
గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ
కొరాపుట్: కొరాపుట్, నబరంగ్‌పూర్ జిల్లాల్లో ప్రజా సమస్యల పరిష్కార శిబిరాలైన గ్రీవెన్స్ సెల్‌ను అధికారులు నిర్వహించారు. మంగళవారం నబరంగ్‌పూర్ జిల్లా తెంతులకుంటి సమితి కేంద్రంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శుభంకర్ మహాపాత్రో గ్రీవెన్స్ నిర్వహించారు. 45 ఫిర్యాదులు రాగా.. వీటిలో 37 వ్యక్తిగతం, 8 సామూహిక ఫిర్యాదులు ఉన్నాయి. వీటిని పరిష్కరించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. నలుగురు దివ్యాంగులకు వీల్‌చైర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ మిహిర్ పండా పాల్గొన్నారు. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితి కేంద్రంలో జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ గ్రివెన్స్ నిర్వహించి ప్రజాసమస్యలను పరిష్కరించారు.
గుడారిలో..
రాయగడ: జిల్లాలోని గుడారిలో జిల్లా యంత్రాంగం మంగళవారం వినతులు స్వీకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లా అదనపు కలెక్టర్ రమేష్ చంద్ర నాయక్, ఎస్పీ స్వాతి, ఐటీడీఏ ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అజయ్ కుమార్ పాడి తదితరులు పాల్గొన్నారు. గుడారి సమితి పరిధిలో గల వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. 16 వ్యక్తిగత సమస్యలు, ఒకటి గ్రామ సమస్యగా గుర్తించారు. జిల్లా అదనపు కలెక్టర్ నాయక్ పాల్గొన్నారు.
మాత్తిలి సమితిలో..
మల్కన్‌గిరి: మల్కన్‌గిరి జిల్లా మత్తిలి సమితి కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశీష్ ఈశ్వర్ పటేల్ గ్రీవెన్స్ నిర్వహించారు. మాత్తిలి సమితిలో పలు పంచాయతీలకు చెందిన వారు తమ సమస్యలను కలెక్టర్‌కు అందజేశారు. 28 వినతులను స్వీకరించారు. జిల్లా అదనపు ఎస్పీ తాపాన్ నారాయణ్ రోతో, జిల్లా సబ్ కలెక్టర్ దూర్యోధన్ బోయి, మత్తిలి సమితి ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొన్నారు.
అబార్‌సింగిలో..
పర్లాకిమిడి: గజపతి జిల్లా ఆర్.ఉదయగిరి బ్లాక్ అబార్‌సింగి గ్రామ పంచాయతీ భవనంలో మంగళవారం గ్రీవెన్స్ సెల్‌కు కలెక్టర్ బిజయకుమార్ దాస్ విచ్చేశారు. జిల్లా ఎస్పీ జితేంద్రనాథ్ పండా, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సీడీఎం శంకర్ కెరకెటా, సబ్ కలెక్టర్ అనుప్ పండా, ఐటీడీఏ పీఓ అంశుమాన్ మహాపాత్రో వినతులు స్వీకరించారు. మొత్తం 48 వినతులు అందాయి. ఆర్.ఉదయగిరి సమితి అధ్యక్షుడు లక్ష్మీనారాయణ శోబోరో, బీడీఓ లారీమాన్ ఖర్సల్, తహసీల్దార్ జ్యోతిర్మయ దాస్, జిల్లా జనస్వస్థ్య అధికారి, తదితరులు పాల్గొన్నారు.

గ్రీవెన్స్‌కు వినతుల వెల్లువ