
కార్మికులకు అండగా.. ఈ శ్రమ్
సూచనలతో నమోదు చేసుకునేందుకు కార్మికులు పోటీపడ్డారు. ఇప్పుడు ఎక్కడా ఆ ఊసే లేదు. అసంఘటిత రంగ కార్మికులు, వలస కార్మికులు, చిరు వ్యాపారులకు భరోసా కల్పించేందుకు కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ ఈ – శ్రమ్ పోర్టల్‌ను ప్రారంభించింది. ఇందులో నమోదైన వారికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. పైగా ఎన్నో సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందుతాయి. ఈ పోర్టల్‌ను ప్రారంభించి ఏడాది గడిచినా.. నేటికీ చాలా మంది దరఖాస్తు చేసుకోకపోవడంతో సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు.
చేకూరే ప్రయోజనాలివి..
ఈ –శ్రమ్‌లో నమోదైతే 12 అంకెలు కలిగిన యూఏఎన్ కార్డులు అందజేస్తారు. ఈ కార్డులు ఉన్నవారికే అన్ని రకాల సామాజిక భద్రత పథకాలు, సంక్షేమ పథకాలను వర్తింపజేస్తారు. ఇందులో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికీ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద రూ.2 లక్షలు, ప్రమాదవశాత్తూ అంగవైకల్యం చెందితే రూ. లక్ష బీమా పరి