ఆదిత్యుని సన్నిధిలో దత్త విజయానందతీర్థ స్వామి
అరసవల్లి: ప్రత్యక్ష దైవం అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయంగా ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ, సీనియర్ అసిస్టెంట్ శోభనాద్రాచార్యులు గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. ఈ సందర్భంగా అనివెట్టి మండపంలో స్వామీజీ మాట్లాడుతూ విశ్వలోకాల రక్షకుడు, ప్రత్యక్షదైవం సూర్యనారాయణ స్వామి ఇక్కడ కొలువుతీరడం నిజంగా అదృష్టమని..ఆరోగ్య ప్రదాత సూర్యభగవానుడని వివరించారు. ఆదిత్యుని వార్షిక కల్యాణ మహోత్సవాలు (బ్రహ్మోత్సవాలు) జరుగుతున్నా యని ప్రధానార్చకులు శంకరశర్మ తెలిపారు. కార్యక్రమంలో అర్చకులు ఇప్పి లి సాందీప్ శర్మ, ఫణీంద్రశర్మ పాల్గొన్నారు.


