కొరాపుట్‌లో వినతుల స్వీకరణ
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలో జిల్లాస్థాయి గ్రీవెన్స్‌సెల్ జరిగింది. కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో ప్రజా సమస్యలు పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 38 ఫిర్యాదుల వచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ మిహిర్ పండా, ఏడీఎం తపన్ కుమార్ కుంటీయా, డిప్యూటీ కలెక్టర్ ప్రకాష్ కుమార్ మిశ్రలు పాల్గొన్నారు.
ఉచిత తీర్థ యాత్రల బస్సులు ప్రారంభం
కొరాపుట్: ఉచిత తీర్థయాత్రల బస్సులు ప్రారంభమయ్యాయి. సోమవారం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రంలోని మిషన్ శక్తి సమావేశ మందిరం వద్ద డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి, నబరంగ్‌పూర్ ఎమ్మెల్యే ప్రతినిధి దేవదాస్ మహాంకుడోలు జెండా ఊపి ఈ యాత్ర ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా ఎంపిక చేసిన 148 మంది వయోవృద్ధులను ఉచితంగా వారణాశి, అయోధ్య తీసుకెళ్లనున్నారు. అందుకోసం ఐదు బస్సులు ఏర్పాటు చేశారు.
మొబైల్ దొంగల అరెస్టు
జయపురం: కత్తితో బెదిరించి ఒక యువకుడి వద్ద మొబైల్‌తో పాటు డబ్బుని దోచుకున్న ఇద్దరు దొంగలను పట్టుకున్నట్లు బొయిపరిగుడ పోలీసు స్టేషన్ ఏఎస్‌ఐ బిజయ పట్నాయిక్ వెల్లడించారు. పోలీసు అధికారి పట్నాయిక్ వివరణ ప్రకారం ఈ నెల 4 వ తేదీన బొయిపరిగుడ పోలీసు స్టేషన్ పరిధి కాఠపొడ పంచాయితీ కెందుపుట్ గ్రామం భక్త కురుటియ(24) ఏదో పనిపై హతీపకన గ్రామానికి వెళ్తున్నాడు. బొదావటాల్ గ్రామ సమీపంలో ముగ్గురు యువకులు బైక్ పై వచ్చి అతడిని అడ్డగించి కత్తితో బెదిరించి అతడి వద్ద గల మొబైల్‌తో పాటు రూ.2 వేల నగదు దోచుకుపోయారు. ఈ సంఘటనపై బాధితుడు బొయిపరిగుడ పోలీసు స్టేషన్‌లో లిఖిత ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో లభించిన ఆధారాలు మేరకు ముగ్గురు నిందితులను అదుపులోనికి తీసుకున్నారు. బొయిపరిగుడ సమితి కెందుగుడ పంచాయతీ దిశారిగుడ గ్రామం సురేష్ హరిజన్, మల్కనగిరి జిల్లా కోరుకొండ గ్రామం సత్య నాగ్‌లతో పాటు మరొకరు ఉన్నారని తెలిపారు.
377 లీటర్ల సారా స్వాధీనం
రాయగడ: జిల్లాలోని రాయగడ, కళ్యాణసింగుపూర్ ప్రాంతాల్లో అబ్కారీ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 377 లీటర్ల నాటుసారా, సారా తయారీకి వినియోగించే 4,400 లీటర్ల విప్ప ఊటను సోమవారం స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తలను అరెస్టర్ చేశారు. హతిఖొంబ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో వ్యాన్‌లో 1800 కిలోల విప్ప పువ్వు బస్తాలు పట్టుబడ్డాయి. దీనికి సంబంధించి డ్రైవర్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. కలహండి నుంచి విప్పపువ్వు అక్రమంగా రవాణా జరుగుతున్నట్లు గుర్తించిన అబ్కారీ శాఖ అధికారులు ఈ మేరకు వాహన తనఖీలను హతిఖంబ వద్ద నిర్వహించారు.
కొరాపుట్‌లో వినతుల స్వీకరణ
కొరాపుట్‌లో వినతుల స్వీకరణ


