బస్సు సేవా పథకంలో కెరిమిటి నుంచి జబాపోదర్ పంచాయతీకి బస్సు వేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశం మేరకు బస్సును ఏర్పాటు చేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కుంధ్ర సమితి ఎమ్మెల్యే ప్రతినిధి, బీజేపీ నేత బిప్రనారాయణ ఆచార్య, నాయకులు అభిలాష్ బెహర, ప్రకాశ పట్నాయక్, భగవాన్ పండ, తుషార్ భట్, దిగాపూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ధనపతి పొరజ, లయిబాన్ గౌఢ పాల్గొన్నారు. బస్సు సౌకర్యం కల్పించినందుకు కెరిమిట, జబాపోదర్ పంచాయతీల ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేశారు. -
పెట్రోల్ బంకులో మోసాలపై ఆందోళన
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కోరుకొండ సమితిలోని పెట్రోల్ బంకులో మోసాలపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఓంకార్ బంకుకు వెళ్లిన బైక్‌లో కొద్దిగా పెట్రోల్ కొద్దిగా నీటిని నింపడాన్ని మరికొంతమంది వాహనాదారులు బుధవారం గమనించారు. దీంతో వాహనాలు ఆగిపోవడంతో గ్యారేజ్‌లో చూపించారు. సుమారు పది మంది వాహనాలు ఇలాగే ఆగిపోయాయి. వీరంతా మెకానిక్‌ను సంప్రదించగా.. పెట్రోల్‌లో నీరు కలిసినట్టు నిర్ధారించారు. దీంతో వారంతా బంక్ వద్దకు వచ్చి ఆందోళనకు దిగారు. బంక్ యజమాని నిలదీశారు. ఖాళీ బాటిళ్లలో పెట్రోల్ నింపి చూస్తే నీరు కలిసినట్టు నిర్ధారణ అయింది. ఈ విషయం అధికారుల దృష్టికి వెళ్లడంతో వారంతా గురువారం బంకును పరిశీలించారు. నీరు కలిసిన పెట్రోల్ వేయడంతో అగిపోయిన వాహనాలను బాగు చేయించి ఇవ్వడంతోపాటు పెట్రోల్ కోసం డబ్బులను కూడా ఇచ్చారు. మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బంక్ యజమానిని పోలీసులు హెచ్చరించారు. -
అమ్మవారికి విశేష పూజలు
రాయగడ: మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాల్లో భాగంగా గురువారం విశేష పూజలను నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు రాయిసింగి బిడిక, సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, పెద్దిన వాసుదేవరావు, వడ్డాది శ్రీనివాస్‌రావు దంపతులు అమ్మవారి సన్నిధిలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఆదివాసీ వాయిద్యాల నడుమ జరిగిన పూజల్లో ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర్ బెరుకో అమ్మవారికి పసుపు, కుంకుమలను సమర్పించారు. అనంతరం గర్భగుడి నుంచి పూజా వేదిక వరకు వెళ్లిన కమిటీ సభ్యులు అక్కడ సూర్య పూజ, శాలపూజ, దేవి షొపోపచార పూజ, మహాస్నానం, మహాపూజ, హారతి, పుష్పాంజలి పూజల్లో పాల్గొన్నారు. గంజాం జిల్లా కవిసూర్య నగర్ నుంచి వచ్చిన వేదపండితులు ఈ సందర్భంగా గరుడ బొమ్మను చిత్రీకరించారు. అనంతరం ఆ స్థానంలో గరుడ సేవ పూజలు చేశారు. నగర పరిక్రమణలో అమ్మవారు దుష్టశక్తుల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు నడుం బిగించిన అమ్మవారు ఈ చైత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారి ప్రతిరూపాలుగా కొలిచే ఘటాలు నగర పరిక్రమణలో పాల్గొన్నాయి. అమ్మవారి వెంట ఆమె అక్కచెల్లెళ్లు గ్రామదేవి, భైరవి ఘటాలు కూడా ఉన్నాయి. ఈ ఘటాలను చిన్నారులు మాత్రమే మోస్తారు. వారికి ముత్తయిదువుల్లా ముస్తాబు చేసిన అనంతరం అమ్మవారి ఘటాలను మోయడం ఆనవాయితీ. ఇదిలాఉండగా అమ్మవారు రాత్రి సమయంలో చిన్నారి రూపంలో సంచరిస్తోందని ప్రతీతి. దానికి అనుగుణంగా ఈ ఉత్సవాల్లో అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలను ఆ చిన్నారుల చేత మోయించారు. కొనసాగుతున్న చైత్రోత్సవాలు -
కింగ్‌కోబ్రా హల్చల్
మందస: మందస మండలం భోగాపురం గ్రామంలోని హరిజనవీధి ఎంపీపీ స్కూల్ సమీపంలో గురువారం తెల్లవారు జామున భారీ కింగ్ కోబ్రా కలకలం రేపింది. దాదాపు 12 అడుగులు ఉన్న సర్పాన్ని చూసి స్థానికులు భయపడ్డారు. పిల్లలు చదువుకుంటున్న ప్రదేశంలో పాము కనిపించడంతో వణికిపోయారు. కొర్లాం గ్రామంలో ఉన్న స్నేక్ క్యాచర్ నర్సింగ్ మహా పాత్రోకు సమాచారం అందించగా ఆయన వచ్చి సర్పాన్ని పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టారు. రాష్ట్ర కార్యక్రమంగా మహాత్మా జ్యోతిబా పూలే జయంతిశ్రీకాకుళం పాతబస్టాండ్: మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. జయంతి వేడుకల్లో భాగంగా శుక్రవారం ఉదయం 10 గంటలకు నగరంలోని మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ప్రత్యేక కార్యక్రమం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అనంతరం, శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులో నూతనంగా నిర్మించిన బీసీ భవన్‌ను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. పురుషోత్తపురంలో తగ్గుతున్న డయేరియా ఇచ్ఛాపురం టౌన్ : మున్సిపాలిటీ పరిధిలోని పురుషోత్తపురంలో డయేరియా గురువారానికి తగ్గుముఖం పట్టింది. అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి జూహితా, ఇతర సిబ్బంది ఇంటింటా సర్వే చేసి వైద్య సేవలు అందజేశారు. పురుషోత్తపురంలో బావి నీరు ఉపయోగిస్తున్నారని, ఆ బావిలో చెత్త వేయకుండా చూసు కోవాలని వైద్యాధికారి జూహితా తెలిపారు. అయితే గ్రామంలో బహిరంగ మలవిసర్జన సమస్యగా ఉందని, దాన్ని అరికట్టాలని కొందరు కోరారు. కాలువల్లోనూ మురికి పేరుకుపోయి ఉందని తెలిపారు. టెక్కలి నూతన డీఎస్పీగా భార్గవి శ్రీకాకుళం క్రైమ్, టెక్కలి: టెక్కలి నూతన డీఎస్పీగా ఎన్.భార్గవి మర్రివాడ రానున్నారు. ఇటీవల శిక్షణ పూర్తిచేసుకున్న ఈమె టెక్కలిలో తొలిపోస్టింగ్ దక్కించుకోవడం విశేషం. ఈ మేరకు మంగళగిరి డీజీపీ కార్యాలయం నుంచి గురువారం ఉత్తర్వులు వచ్చాయి. టెక్కలిలో ఇదివరకు పనిచేసిన డీవీవీఎస్‌ఎన్ మూర్తి ఇటీవల ఉద్యోగవిరమణ పొందిన విషయం విధితమే. ఆర్టీసీ డ్రైవర్ ఆవేదన సాక్షి టాస్క్‌ఫోర్స్: జలుమూరు మండలం పెద్దదూగాం గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ ధర్మాన రామారావు తాను మోసపోయానని, తనకు న్యాయం చేయాలని కోరుతూ ఓ వీడి యో విడుదల చేశారు. బుద్ధల భాస్కరరావు అనే వ్యక్తి తనను మోసం చేశాడని ఆయన ఆరోపించారు. విడతల వారీగా రూ.68 లక్షల వరకు కాజేశాడని, పిల్లల చదువులకు ఇప్పు డు తాను ఇబ్బందులు పడుతున్నానని వీడియోలో పేర్కొన్నారు. తన లాగానే పరిసర గ్రామాల ప్రజల వద్ద కూడా డబ్బులు వసూ లు చేశాడని, కూతురి పెళ్లి కోసం ఉంచుకున్న డబ్బును సైతం అతడికే ఇచ్చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. తన లాగా భాస్కరరావు మాయలో ఎవరూ పడవద్దని కోరారు. ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశానని, తనకు పోలీసులు న్యాయం చేయాలని, ఇది కేవలం తన వ్యక్తిగత సమస్య అని రాజకీయాలకు సంబంధం లేదని తెలిపారు. -
‘ఆపరేషన్ కగార్ ఆపాల్సిందే’
పలాస: దండకారణ్యంలో ఆపరేషన్ కగార్‌ను కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే నిలుపుదల చేయాలని, కేంద్ర పోలీసు బలగాలను వెనక్కి రప్పించాలని, మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని పలువురు వక్తలు ప్రభుత్వానికి విన్నవించారు. కాశీబుగ్గలోని ఓ రెసిడెన్సీలో గురువా రం సీపీఐ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగార్‌కు వ్యతిరేకంగా సదస్సు నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ మాట్లాడుతూ దండకారణ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టుల పేరుతో ఆదివాసీలపై దాడులు జరుగుతున్నాయని, అమాయక ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల పోలీసుల చేతిలో మృతి చెందిన రేణుక బహుజనుల బిడ్డని, ఆమె ఎప్పుడు కూడా తుపాకీ పట్టిన దాఖలాలు లేవని, ఆమె ఒక రచయత, మేధావి అని ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రకృతి వనరులను దోచుకోవడానికేనని దుయ్యబట్టారు. మానవ హక్కుల నేత ఎస్వీ కృష్ణ మాట్లాడుతూ అడవుల్లో ఉన్న ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి మాత్రమే ఈ ఆపరేషన్ కగార్ అని వ్యతిరేకించారు. సదస్సులో మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు కేవీ జగన్నాథం, సీపీఐ ఎం.ఎల్ న్యూడెమొక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్, లిబరేషన్ జిల్లా కార్యదర్శి తామాడ సన్యాసిరావు, పత్రి దానేసు తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా సరస్వతి శిశు మందిర్ వార్షికోత్సవం
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్ పాఠశాల 26వ వార్షికోత్సవాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సంగ్ మడ్కామి కార్యక్రమంలో పాల్గొన్నారు. 1995లో ప్రారంభమైన సరస్వతీ శిశుమందిర్ ఎంతోమందిని ఉత్తములుగా తీర్చిదిద్దింది. 2023–24 విద్యాసంవత్సరంలో జరిగిన పదో తరగతి పరీక్షల్లో 498 మార్క్‌లతో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని లిప్సరాణి పండాకు వెయ్యి రూపాయల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. జిల్లా అదనపు కలెక్టర్ సోమానాధ్ ప్రధాన్, జిల్లా పరిషత్ అధ్యక్షురాలు సమారి టంగులు, పాఠశాల కమిటీ అధ్యక్షుడు ఆశోక్ చక్రవర్తి పాల్గొన్నారు. -
కళలు, సంస్కృతిని పరిరక్షించాలి
రాయగడ: భిన్న సంస్కృతులు గల ఒడిశా రాష్ట్రం కళలకు పుట్టినిళ్లని జిల్లా కలెక్టర్ ఫరూల్ పట్వారి అన్నారు. వీటిని కాపాడుకోవడం మన కర్తవ్యమని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక సంస్కృతి భవనంలో కళాకారుల సన్మాన కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఎంతో మంది కళాకారులు ఉన్నారని, వారిని ప్రోత్సాహించేందుకు జిల్లా యంత్రాంగం ఎన్నో కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కళలనే నమ్ముకున్న సీనియర్ కళాకారులను సన్మానించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం శ్రీకారం చుట్టిందన్నారు. కళారంగం ఎప్పటికీ అలరించాలని, అందుకు కళాకారులను ప్రోత్సాహించడం మనందరి కర్తవ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంస్కృతి విభాగం అధికారి సస్మిత భౌరి, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, జిల్లా కళాకారుల సంఘం ఉపాధ్యాక్షులు సంతోష్ కుమార్ బొచ్చా, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. జిల్లా కలెక్టర్ పట్వారి -
ఆకట్టుకున్న కళా ప్రదర్శన
పర్లాకిమిడి: గజపతి జిల్లా గుసాని సమితి అగరఖండి పంచాయతీ బోడోగావ్ కళాకారుల పుట్టినిల్లు. అగరఖండి గ్రామంలో కళాకారులు గురువారం లోకకళా ప్రదర్శన ఇచ్చారు. ఒడియా భాషా ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, గౌరవ అతిథిగా ఎ.డి.ఎం.రాజేంద్రమింజ్, సబ్ కలెక్టర్ అనుప్ పండా, బీడీవో గౌరచంద్ర పట్నాయక్, గుసాని సమితి చైర్మన్ ఎన్.వీర్రాజు పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలను కల్చరల్ అధికారి అర్చనా మంగరాజ్ పర్యవేక్షించగా, డీపీఆర్వో ప్రదిప్త గురుమయి ధన్యవాదాలు తెలియజేశారు. -
ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
రాయగడ: జిల్లాలోని గుణుపూర్‌లో గల గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న సందీప్ లెంక అనే విద్యార్థి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కేంద్రపడ జిల్లాలోని రాజ్‌నగర్ ప్రాంతానికి చెందిన వాడు. సమాచారం తెలుసుకున్న గుణుపూర్ ఆదర్శ పోలీస్ స్టేషన్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలియజేసిన వివరాల ప్రకారం.. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో గల న్యూటన్ విభాగం హాస్టల్లో 24 వ నంబరు గదిలో సందీప్ ఉండేవాడు. బుధవారం కాలేజీలో ఫైనల్ ఇయర్ విద్యార్థుల వీడ్కోలు సభ జరిగింది. ఆ కార్యక్రమానికి కూడా సందీప్ హాజరు కాలేదు. సందీప్ ఉంటున్న గదిని శుభ్రం చేసేందుకు ఓ మహిళ వెళ్లి తలుపు కొట్టగా ఏమీ సమాధానం రాలేదు. దీంతో ఆమె వెంటనే వార్డెన్‌కు విషయం తెలియజేశారు. అనంతరం హాస్టల్ వార్డెన్, యాజమాన్య సిబ్బంది వెళ్లి గది తలుపులను విరగ్గొట్టి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ సందీప్ కనిపించాడు. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేయాలి జయపురం: ఎండలు తీవ్రంగా ఉంటున్నాయని, పట్టణానికి వచ్చే గ్రామీణులు, స్థానికులు ఎండలో సేద తీరేందుకు జయపురం పట్టణ ప్రధాన సెంటర్లలో తాత్కాలిక రెస్ట్ షెడ్లు ఏర్పాటు చేయాలని ప్రముఖ సమాజ సేవకుడు బి.హరి రావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. జయపురం సబ్‌కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డికి గురువారం వినతిపత్రం అందజేశారు. ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లలో డిజిటల్ సిగ్నల్ లైట్ ఉందని, వాహనాలు దాదాపు ఒక నిముషం వరకు వేచి ఉండాల్సి వస్తుందన్నారు. అధికంగా ఎండలు ఉండటం వలన ప్రజలు వడ దెబ్బకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. 2024లో మున్సిపాలిటీ అధికారులు ఆ ప్రాంతంలో రెస్ట్ షెడ్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వినతిపత్రం అందజేసినవారిలో రమేష్ జెనా, కె.గురు పట్నాయక్, బలరాం నాయక్, కమల లోచన, తదితరులు ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మద్యం దుకాణం పర్లాకిమిడి: జిల్లాలో మోహనా బ్లాక్ గోవిందపూర్‌లో ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల వద్ద దేశీ, విదేశీ మద్యం దుకాణం ఏర్పాటు చేశారు. దీంతో ఆ గ్రామస్తులు గురువారం గజపతి కలెక్టర్ బిజయకుమార్ దాస్, ఎకై ్సజ్ సూపరింటెండెంట్‌ను, సబ్ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలను అందజేశారు. నలుగురు సారా వ్యాపారులు ఏర్పాటు చేసిన నాటు సారా, విదేశీ మద్యం దుకాణాన్ని తొలగించాలని కోరారు. -
అడవుల్లో అగ్ని సెగలు
పాత్రోపుట్ అడవిలో పోడు వ్యవసాయం కోసం అడవులు తగుబెట్టిన దృశ్యం జయపురం: జయపురంలో ఎండలు మండుతున్నాయి. జయపురం అటవీ రేంజ్లో గత ఫిబ్రవరి 12 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు 23 చోట్ల అడవులు అగ్ని ప్రమాదాల్లో చిక్కుకుని తగలబడినట్లు తెలుస్తోంది. ఈ వేసవిలో అగ్ని ప్రమాదాల నుంచి అడవులను కాపాడేందుకు 8 స్వచ్ఛంద సంస్థలకు అటవీ విభాగం బాధ్యతలు అప్పగించింది. అయినా అడవుల్లో అగ్ని ప్రమాదాలు తగ్గటం లేదు. గత ఫిబ్రవరి నెలలో జయపురం అటవీ రేంజ్లో 3 ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరుగగా మార్చ్ నెలలో 9 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఈ నెల అనగా ఏప్రిల్ 1 వ తేదీన రెండు ప్రాంతాల్లో అడవులు తగుల బడగా, ఏప్రిల్ 5 వ తేదీన రెండు ప్రాంతాలలోను, 6న ఒక ప్రాంతంలోను, 7న ఒక ప్రాంతంలోను, 8న 5 ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినట్లు తెలిసింది. మంగళవారం బరిణిపుట్ పంచాయతీ మహుళభట రిజర్వ్ ఫారెస్టులు రెండు చోట్ల, కొండమాలి రిజర్వ్ ఫారెస్టులు రెండు చోట్ల, బులెట్ షోరూం వెనుక వైపున ఉన్న అడవిలో అగ్ని ప్రమాదాలు జరిగినట్లు జయపురం అటవీ రేంజర్ పొరిడ వెల్లడించారు. -
కిడ్నీ ఆస్పత్రి పరిశీలన
కాశీబుగ్గ: పలాసలోని వైఎస్సార్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గురువారం పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామారావు అనే బాధితుడిని పరామర్శించేందుకు వచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజతో కలిసి ఇన్‌పేషెంట్ విభాగం, కిడ్నీ రోగుల వార్డు, ప్రభుత్వ డయాలసిస్ యూనిట్లను పరిశీలించారు. రోజు రోజుకూ కిడ్నీ రోగులు పెరుగుతున్నారని వారికి అవసరమైన వైద్య సేవలు, మందులు పంపిణీ, ఆపరేషన్లు, పరీక్షలు, అన్ని విభాగాలను పనిచేసేలా చూడాలని అన్నారు. ఆయనతో పాటు మందస ఎంపీపీ డొక్కరి దానయ్య, ఎంపీటీసీలు బమ్మిడి దుర్యోధన రావు, గండు మోహనరావు, మాజీ ఎంపీపీ బత్తిని హేమేశ్వరరావు, నాయకులు శిష్టు గోపి, దువ్వాడ రవి తదితరులు పాల్గొన్నారు.కిడ్నీవ్యాధితో వ్యక్తి మృతి టెక్కలి రూరల్: మండలంలోని సన్యాసినీతాపురం గ్రామానికి చెందిన బెహరా సింహాద్రి(45)అనే వ్యక్తి కిడ్నీవ్యాధితో గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీవ్యాధితో బాధపడుతూ శ్రీకాకుళం, టెక్కలిలోని ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకునేవాడు. అయితే గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య కృష్ణవేణి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. -
డోలీ మోత.. తీరని వ్యథ
● అస్పత్రికి తరలిస్తుండగా యువతి మృతిమల్కన్గిరి: జిల్లాలోని ఖోయిర్‌పూట్ సమితి కాత్రాకుంట గ్రామానికి చెందిన సంజితా గోలారీ అనే యువతి జ్వరంతో బాధపడుతూ డోలీలో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందింది. వివరాల్లోకి వెళ్తే.. సంజితా కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతోంది. దీనిలో భాగంగా బుధవారం ఆమె పూర్తిగా నీరసించిపోవడంతో ఆస్పత్రికి తీసుకొని వెళ్లాలని నిర్ణయించారు. అయితే గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో అంబులెన్స్ కోసం సుమారు ఆరు కిలోమీటర్ల వరకు డోలీలో తీసుకెళ్లాల్సి ఉంది. దీంతో సంజితను డోలీలో కుటుంబ సభ్యులు తీసుకొని బయల్దేరారు. అయితే సకాలంలో ఆస్పత్రికి చేరలేకపోవడంతో ఆమె మార్గమధ్యలోనే మృతి చెందింది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. -
హత్య కేసులో ఇద్దరు అరెస్టు
జయపురం: స్థానిక గగణాపూర్‌లోని సేవా పేపరు మిల్లు కాంట్రాక్ట్ కార్మికుడు పద్మన్ హరిజన్ హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు జయపురం సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్ బుధవారం వెల్లడించారు. అరైస్టెనవారిలో పంపుణీ గ్రామానికి చెందిన నరేంద్ర హరిజన్, భగవాన్ హరిజన్లు ఉన్నారన్నారు. వీరి వద్ద నుంచి బైక్‌తో పాటు 3 కత్తులు, ఒక గొడ్డలి, ఒక ఇనుప రాడ్డు, ఒక కత్తి సీజ్ చేసినట్లు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే.. మార్చి 30వ తేదీ సాయంత్రం పద్మన్ హరిజన్ పేపరు మిల్లు నుంచి తన స్వగ్రామానికి వెళ్తుండగా హత్యకు గురయ్యాడు. అయితే పాత శత్రుత్వం వలనే ఈ హత్య జరిగినట్లు వెల్లడించారు. ● ఇదీ విషయం గ్రామానికి చెందిన పద్మన్ హరిజన్‌కు, అలాగే అదే గ్రామంలో ఉంటున్న అన్నదమ్ములు నరేంద్ర, భగవాన్‌లకు మధ్య శత్రుత్వం ఉంది. దీంతో పద్మన్‌ను హత్య చేసేందుకు ఇద్దరు అన్నదమ్ములు ఒక మిత్రుడితో కలిసి ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా ఆరోజు పద్మన్ డ్యూటీ నుంచి బైక్‌పై 5 గంటల సమయంలో ఇంటికి బయల్దేరాడు. అతడిని గగణాపూర్ జంక్షన్ నుంచి నరేంద్ర అనుసరించాడు. అలాగనే బొనగుడ కొండ వద్ద భగవాన్, అతడి మిత్రుడు వేచి ఉన్నారు. పద్మన్‌ను వెంబడిస్తున్న నరేంద్ర ఫోను ద్వారా పద్మన్ రాకను భగవాన్‌కు తెలియజేశాడు. కొంత సమయం తర్వాత పద్మన్ బైక్ అక్కడకు వచ్చిన వెంటనే భగవాన్ ఒక గొడ్డలితో దాడి చేశాడు. ఆ దాడిలో పద్మన్ ఎడమ కాలుపై తీవ్ర గాయమైంది. అయినా ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగు తీశాడు. అతడి వెనుక భగవాన్ గొడ్డలితోను, నరేంద్ర కత్తితోను, వారి మిత్రుడు ఇనుప రాడ్‌తో వెంబడించారు. పద్మన్‌ను వారు వెంటాడి హత్య చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపి భగవాన్, నరేంద్రలను అరెస్టు చేశామని, మూడో వ్యక్తి పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. అతడిని కూడా అరెస్టు చేసి అందరినీ కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు. -
ట్రాఫిక్ సమస్య తీరేలా..!
