
కిడ్నీ ఆస్పత్రి పరిశీలన
కాశీబుగ్గ: పలాసలోని వైఎస్సార్ కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు గురువారం పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామారావు అనే బాధితుడిని పరామర్శించేందుకు వచ్చారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అల్లు పద్మజతో కలిసి ఇన్‌పేషెంట్ విభాగం, కిడ్నీ రోగుల వార్డు, ప్రభుత్వ డయాలసిస్ యూనిట్లను పరిశీలించారు. రోజు రోజుకూ కిడ్నీ రోగులు పెరుగుతున్నారని వారికి అవసరమైన వైద్య సేవలు, మందులు పంపిణీ, ఆపరేషన్‌లు, పరీక్షలు, అన్ని విభాగాలను పనిచేసేలా చూడాలని అన్నారు. ఆయనతో పాటు మందస ఎంపీపీ డొక్కరి దానయ్య, ఎంపీటీసీలు బమ్మిడి దుర్యోధన రావు, గండు మోహనరావు, మాజీ ఎంపీపీ బత్తిని హేమేశ్వరరావు, నాయకులు శిష్టు గోపి, దువ్వాడ రవి తదితరులు పాల్గొన్నారు.
కిడ్నీవ్యాధితో వ్యక్తి మృతి
టెక్కలి రూరల్: మండలంలోని సన్యాసినీతాపురం గ్రామానికి చెందిన బెహరా సింహాద్రి(45)అనే వ్యక్తి కిడ్నీవ్యాధితో గురువారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు గత కొన్ని సంవత్సరాలుగా కిడ్నీవ్యాధితో బాధపడుతూ శ్రీకాకుళం, టెక్కలిలోని ఆస్పత్రుల్లో డయాలసిస్ చేయించుకునేవాడు. అయితే గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పేర్కొన్నారు. మృతుడికి భార్య కృష్ణవేణి, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

కిడ్నీ ఆస్పత్రి పరిశీలన