● జనావాసాల్లోకి హైనా
కొరాపుట్: నబరంగ్‌పూర్ జిల్లా ఉమ్మర్‌కోట్ పట్టణ సమీపంలోకి హైనా ప్రవేశించింది. బీఎస్ పూర్ సమీపంలో భారత మాల రోడ్డు నిర్మాణం జరిగే ప్రాంతంలో ఒక కల్వర్టు కింద గిరిజనులు హైనాను గుర్తించారు. ముందు రోజు ఏదో వాహనం ఢీకొని ఉండడంతో ఈ క్రూర జంతువు నడవలేకపోతోంది. దీంతో స్థానికులు ఉమ్మర్‌కోట్ అటవీ శాఖ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు దాన్ని అదుపు తీసుకోవడానికి ప్రయాస పడ్డారు. అదను చూసి ఎదురు దాడి చేయడం హైనా జంతువు జాతి లక్షణం. దాంతో వల పన్ని ఎంతో కష్టం మీద బోనులో బంధించారు. అనంతరం చికిత్స కోసం నబరంగ్‌పూర్ జిల్లా కేంద్రానికి తరలించారు. పపడాహండిలోని అటవీ సంరక్షణ కార్యాలయంలో ఉంచి కోలుకున్న తర్వాత అడవిలోకి విడిచిపెడతామని చెప్పారు. భారత మాల రోడ్డు నిర్మాణంలో భాగంగా దండకారణ్యం లో వేలాది అటవీ వృక్షాలను తొలగించారు. దీంతో జంతువులు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి.
● జనావాసాల్లోకి హైనా