భువనేశ్వర్: నగరంలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు వరుస డ్రైవింగ్ (లేన్ డ్రైవింగు) విధానం ప్రయోగాత్మకంగా బుధవారం ప్రవేశపెట్టారు. తొలుత స్థానిక జయదేవ్ విహార్ స్క్వేర్ వద్ద అమలులోకి తీసుకొచ్చారు. వాహన చోదకులకు అవగాహన కల్పించడానికి ఈ ప్రయోగాన్ని రద్దీగా ఉండే ఈ ప్రాంతంలో ప్రవేశపెట్టినట్లు నగర ట్రాఫిక్ డీసీపీ తపన్ మహంతి తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు, ప్రమాదాలను తగ్గించే దృక్పథంతో సరైన డ్రైవింగ్ పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు లేన్ అవేర్నెస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జంట నగరాల కమిషనరేట్ పోలీసు అధికారుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ అవగాహన కార్యక్రమం జరుగుతుంది. 3 వరుసల్లో వాహనాల రవాణా వాహన పరిమాణం మరియు వేగానికి అనుగుణంగా 3 వేర్వేరు వరుసల్లో వాహనాలను క్రమపద్ధతిలో నడిపిస్తారు. ఈ కార్యాచరణ కోసం ఏర్పాటు చేసిన నిర్ధారిత వరుసల్లో ఎలా వాహనాలు నడపాలో ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. దీనికోసం పోలీసులు ట్రాఫిక్ కోన్లను ఉపయోగించి రోడ్డుపై 3 లేన్లు ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాటుతో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఒక లేన్‌లో ఉండి మరొక లేన్‌కు మారకుండా చర్యలు తీసుకుంటారు. ప్రమాదాల నివారణకు కృషి నగరంలో రద్దీగా ఉండే రోడ్లలో ఎటువంటి సూచనలు లేకుండా వాహనాలు ఒక లేన్ నుంచి మరొక లేన్‌కు మారడంతో అత్యధిక ప్రమాదాలకు ప్రధాన కారణంగా విశ్లేషించి ఈ చర్యకు జంట నగరాల కమిషనరేట్ పోలీసులు నడుంబిగించారు. ప్రజలు తమ వాహనం కోసం ఏ వరుస ఉద్దేశించబడిందో తెలుసుకుని క్రమపద్ధతిలో వాహనాలు నడపడంపై చైతన్యపరచి ఈ వ్యవస్థని విజయవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు నగర ట్రాఫిక్ డీసీపీ తెలిపారు. అంచెలంచెలుగా విస్తరణ సాయంత్రం వేళల్లో జయదేవ్ విహార్ నుంచి డొమొణ స్క్వేర్ వరకు ఉన్న రోడ్డులో ట్రాఫిక్ రద్దీని నియంత్రించి రవాణా సులభతరం చేసేందుకు లేన్ డ్రైవింగ్ వ్యవస్థని ప్రయోగాత్మక చర్యగా అమలు చేశారు. ఈ చొరవ విజయవంతమైన ఫలితాలను ఇస్తే రాబోయే రోజుల్లో ఆచార్య విహార్, పటియా మరియు డొమొణ వంటి ప్రధాన కూడళ్లలో కూడా ఈ వ్యవస్థను అమలు చేస్తామని పేర్కొన్నారు. వాహనాల వర్గీకరణ ఎడమ వరస: సాధారణంగా సైకిళ్లు, ద్విచక్ర వాహనాలు మరియు ఆటో రిక్షాలు వంటి నెమ్మదిగా కదిలే వాహనాల కోసం ఉద్దేశించబడింది. ఎడమ వైపు మలుపు తిరగడానికి సిద్ధమయ్యే వాహనాలు కూడా దీనిని ఉపయోగిస్తారు. మధ్య వరుస: మితమైన వేగాన్ని కొనసాగించే కార్లు మరియు ఇతర చిన్నస్థాయి వాహనాలకు ఈ వరస నిర్ధారించారు. ఈ వరస పరిమిత వేగంతో ప్రయాణించడానికి అనువైనది. కుడి వరుస: సాధారణంగా అధిగమించడానికి (ఓవర్ టేకింగ్) మరియు వేగంగా దూసుకుపోయే బస్సులు మరియు ట్రక్కులు వంటి భారీ వాహనాల కోసం ప్రత్యేకించబడింది. నగరంలో లేన్ డ్రైవింగ్ జయదేవ్ విహార్‌లో ప్రయోగాత్మకంగా అమలు -
అప్రమత్తతే శ్రీరామరక్ష
● గ్రామాల్లో ఆటలమ్మ, గవదబిళ్లల కేసులు ● వేసవి నేపథ్యంలో పెరుగుతున్న తీవ్రత ● పిల్లల పెంపకంలో జాగ్రత్తలు తీసుకోవాలంటున్న వైద్యులు పాతపట్నం: వేసవి వచ్చిందంటే చాలు కొందరికి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా చిన్నారుల్లో చికిన్పాక్స్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. గవదబిళ్లలు, ఆటలమ్మగా పిలిచే ఈ సమస్య బారిన పడిన వారికి జలుబు, జ్వరం, శరీరంపై పొక్కులు, దవడలకు ఇరువైపులా వాపు, నొప్పి వంటివి తీవ్రంగా బాధిస్తాయి. అన్ని వయసుల వారికి ఈ అంటువ్యాధులు సోకే అవకాశమున్నా, ప్రధానంగా చిన్నారుల్లో ఎక్కువగా వస్తుంటుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే ముందు జాగ్రత్త, అప్రమత్తతతో వ్యవహరిస్తే దీని బారినపడకుండా రక్షణ పొందవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. పదేళ్లలోపు చిన్నారుల విషయంలో మరింత శ్రద్ధ చూపాలని చెబుతున్నారు. వ్యాధి నిరోధక శక్తి తక్కువుంటే.. సాధారణంగా వ్యాధి నిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంటుంది. అందుకే చిన్నారులు బలవర్ధకమైన ఆహారం తీసుకునేలా తల్లిదండ్రులు చొరవచూపాలి. ఆటలమ్మ, గవదబిళ్లలు సోకిన వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. ఆకలి లేకపోవడం, ఆహారం సరిగా తీసుకోలేకపోవడం వంటి చర్యలు వల్ల తీవ్రంగా నీరసించిపోతారు. శరీరంపై నీటి పొక్కులు, జ్వరం వంటి లక్షణాలు కనిపించగానే ఆటలమ్మగా గుర్తించి వైద్యులను సంప్రదించాలి. వ్యాధి తీవ్రత ఆధారంగా వైద్యుల సూచన మేరకు యాంటీవైరస్, యాంటీ బయోటిక్ మందులు వాడాల్సి ఉంటుందిల్లీ ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ఆటలమ్మ సోకిన వారిని మిగతా వారికి దూరంగా ఉంచాలి. తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు ఇవ్వడం మంచిది. గవదబిళ్లలు వచ్చిన వారికి గొంతునొప్పి తీవ్రంగా ఉంటుంది. తరచూ ద్రవపదార్థాలను ఆహారంగా తీసుకోవాలి. ఆటలమ్మ, గవదబిళ్లలు వచ్చిన వారి విషయంలో ప్రజలు అపోహలు, మూఢ నమ్మకాలతో వైద్య సహాయం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తుంటారు. అది మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటే మెదడు, ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఇలాంటి వ్యాధులు సోకకుండా ఉండేందుకు పిల్లలకు గోరువెచ్చని నీరు, శుభ్రమైన ఆహారం ఇవ్వడంతో పాటు పరిసరాల్ని పరిశుభ్రంగా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. నిర్లక్ష్యం తగదు.. ఆటలమ్మ, గవదబిళ్లల వ్యాధులపై నిర్లక్ష్యం తగదు. చిన్నారులు ఎక్కువగా ఈ సమస్యతో బాధపడుతుంటారు. వ్యాధి లక్షణాలు కనిపించగానే వెంటనే వైద్యులను సంప్రదించి వారి సూచనలు మేరకు మందులు వాడాలి. – డాక్టర్ ఎస్.కృష్ణారావు, సూపరింటెండెంట్, సీహెచ్‌సీ, పాతపట్నం -
పురుగు మందు తాగి వృద్ధుడు ఆత్మహత్య
మెళియాపుట్టి : మండలంలోని జర్రిభద్ర గ్రామానికి చెందిన దుంపల సూర్యారావు(80) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సూర్యారావుకు ఐదుగురు కుమారులు. చాలా సంవత్సరాల క్రితమే భార్య చనిపోవడంతో నెలకొక కుమారుడి ఇంటి వద్ద ఉంటున్నాడు. ప్రస్తుతం కుమారుడు నాగేశ్వరరావు వద్ద ఉండేవాడు. ఏం జరిగిందో గానీ మంగళవారం మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం గ్రామానికి కొంతదూరంలో ఉన్న పంటపొలాల్లో వాంతులు చేసుకుంటూ పడిపోయాడు. స్థానికులు గమనించి సమాచారం అందించగా మరో కుమారుడు అప్పారావు 108 అంబులెన్సులో టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించాడు. అక్కడ చికిత్సపొందుతూ బుధవారం రాత్రి మృతిచెందాడు. పురుగుల మందును నీటిలో కలిపి తాగినట్లు పోలీసులు గుర్తించారు. కుమారుడు నాగేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై రమేష్ బాబు తెలిపారు. -
కొలువుదీరిన ఘటాలు
రాయగడ: పట్టణంలో మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారి ప్రతిరూపాలుగా కొలిచే ఘటాలు కొలువుదీరాయి. ఆలయ ప్రాంగణంలో ఘటాలను ఏర్పాటు చేశారు. పసుపు, కుంకుమలను అద్దిన ఘటాలను ప్రత్యేకంగా పూజించారు. సాయంత్రం నుంచి ఘటాల నగర పరిక్రమణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలో దుష్టశక్తులు ప్రవేశించకుండా వాటి బారినుంచి ప్రజలను కాపాడాలన్న ఉద్ధేశంతో అమ్మవారు ప్రతిరోజూ రాత్రి నగర పరిక్రమణ చేస్తారని ప్రతీతి. చరిత్రకు అనుగుణంగా సాంప్రదాయ పద్ధతిలో అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలను ఈ చైత్రోత్సవాల ఐదు రోజులూ ఊరేగిస్తారు. దీనినే నగర పరిక్రమణ అంటారు. ఘటాలు ఊరేగించే సమయంలో పూజారి ఘటాల ముందు పసుపు కలిపిన బియ్యాన్ని గ్రామస్తులకు బొట్టుగా అందిస్తారు. ఈ బొట్టును ధరిస్తే దుష్టశక్తులు ఏవీ దరి చేరవని నమ్మకం. అదేవిధంగా చిన్న పిల్లలకు ఈ పసుపును నీటిలో కలిపి తాగిస్తారు. దీంతో ఏటువంటి రోగాలు దరి చేరవని నమ్మకం. చండీ హోమం పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని, పంటలు సమృద్ధిగా పండాలని ప్రతీ ఏడాది చైత్రోత్సవాల ప్రధాన పూజల్లో భాగంగా చండీహోమం నిర్వహిస్తారు. గంజాం జిల్లా కవిసూర్యనగర్కు చెందిన ప్రత్యేక పురోహితుల ఆధ్వర్యంలో చండీహోమం పూజలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. చివరి రోజున ఈ చండీహోమం ముగిస్తారు. దీనినే పూర్ణాహుతి అంటారు. ప్రత్యేక అలంకరణ సునాబేసోలో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారి గర్భగుడితో పాటు ఆలయ ప్రాంగణాన్ని కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అలంకరించారు. ప్రతిరోజూ ప్రసాద సేవన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి. వివిధ సేవా సంస్థలకు చెందిన మహిళలు ప్రసాదాలను వితరణ చేస్తున్నారు. ప్రారంభమైన నగర పరిక్రమణ కొనసాగుతున్న చైత్రోత్సవాలు -
బ్యాంకు ఉద్యోగి దుర్మరణం
నరసన్నపేట: నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో నరసన్నపేట నాయుడువీధికి చెందిన హరినాథ్కుమార్నాయుడు (బాబీ)(46) మృతి చెందారు. ఈయన నెల్లూరు జిల్లా ముత్తుకూరు యాక్సిస్ బ్యాంకు మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తిరుపతిలో నివాసం ఉంటున్నారు. మంగళవారం ద్విచక్ర వాహనంపై వెళ్తూ ముత్తుకూరు మండలం కొప్పల దొరువు సమీపంలో కుక్క అడ్డంగా రావడంతో అదుపుతప్పి పడిపోయారు. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో స్థానికులు వెంట నే ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బుధవా రం వేకువజామున చికి త్స పొందుతూ మృతిచెందారు. దీంతో నా యుడువీధిలో విషాదం అలముకుంది. మంచి మిత్రుడిని కోల్పోయామని గొద్దు చిట్టిబాబు తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. -
కార్యాలయానికి తాళాలు వేసిన కౌన్సిలర్లు
కొరాపుట్: నబరంగ్‌పూర్ మున్సిపల్ కార్యాలయానికి వైస్ చైర్మన్ సౌమ్య మహాపాత్రో, కౌన్సిలర్లు బుధవారం తాళాలు వేశారు. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ బిశ్వప్రియ దాస్ ఏకచత్రాధిపత్యం చేస్తున్నారని, ప్రభుత్వ నిబంధనలు పాటించడం లేదని, గెలిపొందిన ప్రజాప్రతినిధులను చులకనగా చూస్తున్నారని ఆరోపించారు. గతంలో అతనిపై పార్టీలకు అతీతంగా కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రోకి ఫిర్యాదు చేయడంతో వారం రోజుల్లో బదిలీ చేస్తా మని హామీ ఇచ్చారన్నారు. కానీ నెల రోజులు పూర్త య్యినప్పటికీ బదిలీ జరగకపోవడంతో ఈవిధంగా నిరసన తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ఇది తెలిసి మున్సిపల్ చైర్మన్ కును నాయక్ కార్యాలయం వద్ద కు చేరుకున్నారు. పరిస్థితిని జిల్లా కలెక్టర్‌కి ఫోన్లో వివరించారు. వారం రోజుల్లో ఇంజినీర్ని బదిలి చేస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎ.సతీష్ (బీజేపీ), మురళి(ఇండిపెండెంట్), రంజితా పండా(బీజేడీ), రామో నాయక్ (బీజేడీ) తదితరులు పాల్గొన్నారు. -
పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించండి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలోని మోహనా నియోజకవర్గంలో పాఠశాలల అభివృద్ధి జరగకపోవడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆర్.ఉదయగిరి సమితి చైర్మన్ లక్ష్మీనారాయణ సొబొరో అన్నారు. అందువలన పాఠశాలలను అభివృద్ధి చేయాలని కోరారు. గజపతి జిల్లా సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ 78వ సాధారణ మ్యానేజ్మెంట్ కమిటీ సమావేశం, 71వ ప్రాజెక్టుల స్థాయి కమిటీ సమావేశాలు స్థానిక జిల్లా పరిషత్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి విచ్చేయగా, కలెక్టర్ బిజయకుమార్ దాస్ అధ్యక్షత వహించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ, గిరిజనాభివృద్ధి ప్రత్యేక పథకాలు కింద రూ.1.49 కోట్ల నిధులు ఖర్చు చేయడం జరిగిందని ఐటీడీఏ అధికారి అంశుమాన్ మహాపాత్రో తెలియజేశారు. ముఖ్యమంత్రి ఎస్సీ, ఎస్టీ జీవికా మిషన్ ద్వారా ఐదు సమితి కేంద్రాలు మోహనా, ఆర్.ఉదయగిరి, నువాగడ, గుమ్మా, రాయఘడ సమితుల్లో 79 గ్రామ పంచాయతీ, 311 రెవెన్యూ గ్రామాలు, 143 జనజాతి జీవికా మిషన్స్ ఏర్పాటు చేయడం వలన 14,385 మంది గిరిజనులు ఆర్థికంగా నిలదొక్కుకున్నారని పేర్కొన్నారు. రామగిరి, మహేంద్రగడ, రాయఘడ సమితిల్లో ఎస్సీ, ఎస్టీ రెసిడెన్సియల్ పాఠశాలల్లో విద్యార్థుల సౌకర్యాలు మెరుగుపరచాలని రాయఘడ సమితి చైర్మన్ పూర్ణబాసి నాయక్, గుమ్మా సమితి అధ్యక్షురాలు సునేమీ మండళ్, మోహనా సమితి చైర్మన్ కున్నా మఝి తదితరులు కోరారు. ఏడేళ్ల తర్వాత సమావేశాలు సమావేశాల అనంతరం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి విలేకరులతో మాట్లాడుతూ ఏడేళ్ల తర్వాత ఐటీడీఏ సాధారణ కార్యవర్గ సమావేశాలు జరిగాయన్నారు. గిరిజన ప్రాంతాల్లోని రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస వసతులు లేక అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ విషయాన్ని పీఎం నరేంద్రమోదీ, సీఎం మోహన్చరణ్ల దృష్టికి తీసుకెళ్తానని తెలియజేశారు. సమావేశాల్లో నువాగడ సమితి అధ్యక్షురాలు మాలతీ ప్రధాన్, జిల్లా పరిషత్ సభ్యులు, జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
శ్రీమందిరంలో వనవాస సేవ
భువనేశ్వర్: శ్రీరామ నవమి ఉత్సవాలు పురస్కరించుకుని శ్రీక్షేత్రంలో వనవాస సేవ ఉత్సాహంగా జరుపుకున్నారు. ఏటా పవిత్ర చైత్ర శుక్ల ద్వాదశి నాడు ఈ సేవ నిర్వహిస్తారు. శ్రీరామ నవమి ఉత్సవాలతో పూరీ పట్టణంలో సాహి జాతర ప్రారంభమైంది. ఈ జాతరలో వీధి కళాకారులు కనులకు కట్టినట్లు శ్రీరామ వనవాసం వివరాలతో ప్రదర్శించిన బహిరంగ నాటక ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ సంప్రదాయం ప్రకారం వనవాస సేవ జరిపారు. ఽశ్రీజగన్నాథ వల్లభ మఠం ప్రాంగణంలో ఈ సేవ నిర్వహించారు. ధూపదీప సేవ అనంతరం శ్రీరాముడు, సీతాదేవి, లక్ష్మణుడు ఉత్సవమూర్తులను ఛాత్రఛాయలో ఘంటానాదం మధ్య పల్లకీలో ఊరేగింపుగా శ్రీజగన్నాథ వల్లభ మఠానికి తరలించారు. ఈ ప్రాంగణంలో ప్రత్యేక శయ్యపై ఉత్సవమూర్తులను ఆసీనపరచి వనవాస సేవ ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కండేశ్వర్ వీధి కళాకారుల బృందం శ్రీరామ వనవాసం వీధి నాటకం ప్రదర్శించారు. ఈ ప్రదర్శన ముగిసిన తర్వాత శీతల భోగ సేవ తదితర ఆచారాలతో ప్రత్యేక పూజాదులు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను శ్రీమందిరం దక్షిణ గృహానికి తరలించి యథాస్థానంలో పదిలపరచడంతో శ్రీరామ వనవాసం సేవ ముగిసింది. -
శ్రీక్షేత్రానికి దవనం మొక్కలు
కొరాపుట్: పూరీ క్షేత్రంలో జగన్నాథుడికి ఎంతో ప్రీతిపాత్రమైన దవనం మొక్కలను స్థానిక శబరి శ్రీక్షేత్రం నుంచి పూరీ ఆలయానికి బుధవారం పంపించారు. ఈ మొక్కలతో చేసిన దండలు ప్రతిరోజూ పూరిలో దేవ దేవుళ్లకి వేస్తారు. ఇవి సాధారణ వాతావరణంలో పెరగవు. అందువలన వీటిని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి పూరి క్షేత్రానికి దిగుమతి చేస్తారు. అయితే కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు వీటిని కొరాపుట్‌లో పెంచారు. అవి విస్తారంగా పెరగడంతో పూరీ క్షేత్రం నుంచి పండితులు వచ్చి పరిశీలించారు. వారు ఆమెదం తెలపడంతో పాటు తీసుకుని వెళ్లడానికి ప్రత్యేక వాహనం పంపించారు. దీంతో ఈ మెక్కలను తరలించారు. ఇకపై వీటిని విస్తారంగా పెంచాలని శబరి శ్రీక్షేత్ర కమిటీ నిర్ణయించింది. -
వస్త్ర వ్యాపారి అనుమానాస్పద మృతి
పొందూరు: మండల కేంద్రం పొందూరుకు చెందిన వస్త్ర వ్యాపారి ఉండ్రాళ్ల కిషోర్‌కుమార్(50) అనుమానాస్పదంగా మృతిచెందారు. బుధవారం ధర్మపురం గ్రామ సమీపంలోని బావిలో మృతదేహం తేలడంతో గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని బయటకు తీయగా పొందూరుకు చెందిన వస్త్ర వ్యాపారి కిషోర్‌గా గుర్తించారు. వెంటనే భార్య అనూషకు సమాచారం అందించారు. మంగళవారం రాత్రి ధర్మపురంలో బాకీలు వసూలు చేసేందుకు వెళ్లాడని, బావిలో పొరపాటున కాలుజారి పడిపోయి ఉంటారని అనూష ఫిర్యాదులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వి.సత్యనారాయణ చెప్పారు. మృతదేహాన్ని బయటకు తీసి శవపంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కిషోర్‌కుమార్‌కు భార్య అనూష, కుమారుడు శ్రీనిత్, కుమార్తె శ్రీయ ఉన్నారు. కాగా, పొందూరులో దశాబ్దాలుగా కిషోర్ కుటుంబీకులు వస్త్రవ్యాపారం చేస్తున్నారు. వ్యాపారంలో ఒడిదుడుకులు రావడం, కస్టమర్లకు ఎక్కువగా అరువులు ఇవ్వడం, దీనికి తోడు బ్యాంకు రుణం ఉండటంతో కొన్నాళ్లుగా ఆందోళన చెందుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పొందూరులో సుపరిచితుడైన కిషోర్ మృతితో విషాద ఛాయలు అలముకున్నాయి. -
డివైడర్ని ఢీకొన్న ట్రక్కు
భువనేశ్వర్: స్థానిక పొలాసుణి ప్రాంతంలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఒకేసారి 3 ట్రక్కులు ఒక దాని వెంబడి మరొకటి ఢీకొన్నాయి. ఒక ట్రక్కు డివైడర్‌ను ఢీకొట్టిన తర్వాత వెనుక నుంచి మరో 2 ట్రక్కులు ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒక ట్రక్కు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతడిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్య వర్గాల సమాచారం. నాటు తుపాకీతో వేటగాడు అరెస్టు మల్కన్‌గిరి: జిల్లాలోని కోరుకొండ సమితి కొయిలిపరి గ్రామానికి చెందిన శుక్ర మడ్కమి అనే వ్యక్తి రెండు నాటు తుపాకీలతో అడవి జంతువుల కోసం సంచరిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం కోరుకొండ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ వ్యక్తి అడవి నుంచి బయటకు వస్తూ కనిపించాడు. దీంతో వెంటనే పోలీసులు అరెస్టు చేసి కోరుకొండ ఐఐసీ హిమాంశు శంకర్ బారిక్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ విచారించగా జంతువులను వేటాడేందుకు వెళ్లినట్లు అంగీకరించాడు. దీంతో అతడిపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.ఇంటి పైనుంచి జారిపడి వృద్ధుడి మృతి రాయగడ: ఇంటి పైనుంచి జారిపడిన ఒక వృద్ధుడు మృతి చెందాడు. జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి కొంధొకతిపాడు పంచాయతీ లోని రింజాబడి గ్రామంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతి చెందిన వ్యక్తి గంగారావు కడ్రక(50)గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీ సులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంటిపై ఆరబెట్టిన బట్టలను తీస్తున్న సమయంలో కాలుజారి కిందపడిపోయాడు. దీంతో తీవ్రగాయాలకు గురైన అతడిని కల్యాణసింగుపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి పేరుతో యువతికి మోసం మల్కన్‌గిరి: జిల్లాలోని చిత్రకొండ సమితి అంబిలిబేడ గ్రామానికి చెందిన రామ్‌దాస్ అనే యువకుడిని బలిమెల పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సదరు యువకుడు బలిమెల పోలీసుస్టేషన్ పరిధి రస్బేడ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా దగ్గరయ్యాడు. అయితే ఇటీవల ఇంకో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయం తెలియడంతో రాస్బేడ గ్రామానికి చెందిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని స్వగ్రామంలో బుధవారం అరెస్టు చేసినట్లు ఐఐసీ ధీరజ్ పట్నాయక్ వెల్లడించారు. సమాచార కమిషనర్‌గా మనోజ్ కుమార్ భువనేశ్వర్: విరామ ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ పరిడా ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయనతో పాటు మాజీ ఐఏఎస్ అధికారులు ప్రాణ బిందు ఆచార్య, పబిత్ర మండల్, రాష్ట్ర హైకోర్టు న్యాయవాది కల్పనా పట్నాయక్ సమాచార కమిషనర్లుగా నియమితులయ్యారు. -
దివ్యాంగులకు వీల్చైర్లు పంపిణీ
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లాలోని డాబుగాం సమితి కార్యాలయంలో దివ్యాంగులకు ఉచిత బ్యాటరీ వీల్చైర్లను బుధవారం పంపిణీ చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ, ప్రాథమిక విద్యామంత్రి నిత్యానంద గొండో 60 మంది దివ్యాంగులకు అందజేశారు. అలాగే వినికిడి యంత్రాలు, చార్జింగ్ మెషిన్లు, సెల్ఫోన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నబరంగ్‌పూర్ ఎంపీ బలభద్ర మజ్జి, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు కుంజదాస్ తదితరులు పాల్గొన్నారు. అన్నదానం రాయగడ: మజ్జిగౌరి అమ్మవారి చైత్రోత్సవాల ను పురస్కరించుకొని స్థానిక మార్వాడీ సమాజం అన్నదాన కార్యక్రమాన్ని మందిరం ప్రాంగణంలో బుధవారం నిర్వహించింది. సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ ఏడాది అమ్మవారి చైత్రోత్సవాల్లో సుమారు 1,500 మందికి అన్న దానం చేశామని, ఇటువంటి తరహా సేవా కార్యక్రమాలను మరిన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలి జయపురం: జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని అమలు చేయాలని ఎస్‌యూజే కొరాపుట్ జిల్లా ప్రతినిధులు, కొరాపుట్ జిల్లా పాత్రికేయుల సంఘ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు జయపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీఎం మోహన్‌చరణ్‌ను ఉద్దేశించిన వినతిపత్రం బుధవారం అందజేశారు. ఇటీవల పూరీలో జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో ఎస్‌యూజే జిల్లా అధ్యక్షుడు తరుణ కుమార్ మహాపాత్రో, సహాయ కార్యదర్శి రాజేంద్ర సాహు, సలహాదారు నృసింహ చౌదరి, ఎస్.వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మహిళా ప్రాంగణంలో కలకలం ఎచ్చెర్ల క్యాంపస్: ఎచ్చెర్ల మండల కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మహిళా ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్.టి.ఆర్ నైపుణ్య అభివృద్ధి శిక్షణ కేంద్రం (సీ్త్ర సదన్ మహిళా ప్రాంగణం)లో ఇద్దరు యువతులు అదృశ్యం కావడం కలకలంగా మారింది. బ్యూటీషియన్ శిక్షణ పొందుతున్న 21 ఏళ్ల యువతి, 18 ఏళ్ల యువతి మంగళం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో లంచ్ బ్రేక్‌కు బయటకు వెళ్లి రాత్రి అయినా తిరిగి రాలేదు. దీంతో సీ్త్రసదన్ ఇన్చార్జ్ సనపల సత్యవతి ఇన్చార్జ్ మహిళా ప్రాంగణం మేనేజర్ పి.విమల సూచన మేరకు ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. మంగళవారం రాత్రి పోలీసులు పోలీస్ కేసు నమోదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు 6309990816, 63099 90816 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ ఇద్దరు యువతులదీ విశాఖపట్నం కాగా, ఇద్దరికీ తల్లిదండ్రులు లేరు. ఇద్దరు అనాధులే. ఇందులో ఓ యువతికి దూరపు బంధువులు ఉన్నారు. విశాఖపట్నం సీ్త్రసదన్లో బ్యూటీషియన్ కోర్సు లేకపోవటంతో వీరు ఎచ్చెర్ల కేంద్రంలో చేరి ఈ నెల ఒకటో తేదీ నుంచి శిక్షణ పొందుతున్నారు. శిక్షణ కాలం రెండు నెలలు. వీరిద్దరు స్నేహితులు. ఇద్దరి వద్దా ఫోన్లు లేదు. తోటి అభ్యర్థుల వద్ద ఫోన్ తీసుకుని హైదరాబాద్, విశాఖపట్నం ప్రాంతాల్లో ఉంటున్న ఇద్దరు వ్యక్తులతో తరచూ మాట్లాడుతున్నట్లు తెలిసింది. ఆ ఫోన్ నంబర్లు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తున్నట్లు సమాచారం. ఇద్దరూ మేజర్లు కావటంతో ప్రేమ వ్యవహారమా? ఇతర కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత కారణాలు ఉంటే స్థానిక అధికారుల వద్ద అనుమతి తీసుకొని వెళ్లవచ్చు. అలాకాకుండా సిబ్బంది కళ్లుగప్పి వెళ్లిపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. బాలిక ఆత్మహత్య కవిటి: మండలంలోని కె.కపాసుకుద్దికి చెందిన సిందిరి అపూర్వ(13) అనే బాలిక మంగళవా రం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. కవిటి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అపూ ర్వ కొంతకాలంగా తరచూ అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో మనస్తాపం చెంది మంగళవారం సాయంత్రం 6 గంటల సమ యంలో ఇంట్లోనే ఉరి వేసుకుంది. ఈ మరణంపై తమకు ఎటువంటి అనుమానాలు లేవని మృతురాలి తల్లి హేమలత పోలీసులకు తెలియజేసినట్లు ఎస్ఐ వి.రవివర్మ తెలిపారు. ఈ మేరకు కవిటి పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతదేహానికి బుధవారం ఉదయం సోంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసి అప్పగించారు. -
‘అక్రమంగా గుగ్గిలం చెట్లు తరలింపు’
జయపురం: సబ్ డివిజన్ పరిధి బొరిగుమ్మ సమితి బొడొనాయికగుడ అటవీ ప్రాంతంలో విలువైన గుగ్గిలం చెట్లను కొంతమంది ఇతర రాష్ట్రాలకు అమ్మేందుకు తరలిస్తున్నారని ఆ ప్రాంత అటవీ సురక్ష కమిటీ కార్యదర్శి గోపీనాథ్ గదబ ఆరోపించారు. ఈ మేరకు జయపురం అటవీ డివిజన్ అధికారి ప్రతాప్ బెహరాను బుధవారం కలిసి ఫిర్యాదు చేశారు. కొద్ది రోజుల క్రితం ఆరుగురు వ్యక్తులు 5 విలువైన గుగ్గిలం చెట్లను కొట్టి అమ్మేశారని ఆరోపించారు. ఘటనపై దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. ఫిర్యాదుదారుల్లో నకుల్ గదబ, మనోహర గదబ, లక్ష్మణ గదబ, సోను గదబ తదితరులు పాల్గొన్నారు. -
రాధా కృష్ణుల విగ్రహ ప్రతిష్టాపన
భువనేశ్వర్: ఖుర్దారోడ్ అకౌంట్సు కాలనీ బాలాజీ మందిర సముదాయం అంచెలంచెలుగా బహుళ దేవుళ్ల ప్రాంగణంగా విస్తరిస్తోంది. ఈ దేవస్థానంలో ప్రధాన ఆరాధ్య దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య పూజలు అందుకుంటున్నాడు. కొత్తగా ఈ సముదాయంలో రాధా కృష్ణుల విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిష్ట మహోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవంలో భాగంగా నూతన విగ్రహాలకు దాన్యాధివాసం, జలాధివాసం, క్షీరాధివాసం, పుష్పాధివాసం, షయాధివాసం కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ ఉద యం రాధాకృష్ణుల విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించేందుకు భారీ సన్నాహాలు చేస్తున్నట్లు కార్యదర్శి జేకే రావు తెలిపారు. -
ఆనంద్ బజార్లో గాయపడిన పోటు కార్మికుడు
