క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌ | - | Sakshi
Sakshi News home page

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

Apr 7 2025 12:24 AM | Updated on Apr 7 2025 12:24 AM

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

క్రీడలతో ఉజ్వల భవిష్యత్‌

రాయగడ: యువత క్రీడలపై ఆసక్తి కనబర్చితే ఉజ్వల భవిష్యత్‌ ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యుడు నెక్కంటి భాస్కరరావు అన్నారు. సదరు సమితి పరిధిలోని కొత్తపేటలొ ఉయ్‌ ఫైట్‌ అవర్‌ రైట్స్‌ అనే సేవా సంస్థ ఆధ్వర్యంలో గత నెల 26వ తేదీన ప్రారంభమైన క్రికెట్‌ టోర్నమెంట్‌ ఆదివారంతో ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. యువత క్రీడారంగంపై దృష్టి సారించాలని అన్నారు. ఆరోగ్యానికి క్రీడలు ఎంతో దోహద పడడంతోపాటు వారి జీవన విధానం కూడా మెరుగుపడుతోందన్నారు. టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకున్న సూరి జట్టు, జేకే కామ్రేడ్‌ జట్ల మధ్య జరిగిన పోటీలో సూరి జట్టు విజేతగా నిలవగా రన్నర్‌గా జేకే కామ్రేడ్‌ జట్టు నిలిచింది. విజేత జట్టుకు రు. 25 వేలు, రన్నర్‌ జట్టుకు రుూ. 15 వేలు బహుమతిని నెక్కంటి అందజేశారు. అధికారి చిన్న, గౌరి చైతు, కొండ తదితరులు టోర్నమెంటును నిర్వహించారు.

రాజ్యసభ మాజీ సభ్యుడు భాస్కరరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement