
రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం మోహన్‌చరణ్
భువనేశ్వర్: రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్‌చరణ్ మాఝీ మూడు రోజుల పర్యటన కోసం సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. దీంతో అదేరోజు సాయంత్రం కొంతమంది కేంద్రమంత్రులను కలవనున్నారు. అనంతరం మంగళవారం ఢిల్లీ పెట్టుబడిదారుల సమ్మిట్‌లో పాల్గోనున్నారు. ఈ సమ్మిట్‌లో వ్యాపార దిగ్గజాలతో చర్చలు జరిపి ఒడిశాలో పెట్టుబడులకు సానుకూల అవకాశాల గురించి తెలియజేస్తారని సమాచారం. పారాదీప్‌లో నాఫ్తా క్రాకర్ ప్రాజెక్టు స్థాపన కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్)తో అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం కూడా ఆయన ప్రయాణ ప్రణాళికలో ప్రధాన కార్యక్రమం కావడం విశేషం. తదుపరి ఈనెల 9వ తేదీన రాష్ట్రానికి తిరిగి వస్తారు.
నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం
జయపురం: జిల్లా బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గం శుక్రవారం ప్రమాణస్వీకారం చేసింది. ఎన్నికల అధికారి, సీనియర్ న్యాయవాది దాశరథి పట్నాయిక్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా సరోజ్ దాస్, కార్యదర్శిగా సచితానంద మిశ్ర, ఉపాధ్యక్షుడిగా నవీన్ చంద్ర సాహు, కార్యదర్శిగా భోలానాథ్ పట్నాయక్, సహాయ కార్యదర్శిగా అంజన సింగ్, కోశాధికారిగా దేవ రామానుజం ప్రసాద్, గ్రంథాలయ కార్యదర్శిగా యుగల్ కిశోర్ పట్నాయక్, గ్రంథాలయ సహాయ కార్యదర్శిగా రక్షిభాయి, కార్యవర్గ సభ్యులుగా నళినీ కుమారి ఖెముండు, ప్రజ్ఞా కుమారి బెబర్త, తాపస పండ, తరణీ పాణిగ్రహి, సచిన్ పాడి, ఆకాశ కులదీప్, పి.శంకరరావులు ప్రమాణ స్వీకారం చేశారు.
మద్యం దుకాణం బంద్ చేయాలి
రాయగడ: సదరు సమితి పరిధి పెంటా పంచాయతీ అమలాభట్ట కూడలిలో ఉన్న విదేశీ మద్యం దుకాణాన్ని శాశ్వతంగా బంద్ చేయాలని సర్పంచ్ ఎటల విశ్వనాథ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామస్తులతో కలిసి మద్యం దుకాణం వద్ద శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సమయంలో దుకాణదారుడితో వాగ్వాదం చోటుచేసుకోవడంతో సమాచారం తెలుసుకున్న చందిలి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.
20 క్వింటాళ్ల విప్పపువ్వు స్వాధీనం
రాయగడ: నాటుసారా తయారీకి వినియోగించే విప్పపువ్వును అక్రమంగా తరలిస్తుండగా కాసీపూర్ ఎకై ్సజ్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి కాసీపూర్ ఎకై ్సజ్ శాఖ ఓఐసీ విష్ణుపద బెహర నేతృత్వంలో తనిఖీలు నిర్వహిస్తుండగా, కలహండి వైపు వెళ్తున్న ఒక వ్యాన్‌ను ఆపి తనిఖీ చేశారు. దీంతో విప్పపువ్వు బస్తాలు పట్టుబడ్డాయి. దీంతో వ్యాన్ డ్రైవర్ సురేష్ నెమల్‌పూరిని అరెస్టు చేసి, వ్యాన్‌ను సీజ్ చేశారు. పట్టుబడిన విప్పపువ్వు విలువ సుమారు రూ.90 వేలు ఉంటుందని అంచనా వేశారు.
నేడు జగన్నాథుడి దర్శనం తాత్కాలికంగా నిలిపివేత
భువనేశ్వర్: పవిత్ర శ్రీరామ నవమి పురస్కరించుకొని పూరీ శ్రీమందిరంలో జగన్నాథుడి దర్శనం ఆదివారం తాత్కాలికంగా నిలిపి వేయాలని నిర్ణయించారు. శ్రీమందిరంలో శ్రీరామ జనన ఉత్సవం ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా మూలవిరాటుల సర్వ దర్శనం 5 గంటల పాటు తాత్కాలికంగా నిలిపివేయబడుతుందని ఆలయ అధికార వర్గాలు తెలియజేశాయి. మధ్యాహ్న ధూపదీప, నైవేథ్యం తర్వాత శ్రీరామ జన్మ ఉత్సవం కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఈ వ్యవధిలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సర్వ దర్శనం ఉండదని పేర్కొన్నారు.

రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం మోహన్‌చరణ్

రేపు ఢిల్లీ పర్యటనకు సీఎం మోహన్‌చరణ్