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ మందిరం సముదాయం ఆనంద బజార్ ప్రాంగణంలో పోటు కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం ఈ విచారకర సంఘటన చోటు చేసుకుంది. బాధిత కార్మికుడు బలభద్ర ప్రధాన్‌గా గుర్తించారు. ఆయన చంద్రపూర్ పోలీస్ ఠాణా పరిధి తొలొజొంఘొ గ్రామస్తుడు. మూల విరాట్లకు నివేదించిన మహా ప్రసాదాలను నెత్తిన మోసుకుని ఆనంద్ బజార్ ప్రాంగణానికి తరలిస్తుండగా వేడి పప్పు, అన్నం అతని శరీరంపై ఒలగడంతో గాయపడ్డాడు. తక్షణమే చికిత్స కోసం పూరీ జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చేర్చారు. ఆనంద బజార్ ప్రాంగణంలో నిత్యం స్వామి వారికి నివేదించిన మహా ప్రసాదాలను భక్తులకు విక్రయిస్తారు. వంతెన కింద మంటలు భువనేశ్వర్: ఖుర్దా రఘునాథ్‌పూర్ వంతెన కింద మంటలు చెలరేగాయి. సుమారు 2 గంటలు పైబడి మంటలు నిరవధికంగా రగిలాయి. స్థానిక చంద్రశేఖర్ పూర్ అగ్ని మాపక దళానికి చెందిన 2 యూనిట్ల యంత్రాంగం నిర్విరామంగా శ్రమించి మంటలు నివారించింది. ఈ సంఘటనతో నందన్‌కానన్ రోడ్డుకు ఒక వైపున వాహనాల రవాణా స్తంభించి పోయింది. ఈ పరిసరాల్లో 33 కేవీ విద్యుత్ లైన్ ఉండడంతో దీని పరిధిలో విద్యుత్ సరఫరాని తాత్కాలికంగా నిలిపివేశారు. భద్రతా చర్యలో భాగంగా ఈ మేరకు నిర్ణయించినట్లు విద్యుత్ పంపిణీ సంస్థ ప్రకటించింది. వంతెన కింద చెత్త కుప్పకు ఎవరో నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగినట్లు భావిస్తున్నారు. ఏఐసీసీ సమావేశాలకు వెళ్లిన కాంగ్రెస్ నాయకులు కొరాపుట్: గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్‌లో జరగనున్న ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్రత్యేక సమావేశాలకు కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల నుంచి కాంగ్రెస్ నాయకులు తరలివెళ్లారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి అసెంబ్లీ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్న రాష్ట్ర సీఎల్పి నాయకుడు రాంచంద్ర ఖడం ఏఐసీసీ సభా వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడ కలహండి జిల్లాకు చెందిన రాష్ట్ర ప్రదేశ్‌కాంగ్రెస్ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్, పార్టీ రాష్ట్ర పరిశీలకుడు అజయ్ కుమార్ లల్లూ తో భేటీ అయ్యారు. నబరంగ్‌పూర్ జిల్లాకి చెందిన యువ ఏఐసీసీ సభ్యురాలు మానషా త్రిపాఠి తన బృందంతో అహ్మదాబాద్‌లోని సీబ్ల్యూసీ సమావేశాలు జరిగే సర్దార్ వల్లబాయ్ పటేల్ మెమోరియర్ కేంద్రానికి చేరుకున్నారు. అడవులను కాపాడాలని ప్రచారం పర్లాకిమిడి: అడవులను కాపాడాలని సంబంధిత అధికారులు ప్రచారం చేస్తున్నారు. అటవీ ప్రాంతంలో నిప్పు పెట్టొద్దని మోహానా అటవీ రేంజ్ అధికారులు గజపతి జిల్లా మోహానా బ్లాక్ నలాఘాట్ సెక్షన్ మండిమర వారపు సంతలో మంగళవారం విస్తృతంగా ప్రచారం చేశారు. జిల్లాలో మోహానా బ్లాక్‌లో అటవీ ప్రాంతాల్లో నిప్పు రాజుకున్న ప్రాంతాలను శాటిలైట్ ద్వారా గుర్తించి మంటలను అదుపుచేశారు. అటవీ ప్రాంతంలో నిప్పు పెట్టడం వల్ల అనేక వృక్షాలు, వన్యప్రాణులు నాశనం అవుతాయని, పర్యావరణానికి ముప్పు సంభవిస్తుందని మంద్రబజు, నలాఘాట్, మండిమర గ్రామాల్లో అటవీ శాఖ బృందం ఫారెస్టు ఫైర్ సచేతన కార్యక్రమం చేపట్టారు. అలరించిన కూచిపూడి నృత్యం పర్లాకిమిడి: శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా స్థానిక మార్కెట్ జంక్షన్ కోమటివీధి వద్ద రామాలయం ఆవరణలో కూచిపూడి నృత్యాలను ప్రదర్శించారు. కళాకారులు రేఖానా వీధికి చెందిన వేణిషా కూచిపూడి ఆర్ట్ అకాడమికి చెందిన వేణిషా పట్నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అందవరపు శ్రీనివాసరావు, పైడి శెట్టి నగేష్ తదితరులు సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించారు. అలాగే సింకివీధిలోని రామాలయం వద్ద సీతారాముల కల్యాణాన్ని ఘనంగా జరిపారు. -
కనువిందుగా సీతారాముల కల్యాణ మహోత్సవం
జయపురం: స్థానిక జమాల్ లైన్‌లోని శ్రీరామ మందిరంలో చైత్రమాస శుద్ధ ఏకాదశి సందర్భంగా సీతారాముల కల్యాణాన్ని మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వారణాశి సత్యనారాయణ దంపతులు, సుంకరి ఈశ్వరరావు దంపతులు సంయుక్తంగా కల్యాణ మహోత్సవాన్ని జరిపించారు. మరో ఎనిమిది మంది దంపతులు పాల్గొన్నారు. ముందుగా ముత్తైదువులు పసుపుదంచారు. ఆలయ అర్చకులు ఉలిమిరి నాగేశ్వరరావు, పట్టణ పురోహితులు గన్నవరపు కోటీ వరప్రసాద్‌లు సంప్రదాయబద్ధంగా కల్యాణాన్ని జరిపించగా.. భారీగా హాజరైన భక్తులు ఈ సుందర దృశ్యాన్ని కనులారా వీక్షించి తరించిపోయారు. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షులు గోరపల్లి నాగరాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జమాల్ లైన్ శ్రీరామ నవమి ఉత్సవాలకు వందేళ్ల చరిత్ర ఉందన్నారు. వందేళ్ల కిందట పట్టణంలో తెలుగు పెద్దలు శ్రీరామ నవమి సందర్భంగా కల్యాణ మహోత్సవాలు ప్రారంభించారని.. ఆనాటి నుంచి ఏటా దీన్ని కొనసాగిస్తున్నామన్నారు. ఉత్సవాలకు పట్టణంలోని అన్ని వర్గాల ప్రజలు సహకరిస్తున్నారని.. వారందరికీ శ్రీరామ మందిర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. -
సమీకృత వ్యవసాయం ద్వారా అధిక లాభాలు
పర్లాకిమిడి: సమీకృత వ్యవసాయం ద్వారా రైతులు ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని సెంచూరియన్ వర్సిటీ ఎంఎస్ స్వామినాథన్ అగ్రికల్చర్ కళాశాల డీన్ సత్యప్రకాష్ నంద అన్నారు. వ్యవసాయ విద్యార్థులు ఆధునిక యంత్రాలు, మెలకువలు తెలుసుకుని వ్యవసాయ క్షేత్రం, ల్యాబ్‌కు మధ్య వ్యత్యాసం గ్రహించాలని అన్నారు. స్థానిక సెంచూరియన్ వర్సిటీలో మూడో ఉత్కళ కృషి మేళా 2025 మంగళవారంతో ముగిసింది. ఈ ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా ఒడిషా మిల్లెట్ క్వీన్ డాక్టర్ రైమతీ ఘురియా, సంజీవనీ ఎన్.జి.ఓ.(ఆంధ్రప్రదేశ్) దేవులు పచేరీ తదితరులు పాల్గొన్నారు. గుమ్మా సమితికి చెందిన గిరిజన మహిళలు తృణధాన్యాలు అయిన రాగులు, జొన్నలు, చోడి పంటల అనుభావాన్ని తెలియజేశారు. బీఎస్సీ (అగ్రి) విద్యార్థి దిలీప్ బరాల్ సంబల్పురి డ్యాన్స్ వేసి అందరినీ అలరించారు. రైస్ మేన్ ఆఫ్ ఒడిషా సుధాం సాహు, మయూర్భంజ్ నుంచి ప్రోగ్రెసివ్ ఫార్మర్ ప్రహ్లాద మహాంత, భూదేవి పాల్గొని వేదికపై మాట్లాడారు. వారిని సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య డి.ఎన్.రావు జ్ఞాపికతో సత్కరించారు. అనంతరం ఆయన వ్యవసాయ, పశుపాలన, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, డ్రోన్స్‌ను సందర్శించారు. -
మహిళా కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి
భువనేశ్వర్: పోలీసు బ్యారక్ లోపల మహిళా (యువతి) కానిస్టేబుల్ మృతి అనుమానాస్పదంగా మారుతోంది. మృతురాలిని యశోద దాస్‌గా గుర్తించారు. ఈమె స్వస్థలం రెముణా పోలీస్ ఠాణా పరిధిలోని మందొర్పూర్ గ్రామం. బాలాసోర్ జిల్లా పోలీసు బ్యారక్ లోపలి ప్రాంగణంలో మంగళవారం ఈ విషాద సంఘటన హృదయం కలచి వేసిందని తోటి సిబ్బంది విచారం వ్యక్తం చేశారు. తెల్లవారు జామున బ్యారక్ లోపల యశోద వేలాడుతూ ఉండటాన్ని తోటి కానిస్టేబుళ్లు గమనించారు. వారు ఆమెను రక్షించడానికి సమయం వృధా చేయకుండా ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్యులు ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. మృతురాలి సోదరుడు టుటు దాస్ మాట్లాడుతూ .... పోలీసులు ఆమె ఫోన్, చాట్ వివరాలను పరిశీలించాలని అభ్యర్థించాడు. తన సోదరితో సంబంధం ఉన్న వారి కారణంగా ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని భోరుమన్నాడు. ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని పోలీసులు ప్రకటించారు. బాలాసోర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనపై విచారణ జరుగుతోందని, ప్రారంభ పరిశోధనల ప్రకారం ఈ విషాదం వెనుక వ్యక్తిగత కారణాన్ని సూచిస్తున్నాయని ఆయన ధ్రువీకరించారు. -
భక్తిశ్రద్ధలతో ఏకాదశి పూజలు
రాయగడ: స్థానిక బాలాజీ నగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో చైత్ర ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యుల ఆధ్వర్యంలో పూజలు వైభవంగా జరిగాయి. కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జనావాసాల్లోకి జింక పర్లాకిమిడి: తాగునీటి వనరులు లేకపోవడంతో జంతువులు జనవాసాల్లోకి వస్తున్నాయి. మహేంద్ర తనయ నదిలో నీరు అడుగంటిపోవడంతో సోమవారం మధ్యాహ్నం ఓ కణితి (సాంబారు జింక) తాగునీటి కోసం గుసానిసమితి అభివృద్ధి అధికారి గౌరచంద్ర పట్నాయిక్ నివాసానికి వచ్చింది. ఆయన వెంటనే తా అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సిబ్బంది వచ్చి జింకను అడవుల్లో సురక్షితంగా వదిలిపెట్టారు. రాయగడలో భారీ వర్షం రాయగడ: జిల్లాలో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కళ్యాణసింగుపూర్ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా గల చెట్లు విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రాయగడ పట్టణంలో సుమారు గంటన్నర సమయం కుండపోత వర్షం కురిసింది. స్థానిక రైతుల కాలనీ, ఆర్కే నగర్, కస్తూరీ నగర్ తదితర ప్రాంతాల్లో చెట్టు కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడిపొవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపొయింది. -
అలరించిన షణ్ముఖ శర్మ ప్రవచనాలు
పర్లాకిమిడి: కాశీనగర్ సమితి రాణిపేట గ్రామంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సామవేదం షణ్ముఖశర్మచే మహాభారతంలో భీష్మాచారుని బోధ ప్రవచనములు సోమవారం నుంచి చెబుతున్నారు. మహాభారతంలో లేనిది ఎక్కడా లేదని, ప్రపంచమంతా ఉన్నది ఈ మహాభారతంలోనే.. అని ఆయన తన ప్రవచనాలలో అన్నారు. దేబాబ్రతుడు తదనంతరం తన తల్లి గంగ వద్ద కురువంశం రక్షిస్తానని మాట ఇచ్చిన మేరకు ప్రతిజ్ఞ చేయడంతో భీష్మునిగా పేరుగాంచాడని అన్నారు. పర్లాకిమిడిలో క్రిష్ణచంద్ర గజపతి కళాశాలలో ఎంఏ తెలుగు విద్యాభ్యాసం చేసిన సామవేదం షణ్ముఖ శర్మ అందరికీ సుపరిచితుడు. ఆయన తండ్రి కీ.శే.సామవేదం రామమూర్తి శర్మ తెలుగు పండిట్‌గా పనిచేస్తూ ప్రవచనములు చెబుతుండేవారు. తెలుగు ీచిత్ర సీమలో అనేక సినిమాలకు పాటల రచయితగా కూడా కొంతకాలం పనిచేశారు. అనతి కాలంలో తెలుగు చిత్రసీమకు స్వస్తి పలికిన సామవేదం షణ్ముఖ శర్మ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రవచనములు చెబుతూ ఎలలేని ఖ్యాతిని ఆర్జించారు. ఈ కార్యక్రమం ధన్వంతరి చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 11వతేదీ వరకూ జరుగుతుందని చిరంజీవులు తెలియజేశారు. -
అండర్–15 ఫుట్‌బాల్ పోటీలు
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాలో సీఎం ట్రోఫీ అండర్–15 ఫుట్ బాల్ పోటీలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. కొరాపుట్ జిల్లా కేంద్రంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో లాంఛనంగా ప్రారంభించారు. కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో, కొట్‌పాడ్ ఎమ్మెల్యే రుపుధర్ బోత్రలు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. పోటీలు ఈ నెల 14వ తేదీ వరకు కొనసాగుతాయని నిర్వాహకులు ప్రకటించారు. మరో వైపు నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ పట్టణంలో సీఎం ట్రోఫీ ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఇందులో 15 ఏళ్లలోపు బాలురు పాల్గొంటారని నిర్వాహకులు ప్రకటించారు. ఈ నెల 15వ తేదీ వరకు పోటీలు జరగనున్నాయి. కార్యక్రమంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ, విద్యాశాఖ మంత్రి నిత్యానంద గొండో, జిల్లా కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో, ఎంపీ బలబద్ర మజ్జి, ఎంఎల్ఎలు గౌరీ శంకర్ మజ్జి(నబరంగ్‌పూర్), నర్సింగ్ బోత్ర(జొరిగాం) పాల్గొన్నారు. హాజరైన అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహం చూపిన క్రీడాకారులు -
సందడిగా ఆటల పోటీలు
పర్లాకిమిడి: స్థానిక మహారాజా బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు మంగళవారం శ్రీకృష్ణచంద్రగజపతి కళాశాల మైదానంలో పీఎం శ్రీ వార్షిక ఆటల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో సీనియర్, జూనియర్ విభాగాలలో వందమీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, హై జంప్, షార్ట్‌పుట్, కబాడీ, మ్యూజికల్ ఛైర్, స్లోసైకిల్ రేస్, స్కిప్పింగ్ లెమన్ రేస్ పోటీలను శిక్షకులు నిర్వహించారు. ఈ పీఎం శ్రీ వార్షిక పోటీలను ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు యస్.కిరణ్ ప్రారంభించగా, శిక్షకులు మహేంద్ర బోడోముండి, ఇతర శిక్షాయిత్రిలు పాల్గొన్నారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో విజేతలకు పాఠశాల వార్షిక దినోత్సవంలో అందజేస్తామని హెచ్ఎం కిరణ్ తెలియజేశారు. -
నీలకంఠేశ్వర ఆలయంలో సామూహిక ఉపనయనం
భువనేశ్వర్: స్థానిక శ్రీ నీలకంఠేశ్వర్ ఆలయ ప్రాంగణంలో సామూహిక ఉపనయనం నిర్వహించారు. వేద పారాయణంతో ప్రారంభించి, చతుర్విధ కర్మలు, బిక్ష స్వీకరణ వంటి సంప్రదాయ ఆచార వ్యవహారాలతో ఉపనయనం సామూహికంగా నిర్వహించారు. అనంతరం బ్రహ్మచారి సన్యాసులు ఊరేగింపుగా వెళ్లి లింగరాజుని దర్శనం చేసుకున్నారు. గత 14 ఏళ్లుగా నిరవధికంగా ఈ కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది భువనేశ్వర్, పరిసర ప్రాంతాలతో పాటు కటక్, జాజ్‌పూర్, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి మొత్తం 16 మంది బ్రాహ్మణ పిల్లలు సామూహిక ఉపనయనంలో పాల్గొన్నారు. -
సద్వినియోగం చేసుకోవాలి
రాయగడ: ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగా ఉండే వయో వృద్ధులను ప్రభుత్వం తీర్థయాత్రలకు తీసుకెళ్తోందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఫరూల్ పట్వారీ సూచించారు. మంగళవారం రాయగడ నుంచి 775 మంది వయోవృద్ధులు అయోధ్య, వారణాసి వంటి పుణ్యక్షేత్రాలకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో స్థానిక రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రైలును ఆమె పచ్చజెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో రాయగడ ఎమ్మెల్యే అప్పలస్వామి కడ్రక, రాయగడ డీఆర్ఎం అమితాబ్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు. -
సత్తిగూడ జలాశయంలోకి 54వేల రొయ్యపిల్లలు
మల్కన్‌గిరి : జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్తిగూడ జలాశయంలో మంగళవారం జిల్లా మత్స్యశాఖ వారు 54వేల రొయ్యపిల్లలను విడుదల చేశారు. ఇవి సక్రమంగా పెరిగితే కిలో రూ.500 వరకు ధర పలుకుతుందని తెలిపారు. చేపల కంటే ఇవి ధర ఎక్కువ పలుకుతాయని మత్స్యశాఖాధికారి సుశాంతొ గౌడ్ తెలిపారు. అలాగే జలాశయంలోకి మరికొన్ని నాటు పడవలు మంజూరు చేశారు. గత నెలలో కూడా చిత్రకొండ జలాశయంలో కూడా ఇలాగే రొయ్య పిల్లలు వదిలారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ ఏఎఫ్ఓ ముఖేష్ మాఝి, మనోజ్ కుమార్ జాన తదితరులు పాల్గొన్నారు. -
బుధవారం శ్రీ 9 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
● ప్రారంభమైన మజ్జిగౌరి వార్షిక ఉత్సవాలు ● సునాబేసొలో అమ్మవారి దర్శనంవైభవం.. చైత్రోత్సవంరాయగడ: మజ్జిగౌరి అమ్మవారి వార్షిక చైత్రోత్సవాలు మంగళవారం నుంచి ప్రాంభమయ్యాయి. స్థానిక జంఝావతి నది నుంచి ఆలయ కమిటీ అధ్యక్షుడు రాయిసింగి బిడిక, సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, పెద్దిన వాసు, వడ్డాది శ్రీనివాస్‌రావుల దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించి, తీసుకొచ్చిన శుద్ధ జలాలను మందిరంలో ఉంచడంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. సాంప్రదాయబద్ధంగా ఉదయం సూర్య ఆవాహన పూజలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. గంజాం జిల్లా కవిసూర్యనగర్ నుంచి వచ్చిన ప్రత్యేక పూజారుల బృందం ఆధ్వర్యంలో ఐదు రోజులు పాటు పూజా కార్యక్రమాలు కొనసాగుతాయి. సునాబేసోలో అమ్మవారు చైత్రోత్సవాలను పురస్కరించుకొని అమ్మవారిని బంగారు ఆభరణాలతో అలంకరించారు. దీనినే సునాబేసో అంటారు. సోమవారం అర్థరాత్రి ఈ అలంకరణ కార్యక్రమాలను ఆలయ ప్రధాన పూజారులు చంద్రశేఖర్ బెరుకొ, బబులా బెరుకొలు నిర్వహించడంతో మంగళవారం నుంచి అమ్మవారు సునేబేసోలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల ఐదు రోజులూ అమ్మవారు సునాబేసోలోనే భక్తులకు దర్శనం ఇస్తారు. మంగళవారం కావడంతో పొరుగు రాష్ట్రాలకు చెందిన ఆంధ్రప్రదేశ్, ఇటు ఛత్తీస్గడ్, మధ్యప్రదేశ్‌కు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి దర్శనానికి బాలురుతీరారు. మజ్జిగ వితరణ ఉత్సవాల సందర్భంగా భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో నిర్వాహక కమిటీ సభ్యులు ఉచితంగా భోజన సౌకర్యాలతో పాటు మజ్జిగ, ప్రసాదాలు వితరణ చేస్తారు. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన మరమరాలతో తయారు చేసే ప్రసాదాలను సమర్పించడం ఇక్కడి ప్రజల ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో ప్రత్యేకంగా వీటిని మహిళలు సమర్పిస్తారు.ప్రదీప్ కుమార్ జెనాతో ఓఈఆర్‌సీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరిబాబు కంభంపాటి ఓఈఆర్‌సీ చైర్మన్‌కు గవర్నర్ అభినందనలున్యూస్రీల్నేటి నుంచి ఘటాల ఊరేగింపు అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలు బుధవారం నుంచి పట్టణంలో ఊరేగిస్తారు. మంగళవారం రాత్రి పూజారులు అమ్మవారి ఉత్సవాలకు సంబంధించిన పాదాలను తీసుకొచ్చి గర్భగుడిలో నిలుపుతారు. అనంతరం వాటిని గర్భగుడి సమీపంలోని వేరే గదిలో భక్తుల సందర్శనం కోసం ఉంచుతారు. అదేవిధంగా అమ్మవారి ప్రతిరూపాలైన ఘటాలను అదే ప్రాంతంలో ఉంచి ప్రత్యేకంగా పూజిస్తారు. -
తెలుగు ఉపాధ్యాయుడు మృతికి సంతాపం
జయపురం: జయపురంలో ప్రముఖ తెలుగు ఉపాధ్యాయులు, పట్టణంలో అన్ని భాషల ప్రజలకు చిరపరిచితులైన ఎ.ప్రసాదరావు మాస్టార్ కన్నుమూశారు. ఈయన మరణంతో పట్టణంలో విషాదఛాయలు అలముకున్నాయి. జయపురంలో ఆబాల గోపాలం వరకు గేష్ మాస్టారుగా పిలువబడే ప్రసాదరావు (86) పట్టణంలోని తన నివాసంలో సోమవారం మరణించారు. ఆయన మృతి సమాచారం తెలుసుకున్న అభిమానులు, ప్రముఖులు వచ్చి మృతదేహాన్ని దర్శించుకొని నివాళులర్పించారు. ఆయన ఉపాధ్యాయ ఉద్యోగం నుంచి రిటారైన తరువాత గ్యాస్ పొయ్యిలు మరమ్మతులు చేయటం ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన విద్యా ప్రగతికి అందించిన సేవలకు, మెచ్చి జయపురం ప్రజ్ఞాభారతి సంస్థతో పాటు పలు సంస్థలు ప్రసాదరావుకు సన్మానాలు చేసి గౌరవించాయి. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేశారు. బలిమెల సమస్యలపై సీఎంకు వినతి మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా చిత్రకొండ ఎమ్మెల్యే మంగుఖీలో మంగళవారం బలిమెల ప్రాంతాంలోని సమస్యలపై సీఎం మోహన్ చరణ్ మఝికి భువనేశ్వర్‌లో వినతి పత్రం అందజేశారు. బలిమెల నగరంలో ఈ –లైబ్రరీ నిర్మాణం, మినీ స్టేడియం వద్ద గ్యాలరీ నిర్మాణం గురించి వివరించారు. త్రుటిలో తప్పిన ప్రమాదం రాయగడ: జిల్లాలోని కల్యాణ సింగుపూర్ సమితి పరిధి శాంతినగర్ వద్ద సోమవారం బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. కల్యాణ సింగుపూర్ నుంచి బిసంకటక్, మునిగుడ వైపు ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు శాంతినగర్ మలుపు వద్ద ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి చెట్టుకు బలంగా ఢీకొంది. దీంతో బస్సు ముందరిభాగం నుజ్జునుజ్జయ్యింది. బస్సులో 56 మంది ప్రయాణిస్తున్నారు. డ్రైవర్ చాకచక్యంతో వ్యవహరించడంతో ఎవరికీ ఎటువంటి గాయాలవ్వలేదు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి కంగుర్‌కొండ పంచాయతీ ఎం.వి.24 గ్రామం వద్ద మంగళవారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. కలిమెల సమితికి చెందిన సహిల్ కబిరేష్ (36) బైక్‌పై కలిమెల నుంచి మల్కన్‌గిరి వైపు వస్తుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి సహిల్ కిం రాళ్లపై పడిపోయాడు. గమనించిన స్థానికులు మల్కన్‌గిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేస్తుండగానే మృతి చెందాడు. ప్రమాద సమాచారాన్ని కలిమెల పోలీసులకు ఇవ్వగా.. ఐఐసీ చంద్రకాంత్ మల్కన్‌గిరి చేరుకొని మృతుని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించారు. కేసు నమోద్ చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించామన్నారు. -
వర్కింగ్ ఉమెన్ ఉద్యోగుల భవనం ప్రారంభం
పర్లాకిమిడి: స్థానిక జిల్లా కలెక్టరేట్లో వర్కింగ్ మహిళా ఉద్యోగుల పిల్లల్ని (0 నుంచి 3 వయస్సు) చేరదీసి వారిని లాలించడానికి, వారి సురక్షా కోసం ‘కలికా’ భవనాన్ని కలెక్టర్ బిజయకుమార్ దాస్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌వో కె.నాగరాజు, డీఆర్డీఏ ముఖ్యకార్యనిర్వాహణాధికారి శంకర కెరకెటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అంశుమాన్ మహాపాత్రో, జిల్లాసామాజిక సంక్షేమ శాఖ అధికారిని మనోరమా దేవి, డీసీపీయూ అరుణ్ కుమార్ పాల్గొన్నారు. కలికా భవనంలో పిల్లల్ని చూస్తున్న కలెక్టర్ -
సేంద్రియ వ్యవసాయం ద్వారా స్థిరమైన అభివృద్ధి
పర్లాకిమిడి: గజపతి జిల్లాలో సేంద్రియ వ్యవసాయం పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని పర్లాకిమిడి ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి అన్నారు. ఆయన ఆర్.సీతాపురంలో మూడో ఉత్కళ కృషి మేళాను గౌరవ అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ కృషి మేళాకు ముఖ్యఅతిథిగా భారత వ్యవసాయ పరిశోధన మండళి (ఐకార్) డిప్యూటీ డైరక్టర్ (ఫిషరీస్) డా.జయకృష్ణ జెన్నా, జిల్లా కలెక్టర్ బిజయ కుమార్ దాస్, జిల్లా ముఖ్యఅటవీ శాఖ అధికారి కె.నాగరాజు, ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్.రావు, రిజిస్ట్రార్ అనితా పాత్రో తదితరులు హాజరయ్యారు. ఆచార్య డి.ఎన్.రావు మాట్లాడుతూ ముఖ్యంగా సన్నకారు రైతులు తక్కువ భూమిలో ఎక్కువ ఆదాయం పొందే పంటలు వేయాలని, 2030 కల్లా రైతుల ఆదాయం రెండింతలు కావాలన్నారు. అందుకు సూక్ష్మ వ్యవసాయ పద్ధతులు, ఆధునిక యంత్రాలు ఉపయోగించాలని అన్నారు. అనంతరం ముఖ్యఅతిధి ఐకార్ డిప్యూటీ డైరక్టర్ డాక్టర్ జె.కె జెన్నా మాట్లాడుతూ వాతావరణ మార్పుల వల్ల ఫిషరింగ్ రంగంలో ఆక్వా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీన్ని అధిగమించాలన్నారు. అనంతరం అతిథులు వ్యవసాయ మేళాలో ఏర్పాటుచేసిన 50 వివిధ ఎన్జీఓ సంస్థలు, ఫార్మర్ ప్రోడక్ట్సు కంపెనీలు, సెంచూరియన్ వ్యవసాయ, ఫిషరీస్, వెటర్నరీ స్టాల్స్‌ను సందర్శించారు. అనంతరం మేళాకు విచ్చేసిన కొందరి రైతులకు మట్టి పరీక్షల హెల్త్‌కార్డులు, ఉచిత ఆరోగ్య, నేత్ర పరీక్షలు చేశారు. అనంతరం గౌరవ అతిథులను సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షులు డి.ఎన్.రావు, మెమొంటో దుశ్శాలువతో సత్కరించారు. -
వక్ఫ్ సవరణ బిల్లు ఓటింగ్‌పై చర్యలు
భువనేశ్వర్: రాజ్య సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై బిజూ జనతా దళ్ వైఖరి పట్ల సందిగ్ధత తొలగడం లేదు. మరో వైపు ఈ బిల్లు సవరణకు సానుకూలంగా ఓటు వేసినట్లు ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సస్మిత్ పాత్రో బహిరంగ పరిచారు. ఆయనతో మరో ఒకరు, ఇద్దరు సభ్యులు కూడా సానుకూలంగా ఓటు వేసినట్లు వదంతులు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ బిల్లు సవరణకు వ్యతిరేకంగా ఓటు వేసిన బీజేడీ సభ్యుడు మున్నా ఖాన్ ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన సందర్భంగా బిజూ జనతా దళ్ అధ్యక్షుడు, మాజీ సీఎం నవీన్ పట్నాయక్‌తో ఆయన నివాసంలో సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా బలహీన వర్గాల ప్రతినిధి బృందం కూడా నవీన్ పట్నాయక్‌తో ముఖాముఖి తమ గోడుని వినిపించింది. వక్ఫ్ సవరణ బిల్లుపై సానుకూలంగా ఓటు వేసిన బీజేడీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఈ బృందం సభ్యులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నవీన్ పట్నాయక్‌కు తమ గోడుని వినిపిస్తూ... మీరు కేవలం రాజకీయ నాయకుడు కాదు. మీరు మాకు కుటుంబం.. మీరు న్యాయం చేయాలని బీజేడీ అధ్యక్షుడిని కలిసిన ప్రతినిఽధి బృందం అభ్యర్థించింది. వారి గోడుని ఆలకించిన నవీన్ పట్నాయక్ వక్ఫ్ బిల్లుపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌పై తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టడంలో ఏమాత్రం వెనుకంజ వేసేది లేదని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా బీజేడీ ఒక లౌకిక పార్టీ అని పేర్కొన్నారు. ఈ ఆదర్శంతో కంధమల్ అల్లర్ల తర్వాత రాష్ట్రంలో బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకుందని ప్రతిపక్ష నాయకుడు.. ప్రతినిధి బృందానికి గుర్తుచేశారు. మాజీ సీఎం నవీన్ పట్నాయక్ -
కొరాపుట్‌లో వినతుల స్వీకరణ
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో జిల్లాస్థాయి గ్రీవెన్స్‌సెల్ జరిగింది. కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో ప్రజా సమస్యలు పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 38 ఫిర్యాదుల వచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ మిహిర్ పండా, ఏడీఎం తపన్ కుమార్ కుంటీయా, డిప్యూటీ కలెక్టర్ ప్రకాష్ కుమార్ మిశ్రలు పాల్గొన్నారు. ఉచిత తీర్థ యాత్రల బస్సులు ప్రారంభం కొరాపుట్: ఉచిత తీర్థయాత్రల బస్సులు ప్రారంభమయ్యాయి. సోమవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మిషన్ శక్తి సమావేశ మందిరం వద్ద డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే ప్రతినిధి దేవదాస్ మహాంకుడోలు జెండా ఊపి ఈ యాత్ర ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 148 మంది వయోవృద్ధులను ఉచితంగా వారణాశి, అయోధ్య తీసుకెళ్లనున్నారు. అందుకోసం ఐదు బస్సులు ఏర్పాటు చేశారు. మొబైల్ దొంగల అరెస్టు జయపురం: కత్తితో బెదిరించి ఒక యువకుడి వద్ద మొబైల్‌తో పాటు డబ్బుని దోచుకున్న ఇద్దరు దొంగలను పట్టుకున్నట్లు బొయిపరిగుడ పోలీసు స్టేషన్ ఏఎస్ఐ బిజయ పట్నాయిక్ వెల్లడించారు. పోలీసు అధికారి పట్నాయిక్ వివరణ ప్రకారం ఈ నెల 4 వ తేదీన బొయిపరిగుడ పోలీసు స్టేషన్ పరిధి కాఠపొడ పంచాయితీ కెందుపుట్ గ్రామం భక్త కురుటియ(24) ఏదో పనిపై హతీపకన గ్రామానికి వెళ్తున్నాడు. బొదావటాల్ గ్రామ సమీపంలో ముగ్గురు యువకులు బైక్ పై వచ్చి అతడిని అడ్డగించి కత్తితో బెదిరించి అతడి వద్ద గల మొబైల్‌తో పాటు రూ.2 వేల నగదు దోచుకుపోయారు. ఈ సంఘటనపై బాధితుడు బొయిపరిగుడ పోలీసు స్టేషన్లో లిఖిత ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో లభించిన ఆధారాలు మేరకు ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. బొయిపరిగుడ సమితి కెందుగుడ పంచాయతీ దిశారిగుడ గ్రామం సురేష్ హరిజన్, మల్కనగిరి జిల్లా కోరుకొండ గ్రామం సత్య నాగ్‌లతో పాటు మరొకరు ఉన్నారని తెలిపారు. 377 లీటర్ల సారా స్వాధీనం రాయగడ: జిల్లాలోని రాయగడ, కళ్యాణసింగుపూర్ ప్రాంతాల్లో అబ్కారీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 377 లీటర్ల నాటుసారా, సారా తయారీకి వినియోగించే 4,400 లీటర్ల విప్ప ఊటను సోమవారం స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తలను అరెస్టర్ చేశారు. హతిఖొంబ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వ్యాన్‌లో 1800 కిలోల విప్ప పువ్వు బస్తాలు పట్టుబడ్డాయి. దీనికి సంబంధించి డ్రైవర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కలహండి నుంచి విప్పపువ్వు అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు గుర్తించిన అబ్కారీ శాఖ అధికారులు ఈ మేరకు వాహన తనఖీలను హతిఖంబ వద్ద నిర్వహించారు. -
