
రక్తదానంతో ప్రాణదానం
జయపురం: రక్తదానంతో ప్రాణదానం చేయవచ్చని గోపబందు ఐటీ కళాశాల ప్రిన్సిపాల్ ఉమాకాంత్ పట్నాయక్ అన్నారు. ఒడియా పక్షోత్సవాలు పురస్కరించుకొని జయపురం సమితి అంబాగుడలోని గోపబందు ఐటీ కళాశాలలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానం వలన క్షతగాత్రులకు సకాలంలో అవసరమైన రక్తం లభిస్తుందన్నారు. అలాగే తలసేమియా, సికిల్ సెల్, కాన్సర్ వ్యాధిగ్రస్తులకు రక్తనిల్వలు అవసరమని పేర్కొన్నారు. అందువలన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని సూచించారు. శిబిరంలో 51 యూనిట్ల రక్తం సేకరించారు. కార్యక్రమంలో ఐటీఐ శిక్షకుడు పి.సతీష్ కుమార్, విష్ణు ప్రసాద్ భటి, రాజేష్ కుమార్ ప్రధాన్, యూత్ రెడ్‌క్రాస్ సలహాదారు నిరంజన్ పాణిగ్రహి, ఒడిశా రక్త దాతల మహాసంఘం ప్రతినిధి ప్రమోద్ కుమార్ రౌలో, సతీష్ కుమార్, ఎస్‌కే పాడీ తదితరులు పాల్గొన్నారు.