
సత్తిగూడ జలాశయంలోకి 54వేల రొయ్యపిల్లలు
మల్కన్‌గిరి : జిల్లా కేంద్రానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సత్తిగూడ జలాశయంలో మంగళవారం జిల్లా మత్స్యశాఖ వారు 54వేల రొయ్యపిల్లలను విడుదల చేశారు. ఇవి సక్రమంగా పెరిగితే కిలో రూ.500 వరకు ధర పలుకుతుందని తెలిపారు. చేపల కంటే ఇవి ధర ఎక్కువ పలుకుతాయని మత్స్యశాఖాధికారి సుశాంతొ గౌడ్ తెలిపారు. అలాగే జలాశయంలోకి మరికొన్ని నాటు పడవలు మంజూరు చేశారు. గత నెలలో కూడా చిత్రకొండ జలాశయంలో కూడా ఇలాగే రొయ్య పిల్లలు వదిలారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ ఏఎఫ్‌ఓ ముఖేష్ మాఝి, మనోజ్ కుమార్ జాన తదితరులు పాల్గొన్నారు.