ఫుట్‌బాల్ పోటీలు ప్రారంభం
పర్లాకిమిడి: సీఎం ట్రోఫీ కోసం గజపతి జిల్లా స్థాయి ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలను స్థానిక గజపతి స్టేడియంలో సోమవారం ఉదయం కలెక్టర్ బిజయకుమార్ దాస్ ప్రారంభించారు. ఈ పోటీలకు 15 ఏళ్ల లోపు విద్యార్థులు 176 మంది జిల్లాలో పలు ఉన్నత విద్యాలయాల నుంచి హాజరయ్యారు. ఈ పోటీలకు జిల్లా ఎస్పీ జితేంద్రనాథ్ పండా, క్రీడాధికారి కమలకాంత పండా, జిల్లా ముఖ్యశిక్షాధికారి మాయాధర్ సాహు, డి.సి.పి.యు అరుణ్‌కుమార్ త్రిపాఠి తదితరులు హాజరయ్యారు. విద్యార్థులు చదువుతోపాటు వివిధ క్రీడా పోటీల్లో పాల్గొనటం వల్ల ఆరోగ్యంగా ఉంటామన్నారు. ఈ ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ పోటీలు ఈ నెల 13వ తేదీ వరకు జరుగుతాయని జిల్లా పీఈటీ సురేంద్రకుమార్ పాత్రో తెలియజేశారు. ఈ ఫుట్‌బాల్ పోటీలకు వివిధ విద్యాలయాల నుంచి పీఈటీలు ధర్మేంధ్ర సామల్, రేఖారానీ దేవ్, తదితరులు పాల్గొన్నారు. రాయగడలో.. రాయగడ: స్థానిక గొవింద చంద్రదేవ్ ఉన్నత పాఠశాల మైదానంలో ముఖ్యమంత్రి చాంపియన్‌షిప్ ట్రోఫీ ఫుట్‌బాల్ టోర్నీ సోమవారం ప్రారంభమైంది. జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ చంద్ర నాయక్ ముఖ్యఅతిథిగా హాజరై టోర్నీని ప్రారంభించారు. ఈ నెల 15వ తేదీ వరకు పోటీలు కొనసాగుతాయన్నారు. మొదటి మ్యాచ్‌లో మా మజ్జిగౌరి ఫుట్‌బాల్ క్లబ్ జట్టు, బైరాగి హలువ ఫుట్‌బాల్ క్లబ్ జట్ల మధ్య జరిగింది. మా మజ్జిగౌరి జట్టు 3–0 గోల్స్‌తో విజయం సాధించింది. జిల్లా క్రీడాశాఖ అధికారి షేక్ ఆలీనూర్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి బసంత కుమార్ ప్రధాన్, తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన జాగులై మాత వసంత నవరాత్రి ఉత్సవాలు
భువనేశ్వర్ : జట్నీ మునిసిపాలిటీ కుదియారి గ్రామ దేవత జాగులై మాత వసంత నవరాత్రి ఉత్సవాలు సోమవారం సాయంత్రంతో ముగిశాయి. ఈ సందర్భంగా మహిషాసుర మర్ధిని అలంకరణలో జాగులై మాతని గ్రామస్తులు కనులారా దర్శించుకుని తరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి స్థానికులతో పరిసర గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి సామూహిక ప్రసాద సేవలో పాల్గొన్నారని ఉత్సవ నిర్వహణ కమిటీ అధ్యక్షుడు రాధా మోహన్ పట్నాయక్, కార్యదర్శి లక్ష్మి ధర మహంతి తెలిపారు. విదేశీ మద్యం స్వాధీనం –ఒకరి అరెస్టు రాయగడ: జిల్లాలోని బిసంకటక్ సమితి దుర్గి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలోని ఒక ఇంటిపై అబ్కారీ శాఖ అధికారులు సొమవారం దాడులను నిర్వహించి 20 లీటర్ల విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ప్రశాంత కుమార్ సాహు అనే యువకుడిని అరెస్టు చేశారు. విదేశీ మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు అబ్కారీ శాఖ అధికారి ఛబిరాజ్ అధికారి నేతృత్వంలో ఎస్ఐ రంజాన్ ఖాన్, కానిస్టేబుల్ సుశాంత గౌడ తదితరులు ఆకస్మిక దాడులను నిర్వహించారు. అరెస్టయిన యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. ‘వర్ణబోధ’ పుస్తకాలు పంపిణీ పర్లాకిమిడి: ఒడియా భాషా పక్షోత్సవాల్లో భాగంగా రాష్ట్ర ఒడియా భాష, సాహిత్యం సంస్కృతి విభాగం ఽఆధ్వర్యంలో ప్రాథమిక విద్యార్థులకు మధుసూదన్‌రావు రచించిన ‘వర్ణబోధ’ (పెద్దబాలశిక్ష) పుస్తకాలను కలెక్టర్ బిజయ కుమార్ దాస్ సోమవారం పంపిణీ చేశారు. స్థానిక గాంధీ మెమోరియల్ ఉన్నత ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి వర్ణబోధ పుస్తకాలను అందజేశార. పునఃముద్రణ జరిగిన వర్ణబోధలో ఒడియా భాష ఉచ్ఛారణ, పేర్లు, బొమ్మల రూపంలో ఉంటాయి. కార్యక్రమంలో జిల్లా ముఖ్య విద్యాధికారి డాక్టర్ మాయాధర్ సాహు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.తిరుపతి రావు, జిల్లా సాంస్కృతిక శాఖ అధికారిని అర్చనా మంగరాజ్ పాల్గొన్నారు. -
ప్రారంభమైన పోలీస్ హాకీ పోటీలు
భువనేశ్వర్: అఖిల భారత పోలీస్ క్రీడల నియంత్రణ బోర్డు ఆధ్వర్యంలో ఒడిశా పోలీసులు నిర్వహిస్తున్న 73వ అఖిల భారత పోలీస్ హాకీ చాంపియన్‌షిప్ – 2025 సోమవారం ప్రారంభమైంది. స్థానిక ఏడో బెటాలియన్ గ్రౌండ్లో పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ నెల 15 వరకు స్థానిక కళింగ స్టేడియంలో ఈ పోటీలు నిరవధికంగా కొనసాగుతాయి. లీగ్ కమ్ నాకౌట్ ఫార్మాట్లో జరిగే ఈ టోర్నమెంట్లో వివిధ రాష్ట్రాల పోలీసులు, కేంద్ర సాయుధ పోలీసు దళాల జట్లు పాల్గొంటున్నాయి. ప్రారంభోత్సవానికి రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ పోటీలో పాల్గొనే అన్ని జట్లు, కోచ్‌లు, క్రీడా అధికారులను స్వాగతించారు. శారీరిక దారుఢ్యత, క్రమశిక్షణ, సమైక్యత భావాల ప్రేరణకు పోలీసు దళాలలో క్రీడల ప్రోత్సాహం ప్రాముఖ్యతను సంతరించుకుంటుందన్నారు. జాతీయ క్రీడలలో ప్రధానంగా వాటర్ స్పోర్ట్సు, షూటింగ్, హాకీలో ఒడిశా తారస్థాయి నైపుణ్యతతో ఎదుగుదల సాధించడం పట్ల డీజీపీ హర్షం వ్యక్తం చేశారు. క్రీడా ప్రతిభను పెంపొందించడంలో రాష్ట్ర పోలీసుల ప్రయత్నాలను అభినందించారు. క్రీడాకారులు ఉమ్మడి కృషి, న్యాయసమ్మతమైన పోటీతో క్రీడా స్ఫూర్తిని చాటుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమం చాంపియన్‌న్‌షిప్ ఇన్స్పెక్టరు జనరల్ (శిక్షణ), చాంపియన్‌షిప్ కార్యనిర్వాహక కార్యదర్శి అనుప్ కుమార్ సాహు పరిచయ ప్రసంగంతో ప్రారంభమైంది. అదనపు డీజీపీ (ప్రధాన కార్యాలయం)య కార్యనిర్వాహక కమిటీ ఉపాధ్యక్షుడు దయాళ్ గంగ్వార్, అదనపు డీజీపీయ చాంపియన్‌షిప్ కమిటీ ఉపాధ్యక్షుడు రాజేష్ కుమార్ పాల్గొన్నారు. -
ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
కొరాపుట్: శ్రీరామ నవమి వేడుకలు ఆదివారం రాత్రంతా కొనసాగాయి. కొరాపుట్, దమంజోడి, ఉమ్మర్‌కోట్, నందపూర్ తదితర పట్టణాలలో యువత నృత్యాలు చేస్తూ శోభాయాత్రను కొనసాగించారు. ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ అలరించాయి. కొన్నిచోట్ల సోమవారం ఉదయం వరకు శోభాయాత్రలు జరిగాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసులు, ఉత్సవ కమిటీలు చర్యలు తీసుకున్నాయి. భువనేశ్వర్: స్థానిక ఆంధ్ర సంస్కృతి సమితి ఆధ్వర్యంలో శ్రీ రామ నవమి ఉత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా నిత్యం రెండు పూటలు వేకువ జాము నుంచి సీతారామ లక్ష్మణుల సమేత ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజాదులు నిర్వహిస్తారు. సాయంత్రం వేళలో పలు సాంస్కృతిక కార్యక్రమాలతో సమితి ఉత్సవ ప్రాంగణం భక్త జనంతో కళకళలాడుతుంది. నవమి సందర్భంగా ఖరగపూర్ వికాస్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ బృందం వారిచే కూచిపూడి నాట్య ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. -
గంజాం బార్ అసోసియేషన్ ఎన్నిక
బరంపురం: గంజాం బార్ అసోసియేషన్‌ను న్యాయవాదులు ఎన్నుకున్నారు. సోమవారం బార్ అసోసియేషన్ తాత్కాలిక కార్యాలయంలో జరిగిన ప్రమాణ స్వీకారంలో న్యాయవాది మనోజ్ పట్నాయక్ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షుడిగా వెంకటరావు, సహాయ కార్యదర్శులుగా త్రిముల్ కుమార్‌రెడ్డి, అసిత్ సావత్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలపై పోరాడతామన్నారు. సంక్షేమం కోసం పాటుపడతామన్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన న్యాయవాది మోహన్ శింగారి నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మాజీ అధ్యక్షుడు నయన్ చంద్ర మహాపాత్రో, ఎడిటర్ బిరించి మహాపాత్రో, రామ్‌ప్రసాద్ పండా, తదితరులు పాల్గొన్నారు. -
చైత్రోత్సవ వేళ
● నేటి నుంచి మజ్జి గౌరి అమ్మవారి చైత్రోత్సవాలు ● ఏర్పాట్లు పూర్తి చేసిన ఆలయ కమిటీ ముడుపుల చెట్టు వద్ద భక్తుల సందడి రాయగడ: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, రాయగడ ప్రజల ఆరాధ్య దైవంగా పూజలందుకుంటున్న మజ్జిగౌరి అమ్మవారి వార్షిక చైత్రోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. జంఝావతి నది జలాలు అమ్మవారి చైత్రోత్సవాల ప్రారంభానికి ఒక రోజు ముందు సమీపంలో గల జంఝావతి నది నుంచి జలాలను తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో ఉంచి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. నది వద్ద ప్రత్యేక పూజలను నిర్వహించిన పురోహితులు పూజా కార్యక్రమాల అనంతరం జలాలను కలశాలతో తీసుకువచ్చి అమ్మవారిని అదేవిధంగా అమ్మవారి గర్భగుడిని శుద్ధి చేస్తారు. అదేరోజు రాత్రి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఆలయ ప్రధాన పూజారి చంద్రశేఖర్ బెరుకొ, బాబుల బెరుకొలు అమ్మవారిని సింధూరంతో అలంకరిస్తారు. సునా భెషొలో అమ్మవారు అమ్మవారి చైత్రోత్సవాల సందర్భంగా ఉత్సవాల ఐదు రోజుల పాటుగా అమ్మవారిని బంగారు నగలతో అలంకరిస్తారు. సునా భెషొను తిలకించి భక్తులు మురిసిపోతారు. ఆంధ్ర భక్తుల తాకిడి ఉత్కళాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా గుర్తింపు పొందిన మజ్జిగౌరి అమ్మవారిని దర్శించుకునేందుకు పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లా పార్వతీపురం, విశాఖపట్నంతో పాటు తెలంగాణ, అటు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారు. ప్రతీ ఆది, మంగళ ,బుధవారాల్లో వీరి తాకిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబరు నెల వరకు పొరుగు రాష్ట్రాల భక్తులతో మందిరం కిటకిటలాడుతుంది. భక్తుల తాకిడిని ఉద్దేశించి వారికి సౌకర్యం కల్పించే విధంగా ప్రత్యేక దర్శనాలను ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. అందుకు 300 రూపాయల టిక్కెట్లను విక్రయిస్తుంది. స్థల చరిత్ర క్రీస్తుపూర్వం 16 వ శతాబ్దంలో నందపూర్ రాజ వంఽశస్తులకు చెందిన విశ్వనాథ్ దేవ్ గజపతి అనే రాజు రాజ్యాలను విస్తరించే దిశలో రాయగడలోనికి అడుగుపెట్టారు. రాయగడలో రాజ్యాన్ని స్థాఽపించిన ఆయన మజ్జిగౌరి దేవిని ఇష్టాదేవిగా పూజిస్తుండేవారు. ఈ నేపథ్యంలో అమ్మవారిని కోట మధ్యలో స్థాపించి పూజించేవారు. కోట మధ్యలో కొలువుదీరడంతొ అమ్మవారిని మొఝిఘోరియాణి గా పిలుస్తారు. తెలుగులో మజ్జిగౌరిగా ఒడియాలొ మోఝిఘొరియాణిగా ప్రతీతి. 108 మంది రాణుల సతీసహగమనం రాయగడ రాజ్యాన్ని పాలిస్తుండే విశ్వనాఽథ్ దేవ్ మహారాజుకు 108 మంది రాణులు ఉండేవారు. గోల్కొండను పాలించే ఇబ్రహిం కుతుబ్‌షా సేనతో రాయగడపై దండెత్తారు. ఈ పోరాటంలో విశ్వనాథ్ దేవ్ హతమవుతారు. దీంతో ఆయన 108 మంది రాణులు అగ్నిలొకి దూకి ఆత్మార్పణం చేసుకుంటారు. ఈ స్థలాన్ని సతీకుండంగా పిలుస్తారు. ప్రస్తుతం అమ్మవారి మందిరానికి పక్కనే ఈ సతీకుండం ఉంది. మందిర కమిటీ దీని ప్రాధాన్యతను గుర్తించి అభివృద్ధి చేసింది. అయితే కోట కూలిపొవడం అంతా శిథిలమవ్వడంతొ అమ్మవారి మందిరం కూడా శిథిలమవుతోంది. బ్రిటీష్ వారి ఆగమనంతో.. 1936 వ సంవత్సరంలొ బ్రిటీష్ వారు విజయనగరం నుంచి రాయిపూర్ వరకు రైల్వే పనులు ప్రారంభించించే సమయంలో జంఝావతి నది పై వంతెన నిర్మాణం పనులు ప్రారంభిచారు. ఈ క్రమంలో వంతెన నిర్మాణానికి సంబంధించిన కాంట్రాక్టర్ వంతెన పనులను ప్రారంభిస్తారు. వంతెన నిర్మాణం జరగడం అదేవిధంగా కూలిపోవడం క్రమేపీ చోటు చేసుకుంటాయి. దీంతో ఒక రోజు కాంట్రాక్టరు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో అమ్మవారు కాంట్రాక్టర్ కలలో కనిపించి తాను ఇక్కడే ఉన్నానని, తనకు చిన్న గుడి ఏర్పాటు చేసి నిత్యపూజా కార్యక్రమాలు జరిపిస్తే జంఝావతి నదిపై తలపెట్టిన వంతెన పనులు పూర్తవుతాయని చెబుతుంది. దీంతో కలలో కనిపించిన అమ్మవారి మాటలు ప్రకారం వెతిక చూడగా ఒక శిథిలమైన మందిరంలో అమ్మవారి విగ్రహం ఉంటుంది. అయితే అప్పటికి అమ్మవారి తల భాగమే కనిపిస్తుంది. దీంతో కాంట్రాక్టరు మందిరాన్ని నిర్మించి అమ్మవారి ముఖభాగమే ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు చేపడతాడు. అనంతరం వంతెన పనులు చకచక పూర్తవుతాయి. ఇప్పటికీ ఈ వంతెన అమ్మవారి మందిరానికి సమీపంలో ఉంది. అప్పటి నుంచి అమ్మవారి ముఖభాగమే భక్తులకు దర్శనం ఇస్తుండటం ఇక్కడి విశేషం. ఇదిలాఉండగా అమ్మవారికి సమీపంలో అమ్మవారి పాదాల గుడి కూడా ఉంది. అదేవిధంగా నడుం భాగం మందిరానికి కొద్ది దూరంలో ఉంది. దీనినే జెన్నా బౌలిగా కొలుస్తుంటారు. సంధ్యా హారతి ప్రతీ రోజూ అమ్మవారిని భక్తులను దర్శించుకునేందుకు ముందుగా ఉదయం, సాయంత్రం హారతి కార్యక్రమాలు ఉంటాయి. ఇందులొ సంధ్యా హారతి ప్రత్యేకం. ప్రతీ రోజు సాయంత్రం 6 గంటలకు ఈ హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. పూజారుల బృందం ఈ హారతి సమయంలొ భారీ ఢమరుకాలను మోగిస్తారు. హారతి సమయంలో అమ్మవారి గర్భగుడిని చీకటి చేస్తారు. ఆ చీకటిలో హారతి వెలుగులో అమ్మవారు దర్శనం ఇస్తారు. -
ఒడియా పాఠ్య పుస్తకాల పంపిణీ
కొరాపుట్: ఒడిశా భాషా పరిరక్షణలో రాష్ట్ర వ్యాప్తంగా ఒడియా పాఠ్య పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రాథమిక విద్య, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నిత్యానంద గొండో లాంఛనంగా తన సొంత నియోజకవర్గం ఉమ్మర్‌కోట్ లో ఈ పథకం ప్రారంభించారు. ప్రాథమిక విద్య కోసం బాలలకు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో, జొరిగాంలో స్థానిక ఎమ్మెల్యే నర్సింగ బోత్ర,నబరంగ్‌పూర్ పట్టణంలో నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి పాఠ్యంశాలు పంపిణీ చేశారు. వీధికుక్కలకు గర్భనిరోధక టీకాలు జయపురం: పట్టణంలో వీధి కుక్కలను నియంత్రించేందుకు జయపురం మున్సిపాలిటీ కుక్కలకు గర్భ నిరోదక టీకాలు వేయడాన్ని సోమవారం ప్రారంభించింది. నెలకు దాదాపు 200 మందికిపైగా కుక్కకాటుకు గురవుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో 3 వేలకు పైగా ఊర కుక్కలు తిరుగుతున్నాయి. వీటి బెడద తగ్గించడానికి గర్భ నిరోధక టీకాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమం కోసం పశు వైద్య డాక్టర్లతో పాటు ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. విద్యార్థులకు సన్మానం మల్కన్‌గిరి : మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో 636 మంది విద్యార్థులు జాతీయ ప్రతిభా మేధాశక్తి స్కాలర్షిప్ కోసం అర్హత పరీక్షను రాశారు. వారిలో 32 మంది ప్రతిభ కనబరిచారు. అందులో మల్కన్‌గిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కుముటిగూఢ ప్రభుత్వ ఉన్న ప్రాథమిక పాఠశాల నుంచి 8వ తరగతి చదువుతున్న పరుశురామ్ సోడి, రాజేష్ మాడ్కమిలు ఎంపికయ్యారు. వీరిని సోమవారం జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంధ్ర సభర పాఠశాలలో సత్కరించారు. ఒక్కో విద్యార్థికి రూ.50వేలు మంజూరైనట్లు తెలిపారు. మంచమే పల్లకిగా మారె.. కొరాపుట్: మాజీ మంత్రి, మాజీ ఎంపీ జయరాం పంగి సోమవారం కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కొఠియా గ్రామ పంచాయతీలో పర్యటించారు. అదే మార్గంలో తన స్వగ్రామం తురియా వచ్చింది. గ్రామంలో చైత్రపర్వం జరుగుతోందని చెప్పడంతో.. వెంటనే పంగి ఊరిలోకి ప్రవేశించారు. దీంతో స్థానికులు ఆయనను మంచంపై కూర్చోబెట్టి ఊరంతా ఊరేగించారు. స్థానికులు చూపిన ప్రేమకు పంగి భావోద్వేగానికి గురయ్యారు. ఖుర్దాలో బాంబు పేలి ఒకరి మృతి భువనేశ్వర్: ఖుర్దా ప్రాంతం సొఢై గొడొ గ్రామంలో సోమవారం బాంబు పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బైక్ పై బాంబు తీసుకెళ్తుండగా ప్రమాదం సంభవించింది. బాంబుతో బైక్‌పై నుంచి కిందకి పడడంతో బాంబు పేలింది. మృతుడిని సొఢై గొడొ గ్రామస్తుడు నిరాకర్ సింఘ్గా గుర్తించారు. గాయపడిన యువకుడు బంటీ బరిసల్గా పేర్కొన్నారు. క్షతగాత్రుడిని ఖుర్దా జిల్లా ప్రధాన ఆస్పత్రిలో చేర్చారు. శవ పరీక్ష కోసం మృతదేహాన్ని ఇదే ఆస్పత్రికి తరలించారు. దర్యాప్తు జరుగుతోంది. ఒడియా పుస్తకాలు పంపిణీ చేస్తున్న మంత్రి నిత్యానంద గొండో -
తీర్థ యాత్రలకు వయోవృద్ధులు పయనం
జయపురం: జయపురం సమితి నుంచి81 మంది వయో వృద్ధులు సోమవారం ఉదయం జయపురం సమితి కార్యాలయం నుంచి అయోధ్య, వారణాసి తీర్థ యాత్రలకు బయలు దేరారు. కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ ఆదేశాల మేరకు జయపురం బీడీవో శక్తి మహాపాత్రో జయపురం సమితిలోని 22 పంచాయతీలకు చెందిన 81 మంది వయోవృద్ధులను ఎంపిక చేసి వారిని సమితి కార్యాలయానికి రప్పించారు. వారు సోమవారం ఉదయం బస్సులలో జయపురం నుంచి కొరాపుట్ కలక్టరేట్ సమీపంలో గల సాంస్కృతిక భవనానికి వెళ్లారు. వరిష్ట నాగరిక తీర్థ యాత్ర యోజనలో (వయో వృద్ధుల తీర్థ యాత్ర పథకం) 2025లో వారిని అయోధ్య, వారణాశి పుణ్య క్షేత్రాలు దర్శించేందుకు తీర్థ యాత్రలకు పంపుతున్నట్లు బీడీవో వెల్లడించారు. కొరాపుట్‌లో వారందరికీ జిల్లా వైద్యాధికారులచే వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బస్సులలో రాయగడ తీసుకెళ్తారు. రాయగడ నుంచి వారంతా మంగళవారం వారణాశి, అయోధ్యల తీర్థ యాత్రలకు రైలులో బయలు దేరుతారని వెల్లడించారు. తీర్థ యాత్రలకు వెళ్తున్న వారి బాగోగులు చూసేందుకు సమితి సామాజిక సురక్షా అధికారిని తోడుగా పంపుతున్నట్లు వివరించారు. జయపురం మున్సిపాలిటీ నుంచి 18 మంది.. తీర్థ యాత్రల కోసం జయపురం మున్సిపాలిటీ నుంచి 18 మంది వృద్ధులను కొరాపుట్ పంపినట్లు జయపురం మున్సిపాలిటీ సహాయ కార్యనిర్వాహక అధికారి కృతిబాస సాహు వెల్లడించారు. మల్కన్‌గిరి జిల్లా నుంచి వృద్ధులు పయనం మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా నుంచి కూడా 75 మంది వృద్ధులు తీర్థయాత్రలకు రెండు బస్సుల్లో సోమవారం బయలుదేరి వెళ్లారు. బస్సులను మల్కన్‌గిరి ఎమ్మెల్యే నర్సింగ్ మడ్కమి జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ తీర్థ యాత్రలకు వెళ్తున్న వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ సోమనాథ్ ప్రధన్, వేద్బ్‌ర్ ప్రధన్, జిల్లా సామజిక భద్రతా అధికారి సస్మీత స్వైయి, ఇతర అధికారులు ఉన్నారు. ● పక్కా ఏర్పాట్లు చేసిన అధికారులు -
పర్లాకిమిడి కలెక్టరేట్లో గ్రీవెన్స్‌సెల్
పర్లాకిమిడి: గజపతి కలెక్టరేట్లో సోమవారం ఉదయం ఏడుగంటలకు గ్రీవెన్సు సెల్‌ను కలెక్టర్ బిజయ కుమార్ దాస్ ప్రారంభించారు. ఈ సంయుక్త అభియోగాల స్పందన కార్యక్రమానికి ఎస్పీ జితేంద్రనాథ్ పండా, డీఎఫ్ఓ కె.నాగరాజు, డీఆర్డీఏ ముఖ్యకార్యనిర్వాహాణ అధికారి శంకర కెరకెటా తదితరులు హాజరయ్యారు. మొత్తంగా 49 వినతులు రాగా, అందులో వ్యక్తిగతం 3, గ్రామసమస్యలు 46, ఒక వినతిని అక్కడికక్కడే పరిష్కరించారు. గ్రీవెన్సు సమయం ఏడుగంటలకు మార్చడంతో అనేక మంది పదకొండు గంటల తర్వాత రావడంతో కొందరు వెనుదిరిగారు. -
మల్కన్‌గిరిలో స్వచ్ఛభారత్
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కేంద్రంలో ఆదివారం ఆరో రోజు స్వచ్ఛభారత్ కర్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక మల్లికేశ్వర్ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. ఈ స్వచ్ఛతా కర్యక్రమాన్ని సాహిత్యం, పంచాయతీరాజ్, తాగునీటి సరఫరా, గృహనిర్మాణ, పర్యటకశాఖల సహకారంతో నిర్వహించారు. కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ వేద్బర్ ప్రధన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రతీ పౌరుడు తన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతీ మందిరం వద్ద నిర్వహించాలన్నారు. జిల్లా అభివృద్ధి శాఖ అధికారి నరేశ్ చంద్ర శబర, సంజాయ్ సర్కార్, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురికి గాయాలు
మల్కన్‌గిరి: ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు గాయపడ్డారు. ఈ సంఘటన మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి సుదకొండ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో చోటుచేసుకుంది. సుదకొండ గ్రామానికి చెందిన భీమా మాడ్కమి, లక్ష్మి పడియమి, దివన్ మాడీ, భీమ పోడియామి, రామా మడ్కమి సమీపంలోని అడవిలో కట్టెలు కొట్టి తిరిగి వస్తుండగా మధ్యలో ట్రాక్టర్ రావడంతో దాన్ని ఎక్కారు. కొద్ది దూరం వెళ్లిన తరువాత ట్రాక్టర్ బోల్తాపడడంతో అదుపు తప్పి పడిపోవడంతో అందులో ఉన్న ఐదుగురు గాయపడ్డారు. వారిని స్థానికుల సహయాంతో కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. వీరిలో లక్ష్మికి తీవ్రంగా గాయాలు కావడంతో మల్కన్‌గిరి ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేశారు. కలిమెల ఐఐసి చంద్రకాంత్ తండి ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. -
వైన్‌షాప్ నిర్వాహకుడిపై దాడి
మెళియాపుట్టి: మండల కేంద్రం మెళియాపుట్టిలోని ఓ మద్యం షాపు నిర్వాహకుడిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చాపర గ్రామానికి చెందిన కొందరు యువకులు మెళియాపుట్టిలోని మద్యం షాపులో నాలుగు బాటిళ్లు కొనుగోలు చేసి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత తిరిగి వచ్చి ఒక మద్యం బాటిల్ తిరిగి నిర్వాహకుడికి ఇచ్చి డబ్బులు అడిగారు. అందుకు ఆయన నిరాకరించడంతో వాగ్వాదానికి దిగారు. మద్యం మద్యం మత్తులో నిర్వాహకుడిపై దాడికి దిగి సీసాతో తలపై బలంగా మోదారు. అనంతరం పిడిగుద్దులతో దాడి చేశారు. నిర్వాహకుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో నలుగురు యువకులపైనా కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్‌బాబు తెలిపారు. నిమ్మ @ రూ.110శ్రీకాకుళం: వేసవి ఎండల నేపథ్యంలో జిల్లాలో నిమ్మకాయల ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. నెల రోజుల క్రితం రూ.50 నుంచి రూ.60 వరకు ఉన్న కిలో నిమ్మకాయల ధర ప్రస్తుతం రిటైల్‌లో రూ.110కు అమ్ముతున్నారు. హోల్‌సేల్‌లో రూ.95 వరకు ధర పలుకుతోంది. వేసవిలో నిమ్మకాయల వినియోగం ఎక్కువగా ఉండటంతో ధర పెరగడం పరిపాటి. ఏటా ఏప్రిల్ మాసాంతం నుంచి జూన్ మొదటి వారం వరకు ధర పెరుగుతునే ఉంటుంది. ఈ ఏడాది మాత్రం మార్చి చివరి వారం నుంచి ధర విపరీతంగా పెరిగిపోయింది. జిల్లాలో నిమ్మ పంట అంతంతమాత్రంగానే సాగవుతోంది. గుంటూరు, కృష్ణా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి నిమ్మ దిగుమతి అవుతోంది. ఆయా ప్రాంతాల్లో ఈ ఏడాది వర్షాలు అంతంత మాత్రంగా పడటం, మంచు ఎక్కువగా కురవడం వల్ల దిగుబడి తగ్గిపోయిందని, ఫలితంగా ధర పెరిగిపోయిందని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. మే చివరి నాటికి కిలో నిమ్మ ధర రూ.150 దాటిపోవచ్చని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
పర్యాటకుల బస్సు బోల్తా
పవిత్ర శ్రీ రామ నవమి పురస్కరించుకుని రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం పూరీ శ్రీ జగన్నాథ దేవస్థానం మొదలుకొని రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా శ్రీ రామచంద్ర స్వామి పూజాదులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానాల ప్రాంగణాలు ప్రత్యేక పుష్ప సోయగంతో కళకళలాడాయి. హోమాదులతో ఆధ్యాత్మిక వాతావరణం అలముకున్నాయి. – భువనేశ్వర్ ● ఒకరు మృతి భువనేశ్వర్: నగరం శివార్లలో ఆదివారం వేకువ జామున భారీ రోడ్డు ప్రమాదం సంభవించింది. స్థానిక ఉత్తర క్రాసింగ్ ప్రాంతం సిఫా కూడలి కౌశల్యాగంగ పోలీసు ఔట్ పోస్ట్ దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పర్యాటకుల బస్సు బోల్తా పడింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో 15 మందికి పైగా పర్యాటకులు గాయపడ్డారు. వారందరినీ స్థానిక క్యాపిటల్ ఆస్పత్రిలో చేర్చారు. ఒకరు మృతి చెందారు. పూరీ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం సంభవించింది. డ్రైవర్ కునుకుపాటు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. బస్సులో దాదాపు 70 మంది పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. వీరంతా బంగ్లాదేశ్ నుంచి ఇస్కాన్ సహాయంతో పూరీ శ్రీ జగన్నాథుని దర్శనం కోసం విచ్చేశారు. కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించిన తర్వాత పూరీ వెళ్తుండగా దురదృష్టవశాత్తు దుర్ఘటన పాలయ్యారు. ప్రయాణికుల్లో అత్యధికులు పశ్చిమ బెంగాల్‌లోని ఇస్కాన్ మాయాపూర్ ఆధ్వర్యంలో వచ్చిన బంగ్లాదేశ్ జాతీయులు అని సమాచారం. -
● హైడ్రో ప్రాజెక్టు సందర్శన
జయపురం: జయపురం సబ్ డివిజన్ బొయిపరిగుడ సమితి తెంతులిగుమ్మ పంచాయతీ కొలాబ్ నదిపై నిర్మించిన మీనాక్షి హైడ్రో పవర్ ప్రాజెక్టును ఆదివారం ఏడుగురు సభ్యుల ప్రభుత్వ అధికారుల కమిటీ సందర్శించింది. కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ ఆదేశాల మేరకు ప్రాజెక్టును సందర్శించిన కమిటీ సభ్యులు పలు విషయాలపై ప్రాజెక్టు అధికారులతో చర్చించారు. 2020లో హైదరాబాద్ మీణాక్షి పవర్ ప్రాజెక్టు లిమిటెడ్ వారు ఈ ప్రాజెక్ట్ నిర్మణం చేపట్టారు. సమితి, అటవీశాఖ, కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులతో కలిసి కమిటీ సభ్యులు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించారు. కమిటీ సభ్యులు అడిగిన ప్రాజెక్టు స్కెచ్ మ్యాప్‌ను.. ప్రాజెక్టు అధికారులు చూపించలేకపోయారని, పాత రిపోర్టును ఆధారంగా ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్నట్లు కమిటీ తెలుసుకున్నట్లు సమాచారం. 2020లో పల్లె సభ రిపోర్టును పవర్ కంపెనీ చూపిందని, ఆ రిపోర్టును పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని బొయిపరిగుడ బీడీఓ అభిమన్య కవి శతపతి వెల్లడించారు. ప్రాజెక్టు పరిధిలో ఉంటున్న ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటామన్నారు. అవసరమైన రికార్డులను మంగళవారం నాటికి అందజేయాలని ప్రాజెక్టు అధికారులను కమిటీ ఆదేశించిందని సమాచారం. జయపురం సబ్ కలెక్టర్ అక్కవరం శొశ్యారెడ్డి పర్యవేక్షణలో జయపురం అటవీ డివిజన్ అధికారి ప్రతాప్ కుమార్ బెహర, జయపురం సమగ్ర గిరిజనాభివృద్ధి ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్, బొయిపరిగుడ తహసీల్దార్, కాలుష్య నియంత్రణ బోర్డు జిల్లా అధికారి, తదితరులు పాల్గొన్నారు. -
రామగిరి క్షేత్రంలో ఐటీడీఏ పీఓ
కొత్తూరు: మండలానికి ఆనుకుని ఉన్న ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలం పులిపుట్టి సమీపంలో ఉన్న కన్నెధార కొండపై నిర్మించిన రామగిరి క్షేత్రంలో ఆదివారం నిర్వహించిన శ్రీరామనవమి వేడుకలకు ఐటీడీఏ పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి హాజరయ్యారు. సీతారాములను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు పీఓను సత్కరించి జ్ఞాపిక అందజేశారు. సీతారాముల కల్యాణోత్సవానికి కొత్తూరు, సీతంపేట మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలోహాజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు పిండి శ్రీనివాసరావు, రామగిరి క్షేత్రం కమిటీ అధ్యక్షుడు ఎస్పీ పెంటయ్య, జి.రాములునాయుడు, రాజారావు, రాములు, జి.ప్రసాదబాబు, భాస్కరరావు ప్రిన్సిపాల్ నవీన్ పాల్గొన్నారు. -
● ఆదిత్యా నమోస్తుతే..!
