
ఉన్నత లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి
పర్లాకిమిడి: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు ఏర్పరుచుకోవాలని అగస్థ్య ఫౌండేషన్ చైర్మన్ కేవీ సాయి చంద్రశేఖర్ సూచించారు. స్థానిక గజపతి స్టేడియం వద్ద శనివారం నిర్వహించిన సెంచూరియన్ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ ప్రిన్సిపాల్ సునీతా పాణిగ్రాహి 2024–25 విద్యా సంవంత్సరంలో విద్యార్థులు సాధించిన విజయాలను తెలియజేశారు. అనంతరం జిల్లా, రాష్ట్రస్థాయిలో జరిగిన క్రీడా పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సత్కరించారు. కార్యక్రమంలో సెంచూరియన్ వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య డి.ఎన్.రావు, రిజిస్ట్రార్ డా.అనితా పాత్రో, డైరక్టర్ డా.దుర్గాప్రసాద్ పాఢి తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఉన్నత లక్ష్యాలు ఏర్పరుచుకోవాలి