అరసవల్లి : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. ఆదిత్యుని వార్షిక కల్యాణ మహోత్సవాలు (బ్రహ్మోత్సవాలు) జరుగుతున్న క్రమంలో ఇతర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చి ఆదిత్యునికి మొక్కులు చెల్లించుకున్నారు. ఇంద్రపుష్కరిణి వద్ద సంప్రదాయక పూజలు నిర్వహించి ప్రసాదాలను స్వామికి నివేదించారు. ఆరోగ్యం కోసం సూర్యనమస్కారాలు పూజలు చేయించుకున్నారు. ఎండ వేడిమి తీవ్రంగా ఉన్న కారణంగా భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో వై.భద్రాజీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయించారు. విధుల్లోకి సిబ్బంది.. శనివారం విధులకు దూరంగా ఉన్న దినసరి వేతనదారులు ఆదివారం మాత్రం విధులకు వచ్చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన క్రమంలో వారికి సౌకర్యాల కల్పన నుంచి ఆలయంలో క్యూలైన్ల ఏర్పాటు, అన్నదానం, ప్రసాదాల తయారీ, విక్రయాలన్నీ దినసరి వేతనదారులే చూసుకున్నారు. ఈవో సూచన మేరకు ఈనెలాఖరు వరకు వేచిచూద్దామనే భావనను వ్యక్తం చేసి విధులను యధావిధిగా కొనసాగించారు. వివిధ దర్శనాల టికెట్ల విక్రయాల ద్వారా రూ.1,12,600, పూజలు, విరాళాల ద్వారా రూ.60,521, ప్రసాదాల విక్రయాల ద్వారా రూ. 1,15,880 వరకు ఆదాయం లభించినట్లు ఈవో వివరించారు. భారీగా తరలివచ్చిన భక్తులు విధుల్లోకి దినసరి వేతనదారులు -
బీజేపీతోనే దేశాభివృద్ధి
● ఆవిర్భావ కార్యక్రమంలో నాయకులుభువనేశ్వర్: భారతీయ జనతా పార్టీతోనే దేశాభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ నాయకులు అన్నారు. జాతీయవాదం బీజేపీ భావజాలమన్నారు. బీజేపీ 46వ వార్షికోత్సవాన్ని ఆదివారం జరుపుకోవడం ఆనందాయకమని రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయం ప్రాంగణంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, ప్రధాన కార్యదర్శి పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలకు పూలమాలలు వేసి రాష్ట్ర శాఖ ప్రముఖులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 1980 దశకంలో దేశంలో రాజకీయ అస్థిరత నెలకొన్నప్పుడు, భారతీయ జనసంఘ్ సూత్రాలు, ఆదర్శాలు, భావజాలం, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ త్యాగం, లక్ష్యం ఆధారంగా జాతీయ స్థాయిలో రాజకీయ ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని ప్రారంభించినట్టు నాయకులు పేర్కొన్నారు. పార్టీ అంచెలంచెలుగా ఎలా ఎదిగో నాయకులు వివరించారు. స్థానిక బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి విజయ్‌పాల్ సింగ్ తోమర్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి మానస్ మహంతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిరంచి నారాయణ్ త్రిపాఠి, రాజ్యసభ సభ్యుడు సుజిత్ కుమార్, లోక్‌సభ సభ్యుడు బలభద్ర మాఝి, భువనేశ్వర్ జిల్లా అధ్యక్షుడు నిరంజన్ మిశ్రా పాల్గొన్నారు. ఘనంగా బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం కొరాపుట్: భారతీయ జనతా పార్టీ 46వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి బీజేపీ జెండాను ఆవిష్కరించారు. పార్టీ ప్రతి కార్యకర్త తమ ఇంటి మీద పార్టీని జెండాను ఎగుర వేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మహిళా కార్యకర్తలు ఎమ్మెల్యేకు పార్టీ జెండాలతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రాథమిక విద్య, సాంఘీక సంక్షేమ శాఖా మంత్రి నిత్యానంద గొండో తన స్వంత నియోజకవర్గమైన ఉమ్మర్కోట్లోని పార్టీ కార్యాలయంలో జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీలో చేశారు. -
వైభవంగా దేవీ యాత్ర
బరంపురం: భక్తుల కొంగు బగారం.. బరంపురం ఇలవేల్పు ‘మా బుధి ఠాకురాని’ అమ్మవారి (దేవీ యాత్ర) ఉత్సవాలు ఆదివారం నాల్గో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం మేళతాళాలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య అమ్మవారిని పుర వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా మహిళలు భక్తితో అమ్మవారి పాదాలను పసుపు నీళ్లతో కడిగారు. 26 రోజులపాటు నిర్వహించే ఈ ఉత్పవాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా స్థానిక పోలీసులు పటిష్టమైన బందోబస్టు నిర్వహించారు. యోగాతో మానసిక వికాసం జయపురం: యోగాతో మానసిక వికాసం కలుగుతుందని యోగా గురువు వికాశ షొడంగి అన్నారు. జయపురం సబ్ డివిజన్ కొట్‌పాడ్ బాలికోన్నత పాఠశాలలో ఇకో క్లబ్, ఫిట్ ఇండియా సంయుక్తంగా యోగా శిబిరం నిర్వహించాయి. ఈ శిబిరంలో కొట్ ప్రాంత ప్రముఖ యోగా గురువు వికాశ షొడంగి ముఖ్యఅథితిగా హాజరయ్యారు. యోగాతో మన జీవన శైలి మారుతుందన్నారు. ప్రతిఒక్కరూ యోగాను అభ్యసించాలన్నారు. ఈ శిబిరంలో విద్యాలయ ఉపాద్యాయులు సబిత మదల, దమయంతి సాహూ, ప్రభాషిణి లిమల్, సయిత గొలారి, వణిత మహంతి, ప్రియదర్శిణి మండల్, పాఠశాల ఇకో క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు. నేడు సెంచూరియన్ వర్సిటీ ఉత్కళ కృషి మేళా పర్లాకిమిడి: సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్‌లో మూడవ వ్యవసాయ ఉత్కళ కృషిమేళాను సోమవారం నిర్వహిస్తున్నట్టు ఎం.ఎస్.స్వామినాథన్ అగ్రికల్చర్ కళాశాల డీన్ డాక్టర్ ఎస్.పి.నంద ఆదివారం తెలిపారు. ప్రారంభ కార్యక్రమానికి బరంపురం ఎంపీ ప్రదీప్ కుమార్ పాణిగ్రాహి, ఎమ్మెల్యే రూపేష్ పాణిగ్రాహి, కలెక్టర్, ఐకార్ (ఢిల్లీ) డాక్టర్ జె.కె.జెన్నా హాజరవుతారన్నారు. వ్యవసాయ మేళాలో రెండు వేల మంది రైతులు పాల్గొంటారన్నారు. కుక్కల దాడిలో జింక మృతి కొరాపుట్: కుక్కల దాడిలో జింక మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ డైలీ మార్కెట్ సమీపంలో జరిగింది. ఐదు జింకల కదలికలను స్థానికులు గమనించారు. వీధి కుక్కలు వాటిపై దాడిచేశాయి. నాలుగు జింకలు అటవీ ప్రాంతం వైపు వెళ్లిపోయాయి. ఓ జింక కుక్కల బారీన పడింది. గాయపడిన జింకను స్థానికులు పశువుల ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేస్తుండగా జింక మృతి చెందింది. తీవ్రమైన ఎండల వలన నీరు, ఆహారం కోసం జింకలు పట్టణంలోనికి ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు అభిప్రాయ పడ్డారు. అటవీ శాఖ సిబ్బంది అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశారు. జింకను పోస్టుమార్టం నిర్వహించారు. కుక్కల సమస్యపై తాము తరచూ మున్సిపల్ సిబ్బందికి ఫిర్యాదుల చేస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మున్సిపల్ సిబ్బంది స్పందించారు. కుక్కల నివారణకు చర్యలు తీసుకుంటామని స్థానికులకు నచ్చజెప్పారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి ఆమదాలవలస : శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస) రైల్వేస్టేషన్ పరిధిలోని ఊసవానిపేట గేటు సమీపంలో ఆదివారం రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతిచెందాడు. జీఆర్పీ ఎస్ఐ మధుసూదనరావు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం నుంచి ఒడిశా వైపు వెళ్లే రైలులో ప్రయాణం చేస్తున్న అసోంకు చెందిన బలిన్ దుర(35) ఫుట్‌బోర్డుపై ప్రయాణిస్తూ జారిపడ్డాడు. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం మేరకు జీఆర్పీ పోలీసులు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబానికి సమాచారం అందించారు. -
పర్యాటకుల బస్సు బోల్తా రాజధాని శివారులో పర్యాటకుల బస్సు బోల్తా పడింది. ఒకరు మృతి చెందారు. –8లోu
పర్లాకిమిడిలో.. పర్లాకిమిడి: పర్లాకిమిడిలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా జరిగాయి. మార్కెట్ వీధి, కోమటివీధి రామాలయంలో ఎ.రాజగోపాలచారి, ఎ.ఉగ్రనర్సింహాచారి ఆధ్వర్యంలో భక్తులు అర్చనలు చేశారు. అలాగే సింకివీధిలో ఉదయం నుంచి భక్తులు శ్రీరాముని దర్శనార్థం బారులు తీరారు. గుమ్మాబ్లాక్ జీబ పంచాయతీ జోగిపాడు గ్రామంలో శ్రీరామమందిరంలో శ్రీసీతారాముల కల్యాంణం జరిపించారు. కోమటివీధి రామాలయం వద్ద భక్తులకు మజ్జికను కోడూరు జీవన్ పంపిణీ చేశారు. కోర్సండలో.. పర్లాకిమిడి: జిల్లాలో గుసాని సమితి కోర్సండ గ్రామంలో శ్రీరామనవమి వేడుకల సందర్భంగా సీతారామ కల్యాణం ఘనంగా జరిపించారు. వరుసగా 25 ఏళ్లుగా కోర్సండ గ్రామంలో జరుగుతున్నాయి. ఈ కళ్యాణ మహోత్సవానికి చుట్టు పక్కల గ్రామాలతో పాటు, పాతపట్నం రామరాజు చారిటబుల్ ట్రస్టు అధ్యక్షుడు పారశెల్లి రామరాజు పాల్గొని సేవ చేశారు. -
క్రీడలతో ఉజ్వల భవిష్యత్
రాయగడ: యువత క్రీడలపై ఆసక్తి కనబర్చితే ఉజ్వల భవిష్యత్ ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరరావు అన్నారు. సదరు సమితి పరిధిలోని కొత్తపేటలొ ఉయ్ ఫైట్ అవర్ రైట్స్ అనే సేవా సంస్థ ఆధ్వర్యంలో గత నెల 26వ తేదీన ప్రారంభమైన క్రికెట్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత క్రీడారంగంపై దృష్టి సారించాలని అన్నారు. ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహద పడడంతోపాటు వారి జీవన విధానం కూడా మెరుగుపడుతోందన్నారు. టోర్నమెంట్లో ఫైనల్‌కు చేరుకున్న సూరి జట్టు, జేకే కామ్రేడ్ జట్ల మధ్య జరిగిన పోటీలో సూరి జట్టు విజేతగా నిలవగా రన్నర్‌గా జేకే కామ్రేడ్ జట్టు నిలిచింది. విజేత జట్టుకు రు. 25 వేలు, రన్నర్ జట్టుకు రుూ. 15 వేలు బహుమతిని నెక్కంటి అందజేశారు. అధికారి చిన్న, గౌరి చైతు, కొండ తదితరులు టోర్నమెంటును నిర్వహించారు. రాజ్యసభ మాజీ సభ్యుడు భాస్కరరావు -
భూగర్భంలో దొరికిన రాముడి ప్రతిమ
భువనేశ్వర్: భూగర్భంలో శ్రీరాముని కాంస్య విగ్రహం బయటపడింది. ఈ సంఘటనతో స్థానికుల్లో ఆనందం వెల్లివిరిసింది. కటక్ జిల్లా బంకి మండలం రొత్తాగొడొ గ్రామంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ గ్రామానికి చెందిన బలరామ్ రౌత్ వివరించిన కథనం ప్రకారం శుక్రవారం రాత్రి అతనికి రల వచ్చింది. ఆ ప్రకారం అతను తన కలలో చూసిన ప్రదేశంలో శనివారం తవ్వి వెతకడంతో విగ్రహం బయటపడింది. ఈ వెలికితీతలో అతనికి రాముడి కాంస్య విగ్రహం కనిపించింది. ఈ సమాచారం చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. స్థానికులు రామ నవమి సందర్భంగా భగవంతుని విగ్రహాన్ని ప్రతిష్టించాలని ప్రణాళిక వేశారు. ప్రతిమ దొరికిన ప్రదేశం యజమాని దిబాకర్ మల్లిక్ కూడా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
మూడు చిరుత పులి పిల్లల అలజడి
కొరాపుట్: రాష్ట్ర సరిహద్దులో మూడు చిరుత పులి పిల్లలు అలజడి రేపాయి. నబరంగ్‌పూర్ జిల్లా రాయగర్ సమితిలోని ఏఓబీకి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నహర్పూర్ అటవీ ప్రాంతంలోని జునాబాన్ గ్రామ కొండల్లో పులి పిల్లల అరుపులు స్థానిక గిరిజనులకు వినిపించాయి. అక్కడకు వెళ్లి చూడగా మూడు కూనలు కనిపించాయి. తల్లి కూడా అక్కడే ఉంటుందేమోనన్న భయంతో వారు వెనక్కి వచ్చి అటవీ శాఖాధికారులకు సమాచారం అందజేశారు. వారు పులి కూనలను సంరక్షించి తమ కార్యాలయానికి తీసుకెళ్లారు. గ్రామస్తులు పులి సంచారంపై జాగ్రత్తగా ఉండాలని, పిల్లలను వెతుక్కుంటూ వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ప్రజలను మోసం చేసిన వ్యక్తి అరెస్టు మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీసుస్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల్లో అమాయక ప్రజలను మోసం చేసిన కేసులో ఒకరిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఢెంకనాల్ జిల్లా కామాక్షి నగర్‌కు చెందిన సురేంద్ర పరిడా అనే వ్యక్తి ఖోయిర్‌పూట్ సమితి రాస్బేఢా పంచాయతీలో చెరీగూఢ,బనుగూఢ, బుటిగూ గ్రామాల్లో 50 మంది గిరిజనులకు అధిక వడ్డీ ఆశ చూపించి డబ్బులు వసూలు చేశాడు. 2022 నుంచి ఇలా వసూలు చేశాడు. ఆ మొత్తాన్ని తీసుకుని పరార య్యాడు. గిరిజనులు బలిమెల ఐఐసీ ధీరజ్ పట్నాయిక్ వద్దకు మార్చ్ 16వ తేదీన వచ్చి ఫిర్యాధు చేశారు. అప్పటి నుంచి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడు డెంకనాల్ జిల్లా కామాక్షినగర్లో ఉన్నట్లు తెలుసుకుని అక్కడకు వెళ్లి ఆదివారం అరెస్టు చేశారు. పూరీ జగన్నాథ ఆలయంలో మహిళా జర్నలిస్టుపై సేవకుల దాడి భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో సేవకులు మహిళా జర్నలిస్టుపై దాడి చేశారు. ఆమెతో పాటు కెమెరా మ్యాన్ దాడికి గురి అయ్యాడు. వీరివురు గాయపడి ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఆది వారం శ్రీ రామ నవమి కవరేజ్ హడావిడిలో ఉండగా సేవకులు వీరిపై దాడికి పాల్పడ్డారు. దాడిలో వీరి కెమెరా, మొబైలు ఫోన్ లాక్కున్నారు. పది మందికి పైగా సేవకులు ఈ దాడిలో పాల్గొన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడికి ప్రతిస్పందనగా స్థానిక మీడియా ప్రతినిధులు పూరీలోని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. జర్నలిస్టుల నుంచి అధికారిక ఫిర్యాదుల మేరకు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అధికారులు ఈ విషయంపై శ్రద్ధగా దర్యాప్తు చేస్తున్నారని పూరీ ఎస్పీ హామీ ఇచ్చారు. మేము ఇలాంటి సంఘటనలను తీవ్రంగా పరిగణిస్తామని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టేందుకు కట్టుబడి ఉన్నామని ఎస్పీ పేర్కొన్నారు. ఘనంగా సీతారాముల కల్యాణ మహోత్సవం పర్లాకిమిడి: పట్టణంలోని మార్కెట్ జంక్షన్ కోమటి వీధి వద్ద రామాలయం ఆవరణలో శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవాన్ని వైశ్యరాజు గోవిందరాజు దంపతులు, పొట్నూరు శివ దంపతులు ఆదివారం సాయంత్రం జరిపించారు. రామాలయం ప్రధాన పూజారి అనుమంచిపల్లి రాజగోపాలచారి, అనుమంచిపల్లి ఉగ్రనర్సింహాచార్యులు ఆధ్వర్యంలో శాస్త్రోత్తంగా నిర్వహించిన కల్యాణ మహోత్సవాన్ని భక్తులు కనులారా వీక్షించి తరించారు. -
సోమవారం శ్రీ 7 శ్రీ ఏప్రిల్ శ్రీ 2025
శ్రీ మందిరం ఆదాయం నగదు : రూ. 5,99,529 బంగారం : 500 మిల్లీ గ్రాములు వెండి : 28 గ్రాముల 700 మిల్లీ గ్రాములు – భువనేశ్వర్/పూరీరాయగడ: వేషధారణలో చిన్నారిఉత్కళ భూమి రాముడి సేవలో తరించింది. వేషాలు కట్టి కొన్ని చోట్ల, వివాహ క్రతువు జరిపి మరికొన్ని చోట్ల, శోభాయాత్రలు నిర్వహించి ఇంకొన్ని చోట్ల రామనవమి వేడుకలు నిర్వహించారు. సీతారాముల కల్యాణాలను వైభవంగా చేసి తరించారు. అధికారులు, నాయకులు, సామాన్యులు అన్న తేడా లేకుండా అందరూ న వమి నాడు రాముడిని సేవించారు. శ్రీరాముడి వేషంలో విద్యార్థికొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో శ్రీరామ నవమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. కొరాపుట్ జిల్లా కేంద్రం లోని శబరి శ్రీ క్షేత్ర జగన్నాథ దేవాలయంలో సీతారామ లక్ష్మణ అవతారంలో దేవ దేవులు దర్శనం ఇచ్చారు. నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి, కొరాపుట్ ఎమ్మెల్యే రఘురాం మచ్చో లు తమ నియోజకవర్గాలలో పర్యటించారు. రాయగడలో.. రాయగడ: శ్రీరామ నవమి సందర్భంగా స్థానిక భజరంగ్‌దళ్ కార్యకర్తలు, హిందూ సంస్థలు ఆదివారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించాయి. స్థానిక జగన్నాథ మందిరం నుంచి ఒక బృందం, పీహెచ్డీ నుంచి మరో బృందానికి చెందిన యువకులు ర్యాలీలో పాల్గొన్నారు. హనుమంతుల వారి గదలను పట్టుకుని ర్యాలీ చేశారు. స్థానికంగా గల కోదండ రామాలయంలో విశేష పూజలను నిర్వహించారు. అదేవిధంగా బాలాజీ నగర్లో గల కల్యాణ వేంకటేశ్వర ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవాలు ఘనంగా జరిగాయి. జయపురంలో.. జయపురం: జయపురంలో శ్రీరామ నవమి ఉత్సవాలతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక జమాల్ లైన్లో శ్రీరామ మందిర కమిటీ వారు, హిందూ సమాజ్ వారు, రఘునాథ్ మందిర పూజాకమిటీలు అంగరంగ వైభవంగా పూజలు ప్రారంభించారు. ఉదయం జమాల్ లైన్ రామ మందిర కమిటీ శ్రీరామ దంపతుల ఉత్సవ విగ్రహాలను పురవీధుల్లో ఊరేగించగా శ్రీరామ మందిరం వద్ద భక్తులు దీపారాధనలు చేశారు. శ్రీరాముని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సరస్వతి శిశు మందిర్‌లో.. మల్కన్‌గిరి: స్థానిక సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో ఆదివారం రామనవమి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల అధ్యక్షుడు రవీంద్ర కుమార్ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా గోలక్ చంద్ర దళయి పాల్గొన్నారు. రామాయణ విశిష్టతను పిల్లలకు వివరించారు.న్యూస్‌రీల్ -
ట్రాన్స్ఫార్మర్లను ఎత్తుకెళ్లిపోతున్నారు..
కొత్తవలస: మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను దొంగలు ఎత్తుకెళ్లిపోతున్నారు. దేశపాత్రునిపాలెం గ్రామ సమీపంలోని ఓ ట్రాన్స్ఫార్మర్ను శనివారం రాత్రి ఎత్తుకెళ్లిపోయారు. గడిచిన రెండు నెలల వ్యవధిలో మండలంలోని పలు గ్రామాలలో ఏడు ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయని ఏఈ అప్పారావు తెలిపారు. కంటకాపల్లి జగనన్న కాలనీలో –2, కాటకాపల్లి జగనన్న కాలనీలో –1, పెదరావుపల్లిలో –2, దాట్ల లే అవుట్లో రెండు ట్రాన్స్ఫార్మర్లను ఎత్తుకెళ్లిపోయారని చెప్పారు. సింగిల్ ఫేజ్ (16 కేవీ సామర్థ్యం) ట్రాన్స్ఫార్మర్లను విద్యుత్ సరఫరా ఉన్నప్పుడే దొంగలు చాకచక్యంగా కిందకు దించి అందులో గల కాపర్‌ను తీసుకొని ట్రాన్స్ఫార్మర్ డొక్కులను అక్కడే వదిలేసి వెళ్లిపోతున్నారు. ఒక్కో ట్రాన్స్ఫార్మర్ విలువ రూ. 2 లక్షలకు పైనే ఉంటుంది. దేశపాత్రునిపాలెంలో జరిగిన దొంగతనంపై గ్రామానికి చెందిన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సైబర్ మోసగాడు అరెస్ట్ ?
● అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ● నిందితుడు ఇంజినీరింగ్ విద్యార్థిగా గుర్తింపు వీరఘట్టం: హోలో .. నేను వీరఘట్టం పోలీస్‌స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాను.. ఎస్సై గారు ఆస్పత్రిలో ఉన్నారు.. అర్జెంట్‌గా రూ.55 వేలు ఫోన్ పే ద్వారా కావాలని నమ్మబలికి 75693 41175 నంబర్ నుంచి ఫోన్ చేసి వీరఘట్టంనకు చెందిన ప్రతాప్ అనే వ్యక్తి నుంచి నిందితుడు రూ.28 వేలు కాజేశాడు. ఈ వ్యవహారంపై ఈనెల 2న సాక్షిలో ‘కానిస్టేబుల్‌నని చెప్పి సైబర్ మోసం’ శీర్షికన ప్రచురితమైన కథనంపై వీరఘట్టం పోలీసులు స్పీడ్‌గా స్పందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు బాధితుడికి వచ్చిన 75693 41175 ఫోన్ నంబర్ ఆధారంగా సైబర్ నేరగాడి ఆచూకీ గుర్తించారు. ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేయగా నిందితుడు కృష్ణా జిల్లా బాపట్లలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వీరఘట్టం పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఐదు రోజుల కిందట బాపట్లకు పయనమయ్యారు. ఎస్సై జి. కళాధర్ వీరఘట్టం నుంచి నిందితుడి ఫోన్‌ను ట్రాక్ చేస్తూ హెచ్‌సీ, కానిస్టేబుళ్లకు దిశానిర్దేశం చేశారు. దీంతో బాపట్లలో నిందితుడ్ని పోలీసులు ఆదివారం చాకచక్యంగా పట్టుకున్నారు. సైబర్ నేరానికి పాల్పడిన వ్యక్తి బీటెక్ చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థిగా గుర్తించారు. ఈ సైబర్ నేరం వెనుక ఉన్న కుట్రదారులందరినీ పట్టుకునే ప్రయత్నంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. నిందితుడ్ని సోమవారానికి వీరఘట్టంనకు తీసుకువస్తారని సమాచారం. వాట్సాప్ గ్రూప్‌పై అనుమానాలెన్నో.... ‘వి.జి.టి.యం నీడ్ మనీ ట్రాన్స్ఫర్స్ వీరఘట్టం’ అనే వాట్సాప్ గ్రూప్‌లో ఈ సైబర్ నేరానికి బీజం పడడంతో పోలీసులు ఈ గ్రూప్ అడ్మిన్‌తో పాటు పెద్ద ఎత్తున మనీ ట్రాన్స్ఫర్స్ చేస్తున్న వారిపై నిఘా వేశారు. ఈ గ్రూప్‌లో ఎవరికై నా డబ్బులు కావాలన్నా, ఫోన్ పే కావాలన్నా గ్రూప్‌లో ఉండే సభ్యులు గతంలో పెట్టిన మెసేజ్‌లు.. ఇంత వరకు జరిగిన అన్ని మనీ ట్రాన్స్‌ఫర్స్‌పై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సైబర్ నేరగాడు నోరు విప్పితే అసలు దొంగలు ఎవరనేది తేలుతుంది. -
నేడు వినతుల స్వీకరణ
విజయనగరం అర్బన్: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించనున్న ప్రజా వినతుల పరిష్కార వేదికలో రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొంటారని మంత్రి కార్యాలయం ప్రతినిధులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినతులు నేరుగా మంత్రి స్వీకరిస్తారని, ఈ అవకాశాన్ని అర్జీదారులు వినియోగించుకోవాలని కోరారు. ఆటో బోల్తా.. ● ఒకరి మృతి ● ఎనిమిది మందికి గాయాలు సీతంపేట: కుమారుడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు వస్తూ ఓ తల్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. రాజన్నగూడకు చెందిన సవర లక్ష్మణ్ సీతంపేటలో గల అడ్వంచర్ పార్కులో గేట్‌మన్‌గా పని చేస్తున్నాడు. ఆదివారం తన పుట్టినరోజును పార్కులో జరుపుకుంటానని చెప్పి భార్యాపిల్లలు, తల్లి, బంధువులను రమ్మని ఆహ్వానించాడు. దీంతో లక్ష్మణ్ తల్లి సవర పెద్దతిక్కమై (60), భార్యా పిల్లలు, బంధువులు ఆటోలో స్వగ్రామం నుంచి అడ్వంచర్ పార్కుకు బయలుదేరారు. సరిగ్గా అక్కన్నగూడ వద్దకు వచ్చే సరికి ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పెద్ద తిక్కమై అక్కడికక్కడే మృతి చెందగా.. సవర ఉషారాణి, స్మిత్, రాషి, సునేమి, రాయమన్స్, సవర సౌజన్య, సవర లీనా, సవర సోహెల్ గాయపడ్డారు. వెంటనే వీరిని స్థానిక సీహెచ్‌సీకి తరలించగా.. ముగ్గురిని శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. తన పుట్టిన రోజునే తల్లి మృతి చెందడం.. కుటుంబ సభ్యులు గాయపడడంతో లక్ష్మణ్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ఎస్సై వై. అమ్మన్నరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చీపురుపల్లి రూరల్ (గరివిడి): గరివిడి మండలంలోని బీజే పాలెం గ్రామానికి చెందిన కడుకట్ల అప్పన్న (60) గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. శనివారం రాత్రి 10:30 గంటల సమయంలో బహిర్భూమి కోసం గ్రామ సమీపంలోని చెరువుకు వెళ్తుండగా.. గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై బి. లోకేశ్వరరావు తెలిపారు. చికిత్సపొందుతూ ఒకరు.. జియ్యమ్మవలస రూరల్: మండలంలోని కుందరతిరువాడ పంచా యతీ నీచుకవలస గ్రా మానికి చెందిన పత్తిక రా జేష్ (24)విశాఖపట్నం గాజువాకలో నూతన గృహానికి పెయింటింగ్‌లు వేసేందుకు వెళ్లి అక్కడ గత నెల 28న విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే స్థానికులు కేజీహెచ్‌కు తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు. కుటుంబాన్ని పోషిస్తున్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు శ్రీనివాసరావు, సునీత, తమ్ముడు రాకేష్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రమాదవశాత్తూ మరొకరు.. చీపురుపల్లి: పట్టణంలోని రైల్వేస్టేషన్లో ట్రాక్‌పై ప్రమాదవశాత్తూ ప్రసాద్ (55) అనే వ్యక్తి మృతి చెందాడని జీఆర్పీ హెచ్‌సీ మధుసూదనరావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. రాజాం మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన ప్రసాద్ విజయవాడలోని ఓ ప్రైవేట్ హోటల్లో పని చేస్తున్నారు. మూడు రోజుల కిందట తన స్వగ్రామమైన బొద్దాం వచ్చిన ఆయన తిరిగి విజయవాడకు వెళ్లేందుకు చీపురుపల్లి రైల్వేస్టేషన్‌కు శనివారం రాత్రి చేరుకున్నాడు. అయితే ప్రసాద్ రైలు నుంచి జారి పడి మరణించాడా.. లేక మరే ఇతర కారణాల వల్ల మరణించాడో అన్న విషయం తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య.. చీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని కొండపాలేం గ్రామంలో కె.బాలరాజు (32) అనే వ్యక్తి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు... బాలరాజు తన భార్య పద్మతో కలిసి శ్రీకాకుళం జిల్లా పలాసలో చెప్పులు కుట్టుకుని జీవనం సాగిస్తుండేవాడు. బాలరాజుకు మద్యం అలవాటు ఉండడంతో నిత్యం భార్యతో గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో పలాస నుంచి కొండపాలెంలో ఉన్న తల్లి యశోద వద్దకు ఇటీవల వచ్చేశాడు. ఆదివారం ఉదయం తల్లితో గొడవపడి ఇంటికి సమీపంలో ఉన్న చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. ఈ సంఘటనకు సంబంధించి ఎస్సై బి.లోకేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేరడి సమీపంలో ఏనుగులు భామిని: మండలంలోని నేరడి బీ సమీపంలో ఏనుగులు ఆదివారం కనిపించాయి. రబీ వరితో పాటు మొక్కజొన్న, కనకాంబరాలు, కూరగాయల పంటలు ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగులు పంట చేలల్లో సంచరిస్తుండడంతో తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు ఏనుగులను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు. -
పోలీసుల సాక్షిగా రాములోరి కల్యాణం
● పెనసాంలో భారీగా మోహరించిన పోలీసులు ● ఉత్కంఠ పరిస్థితుల్లో శ్రీరామ నవమి వేడుకలు గంట్యాడ: మండలంలోని పెనసాంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా సీతారాముల కల్యాణం జరిగింది. పోలీసుల సాక్షిగా సీతారాములు మరోసారి ఒక్కటయ్యారు. అసలు కల్యాణం జరుగుతుందో.. లేదోననే ఉత్కంఠ శనివారం అర్ధరాత్రి 12 గంటల వరకు నెలకొంది. వివరాల్లోకి వెళితే.. పెనసాం గ్రామంలో 25 ఏళ్లుగా లెంక నారాయణప్పడు కుటుంబీకులు శ్రీరామనవమి రోజున కల్యాణం జరిపిస్తూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది కూటమి పార్టీకి చెందిన కొంతమంది ఎప్పడూ ఒకే కుటుంబీకులు కల్యాణం జరిపించాలా... మర్చాలంటూ పట్టుబట్టారు. ఈ క్రమంలో 15 రోజుల కిందట పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు. దీంతో గంట్యాడ పోలీస్ స్టేషన్, విజయనగరం ఆర్డీఓ కార్యాలయంలో పలుమార్లు చర్చలు జరిగాయి. ఏళ్ల తరబడి తమ కుటుంబ సభ్యులే సీతారాముని కల్యాణం జరిపిస్తున్నామని లెంక నారాయణప్పడు కుటుంబీకులు పోలీసులు, అధికారులకు చెప్పారు. అప్పట్లో గ్రామ పెద్దలు, మండల ప్రజాప్రతినిధుల సమక్షంలో లెంక నారాయణప్పడు కుటుంబీకులే కల్యాణం జరిపించాలంటూ చేసిన తీర్మానాలను సైతం అధికారులకు చూపించారు. అయినప్పటకీ కూటమి నేతలు అంగీకరించలేదు. విజయనగరం డీఎస్పీ పెనసాం గ్రామ పెద్దలు, మండల ప్రజాప్రతినిధులు, వైఎస్సార్సీపీ, కూటమి కి చెందిన నేతలతో శనివారం రాత్రి కూడా చర్చలు జరిపారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఎట్టకేలకు లెంక నారాయణప్పడు కుటుంబీకుల్లో ఒకరు, కూటమికి చెందిన ఒకరు కల్యాణం జరిపించడానికి అంగీకరించారు. ఇరువర్గాలు అంగీకరించినప్పటకీ, శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే ఉద్దేశంతో గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్సైలు, 120 మంది వరకు ఇతర సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 144వ సెక్షన్ విధించారు. అన్ని గ్రామాల్లో ప్రశాంతంగా సీతారాముల కల్యాణం జరిగితే.. పెనసాంలో పోలీసుల పహారాలో కల్యాణం జరగడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కల్యాణంలో జెడ్పీటీసీ సభ్యుడు వర్రి నరసింహామూర్తి, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పీరుబండి జైహింద్‌కుమార్, సర్పంచ్ కర్రోతు పాపాయ్యమ్మ , ఎంపీటీసీ సభ్యుడు లెంక మోహనరావు, తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులకు అండగా.. ఈ శ్రమ్
సూచనలతో నమోదు చేసుకునేందుకు కార్మికులు పోటీపడ్డారు. ఇప్పుడు ఎక్కడా ఆ ఊసే లేదు. అసంఘటిత రంగ కార్మికులు, వలస కార్మికులు, చిరు వ్యాపారులకు భరోసా కల్పించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ ఈ – శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇందులో నమోదైన వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. పైగా ఎన్నో సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతాయి. ఈ పోర్టల్‌ను ప్రారంభించి ఏడాది గడిచినా.. నేటికీ చాలా మంది దరఖాస్తు చేసుకోకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. చేకూరే ప్రయోజనాలివి.. ఈ –శ్రమ్‌లో నమోదైతే 12 అంకెలు కలిగిన యూఏఎన్ కార్డులు అందజేస్తారు. ఈ కార్డులు ఉన్నవారికే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, సంక్షేమ పథకాలను వర్తింపజేస్తారు. ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తూ అంగవైకల్యం చెందితే రూ. లక్ష బీమా పరి -
దాడి కేసులో నిందితుడి అరెస్ట్
విజయనగరం క్రైమ్: రెండు రోజుల కిందట యువతిపై దాడి చేసిన నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడ్ని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. గరివిడి మండలం శివరాం గ్రామంలో ఉంటున్న బాధిత యువతికి తన అన్న ద్వారా నిందితుడు గర్ల ఆదినారాయణతో పరిచయం ఉంది. నిందితుడు తరచూ బాధిత యువతి ఇంటికి వస్తుంటాడు. ఇదిలా ఉంటే బాధిత యువతి చెల్లెలు విజయవాడలో ఉంటోంది. నిందితుడు ఫోన్ ద్వారా ఆమెతో కూడా పరిచయం పెంచుకున్నాడు. కొద్ది రోజలుగా నిందితుడు ఆదినారాయణ ఫోన్లో బాధితురాలి చెల్లిని అసభ్య పదజాలంతో వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె శివరాంలో ఉంటున్న సోదరికి చెప్పుకుంది. దీంతో బాధితురాలు తన చెల్లిని ఎందుకు వేధిస్తున్నావని ఆదినారాయణను నిలదీసింది. అలాగే చుట్టుపక్కల వాళ్లకు కూడా చెప్పడంతో ఆదినారాయణ బాధిత యువతితో గొడవపడ్డాడు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన ఇంటిలో వంటపాత్రలు శుభ్రం చేస్తున్న బాధిత యువతిపై నిందితుడు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు ఐదు బృందాలను రంగంలోకి దించింది. గంటల వ్యవధిలో నిందితుడు పట్టుబడడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడ్ని త్వరగా పట్టుకున్న నేపథ్యంలో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు, గరివిడి ఎస్సై లోకేశ్వరరావులను ఎస్పీ అభినందించారు. -
హ్యాకథాన్ పోటీల్లో లక్ష్మీపురం విద్యార్థుల సత్తా
రేగిడి: మండలంలోని లక్ష్మీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇటీవల రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఆమెజాన్ ప్యూచర్ ఇంజనీర్ హ్యాక్‌థాన్ పోటీల్లో ప్రతిభ కనబరిచారు. విశాఖపట్నంలోని హోటల్ గ్రీన్‌పార్క్‌లో నిర్వహించిన పోటీల్లో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన 27 మంది విద్యార్థులు పాల్గొనగా.. లక్ష్మీపురం ఉన్నత పాఠశాలకు చెందిన రేగిడి పూర్ణిమ, తోట నిహారిక, బిందు మాధవి (8వ తరగతి) రాష్ట్ర స్థాయిలో తృతీయ బహుమతి సాధించారు. దీంతో అమెజాన్ సంస్థ పాఠశాలకు ఒక టీవీ, రెండు ల్యాప్‌టాప్‌లు, రెండు ట్యాబ్‌లు పంపించింది. ఈ మేరకు విద్యార్థులను పాఠశాల ఆవరణలో ఆదివారం అభినందించారు. కార్యక్రమంలో హెచ్ఎం ఎం. కృష్ణారావు, ఎంఈఓ ఎంవీ ప్రసాదరావు, బి.ఎరకయ్య, సర్పంచ్ కెంబూరు వెంకటేశ్వరరావు, పీఎంసీ చైర్పర్సన్ కర్నేన రమాదేవి, తదితరులు అభినందించారు. -
క్రమశిక్షణతో విద్యనభ్యసించాలి
రాయగడ: విద్యార్థులు క్రమశిక్షణతో విద్యనభ్యసించాలని పద్మపూర్ సమితి భామిని ప్రాంతంలోని ఐఆర్‌బీఎన్ బెటాలియన్ కమాండెంట్ బ్రజమోహన్ నాయక్ అన్నారు. పద్మపూర్‌లోని అభ్యాస్ టెక్నో పాఠశాల వార్షికోత్సవానికి శుక్రవారం ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యతోనే ప్రగతి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. పద్మపూర్ తహసీల్దార్ శంకర్ బాగ్ మాట్లాడుతూ.. విద్యని వ్యాపారంగా కాకుండా విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని విద్యా సంస్థలను నిర్వహించాలని సూచించారు. విద్యతో పాటు ఇతర అంశాల్లోనూ రాణించేలా ఉపాధ్యాయులు ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి లాడి తుకారం, ప్రిన్సిపాల్ దివ్య దేవాశిష్ దుబే తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు పాఠశాల వార్షికోత్సవం పురస్కరించుకొని రక్తదానం శిబిరం నిర్వహించారు. శిబిరంలో 51 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. -
ఉన్నత లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి
పర్లాకిమిడి: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరుచుకోవాలని అగస్థ్య ఫౌండేషన్ చైర్మన్ కేవీ సాయి చంద్రశేఖర్ సూచించారు. స్థానిక గజపతి స్టేడియం వద్ద శనివారం నిర్వహించిన సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ సునీతా పాణిగ్రాహి 2024–25 విద్యా సంవంత్సరంలో విద్యార్థులు సాధించిన విజయాలను తెలియజేశారు. అనంతరం జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమంలో సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్.రావు, రిజిస్ట్రార్ డా.అనితా పాత్రో, డైరక్టర్ డా.దుర్గాప్రసాద్ పాఢి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -
దుస్తులు సాంప్రదాయానికి ప్రతీకలు
జయపురం: మనం ధరించే దుస్తులు సాంప్రదాయానికి ప్రతీకలని సబ్ కలెక్టర్, మున్సిపల్ కార్యనిర్వాహక అధికారి అక్కవరం శొశ్య రెడ్డి అన్నారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ’అమొ పోషక అమొ పరిచయం’ కార్యక్రమం శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఒడిశా పక్షోత్సవాలు నిర్వహిస్తోందని తెలియజేశారు. ఒడియా భాష, సాహిత్యం, సంస్కృతుల పరిరక్షణ లక్ష్యంతో పక్షోత్సవాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మనం ధరించే సాంప్రదాయ వస్త్రాలు మన స్వాభిమానమని వెల్లడించారు. కార్యక్రమంలో మున్సిపల్ సహాయ కార్య నిర్వాహక అధికారి కతిబాస సాహు తదితరులు పాల్గొన్నారు. -
రక్తదానంతో ప్రాణదానం
జయపురం: రక్తదానంతో ప్రాణదానం చేయవచ్చని గోపబందు ఐటీ కళాశాల ప్రిన్సిపాల్ ఉమాకాంత్ పట్నాయక్ అన్నారు. ఒడియా పక్షోత్సవాలు పురస్కరించుకొని జయపురం సమితి అంబాగుడలోని గోపబందు ఐటీ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం వలన క్షతగాత్రులకు సకాలంలో అవసరమైన రక్తం లభిస్తుందన్నారు. అలాగే తలసేమియా, సికిల్ సెల్, కాన్సర్ వ్యాధిగ్రస్తులకు రక్తనిల్వలు అవసరమని పేర్కొన్నారు. అందువలన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సూచించారు. శిబిరంలో 51 యూనిట్ల రక్తం సేకరించారు. కార్యక్రమంలో ఐటీఐ శిక్షకుడు పి.సతీష్ కుమార్, విష్ణు ప్రసాద్ భటి, రాజేష్ కుమార్ ప్రధాన్, యూత్ రెడ్‌క్రాస్ సలహాదారు నిరంజన్ పాణిగ్రహి, ఒడిశా రక్త దాతల మహాసంఘం ప్రతినిధి ప్రమోద్ కుమార్ రౌలో, సతీష్ కుమార్, ఎస్కే పాడీ తదితరులు పాల్గొన్నారు. -
కదంతొక్కిన గిరిజనులు
మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితి చిత్రంగపల్లి పంచాయతీ ప్రజలు తమ హక్కుల కోసం కదం తొక్కారు. ఈ మేరకు సమితి కార్యాలయం వరకు బాణాలు చేతబట్టి శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బీడీవో ప్రదీప్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎంవీ 72 గ్రామంలో ఇద్దరు విద్యార్థినులు మృతి చెందడంపై న్యాయం చేయాలని కోరారు. విద్యుత్ బిల్లులపై నియంత్రణ అవసరమన్నారు. అటవీ భూములకు పట్టాలు ఇవ్వాలని, తాగునీటి సదుపాయాలు కల్పించాలని విన్నవించారు. కార్యక్రమంలో పంచాయతీ పరిధిలోని వందలాది మంది గిరిజనులు పాల్గొన్నారు. -
రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం మోహన్‌చరణ్
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝీ మూడు రోజుల పర్యటన కోసం సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో అదేరోజు సాయంత్రం కొంతమంది కేంద్రమంత్రులను కలవనున్నారు. అనంతరం మంగళవారం ఢిల్లీ పెట్టుబడిదారుల సమ్మిట్‌లో పాల్గోనున్నారు. ఈ సమ్మిట్‌లో వ్యాపార దిగ్గజాలతో చర్చలు జరిపి ఒడిశాలో పెట్టుబడులకు సానుకూల అవకాశాల గురించి తెలియజేస్తారని సమాచారం. పారాదీప్‌లో నాఫ్తా క్రాకర్ ప్రాజెక్టు స్థాపన కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)తో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం కూడా ఆయన ప్రయాణ ప్రణాళికలో ప్రధాన కార్యక్రమం కావడం విశేషం. తదుపరి ఈనెల 9వ తేదీన రాష్ట్రానికి తిరిగి వస్తారు. నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారంజయపురం: జిల్లా బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం శుక్రవారం ప్రమాణస్వీకారం చేసింది. ఎన్నికల అధికారి, సీనియర్ న్యాయవాది దాశరథి పట్నాయిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా సరోజ్ దాస్, కార్యదర్శిగా సచితానంద మిశ్ర, ఉపాధ్యక్షుడిగా నవీన్ చంద్ర సాహు, కార్యదర్శిగా భోలానాథ్ పట్నాయక్, సహాయ కార్యదర్శిగా అంజన సింగ్, కోశాధికారిగా దేవ రామానుజం ప్రసాద్, గ్రంథాలయ కార్యదర్శిగా యుగల్ కిశోర్ పట్నాయక్, గ్రంథాలయ సహాయ కార్యదర్శిగా రక్షిభాయి, కార్యవర్గ సభ్యులుగా నళినీ కుమారి ఖెముండు, ప్రజ్ఞా కుమారి బెబర్త, తాపస పండ, తరణీ పాణిగ్రహి, సచిన్ పాడి, ఆకాశ కులదీప్, పి.శంకరరావులు ప్రమాణ స్వీకారం చేశారు.మద్యం దుకాణం బంద్ చేయాలి రాయగడ: సదరు సమితి పరిధి పెంటా పంచాయతీ అమలాభట్ట కూడలిలో ఉన్న విదేశీ మద్యం దుకాణాన్ని శాశ్వతంగా బంద్ చేయాలని సర్పంచ్ ఎటల విశ్వనాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామస్తులతో కలిసి మద్యం దుకాణం వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో దుకాణదారుడితో వాగ్వాదం చోటుచేసుకోవడంతో సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. 20 క్వింటాళ్ల విప్పపువ్వు స్వాధీనం రాయగడ: నాటుసారా తయారీకి వినియోగించే విప్పపువ్వును అక్రమంగా తరలిస్తుండగా కాసీపూర్ ఎకై ్సజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి కాసీపూర్ ఎకై ్సజ్ శాఖ ఓఐసీ విష్ణుపద బెహర నేతృత్వంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, కలహండి వైపు వెళ్తున్న ఒక వ్యాన్‌ను ఆపి తనిఖీ చేశారు. దీంతో విప్పపువ్వు బస్తాలు పట్టుబడ్డాయి. దీంతో వ్యాన్ డ్రైవర్ సురేష్ నెమల్పూరిని అరెస్టు చేసి, వ్యాన్‌ను సీజ్ చేశారు. పట్టుబడిన విప్పపువ్వు విలువ సుమారు రూ.90 వేలు ఉంటుందని అంచనా వేశారు. నేడు జగన్నాథుడి దర్శనం తాత్కాలికంగా నిలిపివేత భువనేశ్వర్: పవిత్ర శ్రీరామ నవమి పురస్కరించుకొని పూరీ శ్రీమందిరంలో జగన్నాథుడి దర్శనం ఆదివారం తాత్కాలికంగా నిలిపి వేయాలని నిర్ణయించారు. శ్రీమందిరంలో శ్రీరామ జనన ఉత్సవం ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా మూలవిరాటుల సర్వ దర్శనం 5 గంటల పాటు తాత్కాలికంగా నిలిపివేయబడుతుందని ఆలయ అధికార వర్గాలు తెలియజేశాయి. మధ్యాహ్న ధూపదీప, నైవేథ్యం తర్వాత శ్రీరామ జన్మ ఉత్సవం కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఈ వ్యవధిలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వ దర్శనం ఉండదని పేర్కొన్నారు. -
సారా బట్టీలపై దాడులు
జయపురం: సబ్ డివిజన్ కుంద్ర సమితి రాణిగుడ పంచాయతీ శివునిగుడ గ్రామ సమీపంలో ఇప్ప సారా తయారు చేస్తున్న బట్టీపై కుంద్ర పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఆ ప్రాంతంలో చట్ట విరుద్ధంగా నాటుసారా తయారు చేస్తున్నట్లు సమాచారం అందడంతో కుంద్ర పోలీసు అధికారి అశ్వినీ కుమార్ పట్నాయక్ నేతృత్వంలో పోలీసులు ఉదయం 7 గంటల సమయంలో దాడులు చేపట్టారు. దీనిలో భాగంగా నాటుసారా తయారు చేసేందుకు సిద్ధం చేసిన 2 వేల లీటర్ల ఇప్పఊటను ధ్వసం చేశామని పోలీసు అధికారి పట్నాయక్ వెల్లడించారు. అలాగే 55 లీటర్ల ఇప్పసారాతో పాటు సారా వంటకానికి వినియోగించే సామగ్రిని సీజ్ చేశామని తెలిపారు. దీనిలో భాగంగా ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. -
సిద్ధిదాత్రిగా జగులైమాత దర్శనం
భువనేశ్వర్: జట్నీ మున్సిపాలిటీ కుదియయారి గ్రామ దేవత జగులైమాత వసంత నవరాత్రి మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవా ల్లో తొమ్మిదో రోజు ఉదయం సూర్యపూజ అనంతరం అమ్మవారు నగర పరిక్రమలో భాగంగా గ్రామంలోని అన్ని దేవతలను కలిసిన తర్వాత పెద్ద అక్క దేవస్థానం సందర్శించింది. రోజంతా భక్తుల పూజలు అందుకుంది. సాయంత్రం వేళలో సొంత ఆలయానికి తిరిగి చేరింది. స్వస్థానంలో మహాస్నానం జరిగిన తర్వాత జగులైమాత సిద్ధిదాత్రి రూపంలో భక్తులకు దర్శనమిచ్చింది. షోడశోపచా ర పూజలు, సప్త్తసతీ చండీ ఆహుతి వంటి ప్రత్యేక పూజాదులతో ఉత్సవ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. ఈ సందర్భంగా ప్రత్యేక అలంకరణతో చిన్నారులు కుమారి పూజ ఉత్సవంలో భక్తిశ్రద్ధలతో పాలుపంచుకున్నారు. -
మేమెలా బతకాలి?
జీతాలివ్వకపోతే.. మూతపడిన ప్రసాదాల కౌంటర్ ● అరసవల్లి ఆదిత్యాలయంలో దినసరి వేతనదారుల ఆవేదన ● విధులు బహిష్కరించిన 48 మంది సిబ్బంది ● ప్రసాదాల తయారీ, విక్రయాలు, అన్నదానం నిలిపివేత ● నెలాఖరు వరకు గడువు కోరిన ఈవో భద్రాజీ అరసవల్లి సూర్యనారాయణ స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎంతో ఇష్టమైనవి పులిహోర, లడ్డూ ప్రసాదాలే. మధ్యాహ్నం భక్తదాతలిచ్చిన విరాళాలతో నిర్వహించే అన్నదాన ప్రసాదానికి సైతం తాకిడి అధికంగానే ఉంటుంది. వీటిని తయారుచేస్తున్న వారిలో 99 శాతం మంది దినసరి వేతనదారులే. వీరంతా శనివారం నిరసనకు దిగడంతో ఉదయం నుంచి వంట మొదలు పెట్టలేదు. పులిహోర సిద్ధం చేయలేదు. ఉదయం 6 గంటల నుంచే అమ్మకాలు ప్రారంభం కావాల్సిన ప్రసాదాల కౌంటర్‌కు తాళాలు పడ్డాయి. నిత్యం పంపిణీ చేసే ఉచిత ప్రసాదాలు నిలిపివేశారు. అన్నదాన ప్రసాదం తయారిపై కూడా మధ్యాహ్నం 11 గంటల వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.ఆ తర్వాత ఈవో భద్రాజీ, విభాగ బాధ్యుడు కె.వి.రమణమూర్తిల విజ్ఞప్తి మేరకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన 100 మంది భక్తులకు అన్నదాన ప్రసాదాలు అందేలా దినసరి వేతనదారులే వంటను పూర్తి చేసి భోగం పెట్టించిన అనంతరం భక్తులకు వడ్డించారు. అరసవల్లి ఆలయ చరిత్రలో ఇంతవరకు ఇలాంటి పరిస్థితి రాలేదు. ప్రసాదాలు లేని రోజులు రావడం.. ఇదే తొలిసారి అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయం వద్ద శనివారం ఉదయం 6 గంటలకే సర్వదర్శనాల కోసం గుడి తలుపులు తెరుచుకున్నాయి.. వందలాది భక్తులు దర్శనాలకు వచ్చేసారు. కానీ ఆలయం ముందు చెత్తాచెదారాలు తొలిగించలేదు.. ప్రసాదాల కౌంటర్లు తెరవలేదు..ఉచిత ప్రసాదంతో పాటు లడ్డూ, పులిహోర ప్రసాదాల తయారీ జరగలేదు.. పంపిణీ నిలిచిపోయింది..అసలేం జరుగుతుందో తెలియక అధికారులు అయోమయానికి గురయ్యారు. ఆలయంలో ఎన్నాళ్ల నుంచో పనిచేస్తున్న 48 మంది దినసరి వేతనదారులంతా తమకు రావాల్సిన పెండింగ్ జీతాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూనే.. ఆలయ విధులకు హజరుకాకుండా నిరసనకు దిగడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని గుర్తించారు. దర్శనాలు చేసుకుని తిరిగి వస్తున్న భక్తులకు ప్రసాదాలు లేవనే సమాధానం చెబుతుంటే.. ఆదిత్యాలయానికి ఏమయ్యిందనే ప్రశ్నలు భక్తుల నుంచి వ్యక్తమయ్యాయి. ఇలా ఎన్నడూ జరగలేదని భక్తులు మండిపడ్డారు. చారు. ఇంతవరకు జీతాలు ఇస్తామంటూ కాలయాపన చేశారని.. వారం రోజులుగా విజయవాడ వెళ్లి కూడా తమ సమస్యకు పరిష్కారం చూపకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా చాలాసార్లు ఈవో చెప్పారని, ఎమ్మెల్యే చెప్పారని ఊరుకున్నామని.. ఆఖరికి మంత్రి కూడా భరోసా ఇచ్చినా తమ సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. ఇప్పటికే ఆర్థికంగా ఎంతో నష్టపోయామని, కుటుంబాలతో నెట్టుకురావడం కష్టమైపోయిందని..ఇకనైనా తమకు న్యాయం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఆలయ పారిశుద్ధ్యం, అన్నదాన వంట, ప్రసాదాల తయారి తదితర కీలక విభాగాలతో పాటు టికెట్ల విరాళాలు, ఆర్జిత సేవల టికెట్ కౌంటర్ల విధులకు దినసరి వేతనదారులెవ్వరూ వెళ్లకుండా నిరసనను కొనసాగించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే.. గత ప్రభుత్వం ఉన్నంతవరకు అరసవల్లి ఆలయంలో దినసరి వేతనదారులు ఎప్పటికప్పుడు జీతాలను అందుకునే వారు. రెగ్యులర్ నియామకాలు లేకపోవడంతో దినసరి వేతనదారులే అన్ని పనులకు కీలకంగా మారారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ పనిచేస్తున్న 48 మందిపై వేటు వేస్తూ నిర్ణయాన్ని ప్రకటించారు. మంత్రి అచ్చెన్నాయుడు అయితే జిల్లా కలెక్టర్, కీలక అధికారుల సమక్షంలో వీరిని తొలిగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అలా వీరంతా రోడ్డున పడ్డారు. అప్పటి వరకు వస్తాయనుకున్న పెండింగ్ జీతాలు నిలుపుదల చేశారు. తర్వాత రథసప్తమి ఉత్సవాల సందర్భంగా బాధితులంతా మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే శంకర్లను వేడుకున్నప్పటికీ తమకు న్యాయం జరగలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఏదో ఒక రూపంలో తమ నిరసనను కొనసాగిస్తామంటూ కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు వేతనదారులు ‘సాక్షి’ వద్ద స్పష్టం చేశారు.అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి వార్షిక కల్యాణ బ్రహ్మోత్సవాలు జరుగుతున్న తరుణంలో శనివారం దినసరి వేతనదారులు విధులు బహిష్కరించారు. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న తమ జీతాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈవో వై.భద్రాజీ కార్యాలయం ఎదుట భైఠాయింరెగ్యులర్ సిబ్బంది మినహా మిగిలిన దినసరి వేతనదారులంతా నిరసనకు దిగడం సంచలనంగా మారింది. దీంతో హుటాహుటిన ఆలయానికి వచ్చిన ఈఓ భద్రాజీ.. దినసరి వేతనదారులను పిలిపించి చర్చించారు. వార్షిక కల్యాణ మహోత్సవాలు జరుగుతున్న వేళ ప్రసాదాలు తయారీ, అన్నదానాన్ని ఆపేసి నిరసనలకు దిగడమేంటని ప్రశ్నించారు. పెండింగ్ జీతాల అంశం రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ వద్ద ప్రస్తావించామని, ఈ నెలాఖరు వరకు నిరసనలు చెయ్యొద్దని..తర్వాత మీ ఇష్టమని స్పష్టం చేశారు. ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ కల్యాణ మహోత్సవాలు జరుగుతున్న తరుణంలో ఇలా భక్తులకు ఇబ్బందులు పెట్టొద్దని, ఉన్నతాధికారులు ఈనెలాఖరులోగా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముందని..అంతవరకు సహకరించాలని కోరారు. అయినప్పటికీ దినసరి వేతనదారులు ఎలాంటి స్పందనను తెలియజేయకుండానే వెనుదిరిగారు. తమ సమస్యలపై ఎప్పుడు అడిగినా ఇలాగే చెబుతున్నారని, తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవో చర్చలు.. ప్రసాదాల్లేవ్.. అన్నదానం లేదు.. -
శ్రీరామ నవమికి సన్నాహాలు
రాయగడ: శ్రీరామ నవమి ఉత్సవాలకు పట్టణం సన్నద్ధమైంది. బజరంగ్ దళ్, శ్రీరామ ఉత్సవ కమిటీలు ఉత్సవాల కోసం పట్టణంలో తోరణాలు ఏర్పా టు చేశారు. ఆదివారం ఉదయం 9 గంటల నుంచి స్థానిక జగన్నాథ మందిరం కూడలి నుంచి భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇదిలా ఉండగా స్థానిక బ్రహ్మణ వీధి కూడలిలో కోదండ రామ మందిరం శ్రీరామ నవమి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. జయపురం: పట్టణంలో శ్రీరామ నవమి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఉత్సవ కమిటీల సభ్యులు తెలియజేశారు. పట్టణంలో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ చేపట్టారు. కార్యక్రమంలో సబ్ డివిజన్ పోలీసు అధికారి పార్ధ జగదీష్ కశ్యప్, అదనపు ఎస్పీ మనోజ్ పూజారి, పట్టణ పోలీసు అధికారి ఉల్లాస చంద్ర రౌత్ తదితరులు పాల్గొన్నారు. -
రుకుణ రథయాత్ర
నేత్రపర్వంగా..● మౌసీ మా ఇంటికి లింగరాజు మహా ప్రభువు ● తరలివచ్చిన భక్తజనం ● పక్కాగా భద్రతా ఏర్పాట్లు గణనీయంగా దిగజారింది. ఏటా మాదిరిగా యాత్ర ముందు రోజు శుక్రవారం రాత్రి నిర్వహించిన వేలంలో పవిత్ర మారీచి జల కలశం ధర రూ.21,000లు పలికింది. రుకుణ రథ ప్రతిష్ట ఆచారాల తర్వాత శ్రీలింగరాజ ఆలయ సేవకుల బృందం బొడు నియోగులు ఈ వేలం పాటను నిర్వహించారు.భువనేశ్వర్: పవిత్ర అశోకాష్టమి ఉత్సవంలో అంతర్భాగమైన రుకుణ రథయాత్ర శనివారం వైభవంగా ప్రారంభమైంది. దుర్గాదేవి, గోవింద స్వామితో కలిసి లింగరాజు మహా ప్రభువు మౌిసీ మా (పిన్నమ్మ) దగ్గరకు ప్రయాణమయ్యాడు. దీనిలో భాగంగా రామేశ్వర ఆలయంలో కొలువుదీరి పూజాదులు అందుకోవడం ఆచారం. శనివారం ఉదయం 5 గంటలకు మంగళ హారతి, ప్రాతఃకాల ఆచారాలతో ఉత్సవ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం ఉదయం 5.30 గంటలకు భక్తులకు సర్వ దర్శనం కల్పించారు. మూల విరాటుకు మహా స్నానం ముగించి అలంకరణ ఇత్యాది కార్యక్రమాలను ఉదయం 6.30 గంటల నుంచి 8 గంటల వరకు చేపట్టారు. పటిష్టమైన భద్రత రథయాత్ర సజావుగా సాగేందుకు కమిషనరేట్ పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. భద్రతపై నిఘా కోసం సాధారణ దుస్తుల్లో ఉన్న పోలీసు అధికారులతో కూడిన పదహారు ప్లాటూన్ల పోలీసులను మోహరించారు. సమగ్ర భద్రతా కార్యకలాపాల్లో ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు (డీసీపీలు), ముగ్గురు అదనపు డీసీపీలు, 5 మంది సహాయ కమిషనర్లు (ఏసీపీలు), 12 మంది ఇన్స్పెక్టర్లు, 65 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లను నియమించారు. నగర డీసీపీ జగన్మోహన్ మీనా, ట్రాఫిక్ డీసీపీ తపన్ మహంతి భద్రత మరియు ట్రాఫిక్ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. మారీచి జలానికి తగ్గిన గిరాఖీ రుకుణ రథయాత్రలో మారీచి కుండం జలం ప్రత్యేకమైనది. సంతాన ప్రాప్తికి ఈ జలం అత్యంత ప్రభావవంతంగా పని చేస్తుందని భక్తుల విశ్వాసం. ఏటా రుకుణ రథయాత్ర ముందు రోజు రాత్రిపూట ఈ జలాన్ని వేలం వేస్తారు. భక్తులు ఎగబాకి ఈ జలం కొనుగోలు చేసుకుంటారు. సంతాన ప్రాప్తి కోసం మారీచి కుండం జలం భగవంతుని ప్రసాదంగా భావిస్తారు. అయితే ఈ ఏడాది ఈ జలానికి గిరాఖీ -
సుదర్శన్ పట్నాయక్‌కు ప్రతిష్టాత్మక అవార్డు
భువనేశ్వర్: రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ సైకత శిల్పి పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ ఈసారి బ్రిటిష్ శశాండ్ మాస్టర్ అవార్డును గెలుచుకున్నారు. యూకేలోని వేమౌత్‌లో జరిగిన ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సైకత కళా ఉత్సవం శాండ్ వరల్డ్ – 2025లో ఆయన ప్రతిష్టాత్మక ఫ్రెడ్ డారింగ్టన్ బ్రిటిష్ సాండ్ మాస్టర్ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డుని అందుకున్న తొలి భారతీయ సైకత శిల్పిగా నిలవడం విశేషం. ప్రపంచ శాంతి సందేశంతో రూపొందించిన 10 అడుగుల సైకత గణపతి శిల్పానికి ఈ అవార్డు లభించినట్లు తెలిపారు. బగ్గు సరోజినీ దేవి ఆస్పత్రికి ఎన్ఏబీహెచ్ గుర్తింపు శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జిల్లా కేంద్రంలోని బగ్గు సరోజినీ దేవి(బీఎస్‌డీ) ఆస్పత్రికి జాతీయ స్థాయిలో నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొవైడర్స్(ఎన్ఏబీహెచ్) గుర్తింపు దక్కడం ఆనందంగా ఉందని డాక్టర్ బగ్గు శ్రీనివాసరావు అన్నారు. ఇది దేశంలో క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (క్యూసీఐ) కింద నమోదైన ఒక స్వయం ప్రతిపత్తి సంస్థ అని చెప్పారు. ఆస్పత్రిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సంరక్షణ, సౌకర్యాలు, అత్యుత్తమ సేవలు అందిస్తున్నందుకు గాను గుర్తింపు లభించిందన్నారు. 9 సూపర్‌స్పెషాలిటీ విభాగాలతో పాటు 12 డయాగ్నోస్టిక్స్ సేవలకు గుర్తింపు లభించిందన్నారు. శ్రీకాకుళం జిల్లా చరిత్రలో తొలిసారిగా ఈ గుర్తింపు పొందిన ఏకై క ఆసుపత్రిగా బీఎస్‌డీ అని పేర్కొన్నారు. నిరుపేదలు, సామాన్యులకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలందిస్తున్నట్లు చెప్పారు. ‘ఆపరేషన్ కగార్‌ను వ్యతిరేకిద్దాం’ టెక్కలి: అడవులను కొల్లగొట్టి కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ఆపరేషన్ కగార్‌ను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్ కోరారు. శనివారం టెక్కలిలో మాట్లాడుతూ అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ సంస్థలకు అడవులను కట్టబెట్టేందుకు మోదీ సర్కార్ పెద్ద కుట్రలు చేస్తున్నారని గుర్తు చేశారు. మావోయిస్టుల నుంచి అడవుల్ని విముక్తి చేసే పేరుతో పెద్ద కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ.లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను దోచుకునే ప్రయత్నమే ఆపరేషన్ కగార్ అని అన్నారు. దీని కోసం ఆదివాసీలను, మావోయిస్టులను హతమారుస్తున్నారని ప్రసాద్ ఆరోపించారు. ఆపరేషన్ కగార్‌ను దేశ వ్యాప్తంగా వ్యతిరేకించాలని కోరారు. అలాగే ఈ నెల 13 ఆదివారం పలాసలో జరగనున్న కామ్రేడ్ పైల వాసుదేవరావు వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాశ్, జిల్లా పార్టీ సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, జుత్తు వీరాస్వామి, గొరకల బాలకృష్ణ, సార జగన్ తదితరులు పాల్గొన్నారు. వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్ నిరసన శ్రీకాకుళం అర్బన్: వక్ఫ్ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం యావత్ ముస్లిం సమాజానికి వ్యతిరేకమని డీసీసీ అధ్యక్షుడు అంబటి కృష్ణారావు అన్నారు. ఈ మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శనివారం శ్రీకాకుళం మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వక్ఫ్ బిల్లులో ఇతర మతస్థులు సభ్యులుగా ఉంటారని తెలియజేయడం శోచనీయమన్నారు. బీజేపీ ప్రభుత్వం మత స్వేచ్ఛను హరిస్తూ కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతోందని ధ్వజమెత్తారు. ఇది లౌకిక వాద సమాజానికి మంచిది కాదని పేర్కొన్నారు. నిరసన కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెంబూరు మధుసూదనరావు, డీసీ ప్రధాన కార్యదర్శి కేవీఎల్‌ఎస్ ఈశ్వరి, సైదుల్లా ఖాన్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు అంబటి దాలినాయుడు, జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు చాన్ బాషా, నియోజకవర్గాల నాయకులు ఆబోతుల వెంకటనాయుడు, ఇజ్జురోతు రమణ, బొచ్చ వెంకటరమణ, మామిడి సత్యనారాయణ, కొత్తపల్లి రాంప్రసాద్, బాషా బాబు, సూరియా బేగం, చోడవరం లీలావతి, చోడవరం చంద్రశేఖర్ పాల్గొన్నారు. -
టెక్కలిని మున్సిపాలిటీగా మారుస్తాం
టెక్కలి/సంతబొమ్మాళి: జిల్లా కేంద్రానికి ధీటుగా టెక్కలిని అభివృద్ధి చేస్తామని.. అయితే పంచాయతీగా ఉంటే సాధ్యం కాదు కాబట్టి దశల వారీగా మున్సిపాలిటీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. సుమారు రూ.1.43 కోట్ల అంచనా వ్యయంతో టెక్కలి–చెట్లతాండ్ర రోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా మార్గంలో పర్యటించే క్రమంలో చిరు వ్యాపారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఇక్కడే జీవనోపాధి చేస్తున్నామని ఇప్పుడు రోడ్డు విస్తరణతో రోడ్డున పడతామని వాపోయారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. టెక్కలిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబంలో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామన్నారు. అంతకుముందు టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నూతన బస్సులను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, ఆర్అండ్బీ ఎస్ఈ కె.జాన్ సుధాకర్, టీడీపీ నాయకులు కె.హరివరప్రసాద్, బి.శేషగిరి, కె.లవకుమార్, ఎం.దమయంతి, ఎం.రాము, ఎల్.శ్రీనివాస్, కె.కామేష్, ఆర్ అండ్ బీ అధికారులు డీఈ రవికాంత్, జేఈ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు -
సేవాయత్‌ల ఉత్తమ ప్రవర్తనకు శిక్షణ
భువనేశ్వర్: పూరీ శ్రీ జగన్నాథ దేవస్థానం దైనంది న కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న సేవాయ త్ వర్గానికి ప్రత్యేక శిక్షణ శిబిరం నిర్వహించారు. స్థానిక నీలాద్రి భక్త నివాస్‌లో 2 రోజుల పాటు కొన సాగనున్న సేవకుల శిక్షణ శిబిరం శుక్రవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీ మందిరం ప్రధాన పాలన అధికారి సీఏఓ, పూరీ జిల్లా మేజిస్ట్రే ట్, పోలీసు సూపరింటెండెంటు సమక్షంలో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవకునికి ఉన్నత లక్షణాలను వివరిస్తు ప్రధాన అంశాల్ని సీఏఓ ప్రస్తావించారు. అన్ని వర్గాల సేవకులకు ఉండాల్సిన 10 ప్రధాన అంశాలను ఆయన పేర్కొన్నారు. ఈ శిక్షణ, సదస్సు ప్రతి రోజు సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు కొనసాగుతుంది. ఈ శిబిరంలో వివిధ అంశాలపై చర్చలు ఉంటాయని పేర్కొన్నారు. -
రాజధాని స్థాపన దినోత్సవానికి సన్నాహక సమావేశం
భువనేశ్వర్: రాజధాని స్థాపన దినోత్సవం ఈ నెల 13, 14 తేదీల్లో వరుసగా రెండు రోజులు జరుపుకోనున్నారు. కార్యక్రమం జయప్రదం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ముగిసిన ఉన్నత స్థాయి సమావేశం తీర్మా నాల వాస్తవ కార్యాచరణకు సంబంధించి శుక్రవా రం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థానిక క్యాపిటల్ ఉన్నత పాఠశాల సమావేశం హాలులో అదనపు జిల్లా మేజిస్ట్రేట్ రుద్ర నారాయణ్ మహంతి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ ఏడాది రాజధాని స్థాపన దినోత్సవం వైభవంగా ఆకర్షణీ య ప్రదర్శనలతో జరుపుకోవాలని నిర్ణయించారు. విద్యార్థుల కవాతు కళాశాల స్థాయికి పరిమితం చేశారు. ఈ సందర్భంగా వివిధ పోటీలను నిర్వహించాలని ఉత్సవ నిర్వాహక మండలి నిర్ణయించింది. రాష్ట్రంలో వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని పరేడ్ బ్యాండ్లు ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల విద్యార్థులకు మాత్రమే పరేడ్‌లో పాల్గొనేందుకు అనుమతించనున్నారు. మన రాజ ధాని శీర్షికపై పాఠశాల, కళాశాల విద్యార్థుల మధ్య వివిధ నృత్య, పాటల పోటీలు నిర్వహిస్తారు. స్థాని క రవీంద్ర మండపంలో ఈ పోటీలు జరుగుతాయ ని ప్రకటించారు. రాజధాని నగరం స్థాపన దినోత్స వం పురస్కరించుకుని వరుసగా రెండు రోజులు సాయంత్రం స్థానిక ఉత్కళ్ మండపంలో సదస్సు, చర్చ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమావేశంలో రాజధాని స్థాపన దినోత్సవ నిర్వాహక కమిటీ చైర్మన్ ప్రదోష్ పట్నాయక్, భువనేశ్వర్ మున్సిపల్ కార్పొరేషన్ బీఎంసీ సహాయ కమిషనర్ కె. గణేష్, మాధ్యమిక విద్యా విభాగం సహాయ డైరెక్టర్ హిమాన్షు శేఖర్ బెహరా, భువనేశ్వర్ మండల విద్యాధికారి బీఈఓ డాక్టర్ ప్రజ్ఞా పరమిత జెనా, ఖుర్ధా మండల విద్యాధికారి బీఈఓ సంధ్యారాణి రౌత్, క్యాపిటల్ హై స్కూల్ ప్రిన్సిపాల్ అనుపమ మంగరాజ్, క్యాపిటల్ ఫౌండేషన్ డే కమిటీ వైస్ చైర్మన్ ప్రద్యుమ్న కుమార్ మహంతి, ప్రధాన కార్యదర్శి సనత్ మిశ్రా, వివిధ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. -
టెక్కలిని మున్సిపాలిటీగా మారుస్తాం
టెక్కలి/సంతబొమ్మాళి: జిల్లా కేంద్రానికి ధీటుగా టెక్కలిని అభివృద్ధి చేస్తామని.. అయితే పంచాయతీగా ఉంటే సాధ్యం కాదు కాబట్టి దశల వారీగా మున్సిపాలిటీ చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. సుమారు రూ.1.43 కోట్ల అంచనా వ్యయంతో టెక్కలి–చెట్లతాండ్ర రోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా మార్గంలో పర్యటించే క్రమంలో చిరు వ్యాపారులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా ఇక్కడే జీవనోపాధి చేస్తున్నామని ఇప్పుడు రోడ్డు విస్తరణతో రోడ్డున పడతామని వాపోయారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఇళ్లు కోల్పోయిన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు. టెక్కలిలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రజలకు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. కుటుంబంలో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం కింద రూ.15 వేలు ఇస్తామన్నారు. అంతకుముందు టెక్కలి ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో నూతన బస్సులను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఎం.కృష్ణమూర్తి, ఆర్అండ్బీ ఎస్ఈ కె.జాన్ సుధాకర్, టీడీపీ నాయకులు కె.హరివరప్రసాద్, బి.శేషగిరి, కె.లవకుమార్, ఎం.దమయంతి, ఎం.రాము, ఎల్.శ్రీనివాస్, కె.కామేష్, ఆర్ అండ్ బీ అధికారులు డీఈ రవికాంత్, జేఈ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు -
పెను ప్రమాదం తప్పింది!
హమ్మయ్యా.. ఎచ్చెర్ల క్యాంపస్: జాతీయ రహదారిపై ఫరీదుపేట కూడలి కొయ్యరాళ్లు సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారికి స్వల్ప గాయాలు కాగా, ఆమె తల్లిదండ్రులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నరసింహమూర్తి అనే ఉపాధ్యాయుడు విధులు ముగించుకుని శ్రీకాకుళంలోని పీఎన్ కాలనీలోని తన నివాసానికి కారులో వెళ్తున్నారు. అదే సమయంలో ఒడిశా వైపు వెళుతున్న కారు కొయ్యరాళ్లు సమీపంలోకి వచ్చేసరికి అదుపు తప్పి ఉపాధ్యాయుడి కారును ఢీకొట్టారు. ఈ ఘటనలో టీచర్ కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఒడిశా వైపు వెళ్తున్న కారులో చిన్నారి లిఖితకు స్వల్ప గాయాలయ్యాయి. భార్యాభర్తలకు ఎటువంటి గాయాలు కాలేదు. ఎచ్చెర్ల ఎస్సై సందీప్‌కుమార్ ఘటనా పరిశీలించారు. చిన్నారిని ఆస్పత్రిలో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు. హైవేపై రెండు కార్లు ఢీ చిన్నారికి గాయాలు.. క్షేమంగా బయటపడిన తల్లిదండ్రులు -
బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకారం
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా బార్ అసోసి యేషన్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. శుక్రవారం ఎన్నికల రిటర్నింగ్ అధికా రి సీహెచ్ బాబా యుగంధర్, సహాయ అధికా రి కిషోర్ పట్నాయక్‌లు ఈ కార్యక్రమం నిర్వహించారు. బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సిరాజుద్ధీన్ అహ్మద్, కార్యదర్శిగా తపన్ సింగ్, ఉపాధ్యక్షుడిగా సదాశివ సాహు తదితరులు ప్రమాణ స్వీకారం చేశారు. పర్లాకిమిడిలో ఉపవాస దీక్షలు పర్లాకిమిడి: చైత్రమాసం సందర్భంగా పర్లాకమిడి పట్టణంలో మాకాళీ దోండోనచో ఉపవాస దీక్షలు రెండు రోజులుగా జరుగుతున్నాయి. సాయంత్రం వేళ వివిధ వీధుల్లో గాలిదోండో, పాణిదోండో విన్యాసాలు కాళీ సాధకులు చేస్తున్నారు. ఈ నెల 10వ తేదీ వరకూ ఉత్సవాలు, సాంస్కృతి కార్యక్రమాలు జరుగనున్నాయి. ఫైనల్స్‌లో పంజాబ్ లవ్లీ విశ్వవిద్యాలయం గెలుపు పర్లాకిమిడి: ఆర్.సీతాపురం సెంచూరియన్ వర్సిటీ క్యాంపస్‌లో జరుగుతున్న మూడో అఖిల భారత విశ్వవిద్యాలయాల స్టూడెంట్స్ పార్లమెంట్ సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ ముగింపు సమావేశాలలో బహుమతి ప్రదాన సభకు ముఖ్యఅతిథిగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పాల్గొని మాట్లాడారు. నేటి మహిళలు భాగస్వామ్యులు మాత్రమే కాదు... మార్పునకు మార్గదర్శులు కూడా అని అన్నారు. నాలుగు రోజుల పాటు సాగిన వివిధ విశ్వవిద్యాలయాల గర్ల్ స్టూడెంట్స్ పార్లమెంటులో పంజాబ్ లవ్లీ యూనివర్సిటీ చాంపియన్స్‌గా నిలవగా, ద్వితీయ బహుమతి బాబాసాహెబ్ అంబేడ్కర్ వర్సిటీ, సంత్గడ్గే బాబా అమరావతి విశ్వవిద్యాలయం తృతీయ బహుమతి గెలుచుకున్నారు. వారికి పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష బహుమతి ప్రదా నం చేశారు. కార్యక్రమంలో సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య డి.ఎన్.రావు, ఆంధ్రప్రదేశ్ సెంచూరియన్ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ పి.కె.మహంతి, వీసీ బిశ్వజిత్లు జ్యూరీ మెంబర్లుగా వ్యవహరించారు. భువనేశ్వర్ సెంచూరియన్ వర్సిటీ ఉపకులపతి డా. సుప్రియా పట్నాయిక్ బహుమతి ప్రదానోత్స వంలో పాల్గొన్నారు. రెండు కేజీల గంజాయితో ముగ్గురు అరెస్టు ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పట్టణ పరిధిలో 2 కేజీల 140 గ్రాముల గంజాయితో ముగ్గురు వ్యక్తులను పట్టణ పోలీసులు అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డీఎస్పీ వి.వెంకటఅప్పారావు తెలిపా రు. ఇచ్ఛాపురం సీఐ కార్యాలయం ఆవరణంలో శుక్రవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఒడిశాకు చెందిన లక్ష్మికాంత్ బలియార్, అతని బావ మోహన్దాస్ప్రదాన్లు ఆర్థిక పరి స్థితి బాగులేకపోవడంతో గంజాయి వ్యాపారం చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో లక్ష్మికాంత్ గంజాయిని మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతంలో విక్రయించి వచ్చిన మొత్తాన్ని సమానంగా పంచుకునేవారు. ఈ క్రమంలో అక్కడి గంజాయి వ్యాపారి షాహాజి రామజాదవ్తో సికింద్రాబాద్‌లో పరిచయం ఏర్పడింది. తనకు కిలో గంజాయి అందజేస్తే రూ.7500 చెల్లిస్తానని చెప్పడంతో గంజాయి కొనుగోలు చేసి ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్ వద్దకు వచ్చారు. వీరితో పాటు అక్కడికి వచ్చిన రామజాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. మిస్టర్ ఆంధ్రా పోటీల్లో సిక్కోలు హవా శ్రీకాకుళం న్యూకాలనీ: మిస్టర్ ఆంధ్రా బాడీబిల్డింగ్ పోటీల్లో శ్రీకాకుళం బాడీబిల్డర్లు సత్తాచాటారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో శుక్రవారం నిర్వహించిన మిస్టర్ ఆంధ్రా బాడీబిల్డింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో కవిటి చెందిన దుదిస్టీ మజ్జి 55 కేజీల విభాగంలో విజేతగా నిలిచారు. ఎస్.వైకుంఠరావు(శ్రీకూర్మం) 60 కేజీల విభాగంలో 4వ స్థానం, కె.అవినాష్ (పలాస) తదితరులు రాణించారు. వీరిని భీమవరానికి చెందిన ఎమ్మెల్యే అంజిబాబు, సంఘ రాష్ట్ర అసోసియేట్ సెక్రటరీ వి.విజయ్ బహుమతులు అందజేశారు. వీరిని శ్రీకాకుళం జిల్లా సెక్రటరీ కె.గౌరీశంకర్, అధ్యక్షులు తారకేశ్వరరావు, చీఫ్ పేట్రన్ డాక్టర్ బాడాన దేవభూషణ రావు, వడ్డాది విజయ్‌కుమార్, బలగ ప్రసాద్, సీనియర్ బాడీబిల్డర్లు, జిమ్ నిర్వాహకులు, కోచ్‌లు అభినందించారు. -
సమస్యల పరిష్కారంపై మున్సిపల్ చైర్మన్ దృష్టి
కొరాపుట్: నాయకుల వద్ద ప్రజలు స్వయంగా వెళ్తే గాని సమస్యలు పరిష్కారం కావడం లేదు. కానీ కొరాపుట్ జిల్లా సునాబెడా మున్సిపల్ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర కుమార్ పాత్రో విభిన్న శైలి అవలంబించారు. తానే రోజుకొక వార్డుకు వెళ్లి ప్రజల సమస్యలు అడిగి పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఒకటో వార్డు పరిధి బాపూజీనగర్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలు చైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు. బోరింగ్ నీటిలో పురుగులు వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆయన తక్షణమే కొత్త బోరు వేయించేందుకు హామీ ఇచ్చారు. అలాగే అక్కడ ఉన్న బావికి మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. -
భ్రూణ హత్యలు నివారించాలి
జయపురం: సమాజంలో భ్రూణ హత్యలు నివారించాల్సిన అవసరం ఉందని స్వచ్ఛంద సేవకురాలు ప్రియదాస్ అన్నారు. స్థానిక ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలో బేటీ బచావో.. బేటీ పడావో కార్యక్రమాన్ని హెచ్ఎం అభిషేక్ కుమార్ భుయె అధ్యక్షతన శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రియదాస్ మాట్లాడుతూ.. సమాజంలో ఆడపిల్లలు అంటే చిన్నచూపు పోవాలంటే ముందుగా అందరిలో చైతన్యం రావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఉన్నత విద్యనభ్యసించి, ఉత్తమంగా స్థిరపడాలని ఆకాంక్షించారు. అలాగే పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. పురుషాధిక్య సమాజంలో బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు, అత్యాచారాలపై విద్యార్థులు నాటికను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు అన్నపూర్ణ సుందరరాయ్, సంజుక్త మహరాణ, స్వర్ణలత మిశ్ర, సబితా కుమారి పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
హిందూ – ముస్లింలను విడదీసే కుట్ర
● రాజ్యసభ సభ్యుడు మున్నా ఖాన్కొరాపుట్: దేశంలో హిందూ – ముస్లింలను విడదీసే కుట్ర జరుగుతోందని బీజేడీ రాజ్యసభ ఎంపీ, ఒడియా సినీహీరో ముజిబుల్లా ఖాన్ (మున్నా ఖాన్) ఆరోపించారు. గురువారం రాత్రి పార్లమెంట్లో ఆయన మాట్లాడుతూ.. తన స్వస్థలం ఒడిశాలో నబరంగ్‌పూర్ జిల్లాలోని కుగ్రామం అన్నారు. తమ గ్రామంలో హిందువుల అమ్మవారి జాతరలు జరిగినప్పుడు తన కుటుంబ పెద్దలు ముందుంటారన్నారు. తమకు అక్కడ వేర్వేరు మతాలు అనే భావనలు ఉండవని పేర్కొన్నారు. ఒడిశాలోని ప్రతీ వ్యక్తి మతాలకు అతీతంగా జగన్నాథ స్వామివారిని నమ్మతామని పేర్కొన్నారు. ఖుర్దా జిల్లాలో పవిత్ర రథయాత్రలో భాగంగా చెరాపొరని ఒక ముస్లిం నిర్వహిస్తాడని వెల్లడించారు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తన విధానాలతో ఇరుమతాల ప్రజల్లో అనేక భయాలు సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. వక్ఫ్ బోర్డు మీద కేంద్ర ప్రభుత్వం పగ తీర్చుకుంటోందని విచారం వ్యక్తం చేశారు. -
యువ డాక్టర్ రక్తదానం
కొరాపుట్: వైద్యుడు దేవుడుతో సమానం అనే మాట నిరూపించాడు ఆ యువ డాక్టర్. నబరంగ్‌పూర్ జిల్లా కేంద్ర ఆస్పత్రికి ఓ మహిళను అత్యవసర చికిత్స కోసం బంధువులు శుక్రవారం తీసుకొచ్చారు. రోగిని పరిశీలించిన యువ డాక్టర్ సుమంత్ రంజన్ బాల్ ఆమెకి రక్తం ఎక్కించాల్సి ఉందని బంధువులకు వివిరించారు. అత్యవసర సమయంలో ఆమెకి రక్త లభించలేదని వారు చేతులెత్తేశారు. దాంతో ఆలోచించిన సుమంత్ తనది ఆమె గ్రూప్ కావడంతో రక్తదానం చేసి ప్రాణదానం చేశారు. డాక్టర్‌ను అక్కడ ఉన్నవారు అభినందించారు.పాముకాటుతో ఏడేళ్ల బాలిక మృతి జయపురం: జయపురం సబ్‌డివిజన్ కుంధ్ర సమితి దిగాపూర్ పంచాయతీ ప్రధానిపుట్ గ్రామంలో దొయిమతి గుండి కుమార్తె చుమి (7) పాముకాటుకు గురై మృతి చెందిందని బొయిపరిగుడ పోలీసులు శుక్రవారం వెల్లడించారు. దొయిమతి తన ముగ్గురు పిల్లలతో గురువారం ఇంటిలో నిద్రిస్తున్న సమయంలో అకస్మాత్తుగా చుమి అరుస్తూ లేచింది. ఏదో కరిచిందని చెప్పగా.. ఇంటి వారంతా లేచి చూశారు. పాము కరిచి ఉంటుందని బాలికను వెంటనే బైక్‌పై జయపురం జిల్లా కేంద్రాస్పత్రికి తీసుకువచ్చారు. బాలికను పరీక్షించిన డాక్టర్ చుమి ఆమె మరణించినట్లు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు బొయిపరిగుడ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.వివాహిత ఆత్మహత్య మల్కన్‌గిరి: జిల్లాలోని కలిమెల సమితిలో వివాహిత ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కలిమెల సమితి ఎంవీ 70 గ్రామానికి చెందిన ప్రసంజిత్ దత్తకు, బలిమెల పోలీసుస్టేషన్ పరిధి ఎంవీ 109 గ్రామానికి చెందిన రామకృష్ణ కబిరాజ్ కుమార్తె ప్రమీలతో గతేడాది వివాహం జరిగింది. అయితే గత ఆరు నెలలుగా ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. దీంతో అత్తింటి వేధింపులు తాళలేక ప్రమీల పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా ఇటీవల మరలా తిరిగి ఆమె భర్త, కుటుంబ సభ్యులు తీసుకొచ్చారు. కాగా కొద్దిరోజుల్లోనే తన గదిలో ఉరివేసుకొని మృతి చెందింది. అయితే తన కుమార్తెను అత్తింటివారే హత్య చేశారని మృతురాలి తండ్రి ఆరోపించారు. ఘటనా స్థలానికి ఐఐసీ చంద్రకాంత్ తండి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కొరాపుట్ నుంచి సైంటిఫిక్ బృందం వచ్చాక మృతికి కారణాలు తెలిసే అవకాశం ఉంది.చోరీ కేసులో ఇద్దరు అరెస్టు రాయగడ: చోరీ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను జిల్లాలోని అంబొదల పోలీసులు గురువారం అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. వారివద్ద నుంచి రెండు మొబైల్ ఫోన్లు, 50 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్ భువనేశ్వర్: అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ పేలి బాలింత తీవ్రంగా గాయపడిన ఘటన బొలంగీర్ జిల్లా టిట్లాగడ్ ప్రాంతంలో శుక్రవారం చోటు చేసుకుంది. పసికందుతో బాలింతని అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా ఆక్సిజన్ సిలిండర్ ఆకస్మికంగా పేలింది. ఈ పేలుడులో బాలింతకు గాయాలయ్యాయి. ఈమెతో పాటు మరో 2 మంది బంధువులు స్వల్పంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తు ప్రాణహాని సంభవించకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాధిత మహిళని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చారు. -
వనదుర్గా మందిరంలో బుద్ధుని విగ్రహ ప్రతిష్ట
పర్లాకిమిడి: స్థానిక దుర్గంపేటలో వనదుర్గా మందిరం ఆవరణలో శుక్రవారం బుద్ధుని విగ్రహాన్ని చంద్రగిరి టిబెటియన్ శరణార్థుల గురూజీ ఖెంపో పెమా ప్రతిష్టించారు. శాంతికి చిహ్నం బుద్ధుడు అని, ఈ ప్రాంతంలో బుద్ధ విగ్రహం ప్రతిష్టించడంతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తోందని అన్నారు. తొలుత టిబెటియన్ మతగురు దలైలామా శిష్యులు లామా గెలక్, ఖెంపో పెమా గురూజీలను పట్టణంలో మార్కెట్ నుంచి కొత్త బస్టాండ్ వరకు ఊరేగించారు. అనంతరం కండ్రవీధి వద్ద దుర్గంపేటలో నూతన వనదుర్గా మందిరం ఆవరణలో నిర్మించిన బుద్ధుని విగ్రహాన్ని మంత్రోచ్ఛరణ చేసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బౌద్ధ లామాలు తెసిరింగ్, బయాంగ్, లోపోన్ సోనమ్ గ్యంస్తో, నోర్బు, లోపోన్ పసాంగ్ దోర్జి మరో ఎనిమిదిమంది బౌద్ధ తీర్ధాంకుల సహకారంతో మంత్రోచ్ఛరణ చేసి పవిత్ర జలాలను విగ్రహంపై జల్లారు. అనంతరం బుద్ధుని విగ్రహాన్ని లాంఛనంగా గురూజీ ఖెంపోసెమా ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఖెంపో పెమా గురుజీ, లామా గెలక్ను వనదుర్గా ఆలయ కమిటీ తరపున బౌధ్ధ చిత్రాన్ని బహుకరించి, దుశ్శాలువతో సత్కరించారు. -
మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
కొరాపుట్: రోడ్డు ప్రమాద బాధితులను నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే గౌరీ శంకర్ మజ్జి ఆదుకుని మానవత్వం చాటుకున్నారు. గురువారం నబరంగ్‌పూర్ జిల్లా నందాహండి సమితి వైపు ఎమ్మెల్యే వెళ్తున్నారు. అదే సమయంలో కుంటియా జంక్షన్ వద్ద బైక్ యాక్సిడెంట్ జరిగి ఇద్దరు క్షతగాత్రులు రోడ్డు పక్కన తోటలో పడి ఉన్నారు. ఇది గమనించిన ఎమ్మెల్యే తన వాహనం నిలిపి వారి వద్దకు వెళ్లి మంచినీరు తాగించారు. వెంటనే పోలీసులకు, జిల్లా కేంద్ర ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. అత్యవసర వాహనం 112లో వారిని ఆస్పత్రికి పంపించారు. -
భారీ వర్షంతో రాకపోకలు బంద్
కొరాపుట్: కొరాపుట్–సునాబెడా పట్టణాల మధ్య గురువారం వేకువజామున కురిసిన భారీ వర్షానికి జాతీయ రహదారి స్తంభించిపోయింది. ఆ ప్రాంతంలో ప్రస్తుతం నిర్మితమవుతున్న మార్గం బురదమయం కావడంతో ఈ దుస్థితి నెలకొంది. రాయ్‌పూర్–విశాఖపట్నం జాతీయ రహదారి–26 కావడంతో దాని ప్రభావం మూడు రాష్ట్రాలపై పడింది. రాత్రిపూట సుదూర ప్రాంతాల నుంచి వచ్చి, వెళ్లే అంతర్రాష్ట్ర బస్సులు పదుల సంఖ్యలో నిలిచిపోయాయి. సుమారు 7 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోవడం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిలిచిపోయిన వాహనాల్లో అంబులెన్సులు కూడా ఉండడంతో రోగులకు అవస్థలు తప్పలేదు. -
రాత్రంతా కొనసాగిన సభ
రాష్ట్ర శాసన సభ భువనేశ్వర్: శాసన సభ చరిత్రలో కొత్త రికార్డు నెలకొంది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత రాత్రి అంతా సభ నిరవధికంగా కొనసాగింది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు శాసన సభ రాత్రంతా కొనసాగింది. విశ్వవిద్యాలయ సవరణ బిల్లు–2024 గురువారం ఉదయం 4.29 గంటలకు ఆమోదించారు. ఆ వెంబడి రాష్ట్ర రహదారుల అథారిటీ బిల్లు 2024ను సహాయ మంత్రి పృథ్వి రాజ్ హరిచందన్ ప్రవేశ పెట్టారు. విశ్వవిద్యాలయ సవరణ బిల్లుపై ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య సుదీర్ఘంగా వాడీవేడీ చర్చ జరిగింది. ప్రతిపక్ష పార్టీ తరఫున సీనియర్ ఎమ్మెల్యేలు రణేంద్ర ప్రతాప్ స్వంయి, డాక్టర్ అరుణ్ కుమార్ సాహు, గణేశ్వర్ బెహరా, ధ్రువ్ చరణ్ సాహు బిల్లుకు వ్యతిరేకంగా బలమైన వాదనలు లేవనెత్తారు. ఉన్నత విద్యా విభాగం మంత్రి సూర్య వంశీ సూరజ్ కూడా ప్రతిపక్షాలకు ధీటుగా స్పందించారు. అధికార పార్టీకి చెందిన దాదాపు అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఓటింగ్ జరుగుతున్నప్పుడు హాజరు కాని ఎమ్మెల్యేలు ఎందుకు రాలేదని ముఖ్యమంత్రి నిలదీశారు. గైర్హాజరైన ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి ఫోన్ చేసి ఎందుకు హాజరు కాలేదని అడిగారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు విశ్వవిద్యాలయ సవరణ బిల్లు–2024పై చర్చ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రతిపక్షం, అధికార పక్షం మధ్య తీవ్ర వాగ్యుద్ధం చోటు చేసుకుంది. విపక్ష బిజూ జనతా దళ్ ఎమ్మెల్యే డాక్టర్ అరుణ్ కుమార్ సాహు 3 గంటల 10 నిమిషాలకు పైగా, రణేంద్ర ప్రతాప్ స్వంయి ఒకటిన్నర గంటలకు పైగా, గణేశ్వర్ బెహెరా 1 గంటకు పైగా తమ వాదనలను వినిపించారు. ఉన్నత విద్యా విభాగం మంత్రి సూర్యవంశీ సూరజ్ కూడా గంటకు పైగా ఎదురుదాడి చేశారు. అధికార పక్షం భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కూడా చర్చలో పాల్గొని ప్రతిపక్షాలను తీవ్రంగా ప్రతిఘటించారు. సుదీర్ఘంగా పన్నెండున్నర గంటల పాటు చర్చ కొనసాగింది. చర్చల తర్వాత విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2024 అసెంబ్లీలో ఆమోదించారు. ఒడిశాలో విద్యా వ్యవస్థ ఉషోదయం అవుతుందని ఉన్నత విద్యా శాఖ మంత్రి అన్నారు. బిల్లును ఆమోదించినందుకు సభ్యులందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఆ తర్వాత రాష్ట్ర రహదారుల అథారిటీ బిల్లు ఆమోదంపై చర్చలు ప్రారంభం అయ్యాయి. విశ్వ విద్యాలయాల సవరణ బిల్లు 2024 ఆమోదం పొందిన తర్వాత బీజేపీ ప్రభుత్వం ఒక సాహసోపేతమైన బిల్లును తీసుకువచ్చిందని బీజేడీ ఎమ్మెల్యే అరుణ్ సాహు అన్నారు. 2024లో ప్రవేశపెట్టిన బిల్లు 1989 బిల్లుకు సవరణగా వ్యాఖ్యానించారు. బిల్లు చట్టబద్ధతపై తర్వాత సుప్రీంకోర్టులో చర్చిస్తామని ఆయన అన్నారు. ఇదిలా ఉండగా, శాసన సభలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిందని బీజేపీ ఎమ్మెల్యే ఇరాషిస్ ఆచార్య అన్నారు. పన్నెండున్నర గంటల చర్చ తర్వాత విశ్వవిద్యాలయ సవరణ బిల్లు ఆమోదించారు. క్లాజుల వారీగా జరిగిన చర్చలో విపక్షాల సభ్యుల అన్ని సందేహాలకు ఉన్నత విద్యా శాఖ మంత్రి నివృత్తి పరిచారు. ఈ బిల్లు విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం విశ్వవిద్యాలయం అధికారాలను పరిమితం చేసింది. తాజా సవరణతో విశ్వ విద్యాలయాలకు స్వయంప్రతిపత్తి కల్పించారు. కొత్త బిల్లు ప్రభుత్వ నియంత్రణను తగ్గిస్తుందని మంద్రి వివరించారు. రాత్రంతా కొనసాగిన సభా సమావేశఽంలో నిరవధికంగా హాజరై ఉండడంతో విశ్వవిద్యాలయ సవరణ బిల్లులో సంస్కరణల్ని అర్థం చేసుకునే అవకాశం లభించిందని కొత్త ఎమ్మెల్యేలు ఆనందం వ్యక్తం చేశారు. ఉదయం 4.29 గంటలకు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు – 2024కు ఆమోదం శాసన సభ చరిత్రలో రికార్డు -
శాసన సభ బడ్జెట్ సమావేశాలకు తెర
● సభ నిరవధికంగా వాయిదా: స్పీకర్ భువనేశ్వర్: 17వ శాసన సభ మూడో విడతలో బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. మూడు పని దినాలు ఉంటుండగా శాసన సభలో సమావేశాలకు ముందస్తుగా తెర దించేశారు. సభా కార్యక్రమాలను నిరవధికంగా వాయిదా వేసినట్లు స్పీకరు సురమా పాఢి ప్రకటించారు. 28 పని దినాల్లో 25 పని దినాలు పూర్తయ్యాయి. సభలో తదుపరి చర్చకు ప్రముఖమైన అంశాలు లేనందున అధికార పక్షం చీఫ్ విప్ సభను నిరవధికంగా వాయిదా వేయాలని ప్రతిపాదించారు. దీనికి అనేక మంది ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించారు. అనంతరం స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. అన్నీ తొలి అనుభవాలే 17వ శాసన సభ మూడవ సమావేశం అత్యంత ఆకర్షణీయంగా జరిగింది. ఈ సమావేశాల్లో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం అనునిత్యం కొత్త మలుపులు తిరుగుతు ఉత్కంఠ రేపింది. ఈ నేపథ్యంలో శాసన సభ చరిత్రలో తొలి సారిగా గందరగోళం సృష్టించిన సభ్యుల్ని స్పీకరు సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేసి సంచలనం రేపారు. స్పీకర్ ఆగ్రహానికి కాంగ్రెస్ పార్టీ సభ్యులు బలి అయ్యారు. ఆ పార్టీకి చెందిన మొత్తం 14 మంది ఎమ్మెల్యేల్ని స్పీకరు సభ నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై తీవ్ర అసంతృప్తికి గురైన కాంగ్రెసు ఎమ్మెల్యేలు సభ బయట నిరవధికంగా నిరసన ప్రదర్శించారు. ఈసారి వీరంతా ఘంటానాదం, తాళాల వాయింపు, వేణు గానం, డోలక్ బజాయింపు వంటి విన్యాసాలతో సభలో గందరగోళ పరిస్థితిని ఆవిష్కరించారు. మరో వైపు ప్రధాన విపక్షం బిజూ జనతా దళ్ శాసన సభ ప్రాంగణం శుద్ధి చేసింది. ప్రజా సమస్యలపై ఉద్యమించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఏకపక్ష నిర్ణయంతో సస్పెండు చేయడాన్ని బీజేడీ వ్యతిరేకించింది. ఈ క్రమంలో స్పీకరు భారత రాజ్యాంగం వ్యతిరేక చర్యకు పాల్పడ్డారు. ఈ చర్యతో పవిత్ర సభా స్థలం అపవిత్రమైంది. ఈ అపవిత్రత తొలగించేందుకు విపక్ష బీజేడీ సభ్యులు ఇత్తడి కలశాల్లో గంగా జలం సభా ప్రాంగణానికి తీసుకుని వచ్చి సభ ప్రాంగణం నలు మూలలా శుద్ధి చేసి శాంతియుతంగా నిరసన ప్రదర్శించారు. బిజూ జనతా దళ్ ఈ విడత సమావేశాల్లో సుమారు నిత్యం నిరసన ప్రదర్శనకు ముందంజ వేయడం గమనార్హం. రాత్రంతా సభలో సందడే రాష్ట్ర విశ్వవిద్యాలయ సవరణ బిల్లు, రాష్ట్ర రహదారుల అథారిటీ బిల్లుపై చర్చలు పురస్కరించుకుని శాసన సభ రాత్రంతా కొనసాగింది. బుధవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమైన ఈ సభ గురు వారం ఉదయం 7.05 గంటల వరకు నిరవధికంగా కొనసాగింది. స్పీకర్ ఆదేశాల మేరకు సభా కార్యకలాపాల నుంచి సస్పెన్షన్‌కు గురైన కాంగ్రెస్ సభ్యులు రాత్రి అంతా సభ ప్రధాన ప్రాంగణంలో నిరవధికంగా నిరసన ప్రదర్శించారు. రాత్రి పూట అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా అర్ధరాత్రి 2.15 గంటల ప్రాంతంలో శాసన సభ లోపలి నుంచి కాంగ్రెసు సభ్యుల్ని బలవంతంగా బయటకు తొలగించారు. దీంతో మరింత నిరుత్సాహానికి గురైన కాంగ్రెస్ సభ్యులు సభ బయట ఆందోళన ఉధృతపరిచారు. కాంగ్రెసు భవన్ సమీపం మాస్టరు క్యాంటీన్ కూడలి ప్రాంతంలో వీరంతా నడి రోడ్డు మీద రాత్రంతా బైఠాయించి తీవ్ర అలజడి రేపారు. ఈ ఆందోళన ప్రభావంతో పలువురు ఎమ్మెల్యేలు అస్వస్థతకు గురయ్యారు. -
30 కేజీల గంజాయి స్వాధీనం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా సిమిలిగుడ పోలీసులు 30 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. గురువారం సిమిలిగుడ – పొట్టంగిల మధ్య జాతీయ రహదారి–26పై విడా ఆఫీస్ సమీపంలో లైట్‌హౌస్ చర్చి వద్ద అనుమానాస్పదంగా ఒక వ్యక్తి సంచరించడం పెట్రోలింగ్ పోలీసులు గమనించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని సోదాలు చేయగా, అతని బ్యాగులో 30 కేజీల గంజాయి పట్టుబడింది. నిందితుడు గంజాం జిల్లా బైద్యనాథ్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జయదుర్గానగర్కి చెందిన రాహుల్ కుమార్ బుయ్యాన్గా గుర్తించారు. నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు. ఈ కేసుని ఎస్ఐ బాబాజీ చరణ్ కన్వర్ దర్యాప్తు చేస్తున్నారు. -
రెవెన్షా క్యాంపస్‌లో ఉద్రిక్తత
భువనేశ్వర్: కటక్‌లోని రెవెన్షా విశ్వ విద్యాలయం ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. హాస్టల్‌కు బయట వారు వస్తుండడంతో ఈ పరిస్థితి నెలకొంది. బయటి వ్యక్తుల ప్రవేశం, దాడులను వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసన చేస్తున్నారు. వైస్ చాన్స్‌లర్ కార్యాలయం ముంగిట విద్యార్థులు ఆందోళన చేశారు. దుబాయ్‌కు రాష్ట్ర పంటలు భువనేశ్వర్: రాష్ట్రంలో పంటలకు అంతర్జాతీయ గిరాకీ లభించింది. ఇక్కడ పండించిన కూరగాయలు పొటల్స్, మునగకాయలు విదేశాలకు ఎగుమతి కావడం విశేషం. ఈ ఉత్పాదనలను స్థానిక బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి దుబాయ్‌కు అంతర్జాతీయంగా రవాణా చేశారు. దీంతో ఒడిశా వ్యవసాయ ఎగుమతుల్లో ఒక మైలురాయిని సాధించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ హర్షం వ్యక్తం చేసింది. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు జయపురం: సబ్ డివిజన్ పరిధి కుంద్ర సమితి కావిడియగుడ ఎస్ఎస్డీ ఉన్నత పాఠశాల సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం సాయంత్రం సురేంద్ర హరిజన్ తన బైక్‌పై కుమార్తె రాహిల్‌తో కలిసి కుంద్ర నుంచి దిగాపూర్ వెళ్తున్నాడు. కాగా కావిడియగుడ ఉన్నత పాఠశాల సమీపంలో ఒక ఆటో వీరి బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సురేంద్ర ముఖం, చెవులకు బలమైన గాయాలయ్యాయి. ఆటోలో కూర్చున్న బిభుతి పట్నాయిక్ కాలుకి దెబ్బలు తగిలాయి. రాహిల్‌కు తలపై గాయమవ్వడంతో పాటు కాలు విరిగింది. ప్రమాదాన్ని చూసిన పాఠశాల ఉపాధ్యాయుడు దేవేంద్ర శనాపతి, సామాజిక కార్యకర్త సుందరబారిక్ మల్ల, లొబి కొరలియలు గాయపడిన వారిని వెంటనే బొయిపరిగుడ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కొరాపుట్ తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆరు క్వింటాళ్ల తాబేళ్ల అక్రమ తరలింపు మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా కలిమెల సమితి మోటు చెక్‌గేట్ వద్ద గురువారం తాబేళ్ల అక్రమ తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. ఎంవీ 79 గ్రామం వద్ద ఓ మినీ వ్యాన్‌లో 6 క్వింటాళ్ల తాబేళ్లను తరలిస్తుండగా పోలీసులు పట్టుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. ఈ తాబేళ్లను ఆంధ్రా నుంచి అక్రమంగా కలిమెలకు తరలిస్తున్నారు. మొత్తం 300 తాబేళ్లు ఉన్నాయి. ఎంవీ 88 గ్రామానికి చెందిన సురాజ్ మాల్లిక్, ఎంపీవీ 83 గ్రామానికి చెందిన శక్తి పథ్‌లను అరెస్టు చేశారు. తాబేళ్ల విలువ రూ.5 లక్షలకుపైనే ఉంటుందని మోటు ఫారెస్టర్ మురళి తెలిపారు. రైల్వే మంత్రిని కలిసిన ఎంపీ కొరాపుట్: కేంద్ర రైల్వే మంత్రి అశ్వీని శ్రీవైష్ణవ్‌ను నబరంగ్‌పూర్ బీజేపీ ఎంపీ బలభద్ర మజ్జి గురువారం న్యూ ఢిల్లీలో కలిశారు. రైల్వే, ఇన్ఫర్మేషన్, బ్రాడ్ కాస్టింగ్, తదితర ఆంశాలపై చర్చించారు. ఒడిశా రాష్ట్రంలో రైల్వే, తదితర శాఖలలో అనేక ఖాళీలు ఉన్నాయని గుర్తు చేశారు. ఆయా ప్రభుత్వ ఖాళీలు సామరస్య పూర్వకంగా భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా ప్రభుత్వ పథకాల గూర్చి ప్రజల్లోకి మంచి సందేశం వెళ్తుందన్నారు. -
కాలువలో పడి వృద్ధుడు మృతి
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా బలిమెల పోలీస్‌స్టేషన్ పరిధిలో జాముగుఢా గ్రామానికి చెందిన సన్యా బొడనాయక్ (75) అనే వృద్ధుడు గురువారం ఉదయం కాలువలో పడి మృతి చెందాడు. సన్య బొడనాయక్ బుధవారం సిందిగూడ గ్రామం మీదుగా రాస్బెడ వెళ్లడానికి హరి అనే వ్యక్తితో కలిసి బయల్దేరారు. దారిలో వీరిద్దరూ సిందిగూడలో విశ్రాంతి తీసుకున్నారు. ఈ లోగా హరి తాను ఇంటికి వెళ్లి తమ వారిని పట్టుకుని వస్తానని, అంతవరకు అక్కడే ఉండాలని సన్యాకు సూచించాడు. అతను వెళ్లాక సన్యా పక్కనే ఉన్న కాలువలో దిగి కాలుజారి పడిపోయాడు. ఇంతలో అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు చుట్టూ వెతికారు. కాలువ వైపు చూడగా.. సన్యా తేలి ఉండడం గమనించి బయటకు తీసి చూడగా.. ఆయన చనిపోయారు. దీంతో వెంటనే బలిమెల పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వడంతో ఐఐసీ ధీరాజ్ పట్నాయిక్ తన సిబ్బందితో వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని బలిమెల ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగిస్తామని పోలీసులు తెలిపారు. -
సర్వం దోచేస్తారు
షికారుకెళ్తారు.. శ్రీకాకుళం క్రైమ్ : బండిపై సాయంత్రం అలా షికారుకి వెళ్లినట్లు తామెంచుకున్న గ్రామానికి వెళతారు.. వెంట తీసుకెళ్లిన ఫోన్లను స్విచ్చాఫ్ చేసి తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి తిరిగి వెళ్లిపోతారు.. అదే రోజు రాత్రి చోరీ ఎక్కడ చేద్దామనుకున్నారో.. ఆ ఇంటికి కాస్త దూరంలో బండి పార్కింగ్ చేసి వారి వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డు, స్క్రూ డ్రైవర్‌తో ఇంటి తాళాలు పగులగొడతారు.. బీరువా తలుపులు విరగ్గొట్టి అందులో ఉన్న నగదు, బంగారం, వెండి దోచుకుని పరారవుతారు.. శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది చోట్ల, పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక చోట కలిసి మొత్తం 17 చోట్ల ఇలా చోరీలు చేసి ఎట్టకేలకు కాశీబుగ్గ పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి 37 తులాల బంగారు ఆభరణాలు, 20 తులాల వెండిని స్వాధీనపర్చుకున్నారు. ఈ మేరకు నిందితు లైన పార్వతీపురం మన్యం జిల్లా సీతానగ రం మండలం జోగంపేటకు చెందిన పోలా భాస్కరరావు, శ్రీకాకుళం ఎచ్చెర్ల మండలం ముద్దాడ గ్రామానికి చెందిన ముద్దాడ నర్సింగరావులను జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి గురువారం మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. కాశీబుగ్గ పోలీసులకు చిక్కి.. గతేడాది మే 24న కాశీబుగ్గ పీఎస్ పరిధిలో బంగారం, వెండి చోరీ చేసిన కేసులో నిందితులైన భాస్క ర్, నర్సింగరావులు గురువారం నర్సిపురం రైల్వేగే ట్ ఎక్స్–సర్వీస్‌మ్యాన్ క్యాంటీన్ ఎదురుగా వాహన తనిఖీల్లో భాగంగా కాశీబుగ్గ పోలీసులకు చిక్కారు. కాశీబుగ్గ డీఎస్పీ వి.వి.అప్పారావు ఆధ్వర్యంలో సీఐ చంద్రమౌళి నిందితులను విచారించగా వారు చేసిన ఒక్కొక్క నేరం వెలుగులోకి వచ్చాయి. కాశీబుగ్గ, మెళియాపుట్టి, జె.ఆర్.పురం, టెక్కలి పీఎస్‌ల పరిధిలో ఒక్కొక్కటి, శ్రీకాకుళం రూరల్, వన్‌టౌన్, టూ టౌన్లో మూడేసి చోరీలు, పాతపట్నంలో రెండు చోరీలు చేయగా మన్యం జిల్లా పాలకొండలో రెండు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న ఆభరణాలివే.. 17 కేసుల్లో 76 తులాలకు గాను రూ.36.80 లక్షల విలువైన 37 తులాల బంగారు ఆభరణాలు, 184.58 తులాల వెండికి గాను 20 తులాల వెండి, రూ.5 లక్షలు విలువ చేసే డైమండ్ ఆభరణాలకు గాను రూ.2 లక్షలు విలువైన డైమండ్ బ్రాస్లెట్, డైమండ్ లాకెట్, రూ. 3.44 లక్షల నగదుకు గాను రూ.25 వేలు నగదు ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.లక్ష విలువైన రెండు బైక్‌లు, రూ.2 లక్షలు విలువైన ఓ స్కార్పియో వాహనం స్వాధీనం చేసుకున్నారు. కాగా, నిందితులను పట్టుకుని రిమాండ్‌కు తరలించడంలో కృషిచేసిన కాశీబుగ్గ పోలీసులను ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కిన గజదొంగలు 17 చోరీలు చేసిన ఇద్దరు నిందితుల అరెస్టు ఒకరిది శ్రీకాకుళం జిల్లా ముద్దాడ, మరొకరిది పార్వతీపురం మన్యం జిల్లా జోగంపేట 37 తులాల బంగారం, 20 తులాల వెండి రికవరీ వివరాలు వెల్లడించిన ఎస్పీ మహేశ్వరరెడ్డి లెక్కకు మించి కేసులు.. నిందితుల్లో ఒకరైన పోలా భాస్కరరావుపై శ్రీకాకుళంలో 19. విజయనగరంలో 16, విశాఖపట్నం(రూరల్–2) జిల్లాల్లో 37 చోరీ కేసులు నమోదవ్వగా ఎనిమిదింటి లో నేరారోపణ రుజువై జైలు శిక్ష అనుభవించాడు. నర్సింగరావుపై 17 కేసులుండ గా (శ్రీకాకుళం–9, విజయనగరం–4, విశాఖపట్నం సిటీ–3, పార్వతీపురం మన్యం–1) మూడింటిలో నేరారోపణ రుజువై జైలు శిక్ష అనుభవించాడు. చిన్నప్పటి నుంచే.. భాస్కరరావు తన తొమ్మిదో సంవత్సరంలోనే అప్పయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ కాలనీలో ఓ ఇంట్లో డబ్బులు దొంగిలించడంతో సీతానగరం పోలీస్‌స్టేషన్‌లో జువైనల్ కేసు నమోదైంది. మూడు నెలలు పాటు విశాఖ అబ్జర్వేషన్ హోంలో ఉన్నాడు. అప్పటి నుంచే నేర ప్రవృత్తిని ఎంచుకున్నాడు. ఇక నర్సింగరావు శ్రీకాకు ళం జిల్లా కేంద్రంలోని ఓ బైక్ షోరూంలో పనిచేస్తూ బై క్‌ను దొంగిలించి జైలుకి వెళ్లాడు. ఇద్దరికీ విశాఖపట్నం సెంట్రల్ జైలులో పరిచయమేర్పడి బయటకొచ్చాక రాత్రిపూట చోరీలు చేయడం మొదలుపెట్టారు. -
చేనేత వస్త్రాలను ధరించండి
పర్లాకిమిడి: ఒడిశా మినీస్టిరీయల్ ఉద్యోగులు గురువారం కలెక్టరేట్లో ఒడిశా సంప్రదాయ చేనేత వస్త్రాలతో ‘అమొ పోసోకో..అమొ పరిచయ్’ అనే కార్యక్రమాన్ని అదనపు జిల్లా మెజిస్ట్రేట్ రాజేంద్ర మింజ్ అధ్వర్యంలో గురువారం నిర్వహించారు. డీఆర్డీఏ ముఖ్యకార్య నిర్వాహణ అధికారి శంకర్ కెరకటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా, డీఆర్డీఏ అదనపు ఈఓ పృథ్వీరాజ్ మండల్, సాంస్కృతిక అధికారి అర్చనా మంగరాజ్ తదితరులు హాజరయ్యారు. జిల్లా కేంద్రంలో పలు ప్రభుత్వశాఖల అధికారులు, ఉద్యోగులు సంబల్పురి చేనేత వస్త్రాలు ధరించి ఒడిశా పక్షోత్సవాలను నిర్వహించారు. ఒడిశా భాష, సాహిత్యం, సంస్కృతి విభాగం ఆదేశాల మేరకు ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు ఈ పక్షోత్సవాలు జరుగుతాయని ఏడీఎం రాజేంద్ర మింజ్ తెలియజేశారు. సమృద్ధి ఒడిశాను ముందుకు నడిపించేందుకు ప్రభుత్వం ఒడిశా చేనేత వస్త్రాలు తయారుచేసే నేత పనివారిని ప్రోత్సాహించేందుకు పక్షోత్సవాలు నిర్వహిస్తున్నారు. సాంప్రదాయ దుస్తుల సంబరం ప్రారంభం కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో ప్రభుత్వం తరుపున సాంప్రదాయ దుస్తుల సంబరాలు గురువారం ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా అధికారులు సాంప్రదాయ దుస్తులు ధరించారు. నబరంగ్‌పూర్ కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో చేనేత దుస్తులు ధరించారు. రానున్న రెండు వారాలు ప్రభుత్వ ఉద్యోగులు సాంప్రదాయ దుస్తులు ధరించాలని సూచించారు. కొరాపుట్ జిల్లా పరిషత్ ప్రెసిడెంట్ సస్మితా మెలక చేనేత చీర ధరించి సిబ్బందికి సందేశం ఇచ్చారు. మరోవైపు కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తివాసన్ సాంప్రదాయ దుస్తులతో కలెక్టరేట్ సిబ్బందితో సందడి చేశారు. -
జాదవ మజ్జికి ఘన నివాళి
కొరాపుట్: దివంగత పరిశ్రమల మంత్రి జాదవ మజ్జి 26వ వర్ధంతి ఘనంగా జరిగింది. గురువారం నబరంగ్‌పూర్ జిల్లా చందాహండి సమితి కేంద్రంలో ప్రధాన జంక్షన్ వద్ద జాదవ మజ్జి విగ్రహానికి వందలాది ప్రజలు నివాళులు అర్పించారు. ఇదే సమయంలో చందాహండి ప్రభుత్వ హైస్కూల్లో జాదవ మజ్జి విగ్రహానికి నివాళులర్పించారు. జనతా దళ్ పార్టీ నేతృత్వంలో బిజూ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1990–95 మధ్య కాలంలో జాదవ మజ్జి రాష్ట్ర భారీ పరిశ్రమలు, ప్లానింగ్ శాఖ మంత్రి గా పని చేశారు. బిజూకి నమ్మకమైన వ్యక్తులలో జాదవ మజ్జి ఒకరని రాష్ట్ర వ్యాప్తంగా పేరుంది. కార్యక్రమాల్లో అతని కుమారులు మాజీ మంత్రి, బీజేడి జిల్లా ప్రెసిడెంట్ రమేష్ చంద్ర మజ్జి, మాజీ ఎంఎల్ఎ ప్రకాష్ చంద్ర మజ్జి బీజేడీ కార్యకర్తలు పాల్గొన్నారు. -
భర్త రూపానికి ప్రాణ ప్రతిష్ట
రాయగడ: రెండేళ్ల కిందట అస్వస్థతకు గురై చనిపోయిన భర్త రూపానికి ఆమె మళ్లీ ప్రాణ ప్రతిష్ట చేశారు. సిలికాన్‌తో ఆయన ప్రతిమను రూపొందించి ప్రతిష్టించారు. జిల్లాలోని మునిగుడలో వైద్యుడిగా విధులు నిర్వహిస్తుండే సమీర్ రాయ్ కొన్నాళ్ల కిందట మునిగుడలొ కుటుంబంతో సహా స్థిరపడ్డారు.రాయ్ 2023లో అనారోగ్యంతో చనిపోయారు. దీంతో అతని భార్య సిలికాన్‌తో రాయ్ ప్రతిమను తయారు చేయించారు. తన బంగారు ఆభరణాలు అమ్మి మరీ ఈ విగ్రహాన్ని రూపొందించారు. మంగళవారం నాడు శుభ ముహూర్తాన పండితుల సమక్షంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రతిమకు ప్రాణ ప్రతిష్ట చేశారు. -
ఏపీఎస్పీ 5వ బెటాలియన్‌ను సందర్శించిన డీఐజీ
డెంకాడ: చింతలవలసలోని ఏపీఎస్పీ ఐదవ బెటాలియన్‌ను విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి గురువారం సందర్శించారు. ఆయనకు బెటాలియన్ కమాండెంట్ మలికాగార్గ్ మొక్కను అందించి స్వాగతం పలికారు. బెటాలియన్‌లోని పోలీస్ శిక్షణ కేంద్రంలో మౌలిక వసతులను డీఐజీ పరిశీలించారు. తరగతి గదులు, ఆఫీస్, వంటగది, డైనింగ్ హాల్, స్టోర్, వాష్ రూంలను పరిశీలించారు. మినరల్ వాటర్‌ప్లాంట్, లైబ్రరీ, పరేడ్ గ్రౌండ్ స్థితిగతుల వివరాలను మలికాగార్గ్‌ను అడిగి తెలుసుకున్నారు. అదనపు వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటానని తెలిపారు. శిక్షణ కేంద్రంలో పని చేస్తున్న టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బంది వివరాలను అడిగి తెలుసుకున్నారు. డీఐజీ వెంట ఎస్పీ వకుల్ జిందాల్, బెటాలియన్ పోలీస్ అధికారు ఉన్నారు. పోలీస్ శిక్షణ కేంద్రంలో వసతుల పరిశీలన